దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్‌.. అయినా..! | Legends League Cricket: Pathan Brothers Shines With Bat, Yet Konark Suryas Odisha Lost To Southern Super Stars In Qualifier 1 | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్‌.. అయినా..!

Published Sat, Oct 12 2024 7:09 PM | Last Updated on Sun, Oct 13 2024 10:13 AM

Legends League Cricket: Pathan Brothers Shines With Bat, Yet Konark Suryas Odisha Lost To Southern Super Stars In Qualifier 1

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 12) జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో సదరన్‌ సూపర్‌ స్టార్స్‌, కోణార్క్‌ సూర్యాస్‌ ఒడిశా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సదరన్‌ సూపర్‌ స్టార్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన కోణార్క్‌ సూర్యాస్‌ పఠాన్‌ సోదరులు చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇర్ఫాన్‌ పఠాన్‌ 47 బంతుల్లో 62, యూసఫ్‌ పఠాన్‌ 21 బంతుల్లో 43 పరుగులు చేసి కోణార్క్‌ సూర్యాస్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. 

కోణార్క్‌ సూర్యాస్‌ ఇన్నింగ్స్‌లో పఠాన్‌ బ్రదర్స్‌తో పాటు రిచర్డ్‌ లెవి మాత్రమే రెండంకెల స్కోర్‌ (22) చేశాడు. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. సదరన్‌ స్టార్స్‌ బౌలర్లలో హమిద్‌, రజాక్‌, సుబోత్‌ భాటి, కేదార్‌ జాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సదరన్‌ స్టార్స్‌.. హమిల్టన్‌ మసకద్జ (67), పవన్‌ నేగి (40 నాటౌట్‌) సత్తా చాటడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. సదరన్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్‌లో మార్టిన్‌ గప్తిల్‌ 4, శ్రీవట్స్‌ గోస్వామి 23, చిరాగ్‌ గాంధీ 7 పరుగులు చేశారు. 

కోణార్క్‌ సూర్యాస్‌ బౌలర్లలో దివేశ్‌ పథానియా, వినయ్‌ కుమార్‌, అప్పన్న తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పఠాన్‌ సోదరులు మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించినా కోణార్క్‌ సూర్యాస్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సదరన్‌ స్టార్స్‌ ఫైనల్‌కు చేరుకుంది.

చదవండి: T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement