సంచ‌ల‌నం.. 64 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ అరంగేట్రం | Portugals 64-year-old Joanna Child becomes second oldest T20I debutant | Sakshi
Sakshi News home page

సంచ‌ల‌నం.. 64 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ అరంగేట్రం

Apr 10 2025 8:20 PM | Updated on Apr 10 2025 8:27 PM

Portugals 64-year-old Joanna Child becomes second oldest T20I debutant

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. 64 ఏళ్ల వ‌య‌స్సులో జోవన్నా చైల్డ్ అనే మ‌హిళా క్రికెట‌ర్ పోర్చుగ‌ల్ త‌ర‌పున టీ20 అరంగేట్రం చేసింది. ఈ లేటు వ‌య‌స్సులో జోవన్నా చైల్డ్ ఏప్రిల్ 7న నార్వేతో జ‌రిగిన మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది.

త‌ద్వారా ఇంటర్న‌నేష‌న‌ల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రెండవ పెద్ద వయసు క్రికెటర్‌గా ఆమె రికార్డుల‌కెక్కింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఫాక్లాండ్ ఐస్‌ల్యాండ్స్‌కు చెందిన  ఆండ్రూ బ్రౌన్లీ (62 సంవత్సరాల, 145 రోజులు) పేరిట ఉండేది. 

తాజా మ్యాచ్‌తో ఆండ్రూ బ్రౌన్లీ ఆల్‌టైమ్ రికార్డును చైల్డ్ బ్రేక్ చేసింది. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జిబ్రాల్టర్ మాజీ ప్లేయ‌ర్ సాలీ బార్టన్ అగ్ర‌స్ధానంలో ఉంది. బార్టన్ 66 ఏళ్ల 334 రోజుల వయసులో గ‌తేడాది ఎస్టోనియాపై అరంగేట్రం చేసింది.

జోవన్నా చైల్డ్ విష‌యానికి వ‌స్తే.. నార్వేతో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల‌లోనూ ఆమె ఆడింది. అయితే మూడు మ్యాచ్‌ల్లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చైల్డ్ చేసింది. ఆదేవిధంగా బౌలింగ్ కూడా ఆమె చేసింది. 16.50 ఎకానమీతో వికెట్ తీసుకోకుండా 11 పరుగులు ఇచ్చింది. ఈ సిరీస్‌కు ముందు ఆమెకు అస్స‌లు పూర్తిగా క్రికెట్ అనుభ‌వం లేదు. అయిన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన చైల్డ్‌పై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.

టీ20ల్లో అరంగేట్రం చేసిన అతి పెద్ద వయస్సు గల ఆటగాళ్లు వీరే
సాలీ బార్టన్ - 66 సంవత్సరాల 334 రోజులు
జోన్నా చైల్డ్ - 64 సంవత్సరాలు
ఆండ్రూ బ్రౌన్లీ - 62 సంవత్సరాల 145 రోజులు
కేమాన్  మాల్లీ మూర్ - 62 సంవత్సరాల‌ 25 రోజులు
 

Advertisement
 
Advertisement
Advertisement