వాడిలో ఇన్ని వేరియేషన్స్‌ ఉన్నాయని నాకు తెలియదు

Irfan Pathan Shares Adorable Video With Son On Social Media Became Viral - Sakshi

ఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆటకు గుడ్‌బై చెప్పిన సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యాడు. తాజాగా తన కొడుకు ఇమ్రాన్‌తో కలిసి హ్యాపీగా గడిపిన కొన్ని వీడియోలను ట్రిమ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ''నా కొడుకు ఇమ్రాన్‌లో ఇన్ని డిపెరెంట్‌ షేడ్స్‌ చూసి ఆశ్చర్యం కలిగింది. వాడి అల్లరి తట్టుకోలేకపోతున్నా.. రాను రాను మొండిగా తయారవుతున్నాడు.. కానీ ఆ అల్లరే నాకున్న బాధలను మరిచిపోయేలా చేస్తుంది.'' అంటూ కామెంట్‌ చేశాడు. ఇర్ఫాన్‌ షేర్‌ చేసిన వీడియోకు 47వేల లైకులతో ట్రెండింగ్‌గా మారింది. 

ఇక 2003లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌ టెస్టులో అరంగేట్రం చేసిన ఇర్ఫాన్‌ ఆ సిరీస్‌లో తన స్వింగ్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అనంతర కాలంలో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన పఠాన్‌ టీమిండియా తరపున  మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు తీశాడు.

వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2821(వన్డేలు 1544, టెస్టులు 1105, టీ20 172 పరుగులు) పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. 2012లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఇర్ఫాన్‌... గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 క్రికెట్‌ టోర్నీలో జమ్మూ కాశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

చదవండి: 
ఏం పని లేదు.. అందుకే ఇది మొదలుపెట్టా: పంత్‌

మొన్న బనానా ఇన్‌స్వింగర్‌; నేడు స్నార్టర్‌.. నువ్వు సూపర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top