
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. టెస్టు క్రికెట్ నుంచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లి లేఖ రాసాడన్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పకటించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టుల నుంచి తప్పుకుంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సూచనలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విరాట్‌ను రాయుడు కోరాడు.
"విరాట్ కోహ్లి.. దయచేసి రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. ప్రస్తుతం మీలో ఆడే సత్తా ఇంకా ఉంది. ఇప్పటికీ చాలా ఫిట్‌గా కన్పిస్తున్నారు. మీరు టీమిండియా తరుపున పోరాడేందుకు బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి" అని రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
అయితే టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై మాత్రం కోహ్లికి మంచి రికార్డులేదు. ఇంగ్లండ్‌లో 17 టెస్టులు ఆడిన విరాట్.. 33.21 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. కాగా ఇంగ్లండ్ టూర్‌కు మే 23న భారత జట్టుతో పాటు కొత్త టెస్టు జట్టు కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది.