Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Predicts That Gold Will Soar To 25000 Dollars And Silver To 70 Dollars1
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి

ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్‌లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్‌కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.THE END is HERE: WHAT if you threw a party and no one showed up?That is what happened yesterday. The Fed held an auction for US Bonds and no one showed up.So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025

Gold Price Hike Continues2
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..

భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్‌లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు.

TVS Ntorq 125 Covering 1618 km in Under 24 Hours Breaking Endurance Records3
24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'టీవీఎస్ ఎన్‌టార్క్ 125' మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ స్కూటర్ ఇటీవల 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.2025 మే 4న నోయిడాలోని సెక్టార్-38 నుంచి ప్రారంభమైన రైడ్‌ను ప్రారంభించి 15 గంటల్లోపు దాదాపు 1000 కి.మీ. రైడ్‌ను పూర్తి చేసి, మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఆ తరువాత కొందరు రైడర్లు.. కేవలం 24 గంటల్లో 1618 కిమీ దూరాన్ని ఈ స్కూటర్‌పై ప్రయాణించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ స్కూటర్ ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో & లక్నో-అజమ్‌గఢ్‌లతో సహా మల్టిపుల్ ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించింది.రైడింగ్ కోసం ఉపయోగించిన వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన.. ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ, డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్‌టీ ఉన్నాయి. పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్ ధరలు రూ. 87542 నుంచి రూ. 1.07 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ 125 సీసీ ఇంజిన్ ద్వారా 10 Bhp పవర్ 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

US Court Says  Google And Character AI Company Must Face Lawsuit Filed By Mother Over Her Death Of Son4
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'

టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్‌బాట్‌ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Are Robots Replacing Humans Faster5
ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు

ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్‌లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by AI researches | AI (@airesearches)

Tata Altroz Facelift Launched at Rs 6 89 Lakh in India6
రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్

దేశీయ మార్కెట్లో సరికొత్త 'టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌' లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). నాలుగు ట్రిమ్‌లలో లభించే ఈ కొత్త కారు.. పెట్రోల్, డీజిల్, CNG అనే మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది. కంపెనీ దీని కోసం జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభిస్తుంది.స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మంచి డిజైన్ పొందుతుంది. కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, కొత్త గ్రిల్, బంపర్‌లు, 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, ఫ్లష్ ఫిట్టింగ్ ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్ బార్, టీ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ మొదలైనవి ఉన్నాయి. ఇది డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ 2 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, 8 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్‌లు, వైపర్‌లు, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అనేవి మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతాయి.1.2 లీటర్ పెట్రోల్‌, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ CNG ఇంజిన్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇంజిన్ ఆటోమాటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలను పొందుతాయి. CNG వేరియంట్ ఫ్యూయెల్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది.

బిజినెస్ పోల్

Advertisement
Advertisement
Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 112000.00 1000.00 1.20
Gold 22K 10gm 89750.00 450.00 0.50
Gold 24k 10 gm 97910.00 490.00 0.50

Egg & Chicken Price

Title Price Quantity
Chicken (1 Kg skin less) 243.00 1.00
Eggs 76.00 12.00

Stock Action