వారిద్ద‌రూ లెజెండ‌రీ క్రికెట‌ర్లు.. 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల్సింది: యువీ తండ్రి | Yograj Singhs Stunning Verdict On Virat Kohli, Rohit Sharma Test Retirement | Sakshi
Sakshi News home page

వారిద్ద‌రూ లెజెండ‌రీ క్రికెట‌ర్లు.. 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల్సింది: యువీ తండ్రి

May 14 2025 5:04 PM | Updated on May 14 2025 6:04 PM

Yograj Singhs Stunning Verdict On Virat Kohli, Rohit Sharma Test Retirement

భార‌త టెస్టు క్రికెట్‌లో దిగ్గ‌జ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి శ‌కం ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు వీరిద్దరూ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చారు. తొలుత రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌గా..అత‌డి బాట‌లోనే కోహ్లి సైతం న‌డిచాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నకు వ‌ర‌కు కొన‌సాగాల‌ని కోహ్లిని బీసీసీఐ సూచించిన‌ప్ప‌టికి కింగ్ మాత్రం త‌న మ‌న‌సును మార్చుకోలేదు.

ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్‌కు అందించిన సేవ‌ల‌కు గాను రోహిత్‌, కోహ్లిల‌పై మాజీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీ క్రికెట‌ర్‌, టీమిండియా లెజెండ్ యువ‌రాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేరాడు. రోహిత్, కోహ్లి ఇద్ద‌రూ గొప్ప ఆట‌గాళ్లు అని యోగరాజ్ కొనియాడాడు.

కాగా రో -కో ద్వయం రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టను ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 23న ప్రకటించే అవకాశముంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

"విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్బుతమైన ఆటగాళ్లు. ఈ లెజెండ్స్‌ రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బే అవుతోంది.  సరిగ్గా ఇదే పరిస్థితి 2011లో​ కూడా నెలకొంది. ఆ ఏడాది చాలా మంది స్టార్ ప్లేయర్లు రిటైర్ అవ్వడం, మరి కొంత మందిని సెలక్టర్లు పక్కన పెట్టడం వంటి చేశారు.

ఆ సమయంలో భారత క్రికెట్‌ ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ ఒక్క ప్లేయర్ ఏదో ఒక సమయంలో రిటైర్ అవ్వక తప్పదు. కానీ రోహిత్, కోహ్లి మాత్రం కాస్త తొందరపడ్డారనే అన్పిస్తోంది. ఇంకా చాలా క్రికెట్ ఆడే సత్తా వారిలో ఉంది. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చేందుకు వారిద్దరూ ఈ నిర్ణ‌యం తీసుకుని ఉండొచ్చు.

వీరిద్ద‌రూ రిటైర్ అవ్వ‌డంతో భార‌త జ‌ట్టులో మొత్తం యువ ఆట‌గాళ్లే ఉన్నారు. అనుభ‌వం లేని ఆట‌గాళ్ల‌తో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే అది క‌ఠిన స‌వాలే అవుతుంది. ఇంగ్లండ్ వంటి కండీష‌న్స్‌లో రాణించ‌డం అంత సులువు కాదు. కోహ్లి, రోహిత్ వంటి గొప్ప ఆట‌గాళ్లు క‌నీసం 50 ఏళ్ల వ‌రకు అయినా ఆడాలి. వారి నిర్ణ‌యంతో నేను ఆశ్య‌ర్య‌పోయాను. యువ ఆట‌గాళ్లను గైడ్ చేసేందుకు అనుభవం ఉన్న ఆట‌గాళ్లు లేకుండా అయిపోయార‌ని" ఎఎన్ఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యోగ‌రాజ్ పేర్కొన్నాడు.
చదవండి: ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!
 

Advertisement
 
Advertisement
Advertisement