
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో పై 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్‌లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. రాహుల్‌తో పాటు మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఈ ఓటమితో కరుణ్ నాయర్ ఇన్నింగ్స్‌గా వృథా అయిపోయింది. ముంబై బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కావడం గమనార్హం.
తిలక్ హాఫ్ సెంచరీ..బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు.