
Photo Courtesy: BCCI/IPL
టీమిండియా స్టార్ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 1,000 ఫోర్లు బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు.
కోహ్లి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 249 మ్యాచ్‌లు ఆడి 1001 బౌండరీలు బాదాడు. అందులో 721 ఫోర్లు, 280 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లి తర్వాతి స్ధానంలో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(920) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి ఫర్వాలేదన్పించాడు. 14 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేశాడు.
అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు కోహ్లి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 249 ఇన్నింగ్స్‌ల్లో 280 సిక్సర్ల బాదాడు. మరో మూడు సిక్సర్లు కొడితే భారత కెప్టెన్ రోహిత్ శర్మను కోహ్లి అధిగమిస్తాడు. రోహిత్ ఐపీఎల్‌లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు బాదిన టాప్-5 ఆటగాళ్లు..
1001* – విరాట్ కోహ్లీ
920 – శిఖర్ ధావన్
899 – డేవిడ్ వార్నర్
885 – రోహిత్ శర్మ
761 – క్రిస్ గేల్
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..
క్రిస్ గేల్- 357
రోహిత్ శర్మ- 282
విరాట్ కోహ్లి- 278
ఎంఎస్ ధోని- 259
ఏబీ డివిలియర్స్- 251
చదవండి: సంచలనం.. 64 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం