ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా.. | Irfan Pathan Fourth Player To Test Covid Positive In Road Safety Series | Sakshi
Sakshi News home page

ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా..

Mar 30 2021 4:02 PM | Updated on Mar 30 2021 4:02 PM

Irfan Pathan Fourth Player To Test Covid Positive In Road Safety Series - Sakshi

రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టీ20 టోర్నీలో పాల్గొన్న ఇండియా లెజెండ్స్‌ జట్టు ఆటగాళ్లు రోజుకొకరు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్, యూసుఫ్‌ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్‌ వైరస్‌ బారిన పడగా... తాజాగా ఈ జాబితాలో మరో ప్లేయర్‌ చేరాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా సోమవారం ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తోంది. దీని ప్రభావం క్రీడారంగంపై భారీగా పడింది. రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టీ20 టోర్నీలో పాల్గొన్న ఇండియా లెజెండ్స్‌ జట్టు ఆటగాళ్లు రోజుకొకరు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్, యూసుఫ్‌ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్‌ వైరస్‌ బారిన పడగా... తాజాగా ఈ జాబితాలో మరో ప్లేయర్‌ చేరాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా సోమవారం ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. 

కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.. తన సోదరుడు యూసుఫ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో తాను కూడా పరీక్ష చేయించుకున్నానని ఇర్ఫాన్‌ వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటానన్నాని ఆయన ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.
చదవండి: సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement