రామ్‌ న్యూలుక్‌.. ఆపిల్‌ పండులా.. | Ram Pothineni Latest Photos Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఆమ్లెట్‌ వేస్తున్న.. ఆపిల్‌ పండులా ఉన్నాడు

Jan 8 2021 8:15 PM | Updated on Jan 8 2021 8:28 PM

Ram Pothineni Latest Photos Goes Viral In Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి మేల్‌ ఫ్యాన్స్‌తో పాటు లేడీ ఫ్యాన్స్‌ కూడా ఎక్కువే. ‘దేవదాసు’, ‘జగడం’, ‘రేడీ’ వంటి ప్రేమ కథా చిత్రాలతో యువతను ఆకట్టుకున్న రామ్..‌ పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్మార్ట్‌ శంకర్‌తో కూడా మాస్‌ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘రెడ్’‌ సినిమాలో నటిస్తున్న అతడు త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడి లేటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ గడ్డంతో రఫ్‌గా కనిపించే రామ్‌ ఈ ఫొటోల్లో లవర్‌ బాయ్‌గా దర్శనం ఇచ్చాడు. ఇక ఇవి చూసిన అతడి‌ లేడీ ఫ్యాన్స్‌ వివిధ కామెంట్స్‌తో తమ స్పందను తెలుపుతున్నారు. (చదవండి: ఏడు భాషల్లో రామ్‌ కొత్త సినిమా)

అంతలా తన లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోల్లో రామ్‌ పీచ్‌ కలర్‌‌ టీ షర్ట్‌, తెల్లటి ప్యాంట్‌ ధరించి.. ఎగ్‌ ఆమ్లెట్‌ వేస్తూ క్యూట్‌గా ఫొజులిచ్చాడు. వీటికి ‘ఆమ్లెట్‌ వేస్తున్నా.. ఆపిల్‌ పండులా’ ఉన్నాడు అంటూ మహిళ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ‘ఇస్మార్ట్‌ శంకర్’‌లో మాస్‌ లుక్‌లో కనిపించిన రామ్‌ ప్రస్తుతం ‘రెడ్’‌ లో డబుల్‌ రోల్‌ పోషించాడు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న మొత్తం ఏడు భాషల్లో విడుదల కానుంది. (చదవండి: రెడ్‌ ట్రైలర్‌: ఈ సారి మంట మాములుగా లేదు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement