T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ!

టీ20 ప్రపంచకప్-2022లోభాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ తీవ్ర నిరాశ పరిచాడు. కీలకమైన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో.. రాహుల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 128 పరుగులు మాత్రమే చేశాడు. నాకౌట్ దశలో బంగ్లాదేశ్, జింబాబ్వేపై మాత్రమే రాహుల్ పర్వాలేదనిపించాడు.
మిగితా మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే రాహుల్ పరిమితమయ్యాడు. ఇక కీలకమైన సెమీఫైనల్లో విఫలమకావడంతో రాహుల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి రాహుల్..? బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి చిన్న జట్లపై మాత్రం ఆడుతావా అంటూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
KL Rahul chose the big stage to show his loyalty towards the academy...He gone to pavilion after scoring gorgeous gorgeous 5 runs off just 5 balls... Professor KL on fire🔥😍 #INDvENG pic.twitter.com/mY4utMWa2y
— TukTuk Academy (@TukTuk_Academy) November 10, 2022
We fans demand the immediate removal of Kl Rahul from every indian squad. As fans we have suffered enough because of him opening the batting for our lovely Indian team.
How many times we have to suffer?*Your every like means you also want kl rahul dropped.#INDvENG pic.twitter.com/QTVuRUMoup
— Passionate Fan (@Cricupdatesfast) November 10, 2022
చదవండి: WC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? పాక్ కెప్టెన్ ఏమన్నాడంటే
మరిన్ని వార్తలు