బుమ్ బుమ్ బుమ్రా.. ల‌క్నోను చిత్తు చేసిన ముంబై | IPL 2025: Mumbai Indians win 5 in a row, beat LSG by 54 runs | Sakshi
Sakshi News home page

IPL 2025: బుమ్ బుమ్ బుమ్రా.. ల‌క్నోను చిత్తు చేసిన ముంబై

Apr 27 2025 8:21 PM | Updated on Apr 28 2025 7:26 AM

IPL 2025: Mumbai Indians win 5 in a row, beat LSG by 54 runs

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఈ  మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 54 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఇది ముంబైకి వ‌రుసగా ఐదో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో రికెల్ట‌న్‌(58), సూర్య‌కుమార్ యాద‌వ్‌(54) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరితో పాటు న‌మ‌న్ ధీర్‌(25), జాక్స్‌(29), బాష్‌(20) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్, అవేష్ ఖాన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, దిగ్వేష్‌, బిష్ణోయ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

బుమ్ బుమ్ బుమ్రా..
అనంత‌రం 216 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ముంబై బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరిగాడు. నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ల‌క్నోను దెబ్బ తీశాడు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. 

లక్నో బ్యాట‌ర్ల‌లో ఆయూష్ బ‌దోని(35) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిచెల్ మార్ష్(34) ప‌ర్వాలేద‌న్పించాడు. ఈ విజ‌యంతో ముంబై ఇండియ‌న్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్దానానికి చేరుకుంది.
చ‌ద‌వండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. తొలి భార‌త ప్లేయ‌ర్‌గా
 

Advertisement
 
Advertisement
Advertisement