ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్‌కు గుడ్ న్యూస్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.
ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ధ్రువీకరించింది. ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు కేఎస్‌సీఏ తెలిపింది. "ప్రభుత్వం విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పోటీలతో కళకళలాడనుంది" అని కేఎస్‌సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సర్కార్ నిబంధనలు ఇవే..
స్టేడియం లోపల, వెలుపల రద్దీని పర్యవేక్షించడానికి ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సుమారు రూ.4.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఏఐ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. అభిమానులు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్‌లను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం సూచించింది.
కాగా ఐపీఎల్-2025 ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం.. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
దీంతో అప్పటి నుంచి చిన్నస్వామి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. మహిళల ప్రపంచకప్ 2025, మెన్స్ టీ20 ప్రపంచకప్-2026 వేదికల జాబితా నుండి కూడా ఈ వేదికను తొలిగించారు. అయితే తిరిగి మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కళ సంతరించుకోనుండడంలో కొత్తగా ఎన్నికైన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్‌ది కీలక పాత్ర.
చదవండి: WPL 2026: ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం


