హైదరాబాద్‌ ఇప్పుడు కాస్ట్‌లీ సిటీ | Hyderabad now becomes costly city | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఇప్పుడు కాస్ట్‌లీ సిటీ

May 10 2025 10:20 AM | Updated on May 10 2025 10:41 AM

Hyderabad now becomes costly city

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ కాస్ట్‌లీ సిటీగా అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాలతో పోల్చినా భాగ్యనగరంలో గృహాల ధరలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయింది. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6,000 వేలకు పెరిగింది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లకు చేరిందని ఓ సంస్థ నివేదిక వెల్లడించింది.


👉ఇది చదివారా? సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లు.. హైదరాబాద్‌లో ఇక్కడ భలే డిమాండ్‌


దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్‌ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్‌ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఒకవైపు సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులకు రాయితీలను అందిస్తున్నారు. లేదంటే ఆయా నగరాలలో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముంది.

సరఫరా, డిమాండ్‌లలో వృద్ధి రేటు.. 
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో గృహాల విక్రయాలలో హైదరాబాద్‌లో అత్యధిక వృద్ధి నమోదైంది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్‌ ప్రాంతాలలో గృహ విక్రయాలకు డిమాండ్‌ విపరీతంగా ఉంది. ఆయా ప్రాంతాలలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ.. డిమాండ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. లాంచింగ్‌ అయిన ప్రాజెక్ట్‌లలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల వాటా 36 శాతంగా ఉంది. దుండిగల్, తెల్లాపూర్, గోపనపల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్‌ ప్రాంతాలలో ఇళ్ల సరఫరా ఎక్కువగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement