టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో దినేష్ కార్తీక్‌..? అత‌డికి అంత సీన్ లేదు! | Sakshi
Sakshi News home page

#Dinesh Karthik: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో దినేష్ కార్తీక్‌..? అత‌డికి అంత సీన్ లేదు!

Published Tue, Apr 16 2024 5:10 PM

Dinesh Karthik in Indias T20 World Cup squad? Irfan Pathan laughs it off - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌, భార‌త వెట‌ర‌న్ దినేష్ కార్తీక్ అద‌ర‌గొడుతున్నాడు. లేటు వ‌య‌స్సులో ఖ‌త‌ర్నాక్‌ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మ‌లేపుతున్నాడు.  ఆఖ‌రిలో బ్యాటింగ్‌కు వ‌చ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గ‌త సీజ‌న్‌లో నిరాశ‌ప‌రిచిన కార్తీక్ ..ప్ర‌స్తుత సీజ‌న్‌లో మాత్రం పూర్తి భిన్నంగా క‌న్పిస్తున్నాడు.

సోమ‌వారం  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. 288 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో డీకే అద్బుత‌మైన పోరాట ప‌టిమ క‌న‌బ‌రిచాడు. ఓ ద‌శ‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా క‌న్పించిన కార్తీక్‌..  ఆఖ‌రికి న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు.

దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో కార్తీక్‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 భార‌త జ‌ట్టులో చోటు ఇవ్వాల‌ని చాలా మంది మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడించాల‌ని రాయడు అన్నాడు.

"కార్తీక్ త‌న కెరీర్‌లో ఎక్కువ‌గా ఎంఎస్ ధోనితో పోటీప‌డ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూల‌ర్ వికెట్ కీప‌ర్‌గా జ‌ట్టులో ఉండ‌డంతో కార్తీకు పెద్ద‌గా ఆడే అవ‌కాశాలు రాలేదు. అయితే డీకే ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అత‌డికి త‌న‌ కెరీర్‌లో చివ‌రిసారిగా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని నేను భావిస్తున్నానను.

అత‌డికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా భార‌త్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించి, త‌న కెరీర్‌ను ఘ‌నంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవ‌కాశం. కాబ‌ట్టి డికేనే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లను కోరుతున్నానని" రాయ‌డు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.

ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. ప‌ఠాన్ న‌వ్వుతూ ఐపీఎల్ వేరు, వ‌ర‌ల్డ్‌క‌ప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా  వ‌ర‌ల్డ్‌క‌ప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ ఉండ‌ద‌ని, కచ్చితంగా తీవ్ర‌మైన ఒత్త‌డి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement