Ambati Rambabu
-
స్టేషన్ లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు.. అంబటి రియాక్షన్
-
లోకేష్ రాసిపెట్టుకో... నా ప్రాణం పోయినా సరే అబ్బా కొడుకుకు అంబటి వార్నింగ్
-
అంబటిపై మరో కేసు.. పోలీస్ స్టేషన్ లో విచారణ
-
నేను అనుభవించినదానికి కంటే 10రేట్లు ఎక్కువ అనుభవించేలా చేయకపోతే
-
కూటమిని కూలుస్తాం.. జగన్‌ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్‌రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
గుంటూరు కలెక్టరేట్ వద్ద రేపు భారీగా ధర్నా చేస్తాం
-
అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై
-
అంబటిపై మరో కేసు
-
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కుట్రలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరో అక్రమ కేసు నమోదు అయ్యింది. ఆయన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్నది ఈసారి పోలీసుల వాదన. తన నివాసంపై దాడి చేసి విధ్వంసం చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని.. కస్టడీలో తనను హింసించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన శనివారం ఈ దీక్ష చేశారు. అయితే.. ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ‘‘నా ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు. అరెస్టు చేశాక పోలీస్ స్టేషన్లో(నల్లపాడు) నన్ను హింసించాలని ప్రయత్నించారు. మరి దాడి చేసినవాళ్లను 18 నిమిషాలైనా జైల్లో పెట్టారా?. పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని అంబటి రాంబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించారు. -
‘మాకు అధికారం ఉంది..మేం తలచుకుంటే నరికేయగలం’
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది. మేమే నరకగలం. మాకు అధికారం ఉంది. మేం తలచుకుంటే మిమ్మల్ని నరికేయగలం’ అని కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రెచ్చిపోయారు. ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే అంబటి అయినా.. గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. అసలు ప్రజాస్వామ్యం గురించి వైఎస్సార్సీపీకి తెలుసా?’ అంటూ మండిపడ్డారు. జగన్‌కి అమరావతిలో అభివృద్ధి జరగడం ఇష్టం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో వెర్రితలలు వేస్తోందో చెప్పడానికి బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రొటెం స్పీకర్‌గా.. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బుచ్చయ్యచౌదరి ఈ స్థాయిలో దిగజారి దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. -
‘ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబే’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతే దీనికి కారణమని చెప్పారు. అవినీతి కోసమే అమరావతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.‘రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరదీశారు. ఇప్పటివరకు రాజధాని కోసం రూ.45 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా?మావిగన్ ప్రతిపాదనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మావిగన్‌పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని అంబటి రాంబాబు చెప్పారు.అమరావతి అసాధ్యమనే మావిగన్ ప్రతిపాదనహైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని అంబటి రాంబాబు అన్నారను. ‘తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్ హోటల్ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా? అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్ మీద బూతులతో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది’ అని చెప్పారు. -
కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..
-
KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల
-
అంబటి రాంబాబు నిరాహార దీక్ష విరమణ
గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తన నిరాహార దీక్షను విరమించారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(శనివారం) తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు అంబటి రాంబాబు. ఆ నిరాహార దీక్షను సాయంత్రం వరకూ అంబటి కొనసాగించారు. మాజీ హోంమంత్రి సుచరిత.. అంబటి రాంబాబు దీక్షను విరమింపజేశారు. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలివచ్చాయి. దీనిలో భాగంగా సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై దాడి హేయమని, 7 గంటల పాటు దాడులు జరిగినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. అంబటిని వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దాడి చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు. -
అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
-
మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం
-
అంబటి రాంబాబు దీక్ష వద్ద జోగి రమేష్ స్పీచ్
-
అంబటి రాంబాబు దీక్ష వద్ద విడదల రజిని స్పీచ్
-
వంగవీటి అడుగు జాడల్లో దీక్ష.. అంబటి అన్నకు మేమున్నాం
-
నా ప్రాణం పోయినా ఏ ఒక్కడిని వదలను.. అంబటి రాంబాబు ఉగ్రరూపం
-
అంబటి రాంబాబు నిరాహార దీక్ష
-
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు...నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్‌పై చర్యలు లేవు...దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. -
నిరాహార దీక్షకు దిగిన అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్‌లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న). అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. -
ఈ రెండేళ్లలో మీ సరదాలన్ని తీర్చుకోండి ఒకొక్కడికి ఎలా ఉంటుందో చూస్తారు..
-
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది...నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది -
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
-
జెడ శ్రవణిను కలిసిన అంబటి రాంబాబు
-
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
వెనుదిరిగే ప్రసక్తేలేదు: అంబటి రాంబాబు
సాక్షి, పుత్తూరు: పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాసమస్యలపై నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులతో అణచివేయాలని చూస్తే వెనుదిరిగే ప్రసక్తేలేదని అన్నారు. బలిజలు, కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్ కల్యాణ్ స్పందించకుంటే కాపులను మోసం చేసినట్లేనని చెప్పారు.కాగా, కొన్ని రోజుల క్రితం పోలీసులు తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి, చిత్రహింసలు పెట్టారు. కుటుంబ సభ్యులు తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. తంబిరెడ్డి జాడకోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్‌గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.మరోవైపు, బాపట్లలో ఆదివారం (ఏప్రిల్ 12) చెరుకుపల్లి ఎస్సై అనిల్‌కుమార్ ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డిని చితకబాదారు. వైఎస్సార్సీపీ నేతల పోస్టులను స్టేటస్ పెట్టుకున్నందుకు దాడి చేశారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. -
నారాయణ స్వామి నివాసానికి అంబటి రాంబాబు
-
ABN రాధాకృష్ణపై కంప్లెంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసుల తీరు.. కడిగిపారేసిన అంబటి..!
-
దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్
-
అంబటి VS పోలీస్ మాట్లాడకుండా ఇచ్చిపడేసాడు
-
మహిళలను రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు: అంబటి
గుంటూరు: ఏబీఎన్ ఆఫీసుల వద్ద నిరసనలు చేస్తే అడ్డుకుంటారా? అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలిపింది. అయితే, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు మండిపడ్డారు.‘నా ఇంటిని రౌడీ మూకలు ముట్టడిస్తే నో పోలీస్. మా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే పోలీసులు ఆపలేదు. సందులో ఏబీఎన్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపితే లాఠీఛార్జ్ చేస్తారా? మహిళలను ఏబీఎన్ రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’ అని అంబటి రాంబాబు అన్నారు.కాగా, గుంటూరులో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఏబీఎన్ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసన తెలిపారు. ఆ సమయంలో మాజీ మంత్రి అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏబీఎన్ ఆఫీస్ ఎదుట అంబటి రాంబాబు, పార్టీ నేతలు బైఠాయించారు. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పోలీసుల అరాచకంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. -
క్షమాపణ చెప్తావా.. గంగలో దూకుతావా. ABN రాధాకృష్ణపై రెచ్చిపోయిన అంబటి
-
మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?
-
అమరావతి కాదు కమ్మరావతి.. రేణుకా చౌదరికి అంబటి అదిరిపోయే కౌంటర్
-
"పిలవరా కమ్మరావతి.." రేణుక చౌదరికి అంబటి కౌంటర్
-
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్‌పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్‌కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్‌లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. -
బొత్సకు అంబటి రాంబాబు పరామర్శ
-
ఒక్క మాటతో చంపేస్తావా..? పెమ్మసానికి గుబాపగిలేలా అంబటి కౌంటర్
-
వెళ్తూ వెళ్తూ ఎల్లో మీడియా రిపోర్టర్ కు ఇచ్చిపడేసిన అంబటి
-
ముద్రగడను కలిసిన అంబటి.. నా బలం జగన్.. నా ధైర్యం నా పార్టీ
-
ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్‌కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..
-
‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణాధికారిని మార్చాలి’
గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి అంబటి రాంబాబు ఇవాళ (మార్చి 23) గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్ స్టేషన్లో హింసించడంపై విచారణ చేపట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణ అధికారిని మార్చాలి. నల్లపాడు పీఎస్‌లో టార్చర్ వ్యవహారంలో పూర్తి విచారణ చేయాలి. మా ఇంటిపై ఏడున్నర గంటలపాటు దాడి చేసి హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దాడికి పోలీసులు సహకరించారు. ఇలాంటి ఘటనలో పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేయాలి. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు దారుణంగా వ్యవహరించారు. న్యాయం జరగకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తా. దాడులకు పాల్పడినవారిని, ప్రేరేపించినవారిని వదిలేదే లేదు’ అని అంబటి రాంబాబు అన్నారు. -
ఉగాది వేడుకల్లో YSRCP నేతలు
-
ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు
-
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
నా ఇంటిపై దాడిని సీఎం, ఆయన కుమారుడు మానిటర్ చేశారు
-
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్‌లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్‌బుక్‌ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్‌కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అంబటి రాంబాబును కలిసిన కొడాలి నాని
-
అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..
