WC 2022 Ind Vs Eng: టీమిండియా ఓటమిపై పాక్‌ ప్రధాని ట్వీట్‌ వైరల్‌.. కౌంటర్‌ ఇస్తున్న ఫ్యాన్స్‌

Ind Vs Eng: Pak PM Tweet On Team India Loss Goes Viral Fans React - Sakshi

ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ఘోర పరాజయంతో టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా. అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేక భారత బౌలరుల​ ఆపసోపాలు పడిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

పవర్‌ ప్లేలో మనవాళ్లు తడబడితే(38) ఇంగ్లండ్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ మాత్రం ఏకంగా 63 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత వారి దూకుడుకు అడ్డుకట్టవేయడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు. తమదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పొట్టి ఫార్మాట్‌ ఉన్న మజాను ప్రేక్షకులకు అందించారు ఈ ఇద్దరు బ్యాటర్లు.

బట్లర్‌ 80, హేల్స్‌ 86 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. 7 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. నవంబరు 13న మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది.

పాక్‌ ప్రధాని ట్వీట్‌ వైరల్‌
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఓటమిని ఉద్దేశిస్తూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్‌ 170/0 అన్నమాట’’ అని పేర్కొన్నారు.

గతేడాది ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం(అప్పుడు పాక్‌ స్కోరు 152/0) పాలైన విషయాన్ని ఉటంకిస్తూ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో.. పాక్‌, ఇంగ్లండ్‌ ఫైనల్‌ చూడబోతున్నామని పేర్కొన్నారు.

ఫ్యాన్స్‌ కౌంటర్‌
కాగా ఈ ట్వీట్‌పై టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ‘‘మా వాళ్లేమీ న​క్క తోక తొక్కి.. ఎవరో ఎవరినో ఓడించడం ద్వారా సెమీస్‌కు చేరలేదు. సెమీ ఫైనల్‌ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందినంత మాత్రాన మా వాళ్లేమీ తక్కువ కాదు’’ అంటూ కౌంటర్‌ ఇస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఇండియా ఫైనల్‌ చేరితే కథ వేరేగా ఉండేందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో జింబాబ్వే చేతిలో పాక్‌ ఓటమిని గుర్తు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్‌ వాళ్లకే!
WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2022
Nov 10, 2022, 20:02 IST
టీమిండియా మరోసారి ఐసీసీ టైటిల్‌ కొట్టడంలో విఫలమయింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌తోనే ఆటను ముగించింది. ఇంగ్లండ్‌...
10-11-2022
Nov 10, 2022, 19:41 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా కథ ముగిసింది. ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్‌.. టోర్నీ నుంచి...
10-11-2022
Nov 10, 2022, 19:12 IST
ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపై భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! భారత ఓటమికి ప్రధాన కారణాలు
10-11-2022
Nov 10, 2022, 18:52 IST
టి20 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీఫైనల్లోనే వెనుదిరగడంతో ఫ్యాన్స్‌ నిరాశకు లోనయ్యారు. సూపర్‌-12...
10-11-2022
Nov 10, 2022, 18:41 IST
ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి టీమిండియా...
10-11-2022
Nov 10, 2022, 17:50 IST
ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో  టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి...
10-11-2022
Nov 10, 2022, 17:46 IST
''టి20 ప్రపంచకప్‌లో టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్‌ జరగనివ్వం.. అది జరగాలంటే ముందు టీమిండియా మమ్మల్ని ఓడించాలి..'' భారత్‌తో...
10-11-2022
Nov 10, 2022, 17:34 IST
ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
10-11-2022
Nov 10, 2022, 17:13 IST
వీళ్లంతా ఐపీఎల్‌లో ఇలాంటి మ్యాచ్‌లు ఆడిన వాళ్లే.. కానీ: రోహిత్‌ శర్మ
10-11-2022
Nov 10, 2022, 16:56 IST
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘోర...
10-11-2022
Nov 10, 2022, 16:37 IST
అంతా ఊహించినట్లే జరిగింది. ఆరంభం నుంచి టీమిండియాకు మైనస్‌గా కనిపిస్తూ వచ్చిన బౌలింగ్‌ విభాగం కీలకమైన సెమీస్‌ పోరులో పూర్తిగా...
10-11-2022
Nov 10, 2022, 16:34 IST
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final Updates In Telugu: టీ20 ప్రపంచకప్‌-2022:...
10-11-2022
Nov 10, 2022, 16:32 IST
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల...
10-11-2022
Nov 10, 2022, 16:01 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పంత్‌ మరోసారి విఫలమయ్యాడు. కోహ్లి ఔట్‌ అయ్యాకా క్రీజులోకి వచ్చిన పంత్‌...
10-11-2022
Nov 10, 2022, 15:37 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కీలకమైన...
10-11-2022
Nov 10, 2022, 15:28 IST
టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అర్థసెంచరీతో...
10-11-2022
Nov 10, 2022, 15:11 IST
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో...
10-11-2022
Nov 10, 2022, 14:58 IST
టీ20 ప్రపంచకప్‌-2022లోభాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో టీమిండియా స్టార్‌  ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ తీవ్ర నిరాశ పరిచాడు. కీలకమైన మ్యాచ్‌లో కేవలం...
10-11-2022
Nov 10, 2022, 14:07 IST
ICC Mens T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌-2022 మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్తాన్‌...
10-11-2022
Nov 10, 2022, 13:23 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్‌ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి...



 

Read also in:
Back to Top