రోహిత్‌, సూర్య మెరుపులు.. ఎస్ఆర్‌హెచ్‌పై ముంబై విజ‌యం | IPL 2025: Mumbai Indians beat Sunrisers Hyderabad by seven wickets | Sakshi
Sakshi News home page

IPL 2025: రోహిత్‌, సూర్య మెరుపులు.. ఎస్ఆర్‌హెచ్‌పై ముంబై విజ‌యం

Apr 23 2025 10:57 PM | Updated on Apr 23 2025 10:57 PM

IPL 2025: Mumbai Indians beat Sunrisers Hyderabad by seven wickets

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజ‌య భేరి మోగించింది. 144 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 15.4 ఓవ‌ర్ల‌లోనే చేధించింది.

ముంబై బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడ‌గా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 40 నాటౌట్‌) మెరుపు మెరిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఉన‌ద్క‌ట్‌, మ‌లింగ‌, అన్సారీ త‌లా వికెట్ సాధించారు. 

క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవ‌లం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 71 ప‌రుగులు చేశాడు. 

అత‌డితో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన అభిన‌వ్ మ‌నోహ‌ర్ కీల‌క నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 43 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రూ ఆరో వికెట్‌కు 99 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చాహ‌ర్ రెండు, బుమ్రా, హార్దిక్ త‌లా వికెట్ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement