David Warner: వార్నర్ కు అప్పుడు అండగా నిలిచింది వాళ్లే కదా.. అది గుర్తు లేదా?

Irfan Pathan defends SRH in David Warner chapter - Sakshi

Irfan Pathan defends SRH in David Warner chapter: ఐపీఎల్‌-2022 మెగా వేలం ముందు 8 ఫ్రాంఛైజీలు తాము రీటైన్‌ చేసుకోనే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. కెప్టెన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమాద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ను మాత్రమే రీటైన్‌​ చేసుకుంది. అయితే ఆ జట్టు మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ రీటైన్‌ చేసుకోలేదు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్  కెప్టెన్‌ తొలగించబడ్డాడు. అంతే కాకుండా ఆ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటు దక్కలేదు. ముందు నుంచి అంతా అనుకున్నట్టే డేవిడ్‌ భాయ్‌ను ఈసారి హైదరాబాద్ రీటైన్‌ చేసుకోలేదు. 

ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు హైదరాబాద్ ఫ్రాంఛైజీపై తీవ్రస్ధాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమర్శకులు భారత మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్ చెక్‌ పెట్టాడు. వార్నర్ జాతీయ జట్టుకు దూరమై కష్టాల్లో ఉన్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్‌  అండగా నిలిచింది అని అతడు తెలిపాడు.

"ఒక విదేశీ ఆటగాడి రీటైన్‌ గురించి ఫ్రాంచైజీ నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్లందరూ ఒకటి  గుర్తు పెట్టుకోవాలి. తన సొంత దేశం అతనిని ఆడకుండా నిషేధించినప్పుడు అదే ఫ్రాంచైజీ అతనికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిందని  గుర్తుంచుకోవాలి" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీటర్‌ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌లో పఠాన్   వార్నర్ పేరుగానీ, సన్ రైజర్స్ పేరు గానీ ప్రస్తావించడకపోవడం గమనార్హం. కాగా 2018లో  బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

చదవండిT10 League: బ్యాట్స్‌మన్‌ వీరబాదుడు.. 20 నిమిషాల్లోనే మ్యాచ్‌ ఖేల్‌ఖతం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top