-
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి, తన కెరీర్‌ను ఘనంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
RCB: ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్‌తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్‌ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్‌లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్‌లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్‌లోని నాగౌర్‌కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్‌పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
'అతడొక సూపర్ స్టార్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాల్సిందే'
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై దూబే విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో దూబే అలరించాడు. స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. కేవలం 24 బంతుల్లో 4 సిక్స్‌లు , 2 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దూబే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడని పఠాన్ కొనియాడు. "నేనే సెలక్టర్ అయితే శివమ్ దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేస్తాను. అతడికి అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంతే కాకుండా స్పిన్నర్లను చీల్చి చెండాడతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే స్పిన్నర్లను ఎటాక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో కాకుండా గత ఏడాది సీజన్లో కూడా దూబే స్పిన్నర్లకు అద్బుతంగా ఆడాడు. అటువంటి ఆటగాడు జట్టుకు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఎంపికచేయరు? అతడి ఆటను సెలక్టర్లు చూస్తున్నరని నేను భావిస్తున్నాను. కాబట్టి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వండి. దూబే స్పిన్నర్లను మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్లకు కూడా అద్బుతంగా ఆడుతాడు. అతడు ముంబై నుండి వచ్చాడని మర్చిపోవద్దు. ముంబైలో పిచ్‌లు ఎక్కువగా బౌన్స్ అవుతాయి. కాబట్టి అతడు పేసర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలడని" స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే!.. ఎవరూ ఊహించని ప్లేయర్‌కు ఛాన్స్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. 20 జట్లు ఐదు గ్రూప్‌లుగా విడిపోయి.. లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. అనంతరం జూన్ 9 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్లో బీజీబీజీగా ఉన్నారు. ఈ పొట్టి ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లు కంటే ముందే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇర్ఫాన్ ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్‌ను పఠాన్ చోటిచ్చాడు. ఇర్ఫాన్ తన ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లకు అవకాశమిచ్చాడు. అదే విధంగా వికెట్ కీపర్ల కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలను పఠాన్ ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. స్పెషలిష్ట్ స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను ఇర్ఫాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, బుమ్రాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. మూడో సీమర్‌గా మొహ్సిన్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్నాడు. పఠాన్ ఎంపిక చేసిన జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, మొహ్సిన్ ఖాన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement