నేను ఎదుర్కొన్న క‌ఠిన బౌల‌ర్లు వీరే: విరాట్ కోహ్లి | Virat Kohli Picks Toughest Bowler He Has Faced In Test Cricket | Sakshi
Sakshi News home page

నేను ఎదుర్కొన్న క‌ఠిన బౌల‌ర్లు వీరే: విరాట్ కోహ్లి

May 3 2025 5:45 PM | Updated on May 3 2025 6:29 PM

Virat Kohli Picks Toughest Bowler He Has Faced In Test Cricket

PC: BCCI/IPL.com

విరాట్ కోహ్లి.. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. మూడు ఫార్మాట్ల‌లోనూ కింగ్ కోహ్లి త‌న‌కంటూ ఒక‌ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2008లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టాడు.భార‌త క్రికెట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత గొప్ప క్రికెట‌ర్‌గా కీర్తింప‌బ‌డ్డాడు.

వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా ప‌ది వేల ప‌రుగులు మైలు రాయిని అందుకున్న బ్యాట‌ర్ కూడా కోహ్లినే కావ‌డం విశేషం. అటు కెప్టెన్‌గా కూడా కోహ్లి త‌న మార్క్‌ను చూపించాడు. టెస్టుల్లో భార‌త్ త‌ర‌పున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా విరాట్ క్రీజులో ఉన్నాడంటే ప్ర‌త్య‌ర్ది గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాల్సిందే. 

అయితే తాజాగా మూడు ఫార్మాట్ల‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల జాబితాను కోహ్లి వెల్ల‌డించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లెజండ్ జేమ్స్ ఆండ‌ర్స‌న్‌,  వ‌న్డేల్లో శ్రీలంక దిగ్గ‌జం ల‌సిత్ మలింగ,  ఇంగ్లండ్ స్టార్ స్పిన్న‌ర్ అదిల్ ర‌షీద్‌, టీ20ల్లో వెస్టిండీస్ స్పిన్న‌ర్ స‌నీల్ న‌రైన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది ప‌డిన‌ట్లు కోహ్లి పేర్కొన్నాడు. 

కాగా టెస్టుల్లో కోహ్లిపై  ఆండ‌ర్స‌న్‌కు మంచి రికార్డు ఉంది. ఏడు సార్లు కోహ్లిని  ఆండ‌ర్స‌న్ ఔట్ చేశాడు. మ‌రోవైపు లసిత్ మ‌లింగా కూడా చాలా సంద‌ర్భాల్లో కోహ్లిపై పై చేయి సాధించాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో కోహ్లిపై మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ సునీల్ న‌రైన్ సైతం మంచి ట్రాక్ రికార్డు క‌లిగి ఉన్నాడు.

ఇక కోహ్లి ఈ ఏడాది జూన్‌లో తిరిగి భార‌త త‌ర‌పున ఆడ‌నున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ప‌య‌నం కానునున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2025లో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి(443) ఐదో స్ధానంలో కొన‌సాగుతున్నాడు.
చ‌ద‌వండి: అత‌డొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement