ఐపీఎల్-2026 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్(81) తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించారు.
కాగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికి.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అతడు ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ సబ్‌గా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వచ్చాడు. దీంతో సూర్య గాయపడ్డాడా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది.
అయితే సూర్యను పక్కన పెట్టడానికి గల అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్దనే వెల్లడించాడు. సూర్యను కేవలం ఫిట్‌నెస్ జాగ్రత్తలలో భాగంగానే తుది జట్టులో ఆడించలేదని జయవర్ధనే స్పష్టం చేశాడు.
"మేము అనవసరమైన కథనాలను సృష్టించకూడడు అనుకుంటున్నాము. మా జట్టులోని ప్రతీ ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య కాస్త ఆలస్యంగా మా జట్టుతో చేరాడు. అయితే అతడి కాలి గజ్జల్లో స్వల్పంగా పట్టేసినట్లు ఉంది. దీంతో ఫీల్డింగ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు.
అందుకే ఈ రోజు అతడికి విశ్రాంతి ఇచ్చాము. చివరి నాలుగు ఓవర్లలో తను ఫీల్డింగ్‌కు వచ్చేందుకు స్కై సిద్దమయ్యాడు. కానీ నేనే వద్దన్నాను. మా తదుపరి మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. అప్పటికి సూర్య పూర్తి సిద్దంగా ఉంటాడని" జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 4న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌లతో తలపడనుంది.
చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్‌కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు


