
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ,తన సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కలవడం ఇది రెండోసారి కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగామారాయి.

సతీ సమేతంగా తమ అభిమాన ఆధ్యాత్మిక గమ్యస్థానమైన బృందావనానికి చేరుకున్నారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌తో కొన్ని సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత కోహ్లీ, అనుష్క దంపతులు సాధువు ఆశీర్వాదాలు తీసుకున్నారు.
🥹❤️ An emotional moment for all fans!
Just a day after announcing his retirement from Test cricket, Virat Kohli visited Vrindavan with Anushka Sharma to seek blessings from Premanand Ji Maharaj. 🙏
This moment is more than just spiritual—it's the beginning of a new chapter for… pic.twitter.com/FRRkl2vkHo— Abhishek Bhardwaj (@abhibhardwaj14) May 13, 2025
కెల్లీ కుంజ్ ఆశ్రమానికి చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో వీరి వీడియో అప్‌లోడ్ అయింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ కోరుకున్నది జరగాలంటే ఎలాంటి మంత్రాన్ని జపించాలని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్‌ను అని అడిగారు. దీనికి మహారాజ్ స్పందిస్తూ, అది పూర్తిగా సాధించదగినదని సాంఖ్య యోగం, అష్టాంగ యోగం , కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చానని, ఇది తన వ్యక్తిగత అనుభవమని చెప్పుకొచ్చారు. అయితే, వ్యక్తిఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆయన(దేవుడు) కృప ఉంటుంది. తన భక్తులకు అంతిమ శాంతికి మార్గాన్ని చూపించేవాడు ప్రభువు అని వెల్లడించారు.
"ఒకరి కీర్తి , కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది... దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి."
అనుష్క బ్లాక్ ప్రింట్ ఉన్న తెల్లటి సూట్-సెట్ ధరించగా, విరాట్ ఆలివ్ గ్రీన్ ప్యాంటుతో జత చేసిన సేజ్ గ్రీన్ షర్ట్ ధరించాడు. ఈ జంట గతంలో 2025 జనవరిలో ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించారు. మాజీ కెప్టెన్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.