
Photo Courtesy: BCCI
ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. వర్షం అంతరాయం వల్ల 19 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. చివరి ఓవర్లో లక్ష్యం 15 పరుగులు కాగా వర్షం కారణంగా DLS పద్ధతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది.
మ్యాచ్ మొదలైన కాసేపటికే వర్షం పడటంతో మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
తిరిగి మొదలైన మ్యాచ్.. లక్ష్యానికి చేరువగా గుజరాత్
14 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి అర్ద గంట తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది.గుజరాత్ లక్ష్యానికి చేరువగా ఉంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపు దిశగా సాగుతుంది. గుజరాత్ గెలవాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాలి.
14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/2
14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
11.3వ ఓవర్- 78 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (30) ఔటయ్యాడు.
10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1
10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. గిల్ 28, బట్లర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
టార్గెట్ 156.. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1
156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/1గా ఉంది. గిల్ (12) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్ 10 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
1.2వ ఓవర్- 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికల్టెన్‌కు క్యాచ్ ఇచ్చి ఇన్‌ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (5) ఔటయ్యాడు.
సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ముంబైని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. గుజరాత్ బౌలర్లందరూ సత్తా చాటడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో బాష్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా సాధించలేకపోయేది.
ఏడో వికెట్ కోల్పోయిన ముంబై
16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (7) ఔటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన ముంబై
13.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (7) ఔటయ్యాడు.
కష్టాల్లో ముంబై ఇండియన్స్
12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (1) ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
11.4వ ఓవర్- 103 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విల్ జాక్స్ (53) ఔటయ్యాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టాడు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
10.4వ ఓవర్- 97 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (35) ఔటయ్యాడు.
10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/2
10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (34), విల్ జాక్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు.
6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/2
6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/2గా ఉంది. విల్ జాక్స్ 30, సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జాక్స్‌కు 0, 29 పరుగుల వద్ద రెండు లైఫ్స్ లభించాయి. సాయి సుదర్శన్, సిరాజ్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేశారు.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
3.3వ ఓవర్- ముంబై ఇండియన్స్ 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (7) ఔటయ్యాడు.
రెండో బంతికే వికెట్ తీసిన సిరాజ్
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ రెండో బంతికే ముంబైని దెబ్బకొట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (2) ఔటయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. గుజరాత్ తరఫున వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంపాక్ట్ సబ్‌లు: వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వనీ కుమార్