రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ | Virat Kohli, Rohit Sharma To Retain Grade A Plus BCCI Contracts Despite T20 And Test Retirement | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

May 14 2025 3:11 PM | Updated on May 14 2025 4:08 PM

Virat Kohli, Rohit Sharma To Retain Grade A Plus BCCI Contracts Despite T20 And Test Retirement

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. టీ20, టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా ఈ ఇద్దరి గ్రేడ్‌ ఏ ప్లస్‌ కాంట్రాక్ట్‌ కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా రోహిత్‌, కోహ్లి ఇంకా భారత క్రికెట్‌లో భాగమేనని, గ్రేడ్‌ ఏ ప్లస్‌లో సకల సదుపాయాలకు వారు అర్హులేనని సైకియా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ చెప్పారు. 

నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో కొనసాగే భారత క్రికెటర్లకే బీసీసీఐ ఏ ప్లస్‌ కాంట్రాక్ట్‌ వర్తిస్తుంది. భారత క్రికెట్‌కు రోహిత్‌, విరాట్‌ చేసిన సేవల కారణంగా వారికి ఏ ప్లస్‌ కాంట్రాక్ట్‌ కొనసాగనుంది.

​కాగా, బీసీసీఐ గత నెలలోనే 2024-25 సంవత్సరానికి గానూ తమ వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను (34 మంది) ప్రకటించింది. ఈ జాబితాలో భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా తమ ఏ ప్లస్‌ కేటగిరీని రీటైన్‌ చేసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్‌ కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కాంట్రాక్ట్‌ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

శ్రేయస్‌ బి కేటగిరీలో, ఇషాన్‌ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ ‍కుమార్‌ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌, యువ పేసర్‌ హర్షిత్‌ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందారు.

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్‌ కింద విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.

గ్రేడ్‌-ఏలో సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, షమీ, రిషబ్‌ పంత్‌ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.

గ్రేడ్‌-బిలో సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.

గ్రేడ్‌-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.

ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్‌ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్

ఈ ఏడాది కాంట్రాక్ట్‌ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్‌ భరత్, అవేష్ ఖాన్

ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్‌ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)

రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్‌ అశ్విన్ (కేటగిరి ఏ నుంచి ఔట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement