పెట్రోల్‌ అమ్మకాలు పెరిగాయ్‌.. | Petrol Sales Surge 10pc in May Summer Travel Fuels Demand | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ అమ్మకాలు పెరిగాయ్‌..

May 17 2025 12:11 PM | Updated on May 17 2025 12:14 PM

Petrol Sales Surge 10pc in May Summer Travel Fuels Demand

న్యూఢిల్లీ: వేసవి నేపథ్యంలో పెట్రోల్‌ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 10 శాతం పెరిగినట్టు ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థల (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఇంధన అమ్మకాల్లో 90 శాతం వాటా ఈ సంస్థల చేతుల్లోనే ఉంది. మే 1–15 తేదీల మధ్య 1.37 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి.

వేసవి సెలవుల్లో వ్యక్తిగత వాహన వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా ఉంది. డీజిల్‌ విక్రయాలు 2 శాతం పెరిగి 3.36 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. రవాణా, వ్యవసాయ రంగంలో ప్రధానంగా వినియోగించే డీజిల్‌ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలోనూ 2 శాతం పెరగడం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో డీజిల్‌ విక్రయాలు 8.23 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి.

క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాల కంటే 4 శాతం అధికం. ఏప్రిల్‌నెల మొదటి 15 రోజుల్లో డీజిల్‌ అమ్మకాలు 3.19 మిలియన్‌ టన్నులతో పోల్చి చూస్తే 5 శాతం వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండడంతో గత కొన్ని నెలలుగా డీజిల్‌ అమ్మకాల్లో వృద్ధి పరిమితంగానే ఉంటున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.  

ఎల్‌పీజీ అమ్మకాలదీ ఎగువబాటే 
విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌) అమ్మకాలు మే మొదటి 15 రోజుల్లో 3,27,900 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాల కంటే 1.1 శాతం తగ్గాయి. పాకిస్థాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ఉత్తరాదికి విమాన సరీ్వసులు ప్రభావితం కావడం వినియోగం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. ఎల్‌పీజీ అమ్మకాలు 10.4 శాతం పెరిగి 1.34 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement