
మేనేజ్‌మెంట్‌కు వసీం జాఫర్ సూచనలు
భారత టెస్టు జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఓపెనర్‌గా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరోవైపు.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే దిగ్గజం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో వీరిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరన్న అంశంపై చర్చ జరగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కొనసాగించాలని సూచించాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో
అయితే, నాలుగో స్థానానికి మాత్రం వసీం జాఫర్ కొత్త ఆటగాడిని ఎంపిక చేశాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జైసూతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. రోహిత్ తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరే ఓపెనర్లుగా కొనసాగారు.
ఈ నేపథ్యంలో వసీం జాఫర్ న్యూస్18తో మాట్లాడుతూ.. ‘‘బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. కాబట్టి కేఎల్ అదే స్థానంలో కొనసాగితే బాగుంటుంది. నిలదొక్కుకున్న జోడీని విడదీయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
నాలుగో స్థానంలో గిల్!
ఇక శుభ్‌మన్ గిల్ విషయానికొస్తే.. అతడు వైట్ బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా వస్తున్నాడు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం అతడిని మూడు నుంచి నాలుగో స్థానానికి పంపితే బాగుంటుంది.
మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. సుదీర్ఘకాలం వన్‌డౌన్‌లో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఓపెనర్‌గా 83 ఇన్నింగ్స్‌లో 2803 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు ఉన్నాయి.
ఓపెనర్లుగా ఇలా
ఇక నాలుగో స్థానంలో రెండు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్.. 108 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. శుబ్‌మన్ గిల్ 30 ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో వచ్చి 1019 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా 29 ఇన్నింగ్స్‌లో 874 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంత వరకు ఒక్కసారి కూడా నాలుగో స్థానంలో ఆడలేదు.
కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల నిష్క్రమణ తర్వాత టీమిండియా తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో తొలి సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఈ టూర్ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.
చదవండి: ‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా..