గర్ల్‌ ఫ్రెండ్‌కు బెంజ్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్‌.. ఎన్ని కోట్లంటే? | Hardik Pandya Gifts Girlfriend Mahieka Sharma Rs 1.7 Crore Luxury Car | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌కు బెంజ్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్‌.. ఎన్ని కోట్లంటే?

Mar 30 2026 12:48 PM | Updated on Mar 30 2026 12:58 PM

Hardik Pandya Gifts Girlfriend Mahieka Sharma Rs 1.7 Crore Luxury Car

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. హార్దిక్‌ తన ప్రేయసి మహికా శర్మకు అత్యంత ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆమెపై ఉన్న ప్రేమను చాటుకుంటూ సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును కానుకగా అందించాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే పాండ్యా తన కోసం రూ.12 కోట్ల విలువైన లగ్జరీ రును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏకంగా మెర్సిడెస్ బెంజ్‌ను కొనుగోలు చేసి అందరిని ఆశ్యర్యపరిచాడు. కాగా ఈ బ‌రోడా క్రికెట‌ర్ నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన త‌ర్వాత మహికా శర్మతో ప్రేమలో ప‌డ్డాడు. 

హార్దిక్ ఆడే ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ఆమె మైదానంలో ఉండి ఉత్స‌హ‌ప‌రుస్తుంటుంది. తన విజయాల్లో మహికా కీలక పాత్ర పోషిస్తుందని హార్దిక్ ఇదివరకే పలుమార్లు పేర్కొన్నాడు. అయితే హార్దిక్ గ‌త నెల‌లో త‌న మాజీ భార్య న‌టాషాకు కూడా ఖ‌రీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.  నటాషా, అగస్త్య కోసం రూ. 4 కోట్ల విలువైన లాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను పాండ్యా కొనుగోలు చేశాడు.

ముంబై గ్రాండ్ విక్ట‌రీ
ఇక ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది. ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.  కేకేఆర్ విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది.

రోహిత్ శ‌ర్మ‌(78), ర్యాన్ రికెల్టన్ (81) అద్భుతమైన హాఫ్ సెంచ‌రీల‌తో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. 2012 త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ త‌మ తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఇదే మొద‌టిసారి.
చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్‌కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్‌ క్రికెటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement