
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టాటాఈవీ తొలిసారిగా 10 మెగాచార్జర్ స్టేషన్లను ప్రారంభించింది. ముంబై–అహ్మదాబాద్ హైవేపై మూడు, ఢిల్లీ–జైపూర్ హైవేలో నాలుగు, పుణె–నాసిక్ హైవేలో ఒకటి, బెంగళూరు.. ఉదయ్‌పూర్ నగరాల్లో చెరొకటి చొప్పున చార్జ్‌జోన్, స్టాటిక్ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇవిఅత్యంత వేగంగా కేవలం 15 నిమిషాల్లోనే సుమారు 150 కి.మీ. రేంజికి సరిపడేంత చార్జింగ్ చేసుకునేందుకు వీలు కలిగిస్తాయి.
ఈ స్టేషన్లలో రెస్ట్‌రూమ్‌లు, డైనింగ్ సదుపాయాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 500 మెగాచార్జర్లను ఇన్‌స్టాల్ చేయాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని నెలకొల్పినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ బాలాజీ రాజన్ తెలిపారు. 2027 నాటికి ప్రస్తుతమున్న చార్జ్ పాయింట్లను రెట్టింపు స్థాయి పెంచడంపై సంస్థ దృష్టి పెడుతోంది.