విక్రమ్‌కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్‌ పఠాన్‌ | Chiyaan Vikram Movie Cobra Teaser Released | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌ మూవీ: కోబ్రా టీజర్‌ వచ్చేసింది..

Jan 9 2021 6:13 PM | Updated on Jan 9 2021 7:57 PM

Chiyaan Vikram Movie Cobra Teaser Released - Sakshi

ప్రతీ సమస్యకు లెక్కలతో పరిష్కారాన్ని కనుగొంటాడు కోబ్రా అలియాస్‌ హీరో చియాన్‌ విక్రమ్‌. అయితే నంబర్లతో ఆడుకునే కోబ్రాకు ఈ సారి ఎక్కువ నంబర్లిస్తానని, దాన్ని పరిష్కరించమంటూ టీజర్‌లో సవాలు విసురుతున్నాడు అస్లాన్‌ యిల్మాజ్ అలియాస్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌‌. ఇందుకోసం విక్రమ్‌ రకరకాల వేషాలు మార్చుతున్నట్లు టీజర్‌ చూస్తేనే తెలుస్తోంది. కాగా తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌ హీరోగా ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న "కోబ్రా" టీజర్ శనివారం‌ రిలీజైంది (చదవండి: రామ్‌ న్యూలుక్‌.. ఆపిల్‌ పండులా..)

ఇంటర్‌పోల్‌ అధికారి పాత్ర పోషిస్తున్న ఇర్ఫాన్‌ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. థ్రిల్లర్‌ అంశాలు గట్టిగా దట్టించినట్లు కనిపిస్తోన్న ఈ టీజర్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇర్ఫాన్‌ను తొలిసారి నటుడిగా చూడటంతో అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్‌ దాదాపు 20 గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇర్ఫాన్‌తో పాటు దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా వరకూ రష్యాలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా వ్యవహరిస్తున్నారు. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. (చదవండి: ఇర్ఫాన్ పఠాన్‌‌ బర్త్‌ డే సర్‌ప్రైజ్‌: కోబ్రా ఫ్టస్‌లుక్‌ విడుదల)

Advertisement
 
Advertisement
Advertisement