కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్‌ అయిన 5 మంది స్టార్‌ క్రికెట్ ఆటగాళ్లు | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్‌ అయిన 5 మంది స్టార్‌ క్రికెట్ ఆటగాళ్లు

Published Sat, Sep 9 2023 2:47 PM

Indian Cricket Celebrities Failed Hollywood Movies - Sakshi

కొందరు భారత్‌ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్‌ కావడమే కాకుండా  సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్‌లో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు.

(ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?)

తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్‌ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్‌జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్‌గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.

నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు 
ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్‌డే క్రికెట్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్‌ మ్యాచ్‌లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు.  2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు.

అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్‌షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్‌లో నటించాడు.  చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ  'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్‌ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు.

అతని తర్వాత క్రికెటర్‌ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్‌'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు.

(ఇదీ చదవండి: విశాల్‌ 'మార్క్‌ ఆంటోనీ' సినిమాపై బ్యాన్‌ విధించిన కోర్టు)

సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్‌,జవాన్‌,విక్రమ్‌ వంటి సినిమాలకు టాలీవుడ్‌లో భారీగా కలెక్షన్స్‌ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్‌ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement