Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్‌ వాళ్లకే!

WC 2022 Ind Vs Eng Rohit Sharma: We Batted Well Not Upto Mark With Ball - Sakshi

T20 World Cup 2022- 2nd Semi-Final- England Beat India By 10 Wickets: ‘‘తీవ్ర నిరాశకు లోనయ్యాం. మేము బాగానే బ్యాటింగ్‌ చేశాం. మెరుగైన స్కోరు నమోదు చేయగలిగాం. కానీ బౌలర్లు రాణించలేకపోయారు. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించడమే అతి ముఖ్యమైనది. అయినా, మా జట్టులోని ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్‌లు కొత్తేమీ కాదు. వీళ్లంతా ఐపీఎల్‌లో ఇలాంటి నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడినవాళ్లే. కానీ ఈరోజు మాకు శుభారంభం లభించలేదు.

ఇంగ్లండ్‌ విజయంలో క్రెడిట్‌ మొత్తం ఓపెనర్లకే దక్కుతుంది. వాళ్లు అద్భుతంగా ఆడారు. మొదటి ఓవర్‌ నుంచే వారు దూకుడు ప్రదర్శించారు. టోర్నీ మొదటి మ్యాచ్‌లో మేము పట్టుదలగా ఆడిన తీరు గుర్తుండే ఉంటుంది. 

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ హోరాహోరీ పోరు జరిగింది. ఏదేమైనా ఈరోజు మేము మా స్థాయికి తగ్గట్లు ఆడలేదు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం. అందుకే ఇబ్బందుల్లో పడ్డాం’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. 

మరీ ఇంత దారుణంగా
టీ20 ప్రపంచకప్‌-2022 రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అడిలైడ్‌ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్‌కు చేరుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశను మిగులుస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది రోహిత్‌ సేన. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(50), ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా(63) అర్ధ శతకాలతో 168 పరుగులు చేయగలిగిన టీమిండియా.. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను నిలువరించలేకపోయింది. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ 80, అలెక్స్‌ హేల్స్‌ 86 పరుగులతో చెలరేగి 16 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించారు. అద్భుత అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. 

ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2 ఓవర్లలో 25, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు ఓవర్లలో 15, అక్షర్‌ పటేల్‌ 4 ఓవర్లలో 30, మహ్మద్‌ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్‌ అశ్విన్‌ 2 ఓవర్లలో 27 పరుగులు, హార్దిక్‌ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మ్యాచ్‌ స్కోర్లు:
భారత్‌: 168/6 (20)
ఇంగ్లండ్‌: 170/0 (16)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అలెక్స్‌ హేల్స్‌

చదవండి: T20 WC 2022 Ind Vs Eng: 'మీ బౌలింగ్‌కు ఓ దండం రా బాబు.. వచ్చి ఐపీఎల్‌ ఆడుకోండి'
T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్‌ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2022
Nov 10, 2022, 17:50 IST
ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో  టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి...
10-11-2022
Nov 10, 2022, 17:46 IST
''టి20 ప్రపంచకప్‌లో టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్‌ జరగనివ్వం.. అది జరగాలంటే ముందు టీమిండియా మమ్మల్ని ఓడించాలి..'' భారత్‌తో...
10-11-2022
Nov 10, 2022, 17:34 IST
ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
10-11-2022
Nov 10, 2022, 16:56 IST
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘోర...
10-11-2022
Nov 10, 2022, 16:37 IST
అంతా ఊహించినట్లే జరిగింది. ఆరంభం నుంచి టీమిండియాకు మైనస్‌గా కనిపిస్తూ వచ్చిన బౌలింగ్‌ విభాగం కీలకమైన సెమీస్‌ పోరులో పూర్తిగా...
10-11-2022
Nov 10, 2022, 16:34 IST
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final Updates In Telugu: టీ20 ప్రపంచకప్‌-2022:...
10-11-2022
Nov 10, 2022, 16:32 IST
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల...
10-11-2022
Nov 10, 2022, 16:01 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పంత్‌ మరోసారి విఫలమయ్యాడు. కోహ్లి ఔట్‌ అయ్యాకా క్రీజులోకి వచ్చిన పంత్‌...
10-11-2022
Nov 10, 2022, 15:37 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కీలకమైన...
10-11-2022
Nov 10, 2022, 15:28 IST
టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అర్థసెంచరీతో...
10-11-2022
Nov 10, 2022, 15:11 IST
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో...
10-11-2022
Nov 10, 2022, 14:58 IST
టీ20 ప్రపంచకప్‌-2022లోభాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో టీమిండియా స్టార్‌  ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ తీవ్ర నిరాశ పరిచాడు. కీలకమైన మ్యాచ్‌లో కేవలం...
10-11-2022
Nov 10, 2022, 14:07 IST
ICC Mens T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌-2022 మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్తాన్‌...
10-11-2022
Nov 10, 2022, 13:23 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్‌ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి...
10-11-2022
Nov 10, 2022, 12:53 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు ఇవాళ (నవంబర్‌ 10) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గటంలకు ప్రారంభమయ్యే...
10-11-2022
Nov 10, 2022, 12:21 IST
పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇవాళ...
10-11-2022
Nov 10, 2022, 11:52 IST
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ‘‘నాకౌట్‌ మ్యాచ్‌కు ప్రాధాన్యత...
10-11-2022
Nov 10, 2022, 09:51 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య అడిలైడ్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 10) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది....
10-11-2022
Nov 10, 2022, 09:25 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వంలోని న్యూజిలాండ్‌ జట్టు.. నిన్న (నవంబర్‌ 9) జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్‌ చేతిలో...
10-11-2022
Nov 10, 2022, 08:42 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 10) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30...



 

Read also in:
Back to Top