
సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ముంబై 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ముంబైని విజయతీరాలకు చేర్చారు. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ
స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/1గా ఉంది.
టార్గెట్ 177.. 13 ఓవర్లలో ముంబై స్కోర్ 127/1
రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ
రోహిత్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ 32 పరుగులతో (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 112/1గా ఉంది.
టార్గెట్ 177.. 9 ఓవర్లలో ముంబై స్కోర్ 88/1
రోహిత్ శర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 14; ఫోర్, సిక్స్)
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
6.4వ ఓవర్- 63 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (24) ఔటయ్యాడు.
టార్గెట్ 177.. 6 ఓవర్లలో ముంబై స్కోర్ 62/0
రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)
టార్గెట్ 177.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ
177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 3 ఓవర్లలో ముంబై స్కోర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులుగా ఉంది. రోహిత్ 10 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. రికెల్టన్ 8 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 11 పరుగులు చేశాడు.
రాణించిన దూబే, జడేజా.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన సీఎస్‌కే
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే గౌరవప్రమదై స్కోర్ చేసింది. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.
ధోని ఔట్
18.4వ ఓవర్- 156 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ధోని (4) ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. దూబే ఔట్
16.2వ ఓవర్- 142 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటయ్యాడు.
ధాటిగా ఆడుతున్న దూబే
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శివమ్ దూబే అదరగొడుతున్నాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దూబేకు జతగా రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 118/3గా ఉంది.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
7.6వ ఓవర్- 63 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో షేక్ రషీద్ (19) స్టంపౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 66/3గా ఉంది. రవీంద్ర జడేజా (6), శివమ్ దూబే (1) క్రీజ్‌లో ఉన్నారు.
మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన ఆయుశ్ మాత్రే
అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6.5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
3.1వ ఓవర్- 16 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ తన స్పెల్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (9 బంతుల్లో 5) వికెట్ తీశాడు. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. రషీద్‌కు జతగా అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే క్రీజ్‌లోకి వచ్చాడు.
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్
ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, MS ధోని(కెప్టెన్/వికెట్‌కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ
ఇంపాక్ట్ సబ్‌లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్