152/0 VS 170/0 Tweet: మీకు మాకు ఇదే తేడా.. పాక్‌ ప్రధానికి ఇర్ఫాన్‌ పఠాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Irfan Pathan Hits Out At Pak PM Shehbaz Sharif Over Controversial Tweet - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. ఫైనల్‌కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్‌ ప్రధానికి.. ఇర్ఫాన్‌ పఠాన్‌ తనదైన శైలిలో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. పాక్‌ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్‌లో చురలకలంటిస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పాక్‌ ప్రధానికి భారత్‌ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్‌ ఇచ్చిన ఈ కౌంటర్‌ మరింత స్ట్రాంగ్‌గా ఉంది.

దీంతో ఇర్ఫాన్‌ చేసిన  కౌంటర్‌ అటాక్‌పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్‌ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్‌ కౌంటర్‌ ట్వీట్‌కు మద్దతు పలుకుతున్నారు. పాక్‌ ప్రధానిని ఇన్‌ స్వింగింగ్‌ యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో, టీ20 వరల్డ్‌కప్‌-2021 గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్‌ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్‌ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు.
చదవండి: టీమిండియా ఓటమిపై పాక్‌ ప్రధాని ట్వీట్‌ వైరల్‌.. కౌంటర్‌ ఇస్తున్న ఫ్యాన్స్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top