ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం | IPL 2025: Gujarat titans vs Mumbai indians live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం

Mar 29 2025 6:58 PM | Updated on Mar 29 2025 11:50 PM

IPL 2025: Gujarat titans vs Mumbai indians live updates and highlights

PC: BCCI/IPL.com

IPL 2025 MI vs GT live updates and highlights: 

ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం
ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్‌(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.

ముంబై ఐదో వికెట్ డౌన్‌..
సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 48 ప‌రుగులు చేసిన సూర్య.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 24 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులోకి నమాన్ ధీర్ వచ్చాడు.

ముంబై మూడో వికెట్‌ డౌన్‌..
తిలక్‌ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన తిలక్‌ వర్మ.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రాబిన్‌ మింజ్‌ వచ్చాడు. ముంబై విజయానికి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(37) ఉన్నారు.

9 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 86/2
9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 2 వికెట్ల న‌ష్టానికి 80 ప‌రుగులు చేసింది. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(25), తిల‌క్ వ‌ర్మ‌(35) ఉన్నారు.

సిరాజ్ ఆన్ ఫైర్‌.. ముంబై రెండో వికెట్ డౌన్‌
ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై.. రెండు వికెట్ల న‌ష్టానికి 44 ప‌రుగులు చేసింది. క్రీజులో తిల‌క్ వ‌ర్మ‌(18), సూర్య‌కుమార్‌(8) ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. ముంబై తొలి వికెట్ డౌన్‌
రోహిత్ శ‌ర్మ రూపంలో ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. మ‌హ్మ‌ద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిల‌క్ వ‌ర్మ వ‌చ్చాడు.

సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీ.. ముంబై ముందు భారీ టార్గెట్‌
అహ్మ‌దాబాద్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్  బ్యాట‌ర్లు స‌మిష్ట‌గా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయిసుద‌ర్శ‌న్‌(63) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. శుబ్‌మ‌న్ గిల్‌(38), జోస్ బ‌ట్ల‌ర్‌(39) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్‌, ముజీబ్ త‌లా వికెట్ సాధించారు.
19 ఓవ‌ర్లకు గుజ‌రాత్ స్కోర్‌: 186/6
గుజ‌రాత్ టైటాన్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. 18 ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సుద‌ర్శ‌న్(63) ఔట్ కాగా.. 19 ఓవ‌ర్‌లో వ‌రుస క్ర‌మంలో రాహుల్ తెవాటియా, రూథ‌ర్ ఫ‌ర్డ్ ఔట‌య్యారు. 19 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ 6 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది.

గుజ‌రాత్ మూడో వికెట్ డౌన్‌.. షారూఖ్ ఔట్‌
షారూఖ్ ఖాన్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన షారూఖ్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ మూడు వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది.

గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌..
జోస్ బ‌ట్ల‌ర్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 ప‌రుగులు చేసిన బట్ల‌ర్.. ముజీబ్ ఉర్ రెహ్మ‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(49), షారూఖ్ ఖాన్‌(0) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న జోస్‌ బట్ల‌ర్‌..
12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయి సుద‌ర్శ‌న్‌(42), బ‌ట్ల‌ర్‌(26) ఉన్నారు.

తొలి వికెట్ డౌన్‌.. శుబ్‌మ‌న్ గిల్ ఔట్‌
శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన గిల్‌.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి జోస్ బ‌ట్ల‌ర్ వ‌చ్చాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న గిల్‌, సుద‌ర్శ‌న్‌
గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు సాయిసుద‌ర్శ‌న్‌(32), శుబ్‌మ‌న్ గిల్‌(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 66 ప‌రుగులు చేసింది.

నిల‌క‌డ‌గా ఆడుతున్న గుజ‌రాత్ ఓపెన‌ర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు చేసింది. క్రీజులో ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌(13), సాయిసుద‌ర్శ‌న్‌(13) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. గుజ‌రాత్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

తుది జ‌ట్లు
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్‌), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement