Virat Kohli
-
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్ -
విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపిన సింగర్.. ఎందుకంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్‌బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్ రాహుల్‌ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్ కూడా వెల్లడించాడు.తాజాగా అన్‌బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్‌బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్‌లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
IPL 2025: ప్రమాదంలో విరాట్ పేరిట ఉన్న భారీ రికార్డు
ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత ఇవాళ (మే 18) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో రికార్డుల రారాజు, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ టీ20 రికార్డు బద్దలయ్యే ప్రమాదముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 33 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. విరాట్‌కు ఈ ఘనత సాధించేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌కు 214వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చింది. నేటి మ్యాచ్‌లో రాహుల్ 8000 పరుగులు పూర్తి చేస్తే, విరాట్ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా సొంతమవుతుంది. యావత్ టీ20ల్లో అతి తక్కువ 8000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఘనత విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్- 213 ఇన్నింగ్స్లుబాబర్ ఆజమ్- 218 ఇన్నింగ్స్లుకాగా, ఈ సీజన్లో రాహుల్ వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పటికీ పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో రాహుల్ ఓసారి ఓపెనింగ్, రెండు మ్యాచ్‌ల్లో మూడో స్థానం, ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 47.63 సగటున, 142.63 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రాహుల్ 10వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే నేడు గుజరాత్‌తో జరుగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (ఓ మ్యాచ్ రద్దైంది) 13 పాయింట్లు సాధించిన ఢిల్లీ పట్టికలో ఐదు స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇవాళ గుజరాత్‌ను ఢీకొట్టబోయే ఢిల్లీ.. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 21), పంజాబ్ కింగ్స్‌తో (మే 24) తలపడాల్సి ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ రేసులో ఉండే ఢిల్లీ.. తదుపరి ముంబై, పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. -
విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా భారత ప్రభుత్వాన్ని కోరాడు. భారత క్రికెట్‌కు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా విరాట్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని విజ్ఞప్తి చేశాడు. విశ్వ వేదికపై విరాట్ ఎన్నో అసాధారణ ఘనతలు సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశాడని అన్నాడు. భారతరత్న అవార్డుకు విరాట్ అన్ని విధాల అర్హుడని అభిప్రాయపడ్డాడు.ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఏర్పాటు చేయండి..!కొద్ది రోజుల కిందట టెస్ట్ క్రికెట్‌కు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికిన విరాట్‌కు తన సొంత మైదానమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని రైనా డిమాండ్ చేశాడు. ఆ మ్యాచ్‌కు విరాట్ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్‌లను ఆహ్వానించాలని బీసీసీఐని కోరాడు. భారత క్రికెట్‌కు ఎంతో చేసిన విరాట్‌కు సకల మర్యాదలతో వీడ్కలు పలకాలని విజ్ఞప్తి చేశాడు.కాగా, విరాట్ కోహ్లి ఈ నెల 12వ తేదీన ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు తన పేరును పరిశీలిస్తున్న వేల విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విరాట్ అప్పుడే రిటైరయ్యాడేంటని భారత క్రికెట్ అభిమానులు తెగ బాధపడ్డారు. 36 ఏళ్ల విరాట్ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 46.9 సగటున 30సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. విరాట్.. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు చరిత్రలో నిలిచిపోయాడు. విరాట్.. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 విజయాలు సాధించింది. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ప్రస్తుతానికి సచిన్ ఒక్కడికే..!ప్రస్తుతానికి భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత భారత ప్రభుత్వం అతన్ని భారతరత్న అవార్డుతో సత్కరించింది. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు ఉన్నాయి. సెంచరీల సెంచరీ ఘనత భూగ్రహం మీద మరే ఇతర క్రికెటర్ సాధించలేదు.భారతరత్న ఎవరికి ఇస్తారు..?భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు సాహిత్యం, విజ్ఞానం, కళలు, ప్రజా సేవ, క్రీడలు వంటి రంగాలలో విశేష సేవలు చేసిన వారికి అందించబడుతుంది. భారత రాష్ట్రపతి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. -
‘మరింత మంది కోహ్లిలు వస్తారు’
హైదరాబాద్: భారత క్రికెట్లో విరాట్ కోహ్లిది ఒక ప్రత్యేక అధ్యాయమని, అతని బాటలో మరెంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. అతని కవర్‌డ్రైవ్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇకపై టెస్టుల్లో అలాంటివి చూడలేము. బౌలర్ల తల మీదుగా అతను ఆడే స్ట్రెయిట్ షాట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. అయితే మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు.ఎంతో మంది కోహ్లిలు ఉన్నారు. వారంతా మున్ముందు వెలుగులోకి వచ్చి దేశానికి ఆడతారు’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థిగా ఉన్నప్పుడు మీడియం పేసర్‌గా సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ అండర్–25 టోర్నీలో ఆడిన ఒవైసీ... జాతీయ స్థాయి యూనివర్సిటీ వన్డే టోర్నీ విజ్జీ ట్రోఫీలో కూడా ఓయూకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో క్రికెట్ కెరీర్ ముగిసింది. భారత క్రికెట్లో ఇప్పుడు గొప్ప దశ నడుస్తోందని, ప్రతిభ ఉంటే చాలు ఏ స్థాయికైనా చేరవచ్చని హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చూపించాడని ఒవైసీ అన్నారు. ‘పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన సిరాజ్ తన కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరాడు. టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకోగలిగిన అతనిది గొప్ప ప్రస్థానం. ఎందరికో స్ఫూర్తిదాయకం. సిరాజ్ భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలి’ అని ఒవైసీ ఆకాంక్షించారు. -
ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్తే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరుకుంటే తను ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్‌కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు."ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్ -
బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
-
గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్.. కోహ్లికి నో ఛాన్స్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అయితే తన ఎంచుకున్న జట్టులో కేవలం ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్లకు మాత్రమే గిల్‌క్రిస్ట్ అవకాశమిచ్చాడు. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కువగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనిని గిల్ ఎంపిక చేశాడు. ధోనితో పాటుగా సీఎస్కే లెజెండ్స్ సురేష్ రైనా, రవీంద్ర జడేజాలు ఉన్నారు.అదేవిధంగా ముంబై ఇండియన్స్ నుంచి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, డేంజరస్ పేస్ ద్వయం లసిత్ మలింగ,జస్ప్రీత్ బుమ్రాలకు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక రెండు సార్లు ఛాంపియన్ కేకేఆర్ నుంచి సునీల్ నరైన్‌కు మాత్రమే చోటు దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌ను గిల్ క్రిస్ట్ ఎంపిక చేశాడు. అయితే ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడంతో ఈ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. కాగా భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ఎంఎస్ ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్చదవండి: రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్ -
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్ చోటివ్వలేదు.టీమిండియా నుంచి ఆ ఇద్దరుఅయితే, భారత్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపిన రోహిత్ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.హిట్‌మ్యాన్ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్ జమాన్‌ను సెలక్ట్ చేసుకున్న బాబర్.. మిడిలార్డర్లో ధనాధన్ దంచికొట్టే సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్, సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.ఏకైక స్పిన్నర్ ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్ మిచెల్ స్టార్క్‌లకు బాబర్ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌ను పేస్ దళంలో చేర్చాడు.తన జట్టులో పవర్ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్ సమతూకంగా ఉంటుందని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో కనీసం గ్రూప్ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలోనూ పాక్ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్:రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్‌వుడ్.చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు: సురేశ్ రైనా
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ‘రన్‌మెషీన్’ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని.. అయితే, పదిహేడేళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందన్నాడు. ఇంతకీ అదేమిటంటే..!?కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ విషయంలోనూ రోహిత్‌నే అనుసరించాడు.రోహిత్ సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారంలోపే తానూ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్లో కొనసాగుతున్న వీరిద్దరు.. భారత్ తరఫున వన్డేల్లోనూ కొనసాగనున్నారు.ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే, క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ అంటే 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఉన్న కోహ్లికి ఇంత వరకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.చిరకాల కల నెరవేరేనా?ఈసారి మాత్రం కోహ్లి చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్-2025లో వరుస విజయాలతో జోరు మీదున్న పాటిదార్ సేన చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఈసారి ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.ఇక ఐపీఎల్-2025 పునఃప్రారంభం నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లి మైదానంలో దిగబోతున్నాడు.కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి వెన్నెముక, ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి.. అయితే, ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవడం మాత్రమే లోటు.ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ జాలువారితే అదేమీ పెద్ద కష్టం కాబోదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లితో పాటు మిగిలిన పది మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 505 పరుగులు సాధించి.. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.ఆరెంజ్ క్యాప్ పోటీలో సూర్యకుమార్ యాదవ్ (510), సాయి సుదర్శన్ (509), శుబ్‌మన్ గిల్ (508)లతో కోహ్లి పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ- కేకేఆర్ మధ్య మే 17 నాటి మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే. చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
IPL 2025: ఆర్సీబీని గెలిపిస్తాం కదా!.. అంతా కోహ్లి మయం!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండుల్కర్ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.అంతా కోహ్లి మయం..ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు. ఈ సీజన్లో బెంగళూరుకు టైటిల్ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్ సెషన్ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్ హోరెత్తించారు. వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.భారీ స్థాయిలో స్పందనకోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ‘కింగ్’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.ఎలాంటి ప్రభావం చూపదుఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్ జెర్సీ ‘రెడ్ అండ్ గోల్డ్’లో కాకుండా ‘విరాట్ 18’ వైట్ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్ మో బొబాట్ వ్యాఖ్యానించారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ తాజా ఎడిషన్ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
‘రోహిత్ శర్మ జట్టులో లేకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ (Daryll Cullinan) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు రోహిత్ గొప్పగా చేసిందేమీ లేదని.. అతడు రిటైర్ అయినా టీమిండియాకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నాడు.అదే విధంగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) లేకపోయినా.. బౌలర్లు రాణిస్తే భారత్ ఇంగ్లండ్‌లో గట్టెక్కగలదని డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకోవడంతో.. హిట్‌మ్యాన్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్నా.. టెస్టుల్లో కొనసాగుతానని నాడు రోహిత్ స్పష్టం చేశాడు.రో- కో లేకుండానేఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో అతడే పగ్గాలు చేపడతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా మే 7న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరురోజులు తిరిగే లోపే విరాట్ కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫలితంగా.. వీరిద్దరు లేకుండా యువ భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు.రోహిత్ లేకపోయినా నష్టమేమీ లేదునిజం చెప్పాలంటే.. టెస్టుల్లో రోహిత్ కెరీర్ అంత గొప్పగా ఏమీలేదు. సొంతగడ్డ మీదైనా.. విదేశాల్లోనైనా అదే తీరు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సింది పోయి.. అతడే దారుణంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలకడం వల్ల భారత టెస్టు క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదు’’ అని డారిల్ కలినన్ పేర్కొన్నాడు.బౌలర్లంతా ఫిట్‌గా ఉంటే చాలుఇక ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియా బౌలర్లందరూ ఫిట్‌గా ఉండి.. రాణించినట్లయితే ఇంగ్లండ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని కలినన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి లేకపోయినా రాణించగల సత్తా టీమిండియాకు ఉందని పేర్కొన్నాడు. కాగా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది.కాగా 58 ఏళ్ల డారిల్ కలినన్ 1993 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 70 టెస్టులు, 138 వన్డేలు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సంప్రదాయ క్రికెట్లో 4554 పరుగులు, వన్డేల్లో 3860 రన్స్ సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి 123 టెస్టులాడి 9230 రన్స్ సాధించాడు.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ -
మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న ఆర్సీబీ... ఈసారైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ అదే జరిగితే పాటిదార్ బెంగళూరు జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కుతాడు.మెగా వేలంలో నన్ను కొనలేదుఅయితే, ఒకప్పుడు తనకు జట్టులో చోటే ఇవ్వని ఆర్సీబీకి తిరిగి రావొద్దని పాటిదార్ అనుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు నాకు ఫ్రాంఛైజీ నుంచి కాల్ వచ్చింది.మేము నిన్ను తీసుకోబోతున్నాము సిద్ధంగా ఉండు అని చెప్పారు. నేను మరోసారి ఆర్సీబీకి ఆడబోతున్నానని ఎంతో సంతోషపడ్డాను. కానీ మెగా వేలంలో వాళ్లు నన్ను కొనలేదు.దీంతో నేను స్థానిక మ్యాచ్‌లలో ఆడుతూ కాలం గడిపాను. అప్పుడు అకస్మాత్తుగా ఆర్సీబీ నుంచి మరోసారి ఫోన్‌కాల్ వచ్చింది. గాయపడిన లవ్నిత్ సిసోడియా స్థానంలో నిన్ను జట్టులోకి తీసుకుంటున్నాం అని చెప్పారు.తిరిగి ఆర్సీబీకి వెళ్లాలని అనుకోలేదుకానీ నిజం చెప్పాలంటే.. నాకు అప్పుడు తిరిగి ఆర్సీబీకి వెళ్లాలని అనిపించలేదు. ఎందుకంటే.. ఇంజూరీ రీప్లేస్‌మెంట్‌గా వెళ్తే నాకు ఆడే అవకాశం రానేరాదు. డగౌట్లో ఉత్తినే కూర్చోవడం నాకసలు ఇష్టం లేదు.వేలంలో నన్ను కొననందుకు కోపం వచ్చిందని చెప్పను గానీ.. తీవ్ర నిరాశకు గురయ్యాను. కానీ గాయపడిన ఆటగాడి స్థానంలో వెళ్లినా నాకైతే ఆడే ఛాన్స్ ఇవ్వరు. అందుకు కోపం వచ్చింది. అయితే, అది కూడా కాసేపే... ఆ తర్వాత నేను మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశాను’’ అని రజత్ పాటిదార్ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో గత జ్ఞాపకాలు పంచుకున్నాడు.కోహ్లినే కీలకం.. సూచనలు, సలహాలుఅదే విధంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం కొత్తగా అనిపించిందన్న పాటిదార్.. ‘‘సారథిగా నా పేరును ప్రకటించగానే ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి. జట్టులో విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. ఆయన నా కెప్టెన్సీలో ఆడటమా? అని సందేహించాను.అయితే, కెప్టెన్సీ మార్పు విషయంలో కోహ్లి పూర్తి మద్దతుగా నిలబడ్డాడు. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అనుభవజ్ఞుడైన కోహ్లి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విజయవంతమయ్యేందుకు కోహ్లి నాకెన్నో సూచనలు ఇచ్చాడు’’ అని కోహ్లితో తన అనుబంధాన్ని వివరించాడు.కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఎనిమిది గెలిచింది. తద్వారా 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఒకప్పుడు జట్టులో చోటే దక్కించుకోలేని రజత్ పాటిదార్.. ఈసారి ఏకంగా కెప్టెన్‌గా నియమితుడు కావడంతో పాటు సారథిగా అదరగొడుతుండటం విశేషం. ఈ సీజన్లో ఇప్పటికి అతడు 239 పరుగులు సాధించాడు.చదవండి: IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్ -
BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే!
విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ కారణంగా టీమిండియా సెలక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. టెస్టు జట్టులో ఈ దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసే సరైన ప్లేయర్ కోసం సెలక్షన్ కమిటీ వేట కొనసాగిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలన్నది తలనొప్పిగా మారింది.టీమిండియాలో అతడికి చోటు కష్టమేఅయితే, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు కోహ్లి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను పంపాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్ల పేర్లు తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ అధికారి ఒకరు ‘టెలిగ్రాఫ్’తో మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకవేళ టీమిండియా సొంతగడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతున్నట్లయితే శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉండేవి. అయితే, తదుపరి భారత జట్టు విదేశంలో సిరీస్ ఆడబోతోంది.. అది కూడా ఇంగ్లండ్ గడ్డమీద.కాబట్టి శ్రేయస్‌కు ఛాన్స్ లేదనే చెప్పాలి. అతడు రెడ్ బాల్ క్రికెట్లో మరింత గొప్పగా రాణించాల్సిన అవసరం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రేయస్ అద్భుతంగా ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.కానీ టెస్టు ఫార్మాట్ వైట్‌బాల్ క్రికెట్‌తో పోలిస్తే పూర్తి భిన్నమైనది. అందుకే అతడి విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.ఓపికగా బ్యాటింగ్ చేయాలిఅదే విధంగా.. ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. కాబట్టి ఒక్కోసారి అలాంటి బంతులను వదిలేయడమే ఉత్తమం. ఇంగ్లండ్ గడ్డ మీద ఎంత ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నామనదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.కాగా శ్రేయస్ అయ్యర్ చివరగా గతేడాది ఫిబ్రవరిలో టీమిండియా తరఫున టెస్టు బరిలో దిగాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ ఇంత వరకు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటివ్వలేదు.చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడుఅయితే, దేశవాళీ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున బరిలోకి దిగి దంచికొట్టాడు. రంజీల్లో రాణించడంతో పాటు టీ20 ఫార్మాట్లో నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది ముఖ్య భూమిక.ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం అతడు ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్ ఈ సిరీస్‌తోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు! -
సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?
-
టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లి తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!
టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో రోహిత్, కోహ్లి భారత్ తరఫున ఎన్ని వన్డేలు ఆడతారని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం ప్రకారం భారత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు 9 సిరీస్‌ల్లో 8 మంది ప్రత్యర్థులపై 27 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరతారు. అక్కడ ఆగస్ట్ వరకు 4 వరకు గడపనున్న భారత్.. అదే నెల 17వ తేదీ నుండి బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఇక్కడి నుండి టీమిండియా వన్డే క్రికెట్ షెడ్యూల్ మొదలుకానుంది.బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లి ఈ సిరీస్‌లో చెలరేగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు ఉండటంతో రోకోను ఆపడం బంగ్లా బౌలర్లకు పెద్ద సవాలే అవుతుంది.అనంతరం భారత్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు (5 టీ20లు కూడా ఆడుతుంది) ఆడనుంది.ఈ ఏడాది చివర్లో టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్ట్‌లు, 5 టీ20లు సహా మూడు వన్డేలు ఆడనుంది.వచ్చే ఏడాది (2026) జనవరిలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా విరాట్, రోహిత్ తమదైన మార్కును చూపించే అవకాశం ఉంది.అనంతరం చాలా గ్యాప్ తర్వాత జూన్‌లో భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘన్లు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. స్వదేశంలో ఆడబోయే సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో కూడా రోకో చెలరేగే అవకాశం ఉంది.జూలైలో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించి మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది.అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది.డిసెంబర్లో భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది.దీని తర్వాత భారత్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగా టోర్నీ రోహిత్-కోహ్లిల జమానాకు చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైతే తప్ప రోహిత్, కోహ్లి దాదాపుగా అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దిగ్గజాలు వన్డే వరల్డ్‌కప్‌తో తమ క్రికెట్ ప్రస్తానాన్ని ముగిస్తారేమో చూడాలి. -
Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్‌పైనే..!
రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ దిగ్గజాలు ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2025పైనే పెట్టారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, మధ్యలో కూడా వారిపై ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సంబంధించిన ఒత్తిడి ఉండేది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిద్దరు ఫ్రీబర్డ్స్ అయ్యారు. వారిపై ఐపీఎల్ మినహా ఎలాంటి బాధ్యతా లేదు. ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించారు. వారు ఇకపై భారత్ తరఫున వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. భారత్ ఆడబోయే వన్డేలు సమీప భవిష్యత్తులో లేవు. దీంతో వారి దృష్టి మొత్తం ఐపీఎల్ 2025పైనే కేంద్రీకృతమై ఉంది.మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి ముందున్న తక్షణ కర్తవ్యం వారి జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడం. ఇందు కోసం వారు అందరి కంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ రీవైజ్డ్ షెడ్యూల్‌కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతుండగా.. ఈ భారత సూపర్ స్టార్లు మాత్రం దాని తాలూకా ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్ తదుపరి లెగ్ కోసం రోహిత్ మూడు రోజుల కిందటి ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. విరాట్ ఇవాళే బరిలోకి దిగాడని తెలుస్తుంది.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడే సమయానికి రోహిత్, విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగు, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తుకు అతి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 7 విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 21న ఢిల్లీతో (ముంబై), మే 26న పంజాబ్‌తో (జైపూర్) తలపడనుంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ సాధిస్తుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఆ జట్టు ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తమ ఆరో టైటిల్ వేట కొనసాగిస్తుండగా.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ దిశగా సానుకూల అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేని రోహిత్, విరాట్ తమ జట్లకు ఐపీఎల్ టైటిల్ గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. -
వారిద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. 50 ఏళ్ల వరకు ఆడాల్సింది: యువీ తండ్రి
భారత టెస్టు క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శకం ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనకు ముందు వీరిద్దరూ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. తొలుత రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా..అతడి బాటలోనే కోహ్లి సైతం నడిచాడు. ఇంగ్లండ్ పర్యటనకు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ సూచించినప్పటికి కింగ్ మాత్రం తన మనసును మార్చుకోలేదు.ఈ క్రమంలో భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను రోహిత్, కోహ్లిలపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీ క్రికెటర్, టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేరాడు. రోహిత్, కోహ్లి ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు అని యోగరాజ్ కొనియాడాడు.కాగా రో -కో ద్వయం రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టను ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 23న ప్రకటించే అవకాశముంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది."విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్బుతమైన ఆటగాళ్లు. ఈ లెజెండ్స్ రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బే అవుతోంది. సరిగ్గా ఇదే పరిస్థితి 2011లో కూడా నెలకొంది. ఆ ఏడాది చాలా మంది స్టార్ ప్లేయర్లు రిటైర్ అవ్వడం, మరి కొంత మందిని సెలక్టర్లు పక్కన పెట్టడం వంటి చేశారు.ఆ సమయంలో భారత క్రికెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ ఒక్క ప్లేయర్ ఏదో ఒక సమయంలో రిటైర్ అవ్వక తప్పదు. కానీ రోహిత్, కోహ్లి మాత్రం కాస్త తొందరపడ్డారనే అన్పిస్తోంది. ఇంకా చాలా క్రికెట్ ఆడే సత్తా వారిలో ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.వీరిద్దరూ రిటైర్ అవ్వడంతో భారత జట్టులో మొత్తం యువ ఆటగాళ్లే ఉన్నారు. అనుభవం లేని ఆటగాళ్లతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తే అది కఠిన సవాలే అవుతుంది. ఇంగ్లండ్ వంటి కండీషన్స్‌లో రాణించడం అంత సులువు కాదు. కోహ్లి, రోహిత్ వంటి గొప్ప ఆటగాళ్లు కనీసం 50 ఏళ్ల వరకు అయినా ఆడాలి. వారి నిర్ణయంతో నేను ఆశ్యర్యపోయాను. యువ ఆటగాళ్లను గైడ్ చేసేందుకు అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకుండా అయిపోయారని" ఎఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.చదవండి: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు! -
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఈ ఇద్దరి గ్రేడ్ ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా రోహిత్, కోహ్లి ఇంకా భారత క్రికెట్లో భాగమేనని, గ్రేడ్ ఏ ప్లస్‌లో సకల సదుపాయాలకు వారు అర్హులేనని సైకియా ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో కొనసాగే భారత క్రికెటర్లకే బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. భారత క్రికెట్‌కు రోహిత్, విరాట్ చేసిన సేవల కారణంగా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగనుంది.కాగా, బీసీసీఐ గత నెలలోనే 2024-25 సంవత్సరానికి గానూ తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) ప్రకటించింది. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిరి ఏ నుంచి ఔట్) -
Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ కష్టమే.. వాళ్లిద్దరు ఉంటే బెటర్!
టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) స్థానాల్లో వెటరన్ క్రికెటర్లను తీసుకువస్తే బాగుంటుందని సెలక్టర్లకు సలహా ఇచ్చాడు. అజింక్య రహానే (Ajinkya Rahane), ఛతేశ్వర్ పుజారాలను జట్టులోకి తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.దిగ్గజాల వీడ్కోలు ఇంగ్లండ్ గడ్డపై రాణించాలంటే ఇలాంటి సీనియర్ల అవసరం ఉందని.. యువ ఆటగాళ్లు అక్కడ ఒత్తిడిని తట్టుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ఆ తర్వాత ఆరు రోజులలోపే కోహ్లి కూడా ఇదే బాటలో నడిచాడు. వీరిద్దరి నిష్క్రమణ కంటే ముందే దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.ఫలితంగా టీమిండియా టెస్టు జట్టులో సీనియర్లు లేనిలోటు కచ్చితంగా కనిపిస్తుంది. అదీ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం యువ ఆటగాళ్లకు అంతతేలికేమీ కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..రహానే, పుజారా రీ ఎంట్రీ‘‘రోహిత్ రిటైర్ అయినా విరాట్ కోహ్లి జట్టుతో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ బోర్డు అతడిని ఒప్పించేందుకు విఫలయత్నం చేసిందని తెలిసింది. మరి అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాల పునరాగమనం ఇప్పుడైనా చూడవచ్చా? ఈ ఒక్క సిరీస్ కోసమైనా వాళ్లను ఎంపిక చేస్తారా?అసలు జట్టు సరైన దిశలోనే వెళ్తుందా? రాబోయేది అల్లాటప్పా సిరీస్ కాదు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. వేరే జట్టుతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటే.. పర్లేదు కుర్రాళ్లని పంపవచ్చు అని అనుకోవచ్చు.కానీ ప్రస్తుత పరిస్థితి అంత తేలికగా తీసుకునేలా లేదు. కచ్చితంగా రహానే, పుజారాల గురించి ఆలోచించాలి. వాళ్లిద్దరు ఇంకా అద్భుతంగా ఆడుతున్నారు. పరుగులు కూడా రాబడుతున్నారు. వాళ్లు జట్టుతో ఉంటే కుర్రాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.చివరగా అపుడేకాగా రహానే 2023 జూలైలో చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో 85 టెస్టులు ఆడి 5077 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఛతేశ్వర్ పుజారా 103 టెస్టులాడి 7195 పరుగులు సాధించాడు. నయా వాల్‌గా పేరొందిన పుజ్జీ చివరగా 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత జట్టుకు దూరమైన వీరిద్దరు రంజీల్లో అదరగొడుతున్నారు. అయితే, రహానే, పుజారాలను మాత్రం సెలక్టర్లు ఇన్నాళ్లూ పరిగణనలోకి తీసుకోలేదు. మరి ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలోనైనా వీరికి పిలుపునిస్తారేమో చూడాలి!చదవండి: IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు? -
అలా రిటైర్మెంట్ ..ఇలా ఆధ్యాత్మిక సేవ, కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్!
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ,తన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కలవడం ఇది రెండోసారి కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగామారాయి. సతీ సమేతంగా తమ అభిమాన ఆధ్యాత్మిక గమ్యస్థానమైన బృందావనానికి చేరుకున్నారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌తో కొన్ని సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత కోహ్లీ, అనుష్క దంపతులు సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నారు.🥹❤️ An emotional moment for all fans!Just a day after announcing his retirement from Test cricket, Virat Kohli visited Vrindavan with Anushka Sharma to seek blessings from Premanand Ji Maharaj. 🙏This moment is more than just spiritual—it's the beginning of a new chapter for… pic.twitter.com/FRRkl2vkHo— Abhishek Bhardwaj (@abhibhardwaj14) May 13, 2025 కెల్లీ కుంజ్ ఆశ్రమానికి చెందిన యూట్యూబ్ ఛానెల్లో వీరి వీడియో అప్లోడ్ అయింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ కోరుకున్నది జరగాలంటే ఎలాంటి మంత్రాన్ని జపించాలని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను అని అడిగారు. దీనికి మహారాజ్ స్పందిస్తూ, అది పూర్తిగా సాధించదగినదని సాంఖ్య యోగం, అష్టాంగ యోగం , కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చానని, ఇది తన వ్యక్తిగత అనుభవమని చెప్పుకొచ్చారు. అయితే, వ్యక్తిఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆయన(దేవుడు) కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతికి మార్గాన్ని చూపించేవాడు ప్రభువు అని వెల్లడించారు. "ఒకరి కీర్తి , కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది... దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి."అనుష్క బ్లాక్ ప్రింట్ ఉన్న తెల్లటి సూట్-సెట్ ధరించగా, విరాట్ ఆలివ్ గ్రీన్ ప్యాంటుతో జత చేసిన సేజ్ గ్రీన్ షర్ట్ ధరించాడు. ఈ జంట గతంలో 2025 జనవరిలో ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించారు. మాజీ కెప్టెన్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
బాస్.. నువ్వే కెప్టెన్‌గా ఉండు ప్లీజ్!.. నేనైతే ఇదే చెప్పేవాడిని!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) నిర్ణయం పట్ల భారత జట్టు మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశాడు. కోహ్లి తొందరపడ్డాడని.. ఇంగ్లండ్ (IND vs ENG)తో సిరీస్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.తానే గనుక సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్‌ని అయి ఉంటే.. ఈ సిరీస్‌కు కోహ్లినే కెప్టెన్‌ని చేసేవాడినని ఈ మాజీ చీఫ్ సెలక్టర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశాడు.పది వేల పరుగుల మైలురాయికి చేరకుండానే..కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. అయితే, తనకు మరోసారి సారథిగా అవకాశం ఇవ్వాలని కోహ్లి కోరాడని.. అయితే, యాజమాన్యం ఇందుకు నిరాకరించిందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే అతడు వీడ్కోలు పలకడం అనుమానాలను పెంచింది.ఏదేమైనా టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో కోహ్లి నిలిచిపోయాడు. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన ఈ సారథి.. భారమైన హృదయంతో వైదొలిగాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్‌గా ఉండాలిరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ నేనే గనుక ఇప్పుడు సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవిలో ఉండి ఉంటే.. ‘బాస్.. ఈ జట్టుకు నువ్వే కెప్టెన్‌గా ఉండాలి. భారత టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురా.. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను వదిలెయ్’ అని చెప్పేవాడిని.నిజానికి సెలక్టర్లు అతడిని ఒప్పించి ఉండాల్సింది. నేను గనుక అక్కడ ఉంటే.. అతడే కెప్టెన్‌గా ఉండాలని పట్టుబట్టేవాడిని. టీమిండియా గాడిలో పడిన తర్వాత రిటైర్ అవమని చెప్పేవాడిని. అతడికి అదే సరైన వీడ్కోలు అయి ఉండేది’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు.ప్రత్యేక ప్రతిభఅదే విధంగా.. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్న శ్రీకాంత్.. ‘‘కోహ్లిలో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంది. ఆట పట్ల అంకిత భావం, నిబద్ధత.. అతడిని ఈ స్థాయికి చేర్చాయి. కఠినంగా శ్రమించడం తనకు అలవాటు.అతడు గొప్ప బ్యాటర్ కాగలడనే నమ్మకం మాకు ఉంది. అందుకే ఆరోజు కోహ్లిని అందరికంటే ముందుగా ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేశాము’’ అని తెలిపాడు. కాగా 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2011-12 నాటి సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డమీద తొలి శతకం సాధించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి కూడా రిటైర్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.చదవండి: గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు! -
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది. మే 8న రద్దైన ఐపీఎల్ 2025, మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న రాత్రి ప్రకటించింది. మే 8న 10 ఓవర్ల పాటు సాగి రద్దైన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఈ నెల 24న మొదటి నుంచి నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్‌కు చాలా తేడాలున్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 వాయిదా పడటం ప్లే ఆఫ్స్‌కు అతి చేరువలో ఉన్న ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం, గాయాల బారిన పడటంతో జట్టును వీడనున్నారు. ఐపీఎల్ వాయిదాకు ముందే ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయపడ్డారు. పాటిదార్ ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత కూడా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతాడు. పాటిదార్ స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి లేదా జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.రీ షెడ్యూల్లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్‌లకు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్ పూర్తికాక ముందే (మే 29) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్ పూర్తైన వారం రోజులకే (జూన్ 11) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.ఆర్సీబీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు: ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్వెస్టిండీస్ ఆటగాళ్లు: రొమారియో షెపర్డ్మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్ ఫైనల్ తర్వాత వారం రోజుల సమయమున్నా (డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం).. ఆ దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్ల చాయిస్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆ దేశ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన జోష్ హాజిల్‌వుడ్ తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తుంది. హాజిల్‌వుడ్ పోతే ఎంగిడి ఉన్నాడులే అనుకుంటే అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌నే తన మొదటి ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.ఈ లెక్కన చూస్తే ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఉన్నా అతను ఏ మేరకు అందుబాటులో ఉంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీని ఐపీఎల్ వాయిదా పడటం దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే లయ తప్పే ప్రమాదముంది. ఈ సీజన్‌పై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సాలా కప్ నమ్మదే అని ఆర్సీబీ అభిమానులు ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టారు. ఈ లోపే భారత్, పాక్ మధ్య యుద్దం మొదలై ఆర్సీబీ గెలుపు జోష్‌ను దెబ్బకొట్టింది. మరి, ఉన్న వనరులతో ఆర్సీబీ మున్ముందు మ్యాచ్‌ల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఐపీఎల్ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, స్వస్థిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్ దార్ సలామ్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. -
కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే!
టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకోకుండానే విరాట్ కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో 123 టెస్టులాడిన ఈ దిగ్గజ బ్యాటర్.. 9230 పరుగుల వద్ద నిలిచిపోయాడు. అతడి టెస్టు కెరీర్లో 31 అర్ధశతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఫోర్లు 1027 కాగా.. సిక్సర్లు 30. అందుకున్న క్యాచ్‌లు 121.ఇక కెప్టెన్‌గానూ టెస్టుల్లో కోహ్లి చెరగని ముద్ర వేశాడు. సారథిగా మొత్తంగా టీమిండియాకు నలభై విజయాలు అందించి.. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ప్రయాణంలో కోహ్లి కలిసి టెస్టుల్లో ఆడిన భారత అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేయాలంటే..!ఓపెనింగ్ జోడీ.. టాపార్డర్ ఇదేవీరేందర్ సెహ్వాగ్.. కోహ్లితో కలిసి ఆడిన సమయంలో 83.79 స్ట్రైక్‌రేటుతో కనీసం 400 పరుగులు సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ.. కోహ్లి కెప్టెన్సీలో టాపార్డర్‌కు ప్రమోట్ అయిన హిట్‌మ్యాన్.. కోహ్లితో కలిసి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు.అలా రోహిత్ ఖాతాలో 3772 పరుగులు జమయ్యాయి. ఇక వన్‌డౌన్‌లో రాహుల్ ద్రవిడ్‌కే ఓటు వెయ్యవచ్చు. కోహ్లితో కలిసి ద్రవిడ్ ఎనిమిది టెస్టులు మాత్రమే ఆడాడు.ఇక ఛతేశ్వర్ పుజారా విషయానికొస్తే.. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చెప్పవచ్చు. 19 శతకాల సాయంతో 6664 రన్స్ సాధించాడు పుజ్జీ. అయితే, తనకంటే టెస్టు బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వాల్ రాహుల్ ద్రవిడ్ ఉండటమే ఉత్తమమని గతంలో పుజారా పేర్కొన్నాడు.మిడిలార్డర్ ఇలాకాబట్టి ఈ జట్టులో అతడికి చోటు దక్కడం లేదు. ఇక నాలుగో స్థానంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్. కోహ్లితో కలిసి 17 టెస్టుల్లో భాగమైన సచిన్ 835 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి ఆడే సమయంలో సచిన్ నాలుగు, కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవారు.ఇక్కడ అత్యుత్తమ జట్టులోనూ అదే కొనసాగిస్తే బాగుంటుంది కదా! ఇక ఆరోస్థానం విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోని కంటే.. రిషభ్ పంత్ ఇక్కడ బెటర్ అనిపిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ టెస్టుల్లో ధోనిని మించిపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA)లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈసారి అతడికే ఓటు వేయవచ్చు.కోహ్లితో ఆడిన సమయంలో ధోని 1587 పరుగులు చేయగా.. పంత్ మాత్రం ఏకంగా 2657 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు కూడా ఉండటం విశేషం.అదరగొట్టిన స్పిన్ ద్వయంకోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అశ్విన్ కోహ్లి ఉన్న జట్టులో భాగమై ఏకంగా 475 వికెట్లు తీస్తే.. జడ్డూ 282 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటర్‌గా అశూ 3140 రన్స్ సాధిస్తే.. జడేజా 2920 పరుగులు చేశాడు.పేస్ దళంలో వీరేకోహ్లితో కలిసి.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ 13 టెస్టులు ఆడి.. 38 వికెట్లు కూల్చాడు. భారత జట్టు యువ రక్తంతో నిండిపోతున్న తరుణంలోనూ తన మార్కు చూపించాడు.ఇక మహ్మద్ షమీ.. కోహ్లితో కలిసి ఆడుతూ ఈ రైటార్మ్ పేసర్ 226 వికెట్లు పడగొట్టాడు. మరి జస్ప్రీత్ బుమ్రా ఈ జట్టులో లేకపోతే ఎలా?.. కోహ్లి కెప్టెన్సీలో రాటుదేలిన బుమ్రా 176 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే..వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్‌కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.పనిభారం పడకుండా ఉండేందుకే?ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బుమ్రా కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే సరైనోడుటీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్‌లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్‌గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్‌గా నియమించాలి.పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్‌గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.గతంలోనూ నాయకుడిగాకాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్‌లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేదెవరు?.. ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతూ ఇన్నాళ్లూ ఈ రన్‌మెషీన్ కీలక బాధ్యతను తన భుజాల మీద మోశాడు. అయితే, ఇప్పుడు అతడు టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరి కోహ్లి ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు?!ఈ విషయం గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వారసుడి గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని.. కనీసం రెండు సిరీస్‌ల తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు‘‘నాలుగో స్థానంలో అత్యుత్తమ బ్యాటర్ ఉండాలి. అప్పుడే జట్టు నిలబడుతుంది. ప్రస్తుతం చాలా మంది టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. అయితే, వీరిలో నాలుగో స్థానంలో ఎవరు పూర్తిస్థాయిలో ఆడతారనేది ఇంగ్లండ్ పర్యటన తర్వాత తేలనుంది.ఎందుకంటే ఇంగ్లండ్ గడ్డ మీద నంబర్ ఫోర్లో రాణిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పుజారా పేర్కొన్నాడు. కాగా సచిన్ టెండుల్కర్ నిష్క్రమణ తర్వాత కోహ్లి 99 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.ఇక అజింక్య రహానే తొమ్మిది సార్లు, పుజారా ఏడు టెస్టుల్లో నాలుగో నంబర్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్లకు కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కొత్త బంతుల్ని ఎదుర్కోవడంలో శుబ్‌మన్ దిట్ట. గతంలో అతడు ఓపెనర్‌గా వచ్చేవాడు. ఆ తర్వాత మూడో స్థానానికి మారిపోవాల్సి వచ్చింది. అయితే, అతడు ఓల్డ్ బాల్‌ను ఎంత వరకు ఎదుర్కోగలడన్న విషయం కాలక్రమేణా తేలుతుంది. అప్పటిదాకా కోహ్లి స్థానాన్ని భర్తీ చేస్తూ.. దీర్ఘకాలంలో ఆ ప్లేస్‌లో కొనసాగే ఆటగాడు ఎవరో చెప్పడం కష్టతరమే అవుతుంది’’ అని పుజారా పేర్కొన్నాడు.రోహిత్ బాటలోనే కోహ్లికాగా మే తొలివారంలో కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. సోమవారం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఇక ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.ఇదిలా ఉంటే కోహ్లి సారథ్యంలో 2021లో, రోహిత్ కెప్టెన్సీలో 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకున్న రోహిత్ సేన డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు దూరమైంది.ఇక తదుపరి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో మొదటగా టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి, రోహిత్ లేకుండా తొలిసారి భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టబోతోంది. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం -
కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా గత కొంతకాలంలో టెస్టుల్లో భారత జట్టు వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.ఇద్దరూ రిటైర్ అయ్యారుస్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ కావడం సహా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో విఫలమైన నేపథ్యంలో తొలుత రోహిత్ శర్మ.. ఆ తర్వాత వారం తిరిగే లోపే కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక తాను వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ తెలపగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్ అని స్పష్టం చేసింది.మరోవైపు.. కోహ్లి సోమవారం(మే 12) నాటి రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడే గానీ.. వన్డేల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన గావస్కర్.. కోహ్లి- రోహిత్ వరల్డ్‌కప్-2027 నాటికి జట్టులో ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నాడు.కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు‘‘వన్డే ఫార్మాట్లో వాళ్లిద్దరు అత్యద్భుతమైన ఆటగాళ్లు. అయితే, 2027 ప్రపంచకప్ నాటికి సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. వాళ్లిద్దరు వరల్డ్‌కప్ జట్టులో ఉంటారో లేదో తెలియదు. అందుకు తగ్గట్లుగా వారి ప్రదర్శన కొనసాగుతుందా? అంటే అదీ తెలియదు.ఒకవేళ సెలక్షన్ కమిటీ వాళ్లపై నమ్మకం ఉంచితే ఇద్దరూ మరో ప్రపంచకప్ ఆడతారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లి- రోహిత్ మరో వరల్డ్‌కప్ ఆడే అవకాశం లేదు.ఒకవేళ వాళ్లిద్దరు వచ్చే ఏడాది గనుక మంచి ఫామ్‌లో ఉంటే.. అది కూడా శతకాలు బాదితే... అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి తప్పించలేడు! కానీ అదంతా జరుగుతుందో లేదో చూడాలి’’ అని గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. తిరుగులేని రికార్డులుకాగా వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రోహిత్ కొనసాగుతుంటే.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్లో 51 శతకాలు బాది కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. తద్వారా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును అతడు బద్దలు కొట్టాడు. కాగా ప్రస్తుతం రోహిత్ వయస్సు 38 ఏళ్లు కాగా.. కోహ్లికి 36 ఏళ్లు. ఈ ఇద్దరూ వరల్డ్‌కప్ నాటికి వరసగా 40, 38వ పడిలో అడుగుపెడతారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫామ్‌ను కొనసాగిస్తే వీరు 2027 టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఉండటం ఖాయమే!చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
తెలంగాణకు అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి చూపడంతోపాటు హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక వసతులు, సంక్షేమంతో కూడిన సమతుల పాలన రాష్ట్రంలో సాగుతోందని తెలిపారు. హైదరాబాద్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్ది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ప్రాంగణాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పేరొందిన ‘మిస్ వరల్డ్’పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని, ఈ తరహా ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఓడరేవులతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని సీఎం వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానం పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనేం.. పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉంది. డిసెంబర్, 2023లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకుని ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాం. 2025లో దావోస్‌లో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ కట్టడి, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలోనూ మొదటి స్థానంలో ఉంది. 66 లక్షల మంది మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్వేర్, లైఫ్‌సైన్సెస్, పారిశ్రామిక రంగాలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్‌గా మారింది. ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా తయారైంది. మైక్రోసాఫ్ట్, కాగి్నజెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఏఐ లీడర్‌గా తీర్చిదిద్దుతాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీల్లో ప్రపంచంలోనే తెలంగాణను లీడర్‌గా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘తెలంగాణను ఏఐ లీడర్‌గా మార్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. ఏఐ సిటీలో భాగస్వామి అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపించాయి. ఏఐలో ప్రపంచ స్థాయి నిపుణులను తయా రు చేసేందుకు త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్లోబల్ కేపబిలిటి సెంటర్లకు హైదరా బాద్ హబ్‌గా మారింది. ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సొనాటా ప్రతినిధులు సమీర్ ధీర్, సుజిత్ మొహంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కోహ్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీఎందేశ క్రికెట్ చరిత్రలో విరాట్‌కోహ్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్లాఘించారు. క్రికెట్లో ఆయన సాధించిన విజయాలను పొగిడారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ఉన్నత క్రమశిక్షణ కలిగిన, కమిట్మెంట్ ఉన్న ఆటగాడిగా ఆయన సాధించిన పలు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. యువ క్రికెటర్లకు ఆయన ఒక మార్గదర్శి అని తెలిపారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తన తదుపరి దశ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. -
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్‌ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్‌తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్‌లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్‌తోనే రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్‌లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్‌పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్‌గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్‌తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్‌తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్‌మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్‌లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్‌ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్‌లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్‌కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్‌గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్‌ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్‌కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్‌వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్‌వన్ బ్యాటర్‌గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్‌కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్‌గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్‌మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. -
‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గత ఏడాది వరల్డ్ కప్ విజయం తర్వాత టి20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్ బంగర్ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్నెస్ ఒక కారణం కాగా, ఇంగ్లండ్‌లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌తో కొత్తగా 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ సైకిల్ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్‌లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్‌లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్‌ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్‌లాంటి సాధారణ బౌలర్ బంతికి క్లీన్‌బౌల్డ్ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్‌తో సిరీస్ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్ శర్మలాంటి బ్యాటర్ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్‌పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్‌కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్ కోహ్లి‘కెప్టేన్ ఫైర్’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్ ధోని ‘కూల్ కెప్టేన్’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్‌ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్‌ను తగ్గించి అయినా అదనపు బౌలర్‌ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం, మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్ రిచర్డ్సన్ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్‌లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్‌గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్‌బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచరీతో భారత్‌కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్ 2018): కఠినమైన పిచ్‌పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్‌కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్ బౌలింగ్‌ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్ (పుణే, 2019): కెరీర్లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్‌గా విరాట్ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో సచిన్ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్, ఇష్టమైన ఫార్మాట్ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్ కప్ కొనసాగి ఆపై రిటైర్ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్‌కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్ టెండూల్కర్⇒ నువ్వు రిటైర్ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్ యుగంలో టెస్టు ఫార్మాట్ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్ కోహ్లి. టెస్టు క్రికెట్ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్ మంజ్రేకర్ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్ గంభీర్⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్ కుంబ్లే -
కోహ్లి రిటైర్మెంట్పై ఢిల్లీ రంజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు ఇవాళ (మే 12) ఉదయం రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ నుంచి వచ్చిన ఈ అనూహ్య ప్రకటనపై క్రికెట్ ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విరాట్ ఫిట్నెస్, ఫామ్ చూసి టెస్ట్‌ల్లో మరో రెండు మూడేళ్లు కొనసాగుతాడని చాలా మంది అనుకున్నారు. అయితే విరాట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెస్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.విరాట్ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనపై అందరిలాగే ఢిల్లీ రంజీ జట్టు కోచ్ శరణ్‌దీప్ సింగ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విరాట్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ శరణ్‌దీప్ సింగ్ ఇలా అన్నాడు. కొద్ది రోజుల కిందట (ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సమయంలో) విరాట్ టెస్ట్ భవిష్యత్తుపై నాతో చర్చించాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్ కోసం ఆతృతగా ఎదరుచూస్తున్నానని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కౌంటీలు ఆడతావా అని విరాట్‌ను అడిగాను.అయితే విరాట్ లేదని చెప్పాడు. కౌంటీలకు బదులుగా ఇండియా-ఏ తరఫున రెండు మ్యాచ్‌లు (ఇంగ్లండ్-ఏతో) ఆడతానని అన్నాడు. 2018 తరహాలో ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈసారి ఇంగ్లండ్ సిరీస్‌లో నాలుగైదు సెంచరీలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఏం జరిగిందో ఏమో తేలీదు కానీ, విరాట్ మూడు నెలల్లో మనసు మార్చకున్నాడు. విరాట్ రిటైర్మెంట్ వార్త వినగానే షాకయ్యానని తెలిపాడు.శరణ్‌దీప్ సింగ్ చెప్పిన ఈ విషయాలను బట్టి చూస్తే విరాట్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక ఏదో జరిగినట్లు తెలుస్తుంది. విరాట్‌కు గత కొన్నేళ్లుగా బీసీసీఐ పెద్దలతో పొసగడం లేదు. అందుకే అతను చాలా సిరీస్‌లకు ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉంటూ వస్తున్నాడు. గత రెండు మూడేళ్ల కాలంలో విరాట్ కేవలం మెగా టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న సమయం నుంచి విరాట్‌కు బోర్డుతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కూడా విరాట్‌కు సత్సంబంధాలు లేవు. పైకి ఇద్దరూ ఏమీ లేదని నటిస్తున్నప్పటికీ.. ఏదో మూలన ఏదో రగులుతూ ఉంది. ఇటీవలికాలంలో సీనియర్ ఆటగాళ్ల పట్ల బోర్డు తీరు కూడా సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకే సీనియర్లు చెప్పాపెట్టకుండా రిటైర్మెంట్ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనే ఇందుకు ఉదాహరణ.టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్, జడేజా, కోహ్లి ఒకేసారి పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వారం రోజుల్లోపే విరాట్ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. -
నిన్ను నిందించం.. విరాట్ రిటైర్మెంట్పై వ్యంగ్యంగా స్పందించిన కౌంటీ ఛాంపియన్షిప్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై కౌంటీ ఛాంపియన్షిప్ (ఇంగ్లండ్) వ్యంగ్యంగా స్పందించింది. ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ దేశవాలీ టోర్నీలో చెలరేగి వికెట్లు తీస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. నిన్ను నిందించం విరాట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. కౌంటీ ఛాంపియన్షిప్ విరాట్‌ను తక్కువ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్‌పై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విరాట్‌ను అడ్డుకునేంత శక్తి ఇంగ్లండ్ పేసర్లకు లేదని కామెంట్లు చేస్తున్నారు.కౌంటీ ఛాంపియన్షిప్ ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే.. భారత క్రికెట్ జట్టు జూన్ 20 నుండి ఇంగ్లండ్‌లో (తో) ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ అట్కిన్సన్, టంగ్‌ను ఎదుర్కోవాల్సి ఉండింది. ఇవాళ ఉదయం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో విరాట్ అట్కిన్సన్, టంగ్ నుంచి ఎదురయ్యే సవాళ్లను తప్పించుకున్నాడన్న అర్దంతో కౌంటీ ఛాంపియన్షిప్ ఈ పోస్ట్‌ను చేసింది.వాస్తవానికి అట్కిన్సన్కు కానీ టంగ్‌కు కానీ విరాట్‌కు అడ్డుకట్ట వేసేంత సీన్ లేదు. విరాట్ ముందు వాళ్లిదరూ సాధారణ పేసర్లు. ఒకవేళ విరాట్ రిటైర్ కాకుండా వారిని ఎదుర్కోవాల్సి వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో వరుస పెట్టి హాఫ్ సెంచరీలు చేస్తూ.. తన జట్టును (ఆర్సీబీ) తొలి టైటిల్ దిశగా తీసుకెళ్తున్నాడు.విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. అనుభవజ్ఞులైన రోహిత్, విరాట్ ఇంగ్లండ్ లాంటి కఠినమైన సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలతే అవుతుంది. ఈ సిరీస్ కోసం కొత్త జట్టును, అలాగే టీమిండియా నూతన టెస్ట్ సారధిని మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ వాయిదా పడటంతో ఖాళీగా ఉన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. ఐపీఎల్ పూర్తయ్యాక జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఇంగ్లండ్ పర్యటనలో భారత షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్, లండన్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31- ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్ట్న్ ఓవల్, లండన్) -
కోహ్లి రిటైర్మెంట్పై స్పందించిన వైఎస్ జగన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.క్రికెట్ పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంపారు.One of the greatest Indian cricketer of all time, @imVKohli, bids adieu to Test cricket.It has always been fascinating to watch him play - his passion, consistency and hunger in pursuit of excellence have been unmatched. His records speak louder than words, and his legacy will… pic.twitter.com/wBHNVEwKgY— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025కాగా, 36 ఏళ్ల విరాట్ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్ ఎవరూ లేరు. -
ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లి సాధించిన ఘనతలు..!
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 12) ప్రకటించాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించాడు. కెప్టెన్‌గా చెరగని ముద్ర వేశాడు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.2011 వెస్టిండీస్ (జూన్‌లో) పర్యటన సందర్భంగా టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.కోహ్లి టెస్ట్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేయాలని కలలు కాన్నాడు. అయితే అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన కారణంగా అతను అనుకున్న టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. కోహ్లి తన టార్గెట్‌కు 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.టీమిండియా టెస్ట్‌ల్లో కనీసం ఐదేళ్లు డామినేట్ చేయడం చూడాలని కోహ్లి కలలుగన్నాడు. దీన్ని అతను కెప్టెన్‌గా ఉన్న కాలంలో (2015-2022) నెరవేర్చుకున్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న కాలం టీమిండియాకు స్వర్ణ యుగం లాంటిది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి రికార్డుల్లో నిలిచిపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరింది.భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే సమయంలో కోహ్లి వ్యక్తిగతంగానూ రాణించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఏకంగా ఏడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.2016-18 కోహ్లి ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో కోహ్లి 35 టెస్టుల్లో 66.59 సగటున 3,596 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ సాధించిన పలు ఘనతలు - కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ విజయాలు: 40 - విరాట్ కోహ్లీ (68 మ్యాచ్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)- స్వదేశం వెలుపల అత్యధిక టెస్ట్ విజయాలు: 16 - విరాట్ కోహ్లీ (37 మ్యాచ్‌లు) (భారత కెప్టెన్లలో)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు: 7 - విరాట్ కోహ్లీ (24 మ్యాచ్‌లు)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు (భారత ఆటగాళ్లలో): 12 విరాట్ కోహ్లి (93 ఇన్నింగ్స్‌లు)- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ పరుగులు: 5864 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు: 20 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు)- ఆసియా ఖండం అవతల అత్యధిక సెంచరీలు: 14 విరాట్ కోహ్లి (108 ఇన్నింగ్స్‌లు)- అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం- కోహ్లి సారథ్యంలో టీమిండియా 49 నెలలు నంబర్ వన్‌గా ఉండింది. -
నువ్వు దాచుకున్న కన్నీళ్లే గుర్తుండి పోతాయి: అనుష్క భావోద్వేగం
‘‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు.. కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఈ ఫార్మాట్ పట్ల నీకున్న అమితమైన ప్రేమ గురించి నాకు తెలుసు.నీ నుంచి ఈ ఫార్మాట్ ఎంత లాగేసుకుందో నాకు తెలుసు. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత రాటుదేలడంతో పాటు మరింత నిరాడంబరంగా తయారయ్యేవాడివి. నీ ఈ ప్రయాణానికి సాక్షిగా ఉండటం నాకు దక్కిన విశేష గౌరవం. నువ్వు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నావని చాలాసార్లు ఊహించాను.అయితే, నువ్వు మాత్రం మీ మనసు చెప్పిన మాట విన్నావు. నువ్వు ఇప్పుడు ఇలా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయం మై లవ్’’ అంటూ భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ భావోద్వేగానికి లోనైంది.తన భర్త, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక నోట్ షేర్ చేసింది అనుష్క. కాగా పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్‌కు కోహ్లి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు అతడు ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.కొనసాగాల్సిందిఈ నేపథ్యంలో భారత, విదేశీ మాజీ క్రికెటర్లు.. 36 ఏళ్ల కోహ్లి మరికొన్నాళ్ల పాటు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి రికార్డులను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క పైవిధంగా స్పందించడం గమనార్హం.మూడు ముళ్ల బంధం.. ముచ్చటైన పిల్లలుకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న కోహ్లి.. 2017 డిసెంబరు 11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021, జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఆ తర్వాత మూడేళ్లకు అంటే.. ఫిబ్రవరి 15, 2024లో కుమారుడు అకాయ్‌కు విరుష్క జన్మనిచ్చారు.తమ పిల్లలిద్దరిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుకున్న ఈ స్టార్ జోడీ.. ఇంత వరకు వారి ముఖాలు రివీల్ చేయలేదు. అంతేకాదు.. పిల్లల గోప్యత, భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువగా లండన్‌లోనే కాలం గడుపుతున్నారు.శతకాల ధీరుడుఇక టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకూ గుడ్‌బై చెప్పిన ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 82 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 30, వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు బాదిన కోహ్లి.. టీమిండియా తరఫున టీ20లలోనూ సెంచరీ నమోదు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి ఐపీఎల్లో ఇప్పటికి 263 మ్యాచ్‌లు ఆడి.. 8 శతకాల సాయంతో 8509 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!
-
కోహ్లి రిటైర్మెంట్.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా ఢిల్లీకి చెందిన కోహ్లి, గంభీర్ల మధ్య గతంలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఎన్నోసార్లు ఈ విషయం బహిర్గతమైంది. మైదానంలోనే ఇద్దరూ గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారుఅలాంటిది గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాగానే కోహ్లి కెరీర్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరికీ పొసగదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శనఅంతేకాదు.. జట్టు ప్రయోజనాల కోసం తామిద్దరం కలిసి ప్రయాణిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే వారి మధ్య అనుబంధం పెరిగిందని బీసీసీఐ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.గంభీర్ మార్గదర్శనంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో కోల్పోయింది.ఈ క్రమంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ రిటైర్ అవ్వాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగా ఇంగ్లండ్ టూర్‌కు ముందు బుధవారం రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా కోహ్లి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు.నిన్ను మిస్సవుతాము చీక్స్నిజానికి కోహ్లి ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి ఆ తర్వాత రిటైర్ అవ్వాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇందుకు యాజమాన్యం నిరాకరించిందని.. గంభీర్ యువ నాయకుడిని కోరుకోవడం దీనికి కారణమనేది వాటి సారాంశం.ఈ నేపథ్యంలో కోహ్లి రిటైర్మెంట్ తర్వాత గంభీర్ ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేసిన తీరు వైరల్‌గా మారింది. ‘‘ఆట పట్ల సింహంలాంటి ఆకలి కలిగి ఉన్న వ్యక్తి.. నిన్ను మిస్సవుతాము చీక్స్’’ అంటూ కోమ్లి ఫొటోను పంచుకున్నాడు. కాగా కోహ్లి ముద్దు పేరు చీకూ అన్న విషయం తెలిసిందే.వీడ్కోలు మ్యాచ్, సిరీస్ అవసరం లేదుఇదిలా ఉంటే.. ఇటీవల రోహిత్, కోహ్లిల గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని, వారిద్దరి ఆట బాగున్నంత కాలం వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడ్డాడు.‘జట్టును ఎంపిక చేయడం సెలక్టర్ల బాధ్యత. అది నా చేతుల్లో లేదు. బాగా ఆడుతున్నంత వరకు కోహ్లి, రోహిత్ జట్టులో ఉంటారు. అతని వయసు 40 అయినా 45 అయినా సమస్య ఏముంది. కోచ్, సెలక్టర్ లేదా బీసీసీఐ కూడా ఫలానా ఆటగాడిని నువ్వు తప్పుకోవాలని చెప్పదు. ప్రదర్శన బాగుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా ఉంటారేమో. అయినా వారి ఆట ఎలా ఉందో చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచమంతా చూసింది కాబట్టి నేను కొత్తగా చెప్పేదేముంది.నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్లకు వీడ్కోలు మ్యాచ్ లేదా సిరీస్ అనేది ఉండరాదు. అలాంటి ఒక్క మ్యాచ్‌కంటే ఇన్నేళ్లు జట్టు కోసం ఏం చేశాడో గుర్తు చేసుకోగలిగితే అదే పెద్ద గౌరవం. దేశపు అభిమానులు మిమ్మల్ని, మీ ఆటను ఇన్నేళ్లు ఇష్టపడటానికి మించి ఫేర్వెల్ ఏముంటుంది’ అని గంభీర్ ప్రశ్నించాడు. చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులుA man with lion’s passion! Will miss u cheeks…. pic.twitter.com/uNGW7Y8Ak6— Gautam Gambhir (@GautamGambhir) May 12, 2025 -
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఇకపై టీమిండియా టెస్టు జట్టులో చూడలేము.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఆటను, అల్లరిని మిస్సవుతాము.. అవును!.. పద్నాలుగేళ్లుగా తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలతో అలరించిన కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన 36 ఏళ్ల కోహ్లి.. తన కెరీర్‌ను ముగించాడు.బ్యాటర్‌గా సూపర్ హిట్తన పద్నాలుగేళ్ల కెరీర్లో కోహ్లి 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. సగటు 46.85. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 254. ఆసీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర విదేశీ గడ్డలపై సెంచరీలతో అలరించాడు.తన అద్బుత బ్యాటింగ్‌తో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265), సునిల్ గావస్కర్ (10,122) తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సాధించాడు.టెస్టుల్లో భారత జట్టు దిశను మార్చిన యోధుడు2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.చిరస్మరణీయ విజయాలు2018-19లో తొలిసారి ఆసీస్ గడ్డపై కోహ్లి సేన టెస్టు సిరీస్ విజయం సాధించింది. అనంతరం 2021-22లో ఇంగ్లండ్‌లో 2-2తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికాలోనూ చిరస్మరణీయ విజయాలు సాధించింది. సొంతగడ్డపై కోహ్లి కెప్టెన్‌గా వరుసగా 11 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు.సారథిగా మొత్తంగా 68 మ్యాచ్‌లలో నలభై విజయాలు సాధించిన కోహ్లి.. గ్రేమ్ స్మిత్ (53), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా(41) తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌కు టీమిండియాను చేర్చాడు. అయితే, 2022లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు పలికాడు.ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లి.. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పిన వారం లోపే తానూ అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం స్వయంగా కింగ్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ‘‘ఇప్పుడే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కోహ్లి?’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావుభారత మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు’’ అని ప్రశ్నించాడు. ఇక భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో అత్యద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నందుకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లి.అసలైన టార్చ్‌బేరర్ నువ్వేకెప్టెన్గా నువ్వు కేవలం మ్యాచ్‌లు మాత్రమే గెలవలేదు. ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేశావు. టెస్టుల్లో ఫిట్నెస్, దూకుడుతో పాటు ఒక రకమైన గర్వంతో ఎలా ఆడాలో చూపించావు. కొత్త ప్రమాణాలు రూపొందించావు. భారత టెస్టు క్రికెట్లో అసలైన టార్చ్‌బేరర్ నువ్వే. ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.బీసీసీఐ ట్వీట్ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ‘‘టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడాఈ రెండు సిరీస్‌లలోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్‌లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.కాగా రోహిత్‌ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారనిమరోవైపు.. కోచ్‌గా గౌతం గంభీర్ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది వేల పరుగులు చేస్తానంటూఒకవేళ కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
-
రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి
అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.టెస్టు కెరీర్ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రంకాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్టులో క్యాప్ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.చేదు అనుభవం తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో పది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, ఈ చేదు అనుభవం తర్వాత కోహ్లి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సంప్రదాయ క్రికెట్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించాడు.తన కెరీర్లో మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 31 అర్ధ శతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254.రోహిత్‌తో పాటే..కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆరు రోజులకే తానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాగా గత కొంతకాలంగా రోహిత్, కోహ్లి టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి చివరగా పెర్త్‌లో ఆస్ట్రేలియా మీద తన టెస్టు సెంచరీ సాధించాడు. ఇక రోహిత్, కోహ్లి వన్డేలలో మాత్రం కొనసాగనున్నారు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి తప్పుకుంటాడని, ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలో కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకైనా కొనసాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా కోహ్లిని తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సిరీస్‌తోనే టీమిండియా 2025- 27 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో అనుభవం లేని యువ ఆటగాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడి మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.మనసు మార్చుకోని కోహ్లి.. కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ తను మొదట తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్ విషయంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడేలా అతడిని ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది.కానీ అతడి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేలా కన్పించడం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొనసాగుతాడా? లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భారత్ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా గిల్.. వైస్ కెప్టెన్‌గా అతడే!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్ కెప్టెన్‌గా పంత్డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే పంత్‌పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత -
BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (VIrat Kohli) రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లిని మరికొన్నాళ్లు టెస్టుల్లో కొనసాగేలా ఒప్పించేందుకు.. భారత క్రికెట్లో అత్యంత అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తిని రంగంలోకి దించినట్లు సమాచారం.ప్రకటన చేయకపోయినా...కాగా టీమిండియా కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు గుడ్‌బై చెప్పిన మూడు రోజుల్లోపే భారత క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో వార్త శనివారం వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాడు, జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి కూడా టెస్టులనుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు దాని సారాంశం. ఈ ‘రన్‌మెషీన్’ అధికారికంగా తన రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయకపోయినా... తాను టెస్టులనుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు బోర్డుకు అతడు సమాచారం అందించాడు.కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!ఇంగ్లండ్‌తో కీలకమైన సిరీస్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే తన మనసులో మాటను కోహ్లి బీసీసీఐకి తన నిర్ణయం గురించి తెలియజేశాడు. అయితే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా బీసీసీఐ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ రిటైర్ కాగా, శుబ్‌మన్ గిల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో సమరంలో జట్టులో అనుభవలేమి సమస్య కావచ్చు. అందుకే కనీసం ఈ సిరీస్ వరకైనా కోహ్లి జట్టులో కొనసాగాలని బోర్డు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్లో అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఒకరితో కోహ్లిని ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అతడితో మాట్లాడిన తర్వాతే కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన చేయవచ్చు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లి కూడా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు. అయితే, వన్డేల్లో మాత్రం రోహిత్‌తో పాటే అతడు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.టెస్టు క్రికెట్లోనూ ప్రత్యేక స్థానంకాగా విరాట్ కోహ్లి వన్డే రికార్డులు చాలా గొప్పగా, ఘనంగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతడు గొప్ప వన్డే ఆటగాడే అయినప్పటికీ.. టెస్టు క్రికెట్లో తనకంటూ కోహ్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలతో కాకుండా ఈతరం క్రికెటర్లలో టెస్టులను బతికించేందుకు సిద్ధపడిన ఏకైక బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.సంప్రదాయ ఫార్మాట్‌కు ఒక ‘దిక్సూచి’లా నిలబడి పునరుత్తేజం నింపేందుకు కోహ్లి ప్రయత్నించాడు. టెస్టుల్లో గతంలో కనిపించని దూకుడు, వ్యూహాలతో అత్యుత్తమ కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే టెస్టుల్లో అతడి బ్యాటింగ్ ప్రదర్శన ఇటీవల అంత గొప్పగా లేదు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆస్ట్రేలియాపై పెర్త్‌లో కోహ్లి సెంచరీ చేశాడు. అయితే సిరీస్‌లోని మిగతా టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు.గత రెండేళ్లలో కోహ్లి సగటు 32.56 మాత్రమే. ఇదే ఫామ్‌తో ఇంగ్లండ్‌కు వెళితే కోహ్లి ఎంత బాగా ఆడతాడనేది సందేహమే. పైగా రోహిత్ కూడా లేకపోవడంతో అందరి దృష్టీ తనపైనే ఉండటంతో తీవ్ర ఒత్తిడి ఖాయం. జట్టు సంధి దశలో తానూ తప్పుకుంటే మెరుగని కోహ్లి ఆలోచిస్తుండవచ్చు.ఇక కెరీర్లో 123 టెస్టులు ఆడిన కోహ్లి 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరో 770 పరుగులు చేస్తే అతను 10 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’! -
విరాట్ కోహ్లీ (స్టార్ క్రికెటర్) రాయని డైరీ
ఆట ఎన్ని పొరపాట్లనైనా క్షమించేస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేందుకు అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ పెళ్లయిన వాడి జీవితంలో ఒక్క పొరపాటుకైనా క్షమాపణ ఉండదు. పోన్లే పాపం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని జీవితం అనుకోదు. జీవితం దయ తలచినా, జీవిత భాగస్వామి క్షమాభిక్ష పెట్టదు!ఎవరో తెలియనైనా తెలియని ఒక అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున లైక్ కొట్టినందుకు అనుష్క నా వైపు చూడటమే మానేసింది! తెలియని అమ్మాయికి, తెలియకుండా లైక్ కొట్టడంలో ఉండేది పొరపాటే కానీ మరొకటి మరొకటి ఎందుకవుతుంది?! నా నెత్తి మీద ఏ దేవతో ఆ క్షణంలో కూర్చొని ఉండాలి. ఊరికే ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి కనిపించింది. ప్రింటెడ్ ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్. నా అంతట నేనే ఆ అమ్మాయి ఫొటోకి లైక్ కొట్టానా, లేక లైక్ తనంతటదే వెళ్లి ఆ అమ్మాయి ఫొటో కింద పడిందా తెలియటం లేదు. అసలు ఆ అమ్మాయే గుర్తు లేదు.అమ్మాయి వేసుకున్న ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్ గుర్తుండీ, అమ్మాయి గుర్తు లేక పోవటం అనేది ఉంటుందా? ఉండొచ్చేమో! నా నెత్తి మీద దేవతకు ఎంత మహిమ ఉందంటే... సరిగ్గా అనుష్క పుట్టిన రోజుకు మర్నాడే ఇలా జరిగింది. తనదొక రేర్ ఫోటోను వెతికి తీసి, ‘యూ ఆర్ మై లవ్’ అని కవిత్వం రాసి, తనకు బర్త్ డే విషెస్ చెప్పిన కొద్ది గంటలకే... ఆ ఎవరో తెలియని అమ్మాయికి నేను లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లను క్రికెట్ అభిమానులు గొప్పగా సెలబ్రేట్ చేశారు.ఆ సెలబ్రేషన్ అనుష్క వరకు వచ్చింది. ‘‘ప్రేమించుకుని కదా పెళ్లి చేసుకున్నాం... ఈ తిక్క వేషాలేంటి?’’ అని అనుష్క నన్ను డైరెక్ట్‌గా అడిగినా బాగుండేది. తన ముందు ఆరార్లు ముప్పై ఆరు గుంజీళ్లు తీసేవాడిని.పాపభూయిష్ఠమైన నా పొరపాటుకు నివృత్తి, నిష్కృతి రెండూ లభించేవి. తనకు సిక్సర్లంటే ఇష్టం. అందుకే అన్ని గుంజీళ్లు.సిక్సర్లంటే తనకు ఇష్టమే కానీ, నేనంటే ఉండేంత ఇష్టమేమీ కాదు. మిడ్ ఓవర్స్‌లో స్పిన్ బాల్స్‌ని ఫేస్ చెయ్యలేక ఔట్ అయి బయటికి వచ్చిన ప్రతిసారీ... ‘‘నాకోసం అదే పనిగా సిక్సర్లు కొట్టేయనవసరం లేదు’’ అని నవ్వేసేది. ఇప్పుడు తనే నా మీద బౌన్సర్లు వేస్తోంది... తన మౌనంతో!అనుష్క మాట్లాడటం లేదు. వామిక నిద్రపోతోంది. అకాయ్‌కి మాటలు రావటానికి ఇంకా టైమ్ పడుతుంది. అకాయ్ ఒక్కడే ఇంట్లో ఇప్పుడు నా మేల్ ఫ్రెండ్. వాడు నా చెయ్యి పట్టుకుని నడవటానికి, బ్యాట్ పట్టుకుని నాతో ఆడటానికి, బైక్ మీద కాలేజీకి వెళ్లి రావటానికి, మళ్లీ ఎప్పుడైనా అనుష్క నాతో మాట్లాడటం మానేసినప్పుడు.. ‘‘ఏంటి డాడీ అలా ఉన్నారు?’’ అని నన్ను అడగటానికి వాడికి టైమ్ పడుతుంది.రెస్టారెంట్ నుంచి రాగానే అనుష్క నేరుగా పిల్లల గదిలోకి వెళ్లిపోయింది. రెస్టారెంట్ ముందు కార్లోంచి దిగుతున్నప్పుడు ఎప్పటిలా తనకు చెయ్యందించినా, తను నా చెయ్యందుకోలేదు. కనీసం నాకోసం ఆగనైనా ఆగకుండా నన్ను దాటుకుని, నడుచుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోయింది.ఒక్క లైక్ జీవితాన్ని ఎంత ఛిద్రం చేసింది!బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను. సిటీ అంతా వెలిగిపోతోంది. నాలో మాత్రం చీకటి. ఎందుకు నేనలా చేశాను?!ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయి. ఒక చుక్క అమితాబ్ బచ్చన్. ఒక చుక్క బిల్ క్లింటన్. ఒక చుక్క బరాక్ ఒబామా. ఒక చుక్క బిల్ గేట్స్.ఆ చుక్కల్లో నేనూ ఒక చుక్కనయ్యానా? అనుష్కకు తీవ్రమైన ఆవేదన మిగిల్చినందుకు! రాత్రి రెండు దాటేసినట్లుంది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లాను. వామిక నిద్రపోతోంది. అకాయ్ నిద్ర పోతున్నాడు. అనుష్క నిద్ర పోతున్నట్లుగా ఉంది. తను పడుకుని ఉన్న వైపు వెళ్లి, తన తల పక్కనే నేల పైన మోకాలి మీద కూర్చున్నాను. -
'ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది'
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. టెస్టు క్రికెట్ నుంచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లి లేఖ రాసాడన్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పకటించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టుల నుంచి తప్పుకుంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సూచనలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విరాట్‌ను రాయుడు కోరాడు."విరాట్ కోహ్లి.. దయచేసి రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. ప్రస్తుతం మీలో ఆడే సత్తా ఇంకా ఉంది. ఇప్పటికీ చాలా ఫిట్‌గా కన్పిస్తున్నారు. మీరు టీమిండియా తరుపున పోరాడేందుకు బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి" అని రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అయితే టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై మాత్రం కోహ్లికి మంచి రికార్డులేదు. ఇంగ్లండ్‌లో 17 టెస్టులు ఆడిన విరాట్.. 33.21 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి తన టెస్టు కెరీర్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. కాగా ఇంగ్లండ్ టూర్‌కు మే 23న భారత జట్టుతో పాటు కొత్త టెస్టు జట్టు కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. -
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ.. తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అభ్యర్థనను తిరస్కరించిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈసారి ఫైనల్ చేరకుండానేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2023-25 సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. అసలు సమయానికి చేతులెత్తేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ వైఫల్యాలను కొనసాగించింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా ఈసారి ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. రెండు సిరీస్‌లలో ఇంతటి ఘోర పరాభవానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల బ్యాటింగ్ వైఫల్యమే.అయితే, కోహ్లి ఆసీస్ గడ్డపై ఓ శతకంతో మెరిసి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అనంతరం ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ బరిలో దిగి అక్కడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టుకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు రాగా.. బుధవారం ఇందుకు సంబంధించి అతడు అధికారిక ప్రకటన విడుదల చేశాడు.సోషల్ మీడియా వేదికగాతాను టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి మొదలుకానున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఆరంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోహ్లి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.జట్టుకు బలం అతడుఅయితే, బీసీసీఐ మాత్రం కోహ్లిని ఇంగ్లండ్‌తో సిరీస్ వరకైనా ఆడాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీతో బీసీసీఐ వర్గాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఇంకా పరుగుల దాహంతోనే ఉన్నాడు. అతడు డ్రెసింగ్‌రూమ్‌లో ఉంటే జట్టుకు బలం.ఇప్పట్లో టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాం’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది?అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రోహిత్ శర్మ వీడ్కోలు నేపథ్యంలో విరాట్ కోహ్లి తనకు కెప్టెన్సీ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శుబ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని బోర్డు సహా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ మొదలుకానుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కెప్టెన్ నియమించాలని బోర్డు భావిస్తోంది.హెడ్‌కోచ్ గంభీర్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. కొత్తతరం ఆటగాళ్లతో పటిష్ట జట్టు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టుతో సిరీస్ నుంచే ఈ పని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకుడి వైపే యాజమాన్యం మొగ్గు చూపుతోంది’’ అని పేర్కొన్నాయి.కెప్టెన్‌గానూ హిట్‌కాగా గతంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత కోహ్లికి ఉంది. టెస్టుల్లో అతడి రికార్డులు అమోఘం. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత... సౌతాఫ్రికా పర్యటనలో ఓటమి అనంతరం టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు.కోహ్లి సారథ్యంలో డబ్ల్యూటీసీ 2019-21లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. అయితే, ఆ తర్వాత రోహిత్ గైర్హాజరీలో కూడా కోహ్లి ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఇష్టపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీ అడిగాడని.. అందుకు బోర్డు నిరాకరించిందనే వార్తలు కల్పితాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ ‘రన్‌మెషీన్’ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కోహ్లి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇప్పుడే వద్దుఅయితే, సెలక్టర్లు మాత్రం కోహ్లిని మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ గురించి కోహ్లి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు.అయితే, ఇంగ్లండ్‌తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో కోహ్లి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతడు మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్ గుడ్బైకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో ఆటగాడిగానూ విఫలమైన రోహిత్.. ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు.కోహ్లికి ఘనమైన రికార్డులుఇక ఈ రెండు సిరీస్‌లలో కోహ్లి కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్‌తో పెర్త్‌లో శతకం బాదడం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరపులేవీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, కోహ్లి టెస్టు కెరీర్ ఎంతో ఘనమైనది. ముఖ్యంగా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్‌ను గెలిపించిన రికార్డు అతడి సొంతం.కాబట్టి రోహిత్ విషయంలో రిటైర్మెంట్కు సులువుగానే ఓకే చెప్పిన సెలక్టర్లు.. కోహ్లిని మాత్రం కొనసాగాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో మొదటిదైన ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం.కాగా 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన కోహ్లి ఇప్పటికి 123 మ్యాచ్‌లు ఆడాడు. సగటున 46.85తో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్టు శతకాలు, 31 హాఫ్ సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డేలలో ఇద్దరూ కొనసాగుతారు!మరోవైపు.. రోహిత్ విషయానికొస్తే.. భారత్ తరఫున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి కూడా రోహిత్‌తో పాటే తానూ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.ఇప్పుడు రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. కోహ్లి కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్‌కప్-2027 వరకు యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
భారత సైన్యానికి సెల్యూట్.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము: విరాట్ కోహ్లి
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ద వాతవారణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ రూపంలో భారత్ బదులు తీర్చుకుంది. భారత సైన్యం వరుసగా రెండు రోజుల పాటు పాకిస్తాన్, పాక్తిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేస్తూ వంది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ ప్రతిదాడులకు కూడా భారత సాయుద బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తమ దేశభక్తి చాటుకున్నారు."ఈ క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న మన సాయుధ దళాలకు సెల్యూట్. సైన్యం ధైర్యసాహసాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు" కోహ్లి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కోహ్లి ఈ పోస్ట్ చేసిన గంటలోనే 34 లక్షల మంది లైక్ చేస్తూ ఈ పోస్టును షేర్ చేయడం విశేషం.భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తీసుకునే ప్రతీ నిర్ణయం మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండాలి. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా, నమ్మకుండా ఉండాలి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. -
మేకను బలి ఇచ్చిన అభిమానులపై కేసు
దొడ్డబళ్లాపురం: విరాట్ కోహ్లి కటౌట్ ముందు మేకను బలి ఇచ్చిన ఆర్సీబీ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా మారమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు. దీంతో ఆనందం పట్టలేని అభిమానులు మారమ్మనహళ్లిలో విరాట్ కోహ్లి కటౌట్ పెట్టి మేకను బలి ఇచ్చారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో మొళకాల్మూరు పోలీసులు పాలయ్య, జయణ్ణ, తిప్పేస్వామిలపై కేసు నమోదు చేశారు. -
అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: కోహ్లి
టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నాఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను.ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నా.. బ్యాటర్‌గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్పోజ్ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఈ సీజన్లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్-19 క్రికెట్లో కెప్టెన్‌గా భారత్‌కు టైటిల్ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.కెప్టెన్‌గానూ తనదైన ముద్రబ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.రికార్డుల రారాజుటెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్‌గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్‌లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
అక్కడ ఫీల్డర్ ఉండటం ఎప్పుడైనా చూశావా?: ధోని ఫైర్
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు శనివారం మరో చేదు అనుభవం ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం రెండు పరుగుల తేడాతో ధోని సేన పరాజయం పాలై.. సీజన్లో తొమ్మిదో ఓటమిని నమోదు చేసింది.చెన్నై బౌలర్ల చెత్త ప్రదర్శన వల్ల బ్యాటర్ల మెరుపులు కూడా వృథా అయిపోయాయి. ముఖ్యంగా పేసర్ ఖలీల్ అహ్మద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు.ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. కేవలం మూడు ఓవర్ల బౌలింగ్‌లోనే ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. ఐపీఎల్‌తో పాటు ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఖలీల్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా మిస్టర్ కూల్‌గా పేరొందిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా సహనం కోల్పోయాడు.ఓవైపు ఆర్సీబీ బ్యాటర్లు తమ బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. మరోవైపు ఖలీల్ ఏకాగ్రత లేకుండా ఫీల్డింగ్ చేయడం తలా కోపానికి కారణమైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పదకొండో ఓవర్‌ను చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా వేయగా అప్పటికి విరాట్ కోహ్లి అర్ధ శతకానికి చేరువలో ఉన్నాడు.అక్కడ ఫీల్డర్ ఉండటం ఎప్పుడైనా చూశావా?అయితే, ఫీల్డ్ సెట్ చేస్తున్న వేళ ఖలీల్ మాత్రం శ్రద్ధ లేకుండా తన స్థానం నుంచి పక్కకు జరిగాడు. దీంతో సహనం కోల్పోయిన ధోని.. ‘‘ఖలీల్.. అక్కడ ఫీల్డర్ ఉండటం ఎప్పుడైనా చూశావా అసలు?’’ అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డు అయ్యాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.రొమారియో షెఫర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఓపెనర్లు జేకబ్ బెతెల్ (33 బంతుల్లో 55), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62) దంచికొట్టగా.. రొమారియో షెఫర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ (14 బంతుల్లో 53 నాటౌట్) ఆడాడు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కరన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగుల వద్ద నిలిచిపోయింది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94) శతకం చేజార్చుకోగా.. జడేజా మెరుపులు (45 బంతుల్లో 77 నాటౌట్) కూడా వృథాగా పోయాయి. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్తానానికి దూసుకుపోగా.. చెన్నై ఆఖరిదైన పదో స్థానాన్ని మరోసారి అట్టిపెట్టుకుంది.చదవండి: మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.. ప్రకటించిన పంజాబ్ కింగ్స్UNREAL HITTING! 💪🔥#RomarioShepherd blitzkrieg hits Chinnaswamy! ⚡He smashes a jaw-dropping 53 off just 14 balls,equaling the 2nd fastest fifty in IPL history! Worthy of this epic clash #Kohli vs #Dhoni - one last time? 🙌🏻Watch the LIVE action in Haryanvi commentary ➡… pic.twitter.com/cOReV8qcPT— Star Sports (@StarSportsIndia) May 3, 2025 View this post on Instagram A post shared by Mrinal (@cricketcanvas18) -
RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌తో కలుపుకుని విరాట్ మొత్తం ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్ పరుగులు సాధించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. వార్నర్ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. విరాట్, వార్నర్ తర్వాత కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ అత్యధిక సీజన్లలో 500 ప్లస్ స్కోర్లు చేశారు. రాహుల్ 6, ధనవ్ 5 సీజన్లలో 500 ప్లస్ స్కోర్లు చేశాడు. నిన్న (మే 3) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఎనిమిదో సారి ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు పూర్తి చేశాడు.విరాట్ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన సీజన్లు..2015- 505 పరుగులు2025- 505*2018- 5302011- 5572013- 6342023- 6392024- 7412016- 973కాగా, నిన్నటి మ్యాచ్‌లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన విరాట్.. ఐపీఎల్లో ఎనిమిదో సారి 500 ప్లస్ పరుగులు సాధించడంతో పాటు మరిన్ని రికార్డులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఏడు అర్ద సెంచరీల సాయంతో 505 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ (సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్) సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో విరాట్ సాధించిన మరిన్ని రికార్డులు..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉 సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు యాబైకిపైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ధవన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే గెలుపుకు చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. యశ్ దయాల్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ఈ మ్యాచ్‌లో మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ వరుస బంతుల్లో ఔట్ కావడం సీఎస్కేకు టర్నింగ్ పాయింట్. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్‌లోకి తెచ్చాడు.చివరి మూడు ఓవర్లలో (సుయాశ్, భువీ, దయాల్) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0). -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మరో హాఫ్ సెంచరీని కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు కింగ్ కోహ్లి బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.చదవండి: #Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం? -
నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కింగ్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్పటివరకు ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు.భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత గొప్ప క్రికెటర్‌గా కీర్తింపబడ్డాడు.వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా పది వేల పరుగులు మైలు రాయిని అందుకున్న బ్యాటర్ కూడా కోహ్లినే కావడం విశేషం. అటు కెప్టెన్‌గా కూడా కోహ్లి తన మార్క్‌ను చూపించాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా విరాట్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్ది గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అయితే తాజాగా మూడు ఫార్మాట్లలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల జాబితాను కోహ్లి వెల్లడించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లెజండ్ జేమ్స్ ఆండర్సన్, వన్డేల్లో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్, టీ20ల్లో వెస్టిండీస్ స్పిన్నర్ సనీల్ నరైన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది పడినట్లు కోహ్లి పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో కోహ్లిపై ఆండర్సన్‌కు మంచి రికార్డు ఉంది. ఏడు సార్లు కోహ్లిని ఆండర్సన్ ఔట్ చేశాడు. మరోవైపు లసిత్ మలింగా కూడా చాలా సందర్భాల్లో కోహ్లిపై పై చేయి సాధించాడు. అదేవిధంగా ఐపీఎల్లో కోహ్లిపై మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సైతం మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.ఇక కోహ్లి ఈ ఏడాది జూన్‌లో తిరిగి భారత తరపున ఆడనున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు పయనం కానునున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025లో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి(443) ఐదో స్ధానంలో కొనసాగుతున్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్ -
RCB vs CSK: అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పటికే పోటీ నుంచి తప్పుకొన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.ఇక చెన్నై దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నడుమ.. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలను మళ్లీ మైదానంలో కలిపి చూడలేమేమో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.చెన్నైదే పైచేయిఏదేమైనా ఆర్సీబీ- చెన్నై పోరు అంటే ఉండే మజానే వేరు. ఇప్పటికి ఐపీఎల్లో ఇరుజట్లు 34 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌లలో చెన్నై, 12 మ్యాచ్‌లలో బెంగళూరు జట్లు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ మాత్రం రద్దై పోయింది.ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై చెన్నైదే పైచేయి కాగా.. ఈ సీజన్లో మాత్రం బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2008 తర్వాత తొలిసారి మళ్లీ చెన్నైని వారి సొంత మైదానం చెపాక్ స్టేడియంలో ఓడించి చరిత్ర తిరగరాసింది.వర్షం ముప్పుతాజాగా తమ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. సీఎస్కేపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. అయితే, వర్షం ఇందుకు ఆటంకం కలిగించేలా ఉంది. గత రెండు రోజులుగా బెంగళూరులో వాన పడుతోంది.భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శనివారం కూడా బెంగళూరులో ఆకాశం మేఘావృతమై ఉంది.. సాయంత్రం భారీ వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడేలా ఉంది.ఇక ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో అందించిన వివరాల ప్రకారం.. చెన్నై శుక్రవారం మూడు గంటలకే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. 45 నిమిషాల్లోపు వర్షం వల్ల ఆటగాళ్లు తిరిగి వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ 4.30 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఆర్సీబీ ఆటగాళ్లు ఐదింటికి అక్కడకు చేరుకోగా.. కాసేటికే మళ్లీ వర్షం పడింది. ఇలా వరుణుడు ఇరుజట్లతో దోబూచులాడుతున్నాడు.కనీసం రెండు గెలిచినా బెర్తు ఖరారేఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే ఆర్సీబీ- చెన్నైలకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో ఇప్పటికి పదికి ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ఆర్సీబీకి ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది. ఇంకా మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిచినా బెర్తు ఖరారైపోతుంది.ఇక ఇప్పటికే పదింట ఏడు ఓడిన పట్టికలో ఆఖర్లో పదో స్థానంలో ఉన్న సీఎస్కేకు మ్యాచ్ రద్దైనా పోయేదేమీ లేదు. అయితే, పరువు నిలుపుకోవాలంటే మాత్రం ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సీజన్లో వర్షం వల్ల ఇంత వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వాన వల్ల అర్ధంతరంగా ముగిసిపోయింది.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..? ఏ జట్టు ఎన్ని గెలిచింది? -
టైటిల్ గెలిచేది ఆ జట్టే.. తొలిసారి ట్రోఫీని ముద్దాడుతారు: భారత దిగ్గజం
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. మిగతా తొమ్మిది జట్లు పదేసి మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ క్రమంలో ముంబై, రాజస్తాన్‌కి ఇంకో మూడు.. మిగతా జట్లకు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.అగ్రస్థానంలోఇక ఇప్పటికి పదకొండింట ఏడు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా ఏడేసి మ్యాచ్‌లు గెలిచినా.. రన్‌రేటు పరంగా వెనుకబడి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో ఆరు మ్యాచ్‌లు గెలిచి ఇదే తరహాలో నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. మరోవైపు.. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు విజయాలతో ఏడు, రాజస్తాన్ రాయల్స్ మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.అట్టడుగునఅదే విధంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు , చెన్నై సూపర్ కింగ్స్ రెండు మాత్రమే గెలిచి అట్టడుగున తొమ్మిది, పది స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్ విజేతగా నిలవగా.. సన్‌రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.ఈసారి ఈ రెండు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. మరోవైపు.. ఇంత వరకు టైటిల్ గెలవని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మాత్రం అదరగొడుతున్నాయి.ముఖ్యంగా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ సరికొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లికి ఓపెనింగ్ జోడీగా వచ్చిన ఫిల్ సాల్ట్ అదరగొడుతుండగా.. బ్యాటర్‌గానూ రజత్ రాణిస్తున్నాడు. మరోవైపు.. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు.ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్రభావం చూపుతుండగా.. స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సమిష్టి ప్రదర్శనకు నిదర్శనంఇప్పటికి గెలిచిన ఏడు మ్యాచ్‌లలో ఐదుగురు వేర్వేరు ప్లేయర్లు (కోహ్లి, కృనాల్ పాండ్యా (3), పాటిదార్ (2), ఫిల్ సాల్ట్, హాజిల్‌వుడ్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడం వారి సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం. మొత్తానికి ఈసారి కలిసికట్టుగా రాణిస్తూ ఆర్సీబీ టైటిల్ గెలవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తోంది.టైటిల్ గెలిచేది ఆ జట్టే.. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది.వాళ్ల ఫీల్డింగ్ కూడా సూపర్. ముంబై ఇండియన్స్ కూడా అదరగొడుతోంది. అయితే, మిగతా మ్యాచ్‌లలో కూడా వారు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము.అయితే, ఇదే జోరు కనబరిస్తే వాళ్లకు తిరుగు ఉండదు. కానీ.. ఈసారి మాత్రం ఆర్సీబీనే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అని గావస్కర్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడబోతోందని సన్నీ జోస్యం చెప్పాడు.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! -
విరాట్ కోహ్లీ బయోపిక్‌లో తమిళ హీరో..
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీల తరువాత ఆ స్థాయి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నిర్వహించి పేరు గడించారు. విరాట్ కోహ్లీకి అశేష అభిమానులు ఉన్నారు. ఇకపోతే సినిమా రంగంలో సంచలన నటుడు శింబు. ఈయనలో మంచి నటుడే కాకుండా, దర్శకుడు, కథకుడు, సంగీతదర్శకుడు, గాయకుడు ఉన్నారు. అంతేకాకుండా శింబు బహు భాషా నటుడిగా పేరు తెచ్పుకున్నారు. ఇలాంటి నటుడి చిత్రంలోని పాటను క్రీడాకారుడు విరాట్ కోహ్లీ లూప్ మోడ్‌లో(పదేపదే) వినడం విశేషం. నటుడు శింబు 2023లో కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. ఏఆర్.రెహా్మన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో 'నీ సింగం దాన్' అనే పాట చోటు చేసుకుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ పోటీల్లో బెంగళూరు జట్టు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతున్నారు. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలోని నీ సింగం దాన్ అనే పల్లవితో సాగే పాటను పదేపదే విన్నానని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది శింబు దృష్టికి రావడంతో ఆయన కోహ్లీ నుద్దేశించి నీయే ఒరు సింగం దాన్ (నువ్వే ఒక సింహం) అని పేర్కొన్నారు. దీంతో కోహ్లీ అభిమానులు, శింబు అభిమానునలు క్రీడారంగంలోనూ, సినీ రంగంలోనూ ప్రముఖులైన ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే శింబు, కోహ్లీలో స్వారూప్యం చాలా ఉంది. ఇద్దరూ చార్మింగ్‌గా ఉంటారు. ఇద్దరూ పొడవైన జుట్టుతో ఉంటారు. దీంతో కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ధోని బయోపిక్‌తో తెరకెక్కిన ఎంఎస్.ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాబట్టి విరాట్ కోహ్లి బయోపిక్ తెరకెక్కే అవకాశం లేకపోలేదని, అందులో శింబు నటిస్తే అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అవుతుందనే వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు. శింబు ప్రస్తుతం కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్ చిత్రం జూన్ 5న తెరపైకి రానుంది. తాజాగా మరో మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం ఉంటుంది. హీరోయిన్ లైక్‌పై క్లారిటీఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే, వాటిని విరాట్ కోహ్లీ లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించారు. కొంత సమయం తర్వాత ఆ లైక్‌ను ఆయన తొలగించారు. ఇంతలోనే కొందరు నెటిజన్లు ఆ స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాజాగా ఆ విషయంపై కోహ్లీ ఇలా వివరణ ఇచ్చారు. 'నేను ఇన్‌స్టాలోని ఫీడ్‌ను క్లియర్ చేస్తుండగా పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి ఉద్దేశం నాకు లేదు. ఎవరు కూడా అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని కోరుతున్నాను. ఈ పొరపాటును అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని తన ఇన్‌స్టా స్టోరీలో కోహ్లీ పేర్కొన్నారు. -
అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వెనక గల కారణాన్ని కోహ్లి వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు. "టీ20లకు రిటైర్మెంట్ అన్ని ఆలోచించాకే ప్రకటించాను. కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాలని, వారు సిద్దమయ్యేందుకు కాస్త సమయం అవసరమని భావించాను.వారు తదుపరి టీ20 వరల్డ్‌కప్‌కు సిద్దంగా ఉండేందుకు కనీసం రెండేళ్ల సమయమైనా కావాలి. అందుకే వరల్డ్‌కప్ అనంతరం టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటి ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు -
చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆర్సీబీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బెంగళూరు భావిస్తోంది.అయితే సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 53 రన్స్ చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 8,500 పరుగుల మైలురాయిని తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు విరాట్ . 262 మ్యాచ్‌ల్లో 8,447 పరుగులు చేశాడు. కోహ్లి తర్వాతి స్ధానంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(6921) ఉన్నాడు. అయితే కోహ్లి కంటే రోహిత్ దాదాపు 2000 పరుగులు వెనకబడి ఉన్నాడు. ఇక 2008లో ఆర్సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లి.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఐపీఎల్ కెరీర్లో 8 సెంచరీలతో పాటు 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్లో కూడా కింగ్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రత్యర్ధి జట్లపై విరుచుకుపడుతున్నాడు. కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో ఈ ఆర్సీబీ మాజీ కెప్టెన్ కొనసాగుతున్నాడు.చదవండి: Shikhar Dhawan: అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె? -
RCB: నాపై ఆ సౌతాఫ్రికా ఆటగాడి ప్రభావం ఎక్కువ: కోహ్లి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో పనిచేసిన తొలి రోజుల్లో తనపై ఓ వ్యక్తి ప్రభావం చూపాడంటూ సౌతాఫ్రికా ఆటగాడి పేరు చెప్పాడు. అయితే, ఆ వ్యక్తి ఏబీ డివిలియర్స్ మాత్రం కాదు!.. ఇంతకీ విషయం ఏమిటంటారా?!కాగా 2008లో ఐపీఎల్ మొదలుకాగా.. ఆరంభ సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గానూ పనిచేసిన కింగ్.. టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. ఈసారీ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో తాజాగా కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జట్టుతో చేరిన తొలినాళ్లలో సౌతాఫ్రికా స్టార్ మార్క్ బౌచర్ (Mark Boucher) తననెంతో ప్రభావితం చేశాడని కింగ్ చెప్పుకొచ్చాడు.అడగకముందే ఎన్నో విలువైన సలహాలు‘‘ఆరంభ రోజుల్లో నాతో పాటు ఆడిన ఆటగాళ్లలో బౌచర్ అప్పట్లో నన్ను బాగా ప్రభావితం చేశాడు. నేను అడగకముందే ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడు. నేను అనుకున్న స్థాయికి చేరాలంటే.. బలహీనతలు ఎలా అధిగమించాలో వివరించాడు.ఇండియా మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వచ్చే తదుపరి మూడు- నాలుగేళ్లలో టీమిండియాకు కీలక ప్లేయర్‌గా మారాలని.. లేదంటే.. నీకు నువ్వు ద్రోహం చేసుకున్న వాడివి అవుతావని చెప్పాడు. ఆయనతో జరిగిన సంభాషణ నన్ను ఎంతో ప్రభావితం చేసింది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మార్క్ బౌచర్ 2008 నుంచి 2010 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.ప్లే ఆఫ్స్ చేరాలని కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. తద్వారా పద్నాలుగు పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారీ ప్లే ఆఫ్స్ చేరాలని పట్టుదలగా ఉంది.ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 443 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ తదుపరి శనివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే -
అనుష్క శర్మ బర్త్ డే.. విరాట్ కోహ్లీ స్పెషల్ విషెస్!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన భార్య అనుష్క శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. నా ప్రాణ స్నేహితుడు, నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. నిన్ను ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాము అంటూ అనుష్కపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. అనుష్క శర్మ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేసిన ముద్దుగుమ్మ డిసెంబర్ 2017లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరూ ఇటలీలోని టస్కానీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జనవరి 2021లో తమ కుమార్తె వామిక జన్మించింది. గతేడాది ఫిబ్రవరి 2024లో బాబు పుట్టగా అకాయ్ అని పేరు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
తమ్ముడిని విమర్శించిన మాజీ క్రికెటర్.. అన్న కౌంటర్ అదుర్స్
టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ మేటి ఆటగాడిగా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. లీగ్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు మొత్తంగా 262 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 8447 పరుగులు సాధించాడు.తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కింగ్ కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి ఖాతాలో ఎనిమిది ఐపీఎల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. గతేడాది 15 మ్యాచ్‌లలో కలిపి 741 పరుగులు చేసిన కోహ్లి.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 443 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.స్ట్రైక్‌రేటుపై విమర్శలుఅయితే, ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ కోహ్లి స్ట్రైక్‌రేటుపై సునిల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్ వంటి భారత మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తూనే ఉన్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మంజ్రేకర్ కోహ్లిపై విమర్శలు గుప్పించాడు.బుమ్రా వర్సెస్ కోహ్లి ఇకపై బెస్ట్ వర్సెస్ బెస్ట్ కాదని పేర్కొన్నాడు. ఐపీఎల్-2025లో అగ్రస్థానంలో ఉండే పదిమందిలో తానైతే కోహ్లి పేరు చెప్పనని.. అతడు తన జాబితాలో లేడనే మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.మాట్లాడటం సులువేఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి అన్నయ్య వికాస్ కోహ్లి సంజయ్ మంజ్రేకర్‌కు ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘సంజయ్ మంజ్రేకర్.. వన్డే కెరీర్ స్ట్రైక్ రేటు: 64.31.. 200కి పైగా స్ట్రైక్రేట్ల గురించి మాట్లాడటం సులువే’’ అంటూ తన తమ్ముడిని విమర్శించినందుకు అతడి స్ట్రైక్‌రేటు గురించి ప్రస్తావిస్తూ చురకలు అంటించాడు.సింగిల్స్, డబుల్స్‌కి కూడా ప్రాధాన్యంకాగా అంతకుముందు విరాట్ కోహ్లి కూడా విమర్శకులకు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ జట్టును విజయపథంలో నడపడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. తాను సింగిల్స్, డబుల్స్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తానని.. ఒక్కోసారి ఆ పరుగులే ఎంతో కీలకం అవుతాయన్నాడు.కానీ కొందరు మాత్రం భాగస్వామ్యాల ప్రాధాన్యం గురించి మరిచి.. విమర్శలకు దిగుతుంటారని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఇప్పటికి ఆడిన పది మ్యాచ్‌లలో ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: అతడిని బ్యాన్ చేయండి: టీమిండియా స్టార్‌పై నెటిజన్ల ఆగ్రహం -
నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 108.51 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. 163 పరుగుల లక్ష్య చేధనలో 26 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది.ఈ సమయంలో కోహ్లి ఆచితూచి ఆడుతూ కృనాల్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పటికి కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ఎంతో విలువైనది. ఈ క్రమంలో తన స్ట్రైక్ రేట్‌పై విమర్శల చేస్తున్నవారికి కోహ్లి మరోసారి కౌంటరిచ్చాడు.టీ20 క్రికెట్లో దూకుడు ఒక్కటే ముఖ్యం కాదని, పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం అవసరమని కోహ్లి అన్నాడు. "టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాట్ ఏదైనా మనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. స్కోర్ బోర్డులో ఎంత మొత్తం ఉంచాలి,?మనం చేధించాల్సిన టార్గెట్ ఎంత? పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ బౌలర్‌ను ఎటాక్ చేయాలి? ఏ బౌలర్‌ను ఎటాక్ చేయకూడదు? ఇవన్నీ ఆలోచించి వ్యూహత్మకంగా ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా ఛేజింగ్‌లో ఎప్పుడూ నాకంటూ ఓ ప్లానింగ్ ఉంటుంది. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌పై దృష్టిపెడతాను. ఏదో విధంగా పరుగులు రాబట్టమే నా లక్ష్యం. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్స్ రొటేటింగ్, సింగిల్స్, డబుల్స్ తీయడమే నా గేమ్ ప్లాన్. అయితే టీ20 క్రికెట్లో భాగస్వామ్యం నెలకొల్పడం, గేమ్‌ను క్లోజ్‌గా తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో విమర్శకులు మర్చిపోతున్నారు అనుకుంటా. ఈ ఏడాది సీజన్లో ఏ బ్యాటర్ కూడా తొలి బంతి నుంచే బౌలర్‌ను ఎటాక్ చేయడం లేదు. పిచ్ పరిస్థితిని ఆర్ధం చేసుకోని, బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలంటే మనంటూ ప్రొఫిషనలిజం ఉండాలి. స్లో పిచ్‌లపై స్ట్రైక్ రోటేట్ చేయడం అంత తేలిక కాదు. దానికంటూ ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. నేను పిచ్ కండీషన్స్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్ రోటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించేందుకు నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో విరాట్ పేర్కొన్నాడు.కాగా గతేడాది సీజన్లో కోహ్లి స్ట్రైక్ రేట్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలు చేశార. సింగిల్స్ తీస్తూ కోహ్లి చాలా నిదానమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గవాస్కర్ మండిపడ్డారు. అదేవిధంగా ఆర్సీబీ జట్టులో బిగ్ హిట్టర్లు ఉన్నప్పటికి కోహ్లి ఎటవంటి రిస్క్ తీసుకోకుండా స్లోగా ఆడాడని ఆయన అన్నారు. ఆ తర్వాత గవాస్కర్‌కు కోహ్లి కౌంటరిచ్చాడు. "చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్‌రేటు గురించి, స్పిన్‌లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. జట్టుకు విజయం అందించడమే నా లక్ష్యం. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం సరికాదు" అని కోహ్లి పేర్కొన్నాడు.ఆ తర్వాత గవాస్కర్ కూడా కోహ్లి వ్యాఖ్యలకు బదులిచ్చారు. కోహ్లి స్ట్రైక్ రేట్పైన మాత్రమే కామెంటేటర్లు మాట్లాడారు. అంతే తప్ప ఆటగాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనే ఆలోచన ఏ వ్యాఖ్యతకు లేదు. ఓపెనర్‌గా వచ్చి.. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి, 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే పొగడ్తలు ఉండవు అని గవాస్కర్ రిప్లే ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కోహ్లి వ్యాఖ్యలు చూస్తే గవాస్కర్‌కే కౌంటిరిచ్చినట్లు అన్పిస్తోంది. -
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్‌కే: కృనాల్ పాండ్యా
ఆర్సీబీ ఆటగాడు కృనాల్ పాండ్యా ఆల్‌రౌండరే అయినప్పటికీ.. ఐపీఎల్లో అతను బ్యాట్‌కు ఎక్కువగా పని చెప్పలేదు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కృనాల్ చాలాకాలం తర్వాత బ్యాట్‌తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు (నాటౌట్) చేసిన కృనాల్ ఆర్సీబీని గెలిపించాడు. ఈ గెలుపులో కృనాల్‌ది ప్రధానపాత్ర. తొలుత బౌలింగ్‌లో రాణించిన (4-0-28-1) అతను.. ఆతర్వాత బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 3267 రోజుల తర్వాత కృనాల్ ఐపీఎల్లో చేసిన తొలి అర్ద శతకం ఇదే. 137 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్లో కృనాల్‌కు ఇది కేవలం రెండో అర్ద శతకం మాత్రమే. అతని తొలి అర్ద శతకం కూడా ఢిల్లీపైనే చేశాడు. 2016 సీజన్లో ఇది జరిగింది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగే కృనాల్ పెద్దగా భారీ స్కోర్లు చేయనప్పటికీ.. మ్యాచ్‌ను ప్రభావితం చేసే స్వీట్ అండ్ షార్ట్ ఇన్నింగ్స్‌లు ఆడతాడు.నిన్నటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (26/3, 4 ఓవర్లు) బరిలోకి దిగిన కృనాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలుత నిదానంగా ఆడిన కృనాల్.. ఆతర్వాత గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. తొలి 28 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన కృనాల్.. ఆతర్వాత ఎదుర్కొన్న 19 బంతుల్లో ఏకంగా 48 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రెచ్చిపోయిన కృనాల్ ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆతర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో ఓ సిక్సర్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో కూడా సత్తా చాటినందుకు కృనాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ ఇలా ఆన్నాడు. నా పాత్రకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులువగా ఉంటుంది. అతను ప్రతి బంతికి ప్రోత్సహిస్తుంటాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. విరాట్ గైడెన్స్‌లో నేనే మంచి ఇన్నింగ్స్ ఆడాను. తొలి 20 బంతులు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాను. అయితే విరాట్ నింపిన స్పూర్తితో లయను అందుకుని భారీ షాట్లు ఆడగలిగాను. క్రెడిట్ విరాట్‌కి దక్కుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్‌రైజర్స్, కేకేఆర్‌లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. -
కేఎల్ రాహుల్‌పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్ సేనను వారి హోం గ్రౌండ్లో ఓడించి లెక్క సరిచేసింది. ఇక అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ అయ్యింది.కేఎల్ రాహుల్ మరోసారిటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్ రాహుల్ (41) ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్‌వుడ్ రెండు, కృనాల్ పాండ్యా- యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన జేకబ్ బెతెల్ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) ధనాధన్ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లి - ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ను ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్ పాండ్యా ఎదుర్కొన్నాడు.రాహుల్‌తో వాదనకు దిగిన కోహ్లి?!అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్‌తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్, భారత మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కోహ్లి- రాహుల్ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.గట్టిగానే బదులిచ్చాడు‘‘ఫీల్డింగ్ సెట్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్‌కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్ కీపర్ రాహుల్ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్‌కాస్టర్ షేర్ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ బెంగళూరుఢిల్లీ స్కోరు: 162/8 (20)ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా. చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్ Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz— Star Sports (@StarSportsIndia) April 27, 2025 -
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై (ఏ ప్రత్యర్థిపై అయినా) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పి ఉండేవాడు. ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరగులు ఇవే. నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీపై చేసిన 51 పరుగులతో ఆ ఫ్రాంచైజీపై విరాట్ చేసిన పరుగుల సంఖ్య 1130 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే వార్నర్ రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకుని ఉండేవాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి దుష్మంత చమీరా బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు1134 - డేవిడ్ వార్నర్ vs PBKS1130 - విరాట్ కోహ్లీ vs DC*1104 - విరాట్ కోహ్లీ vs PBKS1093 - డేవిడ్ వార్నర్ vs KKR1084 - విరాట్ కోహ్లీ vs CSK1083 - రోహిత్ శర్మ vs KKRకాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ సైతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హవా కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన అతను.. లీడింగ్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఛేజింగ్‌లో చేసినవే కావడం విశేషం.ఫార్మాట్ ఏదైనా విరాట్‌కు ఛేజింగ్ మాస్టర్‌గా బిరుదు ఉంది. ఆ బిరుదుకు విరాట్ మరోసారి సార్థకత చేకూర్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఛేజింగ్‌కు దిగిన నాలుగు సందర్భాల్లో విరాట్ 4 అర్ద సెంచరీలు చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో మూడు సార్లు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్‌లో ఇంకా చేవ తగ్గలేదు.బ్యాటర్‌గా సూపర్ ఫామ్‌లో ఉండటమే కాకుండా తన జట్టును దాదాపు ప్రతి మ్యాచ్‌లో గెలిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ విఫలమైన మ్యాచ్‌ల్లో మాత్రమే ఆర్సీబీ ఓడింది. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. అంతలా విరాట్ ఈ యేడు ఆర్సీబీ విజయాలను ప్రభావితం చేస్తున్నాడు. ప్రస్తుతం విరాట్‌ను చూస్తుంటే కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ఇదే జోరును అతను మరో ఐదారు మ్యాచ్‌లు కొనసాగిస్తే ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవడం ఖాయం. ఆర్సీబీ ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత జోష్‌లో కనిపిస్తుంది. జట్టులో అందరూ రాణిస్తున్నారు. కెప్టెన్‌గా పాటిదార్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కృనాల్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొడుతున్నాడు. పడిక్కల్, టిమ్ డేవిడ్ ఇరగదీస్తున్నారు.పాటిదార్ బ్యాటర్‌గా ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్‌కు తమను తాము నిరూపించుకునే అవకాశం రాలేదు. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ వికెట్లు తీయలేకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. పేసర్ యశ్ దయాల్ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు.విరాట్ ఓపెనింగ్ పార్ట్నర్గా ఎవరూ సెట్ కాకపోవడమే ప్రస్తుతం ఆర్సీబీ వేధిస్తున్న ఏకైక సమస్య. సాల్ట్ ఓ మ్యాచ్‌లో మెరిసినా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జేకబ్ బేతెల్‌ను ప్రయోగించినా అతను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క సమస్యను పక్కన పెడితే ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉంది. కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ డిమినేషన్ కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత ఇలాకాలో ఓడించిన అనంతరం టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఈ గెలుపుతో కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి హోం గ్రౌండ్స్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలిచింది.నిన్నటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోరు), జోష్ హాజిల్‌వుడ్ (4-0-36-2 కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. బ్యాటింగ్‌లో విరాట్ (10 మ్యాచ్‌ల్లో 443 పరుగులు) టాప్ రన్ స్కోరర్‌గా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ (10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు (ఆరెంజ్ క్యాప్)విరాట్ కోహ్లి- 443సూర్యకుమార్ యాదవ్- 427సాయి సుదర్శన్- 417నికోలస్ పూరన్- 404మిచెల్ మార్ష్- 378ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (పర్పుల్ క్యాప్)జోష్ హాజిల్‌వుడ్- 18ప్రసిద్ద్ కృష్ణ- 16నూర్ అహ్మద్- 14ట్రెంట్ బౌల్ట్- 13కృనాల్ పాండ్యా- 13అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ (6)పాయింట్ల పట్టిక1. ఆర్సీబీ (14 పాయింట్లు, 0.521 రన్‌రేట్)2. గుజరాత్ టైటాన్స్ (12, 1.104)3. ముంబై ఇండియన్స్ (12, 0.889)4. ఢిల్లీ క్యాపిటల్స్ (12, 0.482)5. పంజాబ్ కింగ్స్ (11, 0.177)కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (51), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు (18.3 ఓవర్లలో). ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్రేట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్‌రేట్‌తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్లో కావడంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌పై 7, ఢిల్లీపై 22, పంజాబ్‌పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లికి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి కింగ్ కోహ్లి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ చాలా త్వరగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్ ప్రకటించాడని, 2026 టీ20 ప్రపంచ కప్ వరకు ఆడింటే బాగుండేదని రైనా అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ నుంచి కాస్త ముందుగా రిటైర్ అయ్యాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరును చూస్తుంటే టీ20 ప్రపంచకప్-2026 కొనసాగింటే బాగుండేది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఇప్పటికీ చాలా ఫిట్నెస్గా కన్పిస్తున్నాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 125 మ్యాచ్‌లు ఆడి, 48.69 సగటుతో 4188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు, 124 ఫోర్లు, 54 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌లలో కోహ్లి 1292 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు -
క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం సాధించింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో తొలి గెలుపు నమోదు చేసి విమర్శలకు చెక్ పెట్టింది.క్రెడిట్ మొత్తం వారికేఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) హర్షం వ్యక్తం చేశాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేము సత్ఫలితం రాబట్టాము. ఈరోజు వికెట్ కాస్త భిన్నంగా ఉంది. అయినా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.ఈ గెలుపులో క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది. పదో ఓవర్ తర్వాత వారు చూపిన తెగువ అద్భుతం. ఇక ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కూడా ఎంతో చక్కగా బ్యాటింగ్ చేశారు. వాళ్లకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.గొప్ప నాయకులు ఉన్నారు.. కానీమేము వికెట్ల వేటలో ఉన్న వేళ మా మనసు చెప్పినట్లు విన్నాను. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినపుడే వికెట్లు కూడా తీయగలుగుతాం. జట్టులో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వారిచ్చే సలహాలు, సూచనలు కూడా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదం చేస్తాయి. అయితే, నా ప్రణాళికలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కోహ్లి, పడిక్కల్ ధనాధన్‌కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌కు శుభారంభం లభించింది.జైసూ విధ్వంసంఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, జైసూ అవుటైన తర్వాత సీన్ మారిపోయింది. అంతకుముందు.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 పరుగులకే నిష్క్రమించగా.. నితీశ్ రాణా(28), కెప్టెన్ రియాన్ పరాగ్ (22) నిరాశపరిచారు.చెలరేగిన హాజిల్వుడ్ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47) విజయంపై ఆశలు పెంచాడు. అయితే, 20 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయిన రాజస్తాన్ 194 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 11 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్ల(4/33) చెలరేగగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్‌కుమార్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఇది ఆరో విజయం. ఈ నేపథ్యంలో పన్నెండు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు.. తొమ్మిదింట ఏడు ఓడిన రాజస్తాన్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 that speak louder than words 🥳#TATAIPL | #RCBvRR | @imVkohli | @RCBTweets pic.twitter.com/Q4B09fkllE— IndianPremierLeague (@IPL) April 24, 2025 -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను విరాట్ ఊతికారేశాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉టీ20 క్రికెట్లో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్)3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్‌లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)👉అదేవిధంగా టీ20 క్రికెట్లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ బాబర్(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.👉ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..62 - విరాట్ కోహ్లీ*61 - బాబర్ అజామ్57 - క్రిస్ గేల్55 - డేవిడ్ వార్నర్52 - జోస్ బట్లర్52 - ఫాఫ్ డు ప్లెసిస్ -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన భారత క్రికెటర్లు..
పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచాక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఈ టెర్రర్ ఎటాక్‌పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని 140 కోట్ల మంది భారతీయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు."పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ఆ బలాన్ని చేకూర్చాలని ఆ దేవుడును ప్రార్థిస్తున్నాను"- విరాట్ కోహ్లి2 Virat Kohli pic.twitter.com/eAUtXo8hYZ— Virushka🫶❤️ (@KohliTheGOAT18) April 23, 2025"పహల్గామ్లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే నా హృదయం బరువెక్కిపోయింది. బాధితుల కుటంబాలకు ఆ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు"- శుబ్‌మన్ గిల్"కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలలకు బలం చేకూరాలని ఆ దేవడును ప్రార్థిస్తున్నాను"-కేఎల్ రాహుల్"బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుంది"-గౌతం గంభీర్👉భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.👉పెహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, మంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌ను చీర్‌లీడర్స్ లేకుండా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాణాసంచా కూడా పేల్చవద్దు అని నిర్ణయించారు -
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్‌లో ఉన్నారు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్‌మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు. 2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. రిషబ్ పంత్‌కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.ఏ ప్లస్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది. -
Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో
-
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడు శైలికి భిన్నంగా సంయమనంతో ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అద్భుత అర్ధ శతకంతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి 135 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మాత్రం వేగంగా ఆడాడు.ఈ కేరళ బ్యాటర్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 61 పరుగులు సాధించాడు. ఇక ఆఖర్లో జితేశ్ శర్మ సిక్స్‌తో ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నాకెందుకు?.. ఈ అవార్డుకు అతడే అర్హుడు‘‘మాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. రెండు పాయింట్లు కూడా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించే క్రమంలో ఎంతో ఉపయోగపడతాయి. సొంత మైదానం వెలుపలా మేము అద్భుతంగా ఆడుతున్నాం.ఈ విషయం ఇక్కడ మరోసారి నిరూపితమైంది. అయితే, ఈరోజు దేవ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైంది. అతడు భిన్న రీతిలో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాకు అభిప్రాయం ప్రకారం ఈ అవార్డుకు అతడే అర్హుడు.కానీ నాకెందుకు ఇచ్చారో తెలియడం లేదు’’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘నేను క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా పర్లేదు.. ఆ తర్వాత వేగం పెంచి.. ఆఖరిదాకా క్రీజులో ఉండాలనేదే మా వ్యూహం.మాకు మంచి జట్టు లభించిందిఈ సీజన్లో మాకు మంచి జట్టు లభించింది. వేలంలో మా వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. డేవిడ్, టిమ్, పాటిదార్.. అందరూ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక రొమారియో షెఫర్డ్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఉండటం మాకు సానుకూలాంశం’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా మూడు రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఓడించింది. అందుకు బదులుగా పంజాబ్ సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో ఆర్సీబీ ఆదివారం నాటి మ్యాచ్‌లో శ్రేయస్ సేనపై ప్రతీకారం తీర్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. పంజాబ్ కూడా ఎనిమిదింట ఐదు విజయాలు సాధించినా రన్‌రేటు పరంగా వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ👉టాస్: ఆర్సీబీ.. మొదట బౌలింగ్👉పంజాబ్ స్కోరు: 157/6 (20)👉ఆర్సీబీ స్కోరు: 159/3 (18.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోSmacking them with ease 🤌Virat Kohli is in the mood to finish this early 🔥Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB | @imVkohli pic.twitter.com/iuT58bJY2A— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో సతమతమైన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా ‘వింటేజ్ హిట్‌మ్యాన్’ను గుర్తు చేస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు.రోహిత్ ధనాధన్చెన్నై విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 45 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి.. సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్)తో కలిసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు.ఇక చెన్నైతో మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ అంటూ అభిమానులు ఇచ్చిన బిరుదును రోహిత్ శర్మ మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం ఇందుకు నిదర్శనం.This man & his pull shots >>>>#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSKpic.twitter.com/hwnlKRNvO0— Mumbai Indians (@mipaltan) April 20, 2025 ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.ఒకే దేశంలో అత్యధిక సిక్సర్లు (అంతర్జాతీయ, లీగ్ క్రికెట్లో కలిపి) బాదిన క్రికెటర్లు👉రోహిత్ శర్మ- ఇండియాలో- 361 సిక్సర్లు👉క్రిస్ గేల్- వెస్టిండీస్‌లో- 357 సిక్సర్లు👉విరాట్ కోహ్లి- ఇండియాలో- 325 సిక్సర్లు👉మహేంద్ర సింగ్ ధోని- ఇండియాలో- 286 సిక్సర్లు👉కీరన్ పొలార్డ్- వెస్టిండీస్‌లో- 276 సిక్సర్లు👉సంజూ శాంసన్- ఇండియాలో- 274 సిక్సర్లు👉నికోలస్ పూరన్- వెస్టిండీస్‌లో- 271 సిక్సర్లు.ఇక ఓవరాల్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున టెస్టుల్లో 88, వన్డేల్లో 344, టీ20లలో 205 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్లో 264 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 292 సిక్సర్లు బాదాడు.సీఎస్కే 176.. ఆలౌట్ముంబై- చెన్నై మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో ఆదివారం జరిగిన చిరకాల ప్రత్యర్థుల పోరులో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హార్దిక్ సేన.. ధోని బృందాన్ని 176 పరుగులకు కట్టడి చేసింది.అనంతరం కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఈ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానాని (8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి)కి దూసుకువచ్చింది. మరోవైపు.. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది ఆరో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోA #SKY special in Wankhede!#SuryaKumarYadav hits the winning runs for #MI & the Revenge is completed!Next up on #IPLRevengeWeek 👉 #KKRvGT | MON, 21 APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/8rw3ZDwA5w— Star Sports (@StarSportsIndia) April 20, 2025 -
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో గెలుపు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ (PBKS vs RCB) చేతిలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన పరాభవానికి ఆదివారం బదులు తీర్చుకుంది. పంజాబ్‌ను వారి హోం గ్రౌండ్ ముల్లన్‌పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగాఈ క్రమంలో పంజాబ్‌పై ప్రతీకార విజయం నేపథ్యంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్న తీరు విమర్శలకు తావిచ్చింది.కోహ్లి చర్య.. శ్రేయస్ ఫైర్ఇక కోహ్లి చర్య పట్ల శ్రేయస్ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మ్యాచ్ ముగియగానే ఇరుజట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో.. అయ్యర్ కోహ్లితో కోపంగా ఏదో మాట్లాడాడు. అయితే, కోహ్లి మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరచాలని ప్రయత్నించాడు.కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం గంభీరంగా అతడికి బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా సహచర టీమిండియా ఆటగాడిని కించపరిచేలా ఇలాంటి సెలబ్రేషన్స్ దిగ్గజ బ్యాటర్ అయిన కోహ్లి స్థాయికి తగవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడా?అయితే, ఆర్సీబీ అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్‌లో కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడని.. అందుకే కింగ్ ఇలా బదులిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. శ్రేయస్ ఆర్సీబీ మ్యాచ్ సమయంలో ఎలాంటి మూర్ఖపు చర్యలకు దిగలేదని.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో అతడు ఇచ్చిన రియాక్షన్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.బ్యాటర్‌గా శ్రేయస్ విఫలంకాగా ముల్లన్‌పూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31) రాణించగా.. ఆఖర్లో మార్కో యాన్సెన్ (20 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకున్నాడు.ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ శ్రేయస్ అయ్యర్ (6) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి, వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. పడిక్కల్ కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్ములేపాడు.అయితే, కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఈసారి విఫలం కాగా.. కోహ్లి- జితేశ్ శర్మతో కలిసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. కోహ్లి 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. జితేశ్ (8 బంతుల్లో 11) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కాగా ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ ఐదింట గెలిచి.. పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.చదవండి: Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవంCSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి ఇలా..Jitesh Sharma dials 6⃣ to seal it in style 🙌Virat Kohli remains unbeaten on 73*(54) in yet another chase 👏@RCBTweets secure round 2⃣ of the battle of reds ❤Scorecard ▶ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/6dqDTEPoEA— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్‌మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్‌గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్‌పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్‌గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్‌వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్‌ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X గుజరాత్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్‌కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్‌గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఈ మ్యాచ్‌లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
పడిక్కల్ విధ్వంసం, సత్తా చాటిన విరాట్.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
PBKS VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో భారీ రికార్డు సొంతం
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్ శర్మ (11) సిక్సర్ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్‌ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. -
IPL 2025: పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం18.5వ ఓవర్- నేహల్ వధేరా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ (11) మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.4వ ఓవర్- 143 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి పాటిదార్ (12) ఔటయ్యాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లివిరాట్ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 122/2గా ఉంది. విరాట్ (50), పాటిదార్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.3వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (61) ఔటయ్యాడు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న ఆర్సీబీ158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 75 పరుగులుగా ఉంది. విరాట్ (35), పడిక్కల్ (38) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో మరో 83 పరుగులు చేయాలి. ధాటిగా ఆడుతున్న కోహ్లి, పడిక్కల్ఛేదనలో ఆర్సీబీ ఆదిలోనే సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగానే ఆడుతుంది. విరాట్ (31), పడిక్కల్ (22) బ్యాట్ ఝులిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 54/1గా ఉంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి అర్షదీప్‌సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జోస్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (1) ఔటయ్యాడు. విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ స్కోరెంతంటే?ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సెన్ (25 నాటౌట్) ఓ మోస్తరుగా పరుగులు రాబట్టారు.మిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), నేహాల్ వధేరా (5 రనౌట్), మార్కస్ స్టొయినిస్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పదహారు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 129-6యాన్సెన్ 11, శశాంక్ 19 పరుగులతో ఉన్నారు. మరోవైపు.. ఆర్సీబీ స్పిన్నర్ సూయశ్ శర్మ స్థానంలో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ సబ్‌గా వచ్చాడు.ఆరో వికెట్ డౌన్13.5: సూయశ్ శర్మ బౌలింగ్‌లో స్టొయినిస్ (1) బౌల్డ్. మార్కో యాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 114-6(14). శశాంక్ సింగ్ 15 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్13.2: సూయశ్ శర్మ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ (29) బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శశాంక్ 14 పరుగులతో ఉన్నాడు. పంజాబ్ స్కోరు: 112/5 (13.2) .సెంచరీ కొట్టిన పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఇంగ్లిష్ 22, శశాంక్ సింగ్ 9 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్8.6: సూయశ్ శర్మ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్- నేహాల్ వధేరా (5)తో కలిసి సింగిల్ తీశాడు. అయితే, రెండో పరుగు తీసే క్రమంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో నేహాల్ వధేరా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ స్కోరు: 76/4 (9). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అవుట్7.4: రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (6)కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 69/3 (7.5) . జోష ఇంగ్లిస్ ఐదు పరుగులతో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్6.1: ప్రభ్‌సిమ్రన్ (33) రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 62-1(6)ప్రభ్‌సిమ్రన్ 33, శ్రేయస్ అయ్యర్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2: కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన ప్రియాన్ష్ ఆర్య (22). క్రీజులోకి శ్రేయస్ అయ్యర్.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లుప్రభ్సిమ్రన్ 10 బంతుల్లో 19, ప్రియాన్ష్ ఆర్య 14 బంతుల్లో 22 పరుగులతో ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో పంజాబ్ స్కోరు: 41-0 తొలి ఓవర్లో పంజాబ్ స్కోరు: 2-0కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్. ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ ఒక్కో పరుగుతో ఉన్నారు.🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Match 37.Updates ▶️ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/gg5M40bjrg— IndianPremierLeague (@IPL) April 20, 2025ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ (PBKS vs RCB) మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనుంది. చండీగడ్‌లోని ముల్లన్‌పూర్‌లో గల మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య పంజాబ్ బ్యాటింగ్ చేసింది.తుదిజట్లుపంజాబ్ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: హర్‌ప్రీత్ బ్రార్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్గే, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబేఆర్సీబీఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సూయశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, జేకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.ప్రతీకారం తీర్చుకోవాలనికాగా ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడ్డ పంజాబ్ సొంతమైదానంలోనే వారిని ఓడించింది. వర్షం వల్ల పద్నాలుగు ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. -
విరాట్ కోహ్లికి ఘోర అవమానం
-
ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాటిదార్ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్‌కు క్యూ ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్ వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ (19 బంతుల్లో 33 నాటౌట్) కారణంగా.. పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్ పాటిదార్ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్ -
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
ఐపీఎల్-2025 (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ఊహించని రీతిలో ముందుకు సాగుతుంటే.. ఐదేసి సార్లు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ (RR)తో కలిసి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నాయి.ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా సవాళ్లకు ఎదురీతుండగా.. గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేకేఆర్ ఇప్పటికి ఆరింట మూడు గెలిస్తే.. రైజర్స్ ఆరింట రెండే గెలిచి చివరన ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ కొనసాగుతోంది.గతేడాది బెంగళూరు జట్టుపై 287/3 స్కోరు నమోదు చేసింది. ఈ ఏడాది తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్.. ఈ రికార్డు స్కోరు కంటే ఒక్క పరుగు తక్కువ చేసి.. తమ రికార్డును తామే బద్దలుకొడుతుందా అనిపించింది. అయితే, ఇప్పటికి ఆ రికార్డు మాత్రం పదిలంగానే ఉండిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చెక్కు చెదరని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి గమనిద్దామా?!రికార్డుల రారాజుకే సాధ్యమైందిరన్మెషీన్ పేరొందిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఈ రికార్డుల రారాజు 2016 సీజన్లో నాలుగు శతకాల సాయంతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు.అత్యధిక వరుస విజయాలుఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. 2014, 2015 సీజన్లలో అరుదైన ఘనత సాధించింది.గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది కేకేఆర్. ఆ మరుసటి ఏడాది వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఇంత వరకు ఏ జట్టుకు ఇలాంటి వరుస విజయాల ఘనత సాధ్యం కాలేదు.పార్ట్నర్స్ఐపీఎల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి- ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. 2016లో ఆర్సీబీ తరఫున ఈ దిగ్గజ బ్యాటర్లు గుజరాత్ లయన్స్‌పై 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గతంలో ముంబై ఇండియన్స్‌పై తాము సాధించిన 215 (నాటౌట్) పరుగుల భాగస్వామ్య రికార్డును వారే బ్రేక్ చేశారు.హ్యాట్రిక్ వీరుడుఐపీఎల్లో అత్యధిక హ్యాట్రిక్‌లు నమోదు చేసిన బౌలర్‌గా రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున దక్కన్ చార్జర్స్‌పై, 2011లో దక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2011లో పుణె వారియర్స్‌పై అమిత్ మిశ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు.అరంగేట్రంలోనే అదరగొట్టివెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ఏప్రిల్ 6, 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా 6/12 గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా డెబ్యూలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.డివిలియర్స్ పేరిటే..ఒక సీజన్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నాడు. 2016 సీజన్లో అతడు మొత్తంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), రియాన్ పరాగ్ (17) అతడికి చేరువగా వచ్చినా ఈ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు.. -
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్.. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా చూసినా డేవిడ్ వార్నర్ మాత్రమే విరాట్ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 400 టీ20 మ్యాచ్‌ల్లో 108 హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ తన 388వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్ 388 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.THE HISTORIC MOMENT - 100 FIFTIES FOR KING KOHLI IN T20 HISTORY 🎯 pic.twitter.com/e4uvnxh0Vd— Johns. (@CricCrazyJohns) April 13, 2025టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ప్లేయర్లువార్నర్- 108విరాట్- 100బాబర్ ఆజమ్- 90గేల్- 88బట్లర్- 86కాగా, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. విరాట్ హాఫ్ సెంచరీల సెంచరీని విరాట్ సిక్సర్‌తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్లో విరాట్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్లో విరాట్ 6 మ్యాచ్‌ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్ రేట్‌తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసిన పూరన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. -
RCB Vs RR: రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్ జురెల్ (35 నాటౌట్), రియాన్ పరాగ్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, కృనాల్ తలో వికెట్ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్లో 100 హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్ (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. -
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్
రచ్చ గెలుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంట మాత్రం మరోసారి పరాభవం ఎదుర్కొంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) విచారం వ్యక్తం చేశాడు.ఓవర్ కాన్ఫిడెన్స్ కాదుఢిల్లీ చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘వికెట్ ఎప్పటికప్పుడు మారిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్ చేసేందుకు అనుకూలమైన పిచ్. కానీ మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం.మా జట్టులోని ప్రతి బ్యాటర్ కసితోనే ఆడతారు. వాళ్లది ఆత్మవిశ్వాసమే తప్ప.. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అయితే, ఈరోజు 80/1 స్కోరు నుంచి 90/4కు పడిపోవటమన్నది ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.మా బ్యాటింగ్ లైనప్ పటిష్టమైనది. కానీ మేము ఈరోజు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అయితే, ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం మాకు కాస్త ఊరట కలిగించే అంశం.మా ఓటమికి కారణం అదేఇక ఢిల్లీ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో మా బౌలర్లు ఆడిన విధానం అద్భుతం. మాకు అది ఎంతో ప్రత్యేకమైనది. సొంత మైదానంలో కాకుండా వేరే మైదానాల్లోనే గెలుస్తామన్న అభిప్రాయాలతో మాకు పనిలేదు.వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ గురువారం ఢిల్లీతో తలపడింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22) రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యాడు.రజత్ పాటిదార్ (23 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ శర్మ (3) నిరాశపరిచారు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (18 బంతుల్లో 18) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడి స్కోరు 163 పరుగుల మార్కుకు తీసుకువచ్చాడు.పవర్ ప్లేలో మూడు వికెట్లు.. కానీఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (2)ను యశ్ దయాళ్, జేక్ ఫ్రేజర్ మెగర్క్(7)ను భువనేశ్వర్ కుమార్ వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపారు. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (7)ను కూడా భువీ వెనక్కి పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు.రాహుల్ రఫ్పాడించాడుఅయితే, కేఎల్ రాహుల్ విజృంభణతో అంతా తలకిందులైంది. నెమ్మదిగా మొదలుపెట్టిన ఈ లోకల్ బ్యాటర్.. మధ్య ఓవర్లలో దూకుడు పెంచాడు. మొత్తంగా 53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 169 పరుగులు సాధించిన ఢిల్లీ.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అక్షర్ సేనకు ఈ సీజన్లో వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లలో మూడు గెలవగలిగింది.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది! POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
ఇది నా హోం గ్రౌండ్: కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ వైరల్.. పాపం కోహ్లి!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా ముందుకు సాగుతున్న అక్షర్ సేన.. తాజాగా మరో విజయం సాధించింది. పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోనే ఓడించింది.ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul). ఆర్సీబీ విధించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే అక్షర్ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్-మెగర్క్ (7) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (7) కూడా చేతులెత్తేశాడు. దీంతో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ విలవిల్లాడింది.ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పాఇలాంటి తరుణంలో నేనున్నాంటూ కేఎల్ రాహుల్ అభయమిచ్చాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. మధ్య ఓవర్లలో మాత్రం దూకుడు పెంచి ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు.రాహుల్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా సిక్సర్‌తో ఢిల్లీ విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఢిల్లీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా.. రాహుల్ తన విన్నింగ్ ఇన్నింగ్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్‌గా మారింది."𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙢𝙮 𝙜𝙧𝙤𝙪𝙣𝙙" 🔥pic.twitter.com/gKtmfoFvlN— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2025 ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!బ్యాట్‌తో గ్రౌండ్లో గీత గీసిన రాహుల్.. ఆ తర్వాత జెండా పాతుతున్నట్లుగా బ్యాట్‌తో మైదానంపై కొట్టి.. ‘‘ఇది నా హోం గ్రౌండ్’’ అంటూ సైగ చేశాడు. నిజానికి రాహుల్ వికెట్ తీసేందుకు ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన వేళ.. ఇతర బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సమయంలో మాత్రం కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.After the win Rahul stared at Kohli and said "This Is My Home Ground" 🔥Look at Kohli's Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5— Radha (@Radha4565) April 11, 2025 పాపం కోహ్లి!ఇందుకు కౌంటర్‌గానే రాహుల్ తన క్లాసీ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లికి, ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి ఈ రకంగా రియాక్షన్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్సీబీపై ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.ఈ సందర్భంగా.. ‘‘ఇది నా సొంత మైదానం.. నా ఇల్లు.. నాకంటే ఈ పిచ్ గురించి ఇంకెవరికి బాగా తెలుసు?.. నేను ఎప్పుడు ఇక్కడ ఆడినా.. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని రాహుల్ పేర్కొన్నాడు. కాగా బెంగళూరుకు చెందిన రాహుల్ ఆరంభంలో ఆర్సీబీకి ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఇప్పటికి ఐదింట మూడు గెలిచింది. ఈ సీజన్లో ఢిల్లీకి అక్షర్ పటేల్.. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఢిల్లీ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కేఎల్ రాహుల్ (53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 రన్స్ నాటౌట్).చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు మరో పరాజయం ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ సేన ఆరు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సమిష్టి వైఫల్యంతో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో చేదు అనుభవం ఎదుర్కొంది.వారంతా విఫలంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి శుభారంభమే లభించింది. పవర్ ప్లేలో మెరుగైన స్కోరు సాధించినా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22), కెప్టెన్ రజత్ పాటిదార్ (25) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (1), లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (3) పూర్తిగా విఫలమయ్యారు.ఆఖర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) కాస్త వేగంగా ఆడటంతో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ లక్ష్య ఛేదనను 17.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.చెత్త బౌలింగ్సొంతమైదానంలో కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ (53 బంతుల్లో 93 నాటౌట్)తో ఢిల్లీకి విజయం అందించాడు. మిగతా వాళ్లలో ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/26), సూయశ్ శర్మ (1/25) ఫర్వాలేదనిపించగా.. జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాళ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హాజిల్‌వుడ్ మూడు ఓవర్లలో 40 పరుగులు ఇవ్వగా.. దయాళ్ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 45 రన్స్ ఇచ్చేశాడు.ఇదేం కెప్టెన్సీ?.. విరాట్ కోహ్లి ఆగ్రహంఈ నేపథ్యంలో ఢిల్లీ టాపార్డర్ ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్ మెగర్క్(7), అభిషేక్ పోరెల్ (7)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపినా.. ఆర్సీబీకి ప్రయోజనం లేకుండా పోయింది. మధ్య, ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్ల వైఫల్యం వల్ల మ్యాచ్ చేజారింది. ఈ క్రమంలో ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్లో జోష్ హాజిల్‌వుడ్ ఏకంగా 22 (4,4,2,2,4,6) పరుగులు ఇచ్చిన వేళ.. బౌండరీ లైన్ వద్ద కోహ్లి.. తమ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వద్ద అసంతృప్తి వెళ్లగక్కాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ.. బౌలర్లు, ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు.అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ నిర్ణయంపై అసంతృప్తితోనే కోహ్లి ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన సమయంలో హిందీ కామెంట్రీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘దినేశ్ కార్తిక్‌తో అతడు తీవ్రంగా చర్చిస్తున్నాడు.నిజానికి కెప్టెన్ రజత్ పాటిదార్‌తో మాట్లాడాల్సింది. రజత్ ఈ జట్టుకు కెప్టెన్. కాబట్టి విరాట్ కోహ్లి దినేశ్ కార్తిక్‌తో మాట్లాడేకంటే కూడా.. రజత్తో మాట్లాడితేనే బాగుండేది’’ అని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. వీరేందర్ సెహ్వాగ్.. ‘‘జోష్ హాజిల్‌వుడ్ 22 పరుగులు ఇచ్చినందుకే విరాట్ కోహ్లి కోచ్‌తో ఇలా చర్చించి ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. Unbeaten. Unstoppable. Unmatched 🫡History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? Discussions with an experienced man amidst a crisis!Virat x DK COME ON RCB ❤️ ❤️ ❤️ #RCBvsGT #IPL2025 pic.twitter.com/oUgnB3fqOk— Dinesh Karthik Fan Club (@DKFANFOREVER) April 10, 2025🚨 VIRAT KOHLI UNLEASHES THE BEAST MODE! 🦁🏏 RCB vs DC just got SPICY! 🌶️💥 Kohli to Patidar: "CAPTAIN WHO?! अभी दिखाता हूं तेरेको, coach ko Jake chugali karta hu😂!"🕺 Dinesh Karthik: "मैं तो बस अपनी रोटी का जुगाड़ कर रहा हूं’—don’t drag me into this fire!"⚡ Is Rajat… pic.twitter.com/OgdGc8I07i— CRICKET 18 LOVER (@Cricket_18_love) April 11, 2025 -
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 1,000 ఫోర్లు బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు.కోహ్లి ఇప్పటివరకు ఐపీఎల్లో 249 మ్యాచ్‌లు ఆడి 1001 బౌండరీలు బాదాడు. అందులో 721 ఫోర్లు, 280 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లి తర్వాతి స్ధానంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(920) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి ఫర్వాలేదన్పించాడు. 14 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేశాడు.అదే విధంగా ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు కోహ్లి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 249 ఇన్నింగ్స్‌ల్లో 280 సిక్సర్ల బాదాడు. మరో మూడు సిక్సర్లు కొడితే భారత కెప్టెన్ రోహిత్ శర్మను కోహ్లి అధిగమిస్తాడు. రోహిత్ ఐపీఎల్లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు.ఐపీఎల్లో అత్యధిక బౌండరీలు బాదిన టాప్-5 ఆటగాళ్లు..1001* – విరాట్ కోహ్లీ920 – శిఖర్ ధావన్899 – డేవిడ్ వార్నర్885 – రోహిత్ శర్మ761 – క్రిస్ గేల్ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..క్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 282విరాట్ కోహ్లి- 278ఎంఎస్ ధోని- 259ఏబీ డివిలియర్స్- 251చదవండి: సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం -
RCB VS DC: హిట్‌మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందేందుకు మరో ఐదు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. నేటి వరకు ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. రోహిత్ ఐపీఎల్లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు. 248 ఇన్నింగ్స్‌ల్లో 278 సిక్సర్లు బాదిన విరాట్ మరో 5 సిక్సర్లు కొడితే హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొడతాడు. ఐపీఎల్ 2025లో నేడు (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ ఈ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టేందుకు ఆస్కారముంది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఐదు సిక్సర్లతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేస్తే మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో 99 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ నేటి మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేస్తే హాఫ్ సెంచరీల సెంచరీని పూర్తి చేసుకుంటాడు.ఓవరాల్‌గా చూస్తే ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 141 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 357 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాత రోహిత్, కోహ్లి, ధోని, డివిలియర్స్ ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..క్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 282విరాట్ కోహ్లి- 278ఎంఎస్ ధోని- 259ఏబీ డివిలియర్స్- 251కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి సిక్సర్ల వీరుడిగా పేరున్న రోహిత్ శర్మ గత రెండు సీజన్ల నుంచి కాస్త మెత్తబడ్డాడు. 2024 సీజన్ నుంచి ఇప్పటివరకు రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదాడు. సిక్సర్ల విషయంలో రోహిత్.. సహచరుడు విరాట్ కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండేవాడు. అలాంటిది గత సీజన్ నుంచి రోహిత్ విరాట్ కంటే వెనుకపడిపోయాడు. 2024 సీజన్ నుంచి రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదగా.. విరాట్ 44 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుత సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 24 సిక్సర్లు బాది లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా ఉన్నాడు. పూరన్ తర్వాత మిచెల్ మార్ష్ (15), శ్రేయస్ అయ్యర్ (14) ఉన్నారు.ఆర్సీబీ, ఢిల్లీ మధ్య ఇవాళ జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాయి. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీ పైచేయి సాధించినా.. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఢిల్లీకే విజయావకాశలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాంతర శక్తులు ఉన్నాయి. ఢిల్లీకి బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఉండగా.. ఆర్సీబీకి హాజిల్‌వుడ్ ఉన్నాడు. ఢిల్లీ తరఫున స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఉండగా.. ఆర్సీబీకి విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్, ట్రస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు. మొత్తంగా ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్ -
RCB VS DC: మరో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న విరాట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 10) ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగింట మూడు గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓడింది.నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఒక్కడే 100 హాఫ్ సెంచరీలు (108) పూర్తి చేశాడు. గత మ్యాచ్‌లోనే టీ20ల్లో 13000 పరుగుల మార్కును తాకిన విరాట్ నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే మరోసారి రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో విరాట్ 386 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 99 హాఫ్ సెంచరీల సాయంతో 13050 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు.నేటి మ్యాచ్ విషయానికొస్తే.. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఆర్సీబీ 19, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అయితే ప్రస్తుత సీజన్లో పరిస్థితి చూస్తే మాత్రం ఢిల్లీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీ ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. కొత్త కెప్టెన్ అక్షర్ నేతృత్వంలో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతుంది. ఢిల్లీ ఈ సీజన్లో అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ లక్నో, సన్‌రైజర్స్, సీఎస్‌కేలపై అద్భుత విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 200కు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఏకైక జట్టు ఢిల్లీ మాత్రమే. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్, కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ వరుస వైఫల్యాలే జట్టును కలవరపెడుతున్నాయి.మరోవైపు ఆర్సీబీ కూడా ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆది నుంచే అదరగొడుతుంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్, రెండో మ్యాచ్‌లో సీఎస్కేలకు షాకిచ్చిన ఈ జట్టు మూడో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడి ఆతర్వాతి మ్యాచ్‌లోనే మళ్లీ గెలుపు బాట (ముంబైపై విజయంతో) పట్టింది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో విరాట్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్ -
‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
జట్టు ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యం అని టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) స్పష్టం చేశాడు. మ్యాచ్‌లో పరిస్థితులను బట్టే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో వ్యక్తిగత ఇష్టానికి చోటు ఉండదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. తాను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచిస్తూ ఆడానని పేర్కొన్నాడు.‘అహం’ పనికిరాదు..‘జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ‘నేను’ అనే అహం బ్యాటింగ్‌లో ఎప్పుడూ కనిపించకూడదు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం సరైన బ్యాటింగ్ అనిపించుకోదు. నేను మ్యాచ్‌లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకే ప్రయత్నిస్తా. దానిని బట్టే ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇది నేను గర్వించే విషయం కూడా.నేను మంచి లయ అందుకొని జోరు మీదుంటే నాపై బాధ్యత వేసుకుంటా. మరో బ్యాటర్ బాగా ఆడుతుంటే అతడూ అదే బాధ్యత తీసుకుంటాడు’ అని విరాట్ విశ్లేషించాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 256 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తం 8168 పరుగులు చేశాడు. అయితే తొలి మూడు సీజన్లలో ఎక్కువగా మిడిలార్డర్లో బరిలోకి దిగిన అతడు చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 38 ఇన్నింగ్స్‌లు ఆడినా అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలే ఉన్నాయి.నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలుఅయితే 2011 నుంచి కోహ్లి ఆట మలుపు తిరిగింది. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘ఆర్సీబీ తరఫున మొదటి మూడేళ్లు నాకు టాపార్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. కాబట్టి ఐపీఎల్లో గొప్పగా ఆడలేదు. అయితే 2010లో కాస్త నిలకడ వచ్చింది. 2011 నుంచి రెగ్యులర్‌గా మూడో స్థానంలోకి వచ్చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలైంది’ అని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలంగా ఆడటం వల్లే టీ20 ఫార్మాట్లో తన ఆటను మెరుగుపర్చుకోవడం సాధ్యమైందని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి విరాట్ కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. ఆటగాడిగా.. కెప్టెన్‌గా అభిమానులను అలరించిన కోహ్లి.. జట్టుకు ఇంత వరకు ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఇక ఐపీఎల్-2025 సందర్భంగా బెంగళూరు ఫ్రాంఛైజీ రజత్ పాటిదార్‌ను తమ సారథిగా ప్రకటించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచింది. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పాటిదార్ రాణిస్తుండటం విశేషం. మరోవైపు.. కోహ్లి కూడా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం -
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
గెలుపు జోష్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాల్పడిన తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి భారీ జరిమానా విధించింది. కాగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ వాంఖడేలో తొలి విజయం నమోదు చేసి విషయం తెలిసిందే. పాటిదార్ కెప్టెన్సీలో సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (4) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67) మాత్రం రాణించాడు. ఆకాశమే హద్దుగా ఇక వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేయగా.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో పాటిదార్ 64 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ముంబై బౌలర్లలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడింది. టాపార్డర్ రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17), విల్ జాక్స్ (22)విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్(28) కూడా నిరాశపరిచాడు.తిలక్, హార్దిక్ రాణించినా..ఈ క్రమంలో తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లోనే 42) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టినా.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై 209 పరుగుల వద్ద నిలిచింది. దీంతో పన్నెండు పరుగుల తేడాతో ఆర్సీబీ ముంబైపై విజయం సాధించింది.రూ. 12 లక్షల జరిమానాఅయితే, రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆర్సీబీ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఐపీఎల్ పాలక మండలి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. తొలి తప్పిదం కాబట్టి ఈసారి రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టింది.కాగా ఐపీఎల్-2025 సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టిన రజత్ పాటిదార్ ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో కొనసాగుతోంది. టోర్నీ ఆసాంతం ఇదే జోరు కనబరిస్తే ఈసారి కప్ కొట్టాలన్న ఆర్సీబీ చిరకాల కల నెరవేరే అవకాశాలు లేకపోలేదు.చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025 -
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
ముంబై విజయలక్ష్యం 222 పరుగులు... ఆర్సీబీ చక్కటి బౌలింగ్‌తో స్కోరు 99/4 వద్ద నిలిచింది. ముంబై గెలిచేందుకు 8 ఓవర్లలో 123 పరుగులు చేయడం అసాధ్యంగా అనిపించింది. అయితే అసాధారణ ఆటతో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పోరాడారు. కేవలం 34 బంతుల్లో 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి బెంగళూరు చివరకు మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకుంది. అంతకుముందు కెప్టెన్ రజత్ పాటీదార్, విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ దూకుడుతో బెంగళూరు ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ముంబై: వాంఖెడే మైదానంలో పదేళ్ల తర్వాత ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. సోమవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్సీబీ 12 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. సమష్టి ప్రదర్శన... ఇన్నింగ్స్ రెండో బంతికే ఫిల్ సాల్ట్ (4) వెనుదిరగ్గా... కోహ్లి, పడిక్కల్ కలిసి దూకుడుగా స్కోరుబోర్డును నడిపించారు. బౌల్ట్ ఓవర్లో వీరిద్దరు కలిసి 16 పరుగులు రాబట్టారు. చహర్ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బాదగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 73 పరుగులకు చేరింది. చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి పడిక్కల్ వెనుదిరగడంతో 91 పరుగుల (52 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సాంట్నర్ ఓవర్లో 2 సిక్స్‌లతో పాటీదార్ జోరు ప్రదర్శించాడు. హార్దిక్ ఒకే ఓవర్లో కోహ్లి, లివింగ్‌స్టోన్ (0)లను అవుట్ చేయగా, బౌల్ట్ ఓవర్లో ఆర్సీబీ బ్యాటర్లు పాటీదార్, జితేశ్ కలిసి 18 పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 169/4. ఆఖరి 4 ఓవర్లలో బెంగళూరు 52 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6, 4తో దూకుడుగా ఆటను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (9 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)... దయాళ్ తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. రికెల్టన్ (17), జాక్స్ (22) కూడా మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. బౌలర్ దయాళ్, కీపర్ జితేశ్ సమన్వయలోపంతో సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను అదే ఓవర్లో మరో రెండు బంతుల తర్వాత పెవిలియన్ పంపించి దయాళ్ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సుయాశ్ ఓవర్లో తిలక్ 2 ఫోర్లు, సిక్స్...హాజల్‌వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో హార్దిక్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది విజయంపై ఆశలు రేపారు. గత మ్యాచ్‌లో ‘రిటైర్ట్ అవుట్’గా పంపించిన కసి తిలక్ బ్యాటింగ్‌లో కనిపించింది. తర్వాతి మూడు ఓవర్లలో కూడా ఈ జోరు కొనసాగి 43 పరుగులు వచ్చాయి. అయితే తిలక్ వికెట్‌తో ఆట మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) బౌల్ట్ 4; కోహ్లి (సి) నమన్ (బి) హార్దిక్ 67; పడిక్కల్ (సి) జాక్స్ (బి) పుతూర్ 37; పాటీదార్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 64; లివింగ్‌స్టోన్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 0; జితేశ్ (నాటౌట్) 40; డేవిడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–4, 2–95, 3–143, 4–144, 5–213. బౌలింగ్: బౌల్ట్ 4–0–57–2, చహర్ 2–0–29–0, బుమ్రా 4–0–29–0, జాక్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–40–0, హార్దిక్ 4–0– 45–2, విఘ్నేశ్ 1–0–10–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) దయాళ్ 17; రికెల్టన్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 17; జాక్స్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; సూర్యకుమార్ (సి) లివింగ్‌స్టోన్ (బి) దయాళ్ 28; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 56; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) హాజల్‌వుడ్ 42; నమన్ ధీర్ (సి) దయాళ్ (బి) కృనాల్ 11; సాంట్నర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 8; దీపక్ చహర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 0; బౌల్ట్ (నాటౌట్) 1; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–21, 2–38, 3–79, 4–99, 5–188, 6–194, 7–203, 8–203, 9–209. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, యశ్ దయాళ్ 4–0–46–2, హాజల్‌వుడ్ 4–0–37–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 4–0–45–4. -
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 13,000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఐపీఎల్-2025లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.386 ఇన్నింగ్స్‌లలో కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి కంటే ముందు క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్ హేల్స్ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్ మాలిక్ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్ పోలార్డ్ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) ఉన్నారు. అయితే ఇన్నింగ్స్‌ల పరంగా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ మాత్రం కోహ్లినే కావడం గమనార్హం.కాగా ఐపీఎల్-2025లో విరాట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. 60 పరుగులతో కోహ్లి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. వారితోనే ఆడాలని ఉంది: ఎంఎస్ ధోని -
కోహ్లి, రోహిత్ కాదు.. వారితోనే ఆడాలని ఉంది: ఎంఎస్ ధోని
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా, ఆటగాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన ఘనత అతడిది. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి, ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మిస్టర్ కూల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ధోని తాజాగా రాజ్ షమానీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోనికి హోస్ట్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్నఎదురైంది. తన ఆల్ టైమ్ ప్లేయింగ్‌ను ఎంచుకోమని అతడిని అడిగారు. అందుకు ధోని తక్షణమే తిరస్కరించాడు. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోపోయినప్పటికి, ఎప్పటికీ తను కలిసి ఆడడానికి ఇష్టపడే నలుగురు ఆటగాళ్లను మాత్రం ధోని షార్ట్‌లిస్ట్ చేశాడు. మాజీ లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్లను ధోని ఎంచుకున్నాడు. అయితే ధోని ఎంచుకున్న ఈ నలుగురు ప్లేయర్లలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ధోని కెప్టెన్సీలో విరాట్ ఓంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. అయినప్పటికి ధోని మాత్రం తన ఎంపిక అత్యుత్తమ నలుగురు ఆటగాళ్లలో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా ఇదే ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురుంచి వస్తున్న వార్తలపై ధోని స్పందించాడు. "నేను ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నా. ప్రతీ ఏడాది సమీక్షించకున్నాకే ఐపీఎల్లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శరీరం సహకరిస్తోందనపిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ధోని తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. -
IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 7) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో (వాంఖడే స్టేడియంలో) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండగా.. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కాస్త ఢీలాగా కనిపిస్తుంది. అయితే నేటి మ్యాచ్‌లో ముంబైకి కూడా జోష్ రావచ్చు. ఈ మ్యాచ్‌తో వారి తరుపుముక్క జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఆర్సీబీ మ్యాచ్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరో శుభవార్త కూడా ఉంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ కూడా నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, రోహిత్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్ వచ్చింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడింట ఓడింది. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది.ముంబైదే పైచేయిహెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 19, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లిముంబైతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. నేటి మ్యాచ్‌లో విరాట్ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 13000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12983 పరుగులు (385 ఇన్నింగ్స్‌ల్లో 41.47 సగటున) ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్ టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్ హేల్స్ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్ మాలిక్ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్ పోలార్డ్ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) మాత్రమే విరాట్ కంటే అత్యధిక పరుగులు చేశారు.ప్రస్తుత సీజన్లో విరాట్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (59 నాటౌట్) చేసిన అతను.. సీఎస్కేపై (31) పర్వాలేదనిపించి, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో (7) విఫలమయ్యాడు. కేకేఆర్ మ్యాచ్‌లో విరాట్ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విరాట్ ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్ ఐపీఎల్లో 247 ఇన్నింగ్స్‌లు ఆడి 8101 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ -
15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని అస్సలు అనుకోలేదు: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను లిఖించుకున్నారు. బ్యాటర్లుగానే కాకుండా కెప్టెన్లగానూ కీలక పాత్ర పోషించిన ఇద్దరు మేటి ఆటగాళ్లు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించగా.. విరాట్ కోహ్లి సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని సాధించాడు. ఈ దిగ్గజ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్-2025లో సీజన్లో బిజీబిజీగా ఉన్నారు. విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే వేదికగా ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని విరాట్ కోహ్లి అభిమానులతో పంచున్నాడు. గత 15 ఏళ్లగా తమ క్రికెట్ జర్నీ ఎలా జరిగిందో కోహ్లి వెల్లడించాడు."ఎక్కువ కాలంగా ఒకరితో పాటు కలిసి ఆడుతున్నప్పుడు సహజంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. మా కెరీర్ ఆరంభంలో ఇద్దరికి ఒకే రకమైన సందేహలు ఉండేవి. ఆ సమయంలో ఆటపై మాకున్న అవగాహనను ఒకరితో మరొకరు పంచుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లాము.కెప్టెన్సీ విషయంలో కూడా ఇద్దరూ కలిసి పనిచేశాము. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని తారతామ్యం లేకుండా మా జర్నీని కొనసాగించాము. మా ఆలోచనలను ఒకరికొకరు పంచుకునేవాళ్లం. మేమిద్దరం ఎక్కువగా ఒకే దానికి కట్టుబడి ఉండేవాళ్లం. ఆ నమ్మకమే జట్టు కోసం మరింత పనిచేయాలనే స్పూర్తినిచ్చింది. మేము ఇద్దరం కలిసిన ఆడిన సమయాన్ని ఆస్వాదించాము. మేము మా కెరీర్లను మరింత సుదీర్ఘంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాము. మేము ఇద్దరం భారత్ తరపున 15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని నా కెరీర్ తొలినాళ్లలో అస్సలు అనుకోలేదు. మా ప్రయాణంలో ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి. రోహిత్‌తో ఇంత కాలం పాటు కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: ప్రియురాలితో ఆసీస్ మహిళా క్రికెటర్ పెళ్ళి.. ఫోటోలు వైరల్KOHLI 🤝 ROHIT BOND ❤️- King talking about the special journey with Hitman over the years in Indian Cricket. pic.twitter.com/iL54z36xIO— Johns. (@CricCrazyJohns) April 6, 2025 -
IPL 2025: విరాట్ కోహ్లికి గాయం
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా (బౌండరీని ఆపే క్రమంలో) విరాట్ చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పితో విరాట్ విలవిలలాడిపోయాడు. విరాట్ ఇలా గాయపడటం చాలా అరుదుగా జరుగుతుంది. నొప్పి భరించలేక విరాట్ నేలకొరగడంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేయడంతో విరాట్ కొద్ది సేపటికే రికవర్ అయినట్లు కనిపించాడు. అయినా విరాట్ అభిమానుల్లో ఆందోళన అలాగే ఉండింది. గాయం తర్వాత విరాట్‌లో ముందున్నంత యాక్టివ్నెస్ కనిపించలేదు. దీంతో అభిమానులు విరాట్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. విరాట్ గాయంపై ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సానుకూల అప్డేట్ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరాట్ గాయం చిన్నదేనని ఫ్లవర్ ప్రకటించాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైని వాంఖడే మైదానంలో జరుగనుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు మాత్రమే చేసి అనామక అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ వికెట్ పడిన తర్వాత ఆర్సీబీ టాపార్డర్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టింది. పడిక్కల్ (4), సాల్ట్ (14), పాటిదార్ (12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోర్ (169/8) చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ అద్బుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గానూ అతడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సాయి కిషోర్ (4-0-22-2), అర్షద్ ఖాన్ (2-0-17-1), ప్రసిద్ద్ కృష్ణ (4-0-26-1), ఇషాంత్ శర్మ (2-0-27-1) కూడా తలో చేయి వేసి ఆర్సీబీని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్ విమర్శలు!
టాపార్డర్ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) అన్నాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోరు సాధించలేకపోయామని పేర్కొన్నాడు. అయితే, ఒక్క మ్యాచ్‌తో తమ బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ చేసి చూడలేమని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో అతడి సారథ్యంలో ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌పై చెపాక్‌లో చరిత్రాత్మక విజయం సాధించింది. పదిహేడేళ్ల విరామం తర్వాత చెన్నైని తమ సొంతగడ్డపైనే ఓడించింది.అయితే, తాజాగా తమ సొంత మైదానంలో మాత్రం ఆర్సీబీ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. గుజరాత్ టైటాన్స్‌తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆర్సీబీ సారథిగా పాటిదార్ ఖాతాలో తొలి పరాజయం నమోదైంది.పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయాంఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లే తర్వాత మా దృక్పథం మారిపోయింది. 200 కాకపోయినా.. కనీసం 190 పరుగుల మార్కు అందుకోవాలని భావించాం. అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.దూకుడుగా ఆడాలన్న మా ఆలోచన సరైందే. కానీ పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. పవర్ ప్లేలో మేము వరుసగా మూడు వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఒక్కటి కాదు.. ఏకంగా మూడు వికెట్లు కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.ఆ ముగ్గురు అద్భుతంఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింతగా అనుకూలించింది. అయినప్పటికీ మా బౌలర్లు మ్యాచ్‌ను 18వ ఓవర్ వరకు తీసుకురావడం అభినందనీయం. తక్కువ స్కోరును కాపాడేందుకు వారు అద్భుతంగా పోరాడారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు.అయితే, ఈ మ్యాచ్‌లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేసిన తీరు మాకు సానుకూలాంశం. మా బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు పడినా.. ఆ ముగ్గురు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడం శుభపరిణామం’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లు విరాట్ కోహ్లి (7), ఫిల్ సాల్ట్ (14)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(4) పూర్తిగా విఫలమయ్యారు. రజత్ పాటిదార్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరాడు.BIG WICKET! 🙌🏻Inform Gen Bold star, #RajatPatidar has to make his way back as Gen Gold star #IshantSharma traps in front! 👊🏻Watch LIVE action ➡ https://t.co/GDqHMberRq#IPLonJiostar 👉🏻 #RCBvGT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! |… pic.twitter.com/xY8lb4sCN1— Star Sports (@StarSportsIndia) April 2, 2025సిరాజ్ తీన్మార్ఇలాంటి దశలో లియామ్ లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32) వేగంగా ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 169 పరుగులు చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల (3/19)తో చెలరేగగా.. సాయి కిషోర్ రెండు, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ చెరో వికెట్ దక్కించున్నారు.ఇక కేవలం రెండు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసిన టైటాన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫలితంగా టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై గుజరాత్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహ్మద్ సిరాజ్ (3/19).చదవండి: ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సారా టెండూల్కర్They came to Bengaluru with a motive 💪And they leave with 2⃣ points 🥳@gujarat_titans complete a comprehensive 8⃣-wicket victory ✌️ Scorecard ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT pic.twitter.com/czVroSNEml— IndianPremierLeague (@IPL) April 2, 2025 -
రిటైర్మెంట్పై విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ ఆడతానని సంకేతాలు ఇచ్చాడు. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలకపై కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత మీ ముందు ఉన్న అతి పెద్ద లక్ష్యమేంటి అన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు కోహ్లి బదులిస్తూ.. "నా నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. తర్వాతి వరల్డ్ కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తా" అని సమాధానం ఇచ్చాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో వరకూ ఆడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి వీడ్కోలు పలికాడు. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ కోహ్లి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కోహ్లి వ్యాఖ్యలను బట్టి అతడు మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే అవకాశముంది. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు.చదవండి: PAK vs NZ: పాక్‌తో రెండో వన్డే.. కివీస్‌కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీQuestion: Seeing In The Present, Any Hints About The Next Big Step? Virat Kohli Said: The Next Big Step? I Don't Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025 -
ఆర్సీబీ ఇక కోహ్లిపై ఆధారపడదు: భారత మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో సీఎస్కేను ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో సీఎస్కే కంచుకోటను ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత చెపాక్‌లో సీఎస్కేను ఆర్సీబీ ఓడించడం ఇదే తొలిసారి.అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 30 బంతులు ఎదుర్కొని కేవలం 31 పరుగులు మాత్రమే చేసి విరాట్ ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్నింగ్స్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు."ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లి ఇబ్బందిపడ్డాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే కోహ్లి అంత కంఫార్ట్‌గా కన్పించలేదు. ఎక్కువగా లెగ్ సైడ్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని మిడిల్ చేయలేకపోయాడు. పతిరానా బౌలింగ్‌లో తన హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. వెంటనే ఓ సిక్స్, ఫోరు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. కానీ వెంటనే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో లాఫ్టెడ్ స్వీప్ ఆడుతూ డీప్ స్క్వేర్ లెగ్‌లో దొరికిపోయాడు. అస్సలు ఇది కోహ్లి ఇన్నింగ్సే కాదు. కోహ్లి ఫెయిల్ అయినప్పటికి మిగితా ప్లేయర్లు అద్బుతంగా రాణించారు.విరాట్ 30 బంతుల్లో 31 పరుగులు చేస్తే.. మిగిలిన ప్లేయర్ చెలరేగడంతో ఆర్సీబీ 196 పరుగులు చేసింది. అంటే కోహ్లి 5 ఓవర్లు ఆడినప్పటికి.. మిగితా ప్లేయర్ల 15 ఓవర్లలో జట్టుకు 166 పరుగులు అందించారు. గతంలో కోహ్లి బాగా ఆడితే మిగితా ఆర్సీబీ బ్యాటర్లు నిరాశపరిచేవారు.దీంతో ప్రతీసారి జట్టు 15 నుంచి 20 పరుగులు వెనకబడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోహ్లి ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మిగితా ప్లేయర్లు ఎటాక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: PAK vs NZ: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్‌రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్‌తో సీరియస్‌గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
పతిరణ షార్ప్ డెలివరీ.. ఇదీ నా పవర్! కోహ్లి రియాక్షన్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. 2008 తర్వాత తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చెపాక్‌లో ఓడించింది. ఏకంగా యాభై పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసి చిదంబరం స్టేడియంలో గెలుపు జెండా ఎగురవేసింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32) ధనాధన్ దంచికొట్టగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం ఆచితూచి ఆడాడు. 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 31 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. అయితే, తాను సిక్స్ కొట్టిన సందర్భంగా.. కోహ్లి ఇచ్చిన రియాక్షన్ వింటేజ్ కింగ్‌ను గుర్తు చేసింది.హెల్మెట్‌కు బలంగా తాకిన బంతిఅసలేం జరిగిందంటే.. సీఎస్కేతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పదకొండో ఓవర్లో చెన్నై పేసర్ మతీశ పతిరణ బంతితో రంగంలోకి దిగాడు. అప్పుడు కోహ్లి క్రీజులో ఉండగా.. పతిరణ పదునైన షార్ట్ డెలివరీ సంధించగా.. కోహ్లి హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఫలితంగా.. ఒకవేళ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవుతుందేమోనని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.క్లాసీ కౌంటర్.. మాస్ రియాక్షన్అయితే, తాను బాగానే ఉన్నానని చెప్పిన కోహ్లి.. పతిరణ సంధించిన రెండో బంతికి భారీ షాట్ బాదాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సంధించిన షార్ట్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా బౌండరీవైపు తరలించి ఆధిపత్యం చాటుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఇదీ నా పవర్’’ అన్నట్లుగా పతిరణ వైపు కింగ్ గుర్రుగా చూసిన విధానం అభిమానులను ఆకర్షించింది. ఇక అదే ఓవర్లో మరుసటి బంతికి కోహ్లి ఫోర్ కూడా బాదడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.1st ball – 😮💨2nd ball – 6️⃣ That’s what it’s like facing the GEN GOLD! ❤Classy counter from #ViratKohli! 🙌🏻Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 & JioHotstar! pic.twitter.com/MzSQTD1zQc— Star Sports (@StarSportsIndia) March 28, 2025 పాటిదార్, పడిక్కల్, డేవిడ్ అదరహోఇక మ్యాచ్ విషయానికొస్తే.. సాల్ట్, కోహ్లిలు ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51) దుమ్ములేపారు. మిగతా వాళ్లలో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.హాజిల్‌వుడ్ తీన్మార్ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్ల ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (41), రవీంద్ర జడేజా(25), మహేంద్ర సింగ్ ధోని(16 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్ల(3/21)తో సత్తా చాటగా.. లియామ్ లివింగ్‌స్టోన్, యశ్ దయాళ్ రెండేసి వికెట్లు కూల్చారు. భువనేశ్వర్కుమార్కు ఒక వికెట్ దక్కింది. ఐపీఎల్-2025: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ👉టాస్: సీఎస్కే.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 196/7 (20)👉సీఎస్కే స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో సీఎస్కేపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
నితీశ్ కు గోల్డెన్ ఛాన్స్? విరాట్, రోహిత్ కు షాక్!
-
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదన్పించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. తద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 34 మ్యాచ్‌ల్లో 1068 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ చెన్నైపై 29 మ్యాచ్‌ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావన్ తర్వాతి స్దానాల్లో వరుసగా రోహిత్ శర్మ(896), డేవిడ్ వార్నర్(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. -
కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదే: CSK హెడ్‌కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి కారణం టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని- విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2008 తర్వాత అక్కడ నో విన్!అయితే, ఇందుకు మరో కారణం.. వేదిక. అవును.. సీఎస్కే సొంత మైదానం చెపాక్ స్టేడియం ఈ హై రేంజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఆరంభ సీజన్లో అంటే 2008లో తొలిసారి గెలిచిన ఆర్సీబీ.. ఇంత వరకు ఒక్కసారి కూడా మళ్లీ గెలుపు రుచిచూడలేదు. ఇప్పటి వరకు చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు ఆడి అన్నింటా ఓటమిపాలైంది.ఇక ముఖాముఖి పోరులోనూ ఇప్పటి వరకు చెన్నైతో జరిగిన 33 మ్యాచ్‌లలో 11 మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి మీదే కేంద్రీకృతమై ఉంది. జట్టు పరిస్థితి ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం సీఎస్కే మీద మెరుగై రికార్డు కలిగి ఉన్నాడు.ఇప్పటి వరకు సీఎస్కే 33 మ్యాచ్‌లలో ఆడిన కోహ్లి 1053 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియా ముందుకు వచ్చిన చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోహ్లితో ప్రమాదం ఉందని భావిస్తున్నారా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికి ఒక్క మ్యాచ్ ఆడింది. దానిని బట్టి ఇప్పుడే అంచనాకు రాలేము.కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదేగతేడాదితో పోలిస్తే ఈసారి సీఎస్కే- ఆర్సీబీ సరికొత్తగా ఉన్నాయి. గత రికార్డుల గురించి ప్రస్తావన అప్రస్తుతం. ఏదేమైనా ఆర్సీబీకి కోహ్లి అత్యంత కీలకమైన ఆటగాడు. వాళ్ల జట్టు కూడా గతం కంటే మరింత పటిష్టంగా మారింది.ఒకవేళ మేము కోహ్లి, పాటిదార్లను కట్టడి చేయగలిగితే.. అది మా విజయానికి దోహం చేస్తుంది’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తాజా ఎడిషన్‌లో ఆర్సీబీ తొలుత డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 36 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఫలితంగా 16.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి ఆర్సీబీ గెలిచింది.ఇక సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి గతంలో కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా.. చెన్నైని ముందుండి నడిపించిన ధోని.. గతేడాది తన బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్‌లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్‌కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్‌లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్‌గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్‌లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్‌లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ఉద్దేశించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక్కడ క్యూరేటర్‌గా ఉన్నంత కాలం పిచ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. పిచ్ రూపకల్పన గురించి సలహాలు ఇచ్చే అధికారం ఫ్రాంఛైజీలకు లేదని పేర్కొన్నాడు.ఏడు వికెట్ల తేడాతో ఓటమికాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చేతులెత్తేసింది.ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. కృనాల్ పాండ్యాకు మూడుఇక ఆర్బీసీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా మూడు, సూయశ్ శర్మ ఒక వికెట్ తీయగా.. పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ రెండు, యశ్ దయాళ్, రసిఖ్ ధార్ సలాం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34) రాణించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్ వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు.రహానే కామెంట్స్ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి పిచ్‌ను కవర్లతో కప్పేసి ఉంచారు. నిజానికి మా జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు అద్భుతంగా ఆడతారు. ఎలాంటి వికెట్ మీదైనా రాణిస్తారు. కానీ ఈరోజు పరిస్థితి అంతగొప్పగా లేదు’’ అని పేర్కొన్నాడు.రహానే వ్యాఖ్యలపై ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తాజాగా స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పిచ్ ఎలా ఉండాలో చెప్పే అధికారం ఫ్రాంఛైజీలకు లేదు.ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నాను. అందుకే మరీ మరీ చెప్తున్నా.. ఈడెన్ గార్డెన్స్ వికెట్లో ఇప్పుడు.. అదే విధంగా భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు.అయినా ఆర్సీబీ స్పిన్నర్లు మొత్తంగా నాలుగు వికెట్లు తీశారు. మరి కేకేఆర్ స్పిన్నర్లు ఏం చేశారు? ఆర్సీబీలో కృనాల్ మూడు, సూయశ్ ఒక వికెట్ పడగొట్టారు’’ అని సుజన్ ముఖర్జీ కేకేఆర్ స్పిన్నర్ల తీరును విమర్శించాడు.ఇక ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు కేకేఆర్ గువాహతికి పయనమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి పోరులో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. అనంతరం వాంఖడేలో మార్చి 31న ముంబైతో తలపడుతుంది. మళ్లీ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్.. ఏప్రిల్ 3న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
సెంచరీ త్యాగం చేసిన శ్రేయస్.. గతంలో సెంచరీ కోసం కోహ్లి పాకులాడిన తీరును గుర్తు చేసుకున్న ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక భూమిక పోషించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్‌కు సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం దాన్ని వద్దనుకున్నాడు.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్ స్వయంగా వచ్చి స్ట్రయిక్ రొటేట్ చేస్తానన్నా శ్రేయస్ వినలేదు. ఆ ఓవర్ అంతా సింగిల్స్‌కు కాకుండా బౌండరీలు, సిక్సర్లకు ప్రయత్నించమని చెప్పాడు.శశాంక్.. తన కెప్టెన్ చెప్పినట్లుగా చేసే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ క్రమంలో విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ ఉదంతాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేశాడు. ఆ సెంచరీ కోసం కోహ్లి పడ్డ తాపత్రయాన్ని ఫ్యాన్స్ శ్రేయస్ ఉదంతంతో పోల్చుకుంటున్నారు. అప్పుడు కోహ్లి తన వ్యక్తిగత మైలురాయి కోసం జట్టుకు అదనంగా వచ్చే పరుగును వద్దన్నాడు. సెంచరీకి ముందు కోహ్లి ఆడిన ఓ షాట్‌కు రెండు పరుగులు వచ్చేవి. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న స్టోయినిస్ కూడా రెండో పరుగుకు వచ్చేందుకు సుముఖత చూపాడు. కానీ కోహ్లి మళ్లీ తనే స్ట్రయిక్ తీసుకునేందుకు రెండో రన్ వద్దన్నాడు. తిరిగి స్ట్రయిక్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లి బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసి, అతని జట్టు ఆర్సీబీ గెలిచినా అభిమానులు కోహ్లిని తప్పుబట్టారు. జట్టుకు వచ్చే అదనపు పరుగు కంటే కోహ్లి తన సెంచరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 58 బంతుల్లో సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు (213/4) చేసింది.ఛేదనలో ఆండ్రీ రస్సెల్ (65), నితీష్ రాణా (85*) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడినా కేకేఆర్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.శ్రేయస్ విషయానికొస్తే.. సెంచరీ గురించి పట్టించుకోకపోవడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి గెలిచింది. శ్రేయస్ కూడా కోహ్లిలా సెంచరీ కోసం పాకులాడి ఉంటే పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసుండేది కాదు. శ్రేయస్ సెంచరీ త్యాగం చేసి పంజాబ్ అంత భారీ స్కోర్ చేసినా గుజరాత్ అద్భుతంగా పోరాడి లక్ష్యానికి కేవలం 11 పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ సెంచరీ వదులుకుని హీరో అయ్యాడు.. ఆ రోజు కోహ్లి సెంచరీ చేసి కూడా విమర్శలపాలయ్యాడు. -
‘ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని విరాట్ సర్ చెప్పారు’
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.ఒకరోజు జైలులోఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం. అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు. PC: BCCI/IPLపశ్చాత్తాపం లేదుఅయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెద్ద మనసుతో క్షమించండిఅయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.శుక్లా తీరుపై విమర్శలు‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉కోల్‌కతా- 174/8 (20)👉ఆర్సీబీ- 177/3 (16.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపుచదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్ -
IPL 2025: దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ట్యాక్స్ ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.ఈసారి రూ.21 కోట్లుఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.కట్టాల్సిన పన్ను ఎంత?2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.పన్ను లెక్కింపురూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్‌ఛార్జ్‌పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి. -
ఐపీఎల్ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్‌తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ
వేసవి క్రీడా సంబురం ఐపీఎస్ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది.అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్‌ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్‌కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. King Khan 🤝 King Kohli When two kings meet, the stage is bound to be set on fire 😍#TATAIPL 2025 opening ceremony graced with Bollywood and Cricket Royalty 🔥#KKRvRCB | @iamsrk | @imVkohli pic.twitter.com/9rQqWhlrmM— IndianPremierLeague (@IPL) March 22, 2025 -
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, ధోనీ.. హెయిర్ కట్ కోసం ఎంత చెల్లిస్తారంటే..
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్‌నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్‌కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్‌కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్‌స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్‌స్టార్స్‌కు హెయిర్‌స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్‌కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదేఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
ఈడెన్‌లో మెరుపులతో మొదలు
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో రహానే, నరైన్ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్‌ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌తో రజత్ పాటీదార్ కెపె్టన్‌గా శుభారంభం చేశాడు. కోల్‌కతా: ఐపీఎల్ తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్కృష్ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రహానే, నరైన్ రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరించి రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. భారీ భాగస్వామ్యం... 10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్ తొలి భాగంలో కోల్‌కతా బ్యాటింగ్ జోరింది. డి కాక్ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్ కలిసి చెలరేగిపోయారు. సలామ్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదిన రహానే...కృనాల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్‌తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు. సుయాశ్ ఓవర్లో సిక్స్‌తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్‌గా మలిచాడు. సలామ్ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్ (12), ఆండ్రీ రసెల్ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది. దూకుడుగా దూసుకుపోయి... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన సాల్ట్ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, కోహ్లి మరో ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. నైట్‌రైడర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్ (10) వికెట్లు తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్‌స్టోన్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలుకోల్కాత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 4; నరైన్ (సి) జితేశ్ (బి) సలామ్ 44; రహానే (సి) సలామ్ (బి) పాండ్యా 56; వెంకటేశ్ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్ (బి) దయాళ్ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్ (బి) సుయాశ్ 4; రమణ్‌దీప్ (నాటౌట్) 6; హర్షిత్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 5; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–22–2, యశ్ దయాళ్ 3–0–25–1, రసిఖ్ సలామ్ 3–0–35–1, కృనాల్ పాండ్యా 4–0–29–3, సుయాశ్ శర్మ 4–0–47–1, లివింగ్‌స్టోన్ 2–0–14–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సన్ (బి) వరుణ్ 56; కోహ్లి (నాటౌట్) 59; పడిక్కల్ (సి) రమణ్‌దీప్ (బి) నరైన్ 10; పటీదార్ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్: వైభవ్ అరోరా 3–0–42–2, స్పెన్సర్ జాన్సన్ 2.2–0–31–0, వరుణ్ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్ రాణా 3–0–32–0, సునీల్ నరైన్ 4–0–27–1. సందడిగా ప్రారంభోత్సవంతొలి మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ కరణ్ ఔజ్లా ఆమెకు జత కలిశాడు. చివర్లో షారుఖ్ చిత్రం ‘పఠాన్’లోని సూపర్ హిట్ పాటకు అతనితో కలిసి విరాట్ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్ వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి చెన్నై X ముంబైవేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2025ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన క్లాస్ చూపించాడు. కేకేఆర్ బౌలర్లను కింగ్ కోహ్లి ఓ ఆట ఆడేసుకున్నాడు.విరాట్ మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తో స్కోర్ బోర్డున పరుగులు పెట్టించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. విరాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 55వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన కోహ్లి..👉విరాట్ కోహ్లికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్ లు ఆడిన మూడో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. రోహిత్ శర్మ (448), దినేశ్ కార్తీక్ (412) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్ తరపున 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి..ఆర్సీబీ తరపున 268 మ్యాచ్ లాడాడు.👉ఐపీఎల్లో కేకేఆర్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. కేకేఆర్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 43.72 సగటుతో 1,093 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 34 ఇన్నింగ్స్‌ల్లో 39.62 సగటుతో 1,070 పరుగులు చేశాడు.👉ఐపీఎల్ చరిత్రలో నాలుగు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లపై 1000కి పైగా రన్స్ చేశాడు. ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
RCB Vs KKR: సాల్ట్, కోహ్లి విధ్వంసం.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయినప్పటికి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), సునీల్ నరైన్(26 బంతుల్లో 44) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.వీరితో పాటు రఘువంశీ(30) పరుగులతో రాణించాడు. డికాక్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్(6), అండ్రీ రస్సెల్(4), రింకూ సింగ్(12) తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. హాజిల్ వుడ్ రెండు, రసీఖ్ ధార్ సలీం, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.కోహ్లి, సాల్ట్ విధ్వంసం..175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పవర్‌ప్లేలో కోహ్లి, సాల్ట్ చాలా దూకుడుగా ఆడారు.వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ఆర్సీబీ స్కోర్ ఆరు ఓవర్లలోనే 80 పరుగులు దాటేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆప్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి బ్రేక్ చేయగలిగే ఐదు భారీ రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపటి నుంచి (మార్చి 22) ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.అత్యధిక బౌండరీలుఈ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సీజన్లో కోహ్లి మరో 64 బౌండరీలు బాదితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఖాతాలో 768 బౌండరీలు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 705 బౌండరీలు ఉన్నాయి.అత్యధిక హాఫ్ సెంచరీలుఈ సీజన్లో విరాట్ మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (హాఫ్ సెంచరీ ప్లస్ సెంచరీలు) చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఖాతాలో 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 63 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉన్నాయి.తొలి భారతీయుడిగా రికార్డుఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12886 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ ప్రపంచవాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562), అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13537), కీరన్ పోలార్డ్ (13537), డేవిడ్ వార్నర్ (12913) టాప్-5లో ఉన్నారు.తొలి ప్లేయర్‌గా..!ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 24 పరుగులు చేస్తే ఆసియా ఖండంలో 11000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.విరాట్ ఆసియాలో ఇప్పటివరకు 10976 పరుగులు స్కోర్ చేశాడు.ఓపెనర్‌గా 5000 పరుగులుఈ ఐపీఎల్లో విరాట్ మరో 97 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల జాబితాలో చేరతాడు.ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
ఈసారి ఆర్సీబీ పదో స్థానంలో నిలుస్తుంది: ఆస్ట్రేలియా దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి తానెప్పుడూ వ్యతిరేకం కాదని పేర్కొన్నాడు. అయితే, ఆర్సీబీలో ఓ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలుస్తుందంటూ వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు.నాయకుడిగా రజత్ పాటిదార్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ శనివారం (మార్చి 22)ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025కి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాతో పాటు ఆర్సీబీకి కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కేకేఆర్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్న ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉండే జట్టు ఏది? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆ జట్టులో అనేక మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.కాబట్టి.. వాస్తవాల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నా. ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. వాళ్లకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆర్సీబీ, కోహ్లి అభిమానులకు గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కూడా చెప్పడం విశేషం.మనస్ఫూర్తిగా క్షమాపణలు‘‘విరాట్ లేదంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. కానీ మీ రిక్రూట్మెంట్ ఏజెంట్లకు మీరైనా చెప్పండి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం’’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ల ప్రదర్శన అంతగొప్పగా ఉండదని.. ఈసారి వారి వల్ల ఆర్సీబీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కాగా మెగా వేలం-2025 సందర్భంగా ఆర్సీబీ.. ఇంగ్లండ్ స్టార్లు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ తదితరులను కొనుగోలు చేసింది. సాల్ట్ ఈసారి కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టుకు రెండుసార్లు ట్రోఫీని దూరం చేసిన జట్టు హైదరాబాద్. 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో నాటి దక్కన్ చార్జర్స్.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్లో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండగే, జేకబ్ బెతెల్, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్చికార, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.చదవండి: 44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్ -
‘అక్షర్‌తో పోలిస్తే అతడికి కాస్త కష్టమే.. కోహ్లి సూపర్స్టార్డమ్తో పోటీ’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ (Rishabh Pant), పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు.అయితే, వీరిలో రజత్ (Rajat Patidar), అక్షర్‌లకు ఐపీఎల్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే, వీరిద్దరిలో రజత్తో పోలిస్తే అక్షర్‌పై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘అక్షర్ పటేల్, రజత్ పాటిదార్లను పోల్చి చూస్తే అక్షర్‌కు కాస్త వెసలుబాటు ఉంటుంది. జట్టు, సారథ్య బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా.. కొంతమంది పాతవాళ్లు కూడా ఉండటం అక్షర్‌కు సానుకూలాంశం.రజత్‌కు కూడా జట్టులో కొంతమంది ఆటగాళ్లతో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ.. అతడు మిగతా విషయాలతో పాటు.. విరాట్ కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీ పడాల్సి ఉంటుంది. అతడిపై కోహ్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్సీ నైపుణ్యాలు మెరగుపరచుకునే క్రమంలో ఒక్కోసారి కోహ్లిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.కోహ్లి నీడలో కాకుండా.. అయితే, నాకు తెలిసి రజత్‌కు ఆర్సీబీ మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటుందనిపిస్తోంది. కోహ్లి నీడలో కాకుండా.. రజత్ తన మార్కు చూపిస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈసారి ఆర్సీబీ, కోల్‌కతా, ఢిల్లీ జట్లు తమ కొత్త కెప్టెన్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలని ఆతురతగా ఉంది.ముఖ్యంగా రజత్పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. కాబట్టి రజత్ ఆ రాతను మారుస్తాడో లేదో చూడాలి. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు విజయాలు అందించిన ఘనత అతడికి ఉంది. అయితే, ఐపీఎల్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయడం అంత సులువేమీ కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాళ్, జోష్ హాజల్‌వుడ్, ఫిల్ సాల్ట్,జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ ధార్, కృనాల్ పాండ్యా , టిమ్ డేవిజ్, జాకబ్ బెథెల్, సుయాశ్ శర్మ, దేవ్‌దత్ పడిక్కల్, తుషార, రొమరియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మనోజ్, మోహిత్ రాఠి, అభినందన్, స్వస్తిక్ చికార.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా -
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ -
IPL 2025: అంపైర్‌గా కోహ్లి సహచరుడు
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చిన్ననాటి స్నేహితుడు తన్మయ్ శ్రీవాత్సవ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (శ్రీవాత్సవ సొంత రాష్ట్రం) అధికారికంగా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వడిచి వెళ్ళడు. మైదానంలో అతని పాత్ర మాత్రమే మారుతుంది. కొత్త ప్రయాణంలో శ్రీవాస్తవకు శుభాకాంక్షలు అంటూ ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.35 ఏళ్ల తన్మయ్ శ్రీవాత్సవ్ కోహ్లి కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్‌కప్ (2008) గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాత్సవ్ టాప్ రన్ స్కోరర్‌గా (ఇరు జట్ల తరఫున) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీవాత్సవ్ 46 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఛాంపియన్‌గా నిలిచింది. ఐదేళ్ల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీవత్సవ.. అప్పటి నుంచి దేశవాలీ క్రికెట్లో అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీవాత్సవ 2008-2012 వరకు ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్లో ఆటగాడిగా శ్రీవాత్సవ కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. ఐదేళ్లలో అతను 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పరుగులే చేశాడు. శ్రీవాత్సవ దేశవాలీ కెరీర్ మాత్రం పర్వాలేదన్నట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్ తరఫున అతను 90 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్-ఏ, 34 టీ20 ఆడి 7000 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 81 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. శ్రీవాత్సవతో పాటు 2008 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో మరో సభ్యుడు కూడా బీసీసీఐ అంపైర్‌గా ఉన్నాడు. ఆ జట్టులోని అజితేశ్ అర్గాల్ ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేస్తున్నాడు. ఇద్దరు సహచరులు అంపైర్లుగా మారినా కోహ్లి మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. కోహ్లి కెరీర్ ప్రస్తుతం ఉన్నత దశలో ఉంది. సహచరుడు అంపైరింగ్ చేస్తుండగా కోహ్లి ఆటగాడిగా ఆడటం వింత ఆసక్తికరం.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. -
‘అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ ఎడిషన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్ స్టార్ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ ఆడిన షాదాబ్ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్‌తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.నమ్మకం, సహోదర భావం లేదుయాజమాన్యం, డ్రెసింగ్‌రూమ్ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.గెలిచేది ఆ జట్టేఇక ఈసారి ప్లే ఆఫ్స్ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్ కూడా టాప్-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యం లేదు.అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.ఆరెంజ్ క్యాప్ అతడికేఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.ఇక పర్పుల్ క్యాప్‌ను పేసర్ జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్), యజువేంద్ర చహల్ (పంజాబ్ కింగ్స్)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.చదవండి: IPL: అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!.. హ్యాట్సాఫ్ -
IPL 2025: రజత్‌ను ఆశీర్వదించండి.. ఆర్సీబీ అభిమానులకు విరాట్ పిలుపు
యువ ఆటగాడు రజత్ పాటీదార్ సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. రజత్‌ను ఆశీర్వదించాలని ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా పిలుపునిచ్చాడు. గత సీజన్లో డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఈ సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలను రజత్ పాటీదార్‌కు అందించింది. విరాట్ మాటల్లో..‘రజత్ పెద్ద బాధ్యతలు అందుకున్నాడు. సుదీర్ఘ కాలం అతడు సారథిగా కొనసాగుతాడు. జట్టును నడిపంచేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని విరాట్ అన్నాడు. ఇక లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి... ఇదంతా ఆర్సీబీ అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని అన్నాడు. ‘18 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నా. ఇదో అద్భుతమైన అనుభూతి. ప్రతి సీజన్‌కు ముందు అదే ఉత్సాహం నన్ను మరింత ఉత్తేజపరుస్తోంది. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడనున్నాడు.గౌరవం.. ఆనందం.. సక్రమంగా నిర్వర్తిస్తా: పాటీదార్బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రజత్ పాటీదార్ అన్నాడు. ‘విరాట్, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ల ఆటను చూస్తూనే పెరిగా. చిన్నప్పటి నుంచే ఆర్సీబీ అంటే ప్రత్యేక అభిమానం. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అని ఆర్సీబీ జట్టు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాటీదార్ వ్యాఖ్యానించాడు. -
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
Virushka: తల్లీ, తండ్రి, తోబుట్టువు.. అందరికీ ఒకేలా కనిపించవు!
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల అనుమతిని పరిమితం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయంపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులు వెంట ఉంటే ఆటగాళ్లు మానసికంగా మరింత బలంగా ఉంటారని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందరికీ ఒకేలా కనిపించవు!‘‘నువ్వెవరో తెలిసిన ప్రతి వ్యక్తి మనసులో నీ పట్ల భిన్న భావాలు ఉన్నాయి. నువ్వు ఎవరని నువ్వు అనుకుంటావో అదే నువ్వు. ఆ ‘నువ్వు’ ఎవరన్నది నీకూ పూర్తిగా తెలియదు. నిన్ను కలిసిన వ్యక్తులు, నీ బంధువులు.. లేదంటే వీధిలో వెళ్తున్నపుడు నీతో చూపులు కలిపిన వాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరి మదిలో నీ గురించిన ఆలోచన వేరుగా ఉంటుంది.తల్లి, తండ్రి, తోబుట్టువులకు నువ్వు ఒకే తీరుగా కనిపించవు. సహచరులకు, ఇరుగుపొరుగు వారికి, నీ స్నేహితులకూ వారి కోణంలోనే కనిపిస్తావు. ఎదుటివారి ఆలోచనల్లో నీకు వెయ్యి రూపాలు ఉండవచ్చు. కానీ.. ప్రతి వర్షన్లోనూ నువ్వు ప్రత్యేకమే. నువ్వు నువ్వే.. వేరొకరివి అసలే కావు’’ అని అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త.. ప్రత్యేకమైన వాడని అనుష్క చెప్పాలనుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా బీసీసీఐ నిబంధనను ఆమె కూడా విమర్శించిందని అభిప్రాయపడుతున్నారు.కాగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో టీమిండియా పరాజయం పాలవడంతో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 45 రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతించనుంది. దానికి వెలకట్టలేంనలభై ఐదు రోజులకు మించిన విదేశీ పర్యటనల్లో రెండు వారాల పాటు సన్నిహితులకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ... ‘ఒక ఆటగాడి వెనక కుంటుబ సభ్యుల ప్రాతను అందరికీ వివరించడం కష్టం. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారిచ్చే మద్దతును వెలకట్టలేం. దాని మీద ప్రజలకు అవగాహన లేదని అనుకోలేం.కుటుంబ సభ్యులు పక్కన ఉంటే మైదానంలో ఆవరించిన నిరాశ, నిస్పృహ నుంచి ప్లేయర్లు త్వరగా బయటపడగలరు. అంతేకానీ మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా వెళ్లి గదిలో కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. నిరాశ కలిగించిందిసన్నిహితుల సమక్షంలో బాధ్యత మరింత పెరుగుతుంది. ఆట అయిపోయిన తర్వాత కుటుంబంతో గడపడంలో తప్పేముంది. నా వరకైతే కుటుంబ సభ్యులతో ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా. అలాంటి అవకాశాలను వదిలిపెట్టను.మైదానంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులు దీనిపై నియంత్రణ తేవడం నిరాశ కలిగించింది. ఏ ఆటగాడిని అడిగినా కుటుంబ సభ్యులు వెంట ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు’ అని వివరించాడు. కాగా ఐపీఎల్‌లోనూ డ్రెసింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి మాత్రం తాను అనుష్కతో ప్రేమలో ఉన్ననాటి నుంచి.. ఇప్పుడు తాము ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన తర్వాత కూడా.. భార్యను ఎల్లవేళలా తన వెంటే తీసుకువెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఆమె ఎదురుగా ఉంటే.. తాను సానుకూల దృక్పథంతో ముందుకు సాగగలనని పలు సందర్భాల్లో కోహ్లి వెల్లడించాడు. అయితే, బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ వల్ల కోహ్లి బాగా ఇబ్బంది పడుతున్నట్లు అతడి మాటల ద్వారా వెల్లడైంది. అనుష్క శర్మ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్‌గా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025 -
IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్‌ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్‌వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకముంచింది.ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్‌స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్‌లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్. -
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
పరుగుల వీరులు... వికెట్లు ధీరులు... మెరుపు ఫీల్డర్లు... అశేష అభిమానులు... విశేష ఆదరణ... ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. లీగ్ ఆరంభం (2008) నుంచి ప్రతిసారీ ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం... రిక్తహస్తాలతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... తన జెర్సీ నంబర్ 18వ సారైనా ట్రోఫీని అందిస్తాడా లేదో వేచి చూడాలి! – సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక జనాదరణ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడి ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేకపోయిన ఆర్సీబీ ఈ సారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమంగా మూడుసార్లు (2009, 2011, 2016లో) రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ... తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18వ సీజన్లో ట్రోఫీ ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ స్టార్లపై ఎక్కువ నమ్మకముంచే ఫ్రాంచైజీ ఈసారి దేశీ ఆటగాడు రజత్ పాటీదార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2021 నుంచి ఆర్సీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్ జట్టు రాత మారుస్తాడని ఆశిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంతోనే ఈసారి విభిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు ఆర్సీబీ సంకేతాలు పంపింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... ఆర్సీబీ 22 మంది ప్లేయర్లకే పరిమితమైంది. విరాట్ కోహ్లికి రూ. 21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... రజత్ పాటీదార్ (రూ. 11 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్, సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లను వదిలేసుకున్న ఆర్సీబీ... స్వప్నిల్ సింగ్‌ను రూ. 50 లక్షలతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి తీసుకుంది. కేఎల్ రాహుల్, చహల్, రిషబ్ పంత్ వంటి వారిని వేలంలో చేజిక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. అటు అనుభవం... ఇటు యువరక్తంతో కూడిన కొత్త బృందాన్ని కొనుగోలు చేసుకుంది. గత సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు... ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. అతడే బలం... బలహీనత ఆర్సీబీ ప్రయాణాన్ని గమనిస్తే... ఆ జట్టుకు అతిపెద్ద బలం విరాట్ కోహ్లినే. అదే సమయంలో బలహీనత కూడా అతడే. విరాట్ రాణించిన మ్యాచ్‌ల్లో అలవోకగా విజయాలు సాధించే ఆర్సీబీ... అతడు విఫలమైన సమయంలో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేక వెనుకబడి పోతుంది. 17 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లాడి 8004 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 8 శతకాలు, 55 అర్ధశతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఐదు సీజన్లలో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి... చాంపియన్స్ ట్రోఫీ తాజా ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఫిల్ సాల్ట్... ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్... హార్డ్ హిట్టర్ లివింగ్‌స్టోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 11 కోట్లు పెట్టి తీసుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై కూడా టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. ఆండీ ఫ్లవర్ ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా... దినేశ్ కార్తీక్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.బౌలర్లపైనే భారం... బ్యాటింగ్ విషయంలో బలంగా ఉన్న బెంగళూరు... ఈసారి మెరుగైన బౌలింగ్ దళంతో బరిలోకి దిగనుంది. ఆస్థాన బౌలర్ సిరాజ్‌ను వదిలేసుకున్న ఆర్సీబీ... తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆ్రస్టేలియా స్పీడ్‌స్టర్ జోష్ హాజల్‌వుడ్, ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్, గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన యశ్ దయాల్, దక్షిణాఫ్రికా పేసర్ ఇన్‌గిడి పేస్ భారాన్ని మోయనున్నారు. స్వప్నిల్ సింగ్, జాకబ్ బెథెల్, సుయశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న నాణ్యమైన స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఇతర స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ బౌలింగ్ బృందం ప్రదర్శనపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్సీబీ జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్ బెథెల్, హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి, యశ్ దయాల్. అంచనా ఇప్పటి వరకు ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన చరిత్ర ఉన్న ఆర్సీబీ... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. -
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే బాగుంటుంది!
బెంగళూరు: ఒక క్రికెటర్‌గా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోగలిగితే అది ఎంతో ప్రత్యేకం అవుతుందని, దానికి మరేదీ సాటి రాదని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1900 తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా కీలక పాత్ర పోషించిందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే ఎంతో బాగుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగమయ్యే స్థాయికి తెచి్చంది. ఇది యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం. ప్రతి అథ్లెట్ దాని కోసమే కష్టపడతాడు. పురుషుల, మహిళల విభాగాల్లో మన జట్టు పతకానికి చేరువవుతుందని అనుకుంటున్నా’ అని విరాట్ అన్నాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన కోహ్లి... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు కెరీర్ కొనసాగిస్తాడా అనేది చూడాలి. 2028కి విరాట్ 40వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ‘ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఒకవేళ ఒలింపిక్ పసిడి పతకం కోసం మ్యాచ్ ఆడుతుంటే... నేను గుట్టు చప్పుడు కాకుండా జట్టులో చేరి పతకం సాధించి ఇంటికి వస్తా’ అని విరాట్ చమత్కరించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివిధ అంశాలపై విరాట్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... » మహిళల ప్రీమియర్ లీగ్ వల్ల దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. » ఆరేడేళ్ల క్రితం మహిళల ఆటకు ఇంత ప్రాధాన్యత దక్కలేదు. డబ్ల్యూపీఎల్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వారి గురించి చర్చ జరుగుతోంది. రోజు రోజుకు ఆటలో ప్రమాణాలు పెరుగుతున్నాయి. » వేరే రంగాల్లో విజయం సాధించినప్పుడు రాని పేరు, ప్రఖ్యాతలు క్రీడల్లో సులువుగా వస్తాయి. ఎందుకంటే మైదానంలో ఆడేది తామే అని ప్రతి ఒక్క అభిమాని ఊహించుకుంటాడు కాబట్టే ఇది సాధ్యం. అందుకే క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది. » ఆటను ఆస్వాదించడం నాకు ఇష్టం... అదే చేస్తున్నా. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం లేదు. మైదానంలో వంద శాతం కష్టపడటం అలవాటు. దాన్ని ఇక మీద కూడా కొనసాగిస్తా. భావోద్వేగాలు ఆటలో భాగం. వాటిని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించను. » ఆటలో పోటీ సహజం. అప్పుడే మన సహజ నైపుణ్యం బయటకు వస్తుంది. ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకేదో గుర్తింపు పొందాలనుకోవడం లేదు. ఆటపై ప్రేమ ఉన్నంతకాలం మైదానంలో కొనసాగుతా. ఈ అంశంలో రాహుల్ ద్రవిడ్ విలువైన సూచనలిచ్చారు. ‘‘నీతో నువ్వు తరచూ మాట్లాడుతూ ఉండు ఎప్పుడు ఆపేయాలో నీకే తెలుస్తుంది’’ అన్నారు. దాన్నే పాటిస్తున్నా. » జీవితంలో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా. కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే సుదీర్ఘ అనుభవం సాధించిన తర్వాత అన్నీ విషయాలను అనుకున్న విధంగా పూర్తి చేయడం కష్టం. వయసు పెరుగుతున్న భావన కలగడం సహజం. ఫిట్‌గా ఉండేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. » అప్పుడప్పుడు అసంతృప్తి ఆవరిస్తుంది. నా వరకు ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా.. అయితే దాన్ని ఒత్తిడిగా భావించలేదు. అందులో నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించి వాటిపై కసరత్తు చేసి ఫలితాలు సాధించా. 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించాల్సిందే. మరో అవకాశం వచ్చినప్పుడు దాన్ని మరింపిచే ప్రదర్శన చేయాలి. 2018లో నేను అదే చేశా. » క్రికెటేతర విషయాల గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోను. డ్రెస్సింగ్ రూమ్ బయటి వ్యాఖ్యలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. ఒక్కసారి వాటిని పట్టించుకోవడం ప్రారంభిస్తే ఇక ఒత్తిడి కొండలా పెరుగుతుంది. -
IPL 2025: కోహ్లీ ఈసారైనా టైటిల్ సాధించేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో గతేడాది టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి. ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలుఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది. గత సీజన్లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్‌లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్లో ఓపెనర్‌గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్‌ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్‌ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్‌తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు. రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ. -
న్యూ లుక్‌లో విరాట్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్‌లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్‌లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్‌తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్‌పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను సైతం తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో బాబర్ ఆజంపై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బాబర్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై కూడా అజ్మల్ ఈ సందర్భంగా మండిపడ్డాడు.అంతటి సచిన్‌కే తప్పలేదుఅంతటి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అయినా ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం సాధ్యం కాదని.. అలాంటపుడు బాబర్‌ను పదే పదే ఎందుకు విమిర్శిస్తారని అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన బాబర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించడం మానుకోవాలని అజ్మల్ హితవు పలికాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అంతేకాదు చరిత్రలో లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ చేతిలో వన్డే పరాజయం చవిచూసింది. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు పీసీబీ మరోసారి అతడికి పగ్గాలు అప్పగించింది.ఇక ఈ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. పసికూన అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్‌పై వేటు వేసిన పీసీబీ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో వన్డేల్లో పాక్ చిరస్మరణీయ విజయాలు సాధించింది.ఆ ఇద్దరిపై వేటుఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే జోరులో సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. అయితే, అంతకంటే ముందు సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌లతో త్రైపాక్షక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఐసీసీ టోర్నీలోనూ చేదు అనుభవం చవిచూసింది.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ఒక్క విజయం లేకుండానే ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. తొలుత న్యూజిలాండ్ చేతిలో.. అనంతరం టీమిండియా చేతిలో పరాజయం పాలైన పాక్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది. ఇక ఈ టోర్నీలో బాబర్‌తో పాటు.. రిజ్వాన్ కూడా తేలిపోయాడు.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పీసీబీ ఈ ఇద్దరికి చోటు ఇవ్వలేదు. కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తప్పించడంతో పాటు బాబర్‌పై కూడా వేటు వేసింది. ఈ విషయంపై సయీద్ అజ్మల్ స్పందిస్తూ పీసీబీ తీరును ఎండగట్టాడు. విరాట్ లాంటి దిగ్గజాలు కూడా అంతే‘‘బాబర్, రిజ్వాన్ గొప్ప ఆటగాళ్లు. అయితే, మిగతా వాళ్లలా వాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయలేరు. అయినా సరే జట్టుకు అవసరమైనప్పుడు కచ్చితంగా రాణిస్తారు. కానీ మా వాళ్ల(మాజీ క్రికెటర్లను ఉద్దేశించి) ఆలోచనా విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.అంతర్జాతీయ క్రికెట్ అంటే దూకుడుగా ఆడాలనే ఫిక్సైపోయినట్టున్నారు. మ్యాచ్ విన్నర్లకు దూకుడుతో పని ఏముంది? అటాకింగ్ చేసే కంటే ముందు విరాట్ లాంటి దిగ్గజాలు కూడా తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభిస్తారు. అది వాళ్ల శైలి. కానీ బాబర్- రిజ్వాన్‌లను మీరెందుకు తప్పుబడుతున్నారు?వాళ్లను టీ20 జట్టు నుంచి తొలగించడం ముమ్మాటికీ తప్పే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. బాబర్‌పై వేటు వేయకుండా.. అతడితో చర్చించి ఆటను మార్చుకునే విధంగా.. తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపి ఉండాల్సింది.మీరు కాస్త నోళ్లు మూయండిప్రతి ఒక్క క్రికెటర్ జీవితంలో ఒకానొక సమయంలో గడ్డు దశ ఎదుర్కోక తప్పదు. కెరీర్ మొత్తం ఏ ఆటగాడూ అద్భుతంగా ఆడలేడు. అంతెందుకు.. సచిన్ టెండుల్కర్ కూడా ప్రతి మ్యాచ్‌లో శతకం బాదలేడు కదా!పాకిస్తాన్ క్రికెట్‌కు ఉన్న ఏకైక స్టార్ బాబర్. మీరు గనుక అతడిని కూడా డీగ్రేడ్ చేస్తే.. ఎవరి పేరు మీద పాక్ క్రికెట్‌ను నడుపుతారు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మన మాజీ క్రికెటర్లు కాస్త నోళ్లు మూసుకుని ఉంటే బాగుంటుంది’’ అని సయీద్ అజ్మల్ ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: ఎవరూ ఊహించని నిర్ణయం.. అతడి రాకతో కివీస్ కుదేలు: పాక్ దిగ్గజం -
రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.లక్నో కెప్టెన్‌గా..ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం పంత్‌కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్‌కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్లో లక్నో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!? -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్.. పాంటింగ్ సరసన చోటు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో టీమిండియా ఖాతాలో ఏడో ఐసీసీ ట్రోఫీ చేరింది. భారత్ తొలిసారి 1983లో ఐసీసీ ట్రోఫీ (వన్డే వరల్డ్‌కప్) గెలిచింది. ఆతర్వాత 2002 (ఛాంపియన్స్ ట్రోఫీ, శ్రీలంకతో సంయుక్తంగా), 2007 (టీ20 వరల్డ్‌కప్), 2011 (వన్డే వరల్డ్‌కప్), 2013 (ఛాంపియన్స్ ట్రోఫీ), 2024 (టీ20 వరల్డ్‌కప్), 2025లో (ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్ల జాబితాలో భారత్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా అత్యధికంగా 10 ఐసీసీ ట్రోఫీలు (1987, 1999, 2003, 2007, 2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, భారత్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కుతుంది. విండీస్ మొత్తంగా ఐదు ఐసీసీ టైటిళ్లు (1975, 1979 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2012, 2016 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.విండీస్ తర్వాత పాకిస్తాన్ (1992 వన్డే వరల్డ్‌కప్.. 2009 టీ20 వరల్డ్‌కప్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ), శ్రీలంక (1996 వన్డే వరల్డ్‌కప్.. 2014 టీ20 వరల్డ్‌కప్.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ (భారత్‌తో కలిసి సంయుక్తంగా), ఇంగ్లండ్ (2019 వన్డే వరల్డ్‌కప్.. 2010, 2022 టీ20 వరల్డ్‌కప్‌లు) తలో మూడు ఐసీసీ టైటిళ్లు సాధించాయి. న్యూజిలాండ్ రెండు (2000 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2019-2021 డబ్ల్యూటీసీ), సౌతాఫ్రికా ఓ ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది.ఐసీసీ టైటిళ్లు గెలిచిన జట్ల విషయం ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దక్కుతుంది. ఈ ఇద్దరు తలో ఐదు ఐసీసీ టైటిళ్లు (అండర్-19 ఈవెంట్లు కలుపుకొని) సాధించారు. పాంటింగ్ 1999, 2003,2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలువగా.. విరాట్ 2008 అండర్ 19 వరల్డ్‌కప్.. 2011 వన్డే వరల్డ్‌కప్.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు.. 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిళ్లు గెలిచాడు.పాంటింగ్, విరాట్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత రోహిత్ శర్మ (2007, 2024 టీ20 వరల్డ్‌కప్‌లు.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), గ్లెన్ మెక్‌గ్రాత్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), షేన్ వాట్సన్ (2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు), డేవిడ్ వార్నర్ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), మిచెల్ స్టార్క్ (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), స్టీవ్ స్మిత్‌కు (2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లు.. 2021 టీ20 వరల్డ్‌కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) దక్కుతుంది. వీరంతా తలో నాలుగు ఐసీసీ టైటిళ్లు గెలిచారు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను, ఓవరాల్‌గా ఏడో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
CT 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.పాకిస్తాన్‌కు మొండిచేయిమరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు. అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.నాలుగు వికెట్ల తేడాతో ఓడించికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్‌లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించిన దుబాయ్ పిచ్‌పై ఆల్‌రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్‌తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
CT 2025 Final: షమీ తల్లి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లి
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా విజయానంతరం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలతో పాటు పలు దృష్యాలు సోషల్‌మీడియాను విపరీతంగా ఆకర్శించాయి. ఇందులో ఒకటి విరాట్ కోహ్లి.. సహచరుడు మహ్మద్ షమీ తల్లికి పాదాభివందనం చేయడం. విజయోత్సవ సంబురాల్లో భాగంగా టీమిండియా ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియంలో కలియతిరుగుతుండగా.. కోహ్లికి షమీ తల్లి తారసపడింది. Virat Kohli Touched Mohammad Shami’s Mother Feet And Clicked Pictures With Shami’s Family. pic.twitter.com/D08GRCfurN— khalid Chougle (@ChougleKhalid) March 10, 2025కోహ్లి వెంటనే షమీ తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం షమీ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. విరాట్ షమీ తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇది చూసి జనాలు విరాట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌కు పెద్దలంటే ఎంత గౌరవమోనని చర్చించుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం దుబాయ్ స్టేడియంలో ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ చాలా కనిపించాయి. శుభ్‌మన్ గిల్ తండ్రితో రిషబ్ పంత్ చిందులేయడం.. శ్రేయస్ తల్లి అతన్ని ముద్దాడటం.. ఇలా చాలా ఆసక్తికర ఫ్యామిలీ మూమెంట్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికైంది.Shubman Gill's father doing Bhangra with Rishabh Pant. 😂❤️pic.twitter.com/SdUu58044d— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025ఇదిలా ఉంటే, నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఆటగాళ్లలో విరాట్, రోహిత్, జడేజా మినహా దాదాపుగా అందరికీ ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. చాలాకాలంగా టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నా షమీకి సైతం ఐదే తొలి ఐసీసీ టైటిల్. 2013 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షమీ.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తరఫున ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేసినా దీనికి ముందు ఒక్కసారి కూడా టైటిల్ విన్నింగ్ జట్టులో భాగం కాలేకపోయాడు. గతేడాది భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పటికీ.. ఆ ఐసీసీ టోర్నీకి షమీ దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన షమీ.. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025తోనే (ఐసీసీ టోర్నీలు) రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 25.88 సగటున, 5.68 ఎకానమీ రేటుతో 9 వికెట్లు తీసి భారత్ అజేయ యాత్రతో తనవంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో షమీ అత్యుత్తమ ప్రదర్శన బంగ్లాదేశ్‌పై వచ్చింది. ఆ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై కూడా షమీ సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఐసీసీ ఈవెంట్లలో తిరుగులేని కోహ్లి, రోహిత్.. ఇద్దరూ ఇద్దరే..!
ఐసీసీ వైట్ బాల్ టోర్నీలు (పరిమిత ఓవర్ల టోర్నీలు) అనగానే టీమిండియా కృష్ణార్జునులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు పూనకం వస్తుంది. ఈ ఇద్దరు మామూలు మ్యాచ్‌ల్లో ఎలా ఆడినా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చెలరేగిపోతారు. ఇందుకు తాజా నిదర్శనం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ టోర్నీలో విరాట్ ఆది నుంచే చెలరేగగా.. రోహిత్ కీలకమైన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.ఈ ఇద్దరు గడిచిన 18 ఏళ్లలో భారత్‌కు ఐసీసీ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. రోహిత్ ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ.. కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగం కాగా.. విరాట్ ఆటగాడిగా 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో భాగమయ్యాడు.ఐసీసీ ఈవెంట్లలో కోహ్లి, రోహిత్‌ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు వీరు సొంతం చేసుకున్నారు. కోహ్లి, రోహిత్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఇప్పటివరకు (ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్) తలో 90 మ్యాచ్‌లు ఆడి 70కి పైగా విజయాల్లో (కోహ్లి 72, రోహిత్ 70) భాగమయ్యారు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో వీరు సాధించినన్ని విజయాలు సాధించలేదు. కోహ్లి, రోహిత్ తర్వాత ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఘనత మహేళ జయవర్దనేకు దక్కుతుంది. జయవర్దనే 93 మ్యాచ్‌ల్లో 57 విజయాలు సాధించాడు.ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లి- 72 (90 మ్యాచ్‌లు)రోహిత్ శర్మ- 70 (90)మహేళ జయవర్దనే- 57 (93)కుమార సంగక్కర- 56 (90)రవీంద్ర జడేజా- 52 (66)రికీ పాంటింగ్- 52 (70)ఎంఎస్ ధోని- 52 (78)ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విషయానికొస్తే.. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడగా.. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న అనుష్క శర్మ.. ప్రత్యేక అభినందనలు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నాటి చేదు అనుభవాన్ని మరిపిస్తూ టీమిండియా అద్భుత విజయం సాధించింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవాన్ని మరిపించేలా.. దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచి అభిమానులకు కానుక అందించింది. ఈ మెగా వన్డే టోర్నమెంట్ ఆద్యంతం అజేయంగా నిలిచి పరిపూర్ణ విజయంతో ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్(India vs New Zealand) చేతిలో ఫైనల్లో ఓడిపోయిన భారత జట్టు తాజాగా అదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొంది 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై.. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్-2023లో తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ఫైనల్ చేర్చిన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.ఆత్మీయంగా హత్తుకుని.. శుభాకాంక్షలుఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సహచరులు రోహిత్ శర్మతో తమ ఆనందాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్ బ్యాటర్, మాజీ సారథి విరాట్ కోహ్లి అయితే సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆ సమయంలో రోహిత్ కుటుంబంతో పాటు కోహ్లి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది.అయితే, విజయానంతరం రోహిత్ తన కుమార్తె సమైరాను ముద్దాడటంతో పాటు భార్య రితికాను ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకున్నాడు. ఆ సమయంలో రితికా పక్కనే ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మ రోహిత్‌ను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాదు ఆత్మీయంగా అతడిని హత్తుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవగానే అనుష్క- కోహ్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక టీమిండియాకు మద్దతుగా అనుష్క పలుమార్లు స్టేడియంలో సందడి చేయడంతో పాటు భర్త విరాట్ అద్భుతంగా ఆడిన వేళ గాల్లో ముద్దులు ఇస్తూ అతడిపై ప్రేమను చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu— Filmfare (@filmfare) March 9, 2025 విరాట్ కూడా తాను కీలక మైలురాయిని అందుకున్న ప్రతివేళా సతీమణికి దానిని అంకితమిస్తాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమైన వేళ అనుష్క వల్లే తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేవాడినని.. ఆమె తనకు నైతికంగా ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని గతంలో వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ బారత్ వర్సెస్ న్యూజిలాండ్ వేదిక: దుబాయ్, మార్చి 9టాస్: న్యూజిలాండ్ .. మొదట బ్యాటింగ్కివీస్ స్కోరు: 251/7 (50)టీమిండియా స్కోరు: 254/6 (49)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76) Anushka Sharma specially called Rohit Sharma and gave him a tight hug.🔥They are like a family bro.#INDvNZ pic.twitter.com/6UgeFchHVT— 𝐕𝐢𝐬𝐡𝐮 (@Ro_45stan) March 9, 2025 -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
IND Vs NZ: చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ (ఫొటోలు)
-
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్