
Photo Courtesy: BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.
ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్, రోహిత్ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 261 మ్యాచ్‌ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లు
క్రిస్ గేల్- 357
రోహిత్ శర్మ- 295
విరాట్ కోహ్లి- 285
ఎంఎస్ ధోని- 260
ఏబీ డివిలియర్స్- 251
ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఈ ఫార్మాట్‌లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్ మినహా ఏ క్రికెటర్ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్ తర్వాత కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్‌లో 908 సిక్సర్లు బాదాడు.
గేల్, పోలీ తర్వాత రసెల్ (737), పూరన్ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు విండీస్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో, విరాట్ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్ తన టీ20 కెరీర్‌లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్ 429 సిక్సర్లు కొట్టాడు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 ఆటగాళ్లు
క్రిస్ గేల్- 1056
కీరన్ పోలార్డ్- 908
ఆండ్రీ రసెల్- 737
నికోలస్ పూరన్- 630
కొలిన్ మున్రో- 557
అలెక్స్ హేల్స్- 552
రోహిత్ శర్మ- 540
గ్లెన్ మ్యాక్స్‌వెల్- 530
జోస్ బట్లర్- 528
డేవిడ్ మిల్లర్- 505
ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్‌లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్ (11) టాప్-4లో ఉన్నాయి.