-
‘2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’
సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం కొడాలి నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు. -
అంబటికి మళ్ళీ నోటీసులు
-
రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
-
రెడ్‌బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి
సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమాగుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.రెడ్‌బుక్ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజురాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్‌బుక్ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. -
అంబటిని పరామర్శించిన వంశీ
-
అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు
-
మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్
-
ధైర్యానికి మారు పేరు అంబటి
-
Guntur: అంబటిని పరామర్శించిన YSRCP నేతలు
-
చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/ఇబ్రహీంపట్నం: కాపుల వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వారిపైనే దాడులు చేయిస్తూ అవమానాలు, వేధింపులకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా బానిసలుగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అది జరగదని మండిపడ్డారు. సోమవారం ఆయన గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి వచ్చారు. అంబటిని పరామర్శించారు.ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైనా, తన కుటుంబంపైనా దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంపైనా దాడి చేయించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘అయ్యా చంద్రబాబు నీకు, మీ సతీమణి, మీ కుమారుడు, కోడలికి అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏమిటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు చేయించటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.ఇప్పటికైనా అబద్ధాలు ఆపి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ ఆయనకు వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా జోగి రమే‹Ùను పరామర్శించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నగర గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గం ఇన్చార్జ్, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు చిలిమిలి వెంకటరాయుడు, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్
-
‘నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం’
గుంటూరు: తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పటినుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను జైలులో ఉన్నప్పుడు మా అధినేత జగన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 18 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాను.నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళిన తర్వాత నా ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. మా ఇంట్లోనుంచి నా భార్య, కూతుర్లు వెనుకనుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యుడు. ఏడు గంటలు పోలీసులు నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. మీరు కాదని చెప్పండి.. ఆవేశంలో దాడులు చెయ్యడం చూశాం. కానీ సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఇది మీ కుట్ర కాదా చంద్రబాబు.మాజీ మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే ఎందుకు నిర్యీర్యంగా ఉన్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు.. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు’
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆ రోజు రాత్రి 12 గంటల వరకు.. లోకేష్ రెడ్ బుక్ కు కుక్కలు కూడా లెక్క చెయ్యవు
-
తప్పు చేసిన వారు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఆహుతి కాక తప్పదు
-
నాపై దాడిని బీజేపీ, జనసేన నేతలు ఖండించారు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప
-
చంద్రబాబూ.. ప్రజలు గమనిస్తున్నారు: అంబటి రాంబాబు
సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్‌పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న ప్రభుత్వ కక్ష సాధింపు
రాజమండ్రి: వైఎస్సార్సీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈనెల 19వ తేదీన రాజమండ్రి నుండి గుంటూరుకు అంబటి రాంబాబు బయల్దేరిన సమయంలో సెక్షన్ 30 నోటీసులు అందజేశారు పోలీసులు. అంబటి కాన్వాయ్‌కు అడగడుగునా అడ్డు తగిలిన పోలీసులు.. సెక్షన్ 30 కింది అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు ప్రకాశ్ నగర్ పోలీసులు.కాగా, మంగళవారం(ఫిబ్రవరి 19వ తేదీ) రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అంబటి కాన్వాయ్‌ను పదే పదే అడ్డుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేశారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. తన కాన్వాయ్ అడ్డుపడటమే కాకుండా, సెక్షన్ 30 కింద నోటీసులు ఇవ్వడాన్ని అప్పుడే అంబటి తీవ్రంగా ఖండించారు. తన ఇంటిపై దాడి చేసినప్పుడు రాని సెక్షన్ 30, ఇప్పుడు తాను కాన్వాయ్‌లో బయల్దేరితే వచ్చేసిందా అంటూ మండిపడ్డారు. -
ఏ రాజకీయ నాయకుడు చెప్పుడు.. అది అంబటి సంస్కారం..
-
నాకు కొడుకులు లేరని ఎప్పుడూ.... కూతురు మౌనిక పై అంబటి ప్రశంసలు
-
ఆమెని చూసి సిగ్గు తెచ్చుకోండి... జనసేన రజినీ పై అంబటి ప్రశంసలు
-
ఈ అంబటి అనే కుక్కకు కూడా... అంటే అర్ధం ఏంటో తెలుసా పవన్...ఏకిపారేసిన అంబటి
-
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
నీవు తీసిన సినిమాలో నేనే హీరో.. పెమ్మసానికి గుబాపగిలేలా అంబటి కౌంటర్
-
చంపితే చస్తా కానీ.. తగ్గేదేలే... మరో సారి అంబటి మాస్ వార్నింగ్
-
ఏం బెదిరిస్తున్నావా...? నీ కన్నా గట్టిగా అరవగలను... అంబటి Vs పోలీస్
-
తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి
సాక్షి, గుంటూరు: తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. గూండాలు 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు, గూండాలు ఏకమై దారుణంగా ఇంటిపై దాడి చేశారు. ఆ మాట అనడాన్ని నా అంతరాత్మ ఒప్పుకోలేదు.. నేను బాధపడ్డాను. టీడీపీ నేతలు తిడుతున్నారనే ఉద్దేశంతో మాట అన్నాను. బ్యాచ్‌లుగా బ్యాచ్‌లుగా నా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నా పిల్లలు, నా మనవళ్లు ఉన్నారు. పోలీసులు సాక్షిగానే నా ఇంటి మీద దాడి చేశారు. నాలుగు గంటల పాటు నా ఇంటి మీద కరాళ నృత్యం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోండి అన్నారు...నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్‌లో పెట్టారు. నా అల్లుళ్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. కమ్మ సామాజిక వర్గాన్ని నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్‌లో పెట్టారు. నా ఇంటి మీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. పెమ్మసాని నాకు సినిమా చూపిస్తానని చెప్పారు. అవును నాకు పెమ్మసాని సినిమా చూపించారు. పెమ్మసాని సినిమాలో హీరో ఎవరు?’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు...31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదల అయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యేవిధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇది మంచి పద్దతి కాదని చెప్పాను. కానీ చించివేయలేదు. మరుసటి రోజు గుళ్లలో పూజలు చేయమని పార్టీ పిలుపు ఇచ్చింది. పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్లనని చెప్పాను. తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు...నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఐదు గంటలకు నా ఇంటివద్దకు పలు నియోజకవర్గాలనుంచి జనం వచ్చారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మనవళ్లు ఉన్నారు. ఏడు గంటల పాటు కరాళనృత్యం చేశారు. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా? ఇది ధర్మమేనా? వైఎస్సార్సీపీ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలని చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని చెప్పాను...ఇంత దారుణం.. అన్యాయం జరిగితే స్పందించరా? పోలీసులు తీసుకెళ్లి లాకప్‌లో పెట్టారు. రాత్రి 2గంటలకు స్టేషన్‌పైకి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎందుకో కొట్టలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో కమ్మవారిని తిట్టానని పేర్కొన్నారు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతుంది మీరే. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పశ్చాత్తాప పడ్డా. పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడ లేదా? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు...నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా. నా కొడకా అంటే అర్థం తెలుసా. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా.. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు. అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా.. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం... ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘చంద్రబాబుకమ్మని ప్రభుత్వానికి పవన్ కాపు కాస్తున్నాడు. నేను తగ్గను, చావనైనా చస్తా, తగ్గదేలేదు. నన్ను ఎమిలినేట్ చేయాలని రెడ్‌బుక్‌లో రాసుకున్నారట. చంపేస్తే సమాధి అయ్యి సాధిస్తా. పోలీసులతో హత్యలు చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఆ అలవాటే లోకేష్‌కు వచ్చింది’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
కూటమికి దడ పుట్టిస్తున్న అంబటి వారసురాలు
-
జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
-
వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్‌ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్‌కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. -
అంబటికి విడదల రజిని పరామర్శ
-
అంబటికి స్వాగతం పలికిన భార్య, కూతుర్లు
-
నా ఇంటికి నేను వెళుతుంటే అడ్డుకుంటారా.. అంబటి మాస్ వార్నింగ్
-
పోలీసుల అత్యుత్సాహం.. కాన్వాయ్ ఆపుదాం అని చూసారు దెబ్బకి ఇచ్చిపడేసిన అంబటి
-
రాజమండ్రిలో హైటెన్షన్.. అంబటి ర్యాలీకి అడ్డంకులు
-
అప్పుడు లేని యాక్ట్.. ఇప్పుడు వచ్చిందా?: అంబటి తీవ్ర ఆగ్రహం
రాజమండ్రి: గుంటూరు బయల్దేరిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు పోలీసులు. అంబటి రాంబాబు వాహనం బయల్దేరిన వెంటనే కాన్వాయ్‌గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు అంబటి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళతా.. లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళతా’ అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఈ తరహా దాష్టీకం చేయడం సరికాదన్నారు.. ‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యాక్ట్ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి తన ఇల్లును పగలగొట్టించారని, ఆ రోజు ఏమైంది 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళుతున్నానని, మీరు కారులో వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం పాదయాత్రగా గుంటూరుకు వెళతా అంటూ హెచ్చరించారు. రాజమండ్రిలో పోలీసుల హైడ్రామారాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంబటి కాన్వాయ్‌ను పదే పదే అడ్డుకుంటున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేస్తున్నారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. -
అంబటి ఇంటి దగ్గర సంబరాలు
-
ప్రజా బలం దైవబలం కలిసి.. అంబటి విడుదలపై కూతురు రియాక్షన్
-
కాపు టైగర్ ఈజ్ బ్యాక్
-
భయపడడం నా రక్తంలోనే లేదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నన్ను జైలులో పెడితే భయపడతానని అనుకున్నారని, అది నా రక్తంలోనే లేదని... ఎన్ని కేసులు పెట్టినా ఒక్క అడుగూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జైలుకు వెళ్లినప్పుడు సంతోషంగానే ఉన్నానని, తిరిగి వచ్చినప్పుడూ అంతే సంతోషంగా ఉన్నానని, ఐ డోంట్‌కేర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో 18 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న రాంబాబు బుధవారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బెయిలబుల్ కేసుకు ఇన్ని రోజులు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. తనకు మద్దతు పలికిన వారికి, పలకని వారికి ధన్యవాదాలన్నారు. తనను జైలులో పెట్టడానికి చంద్రబాబు, లోకేశ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారని, వారికి ఈ చిన్నపాటి విషయం దొరికిందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా కూల్చేవరకు ఈ పోరాటం ఆగదన్నారు. సెంట్రల్ జైలును తనలో పట్టుదల పెంచే శిక్షణ కేంద్రంగా భావించానన్నారు. త్వరలో పరిస్థితులు మారుతాయన్నారు. తనను అన్యాయంగా, అక్రమంగా జైలులో పెట్టారన్నారు. చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షణలోనే దాడి ‘నా ఇంటిని దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు, ఆఫీసు పగులకొట్టారు. నా భార్య, పిల్లలను తరిమికొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైలులో పెట్టారు, అయితే ఏమైంది..’ అని చంద్రబాబు, లోకేశ్‌ను అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏడు గంటల సేపు తన ఇంటిపై దాడి జరిగిందని, దాన్ని చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షించారన్నారు. పోలీసుల సమక్షంలో తెలుగుదేశం కార్యకర్తలు, రౌడీలు, గంజాయి బ్యాచ్ తమపై దాడి చేశారన్నారు. ఎప్పుడూ, ఎక్కడా తప్పు చేయలేదని, పొరబాటు మాట్లాడి వెంటనే పశ్చాత్తాప పడ్డానన్నారు. దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. దేనికైనా సిద్ధపడి ఉన్నామని, అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుక, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుక నడుస్తున్నామన్నారు. ఎన్ని కుట్రలైనా, కుతంత్రాలైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. జైలు అధికారులు వారి డ్యూటీ చేశారని, తనకు నచ్చకపోయినా వారు పెట్టిన ఆహారాన్నే తిన్నానని, తనను ప్రత్యేకంగా చూడాలని కోరలేదన్నారు. జైలులో ఇబ్బంది పడలేదని, బాత్రూమ్లో జారిపడ్డానని తెలిపారు. జైలు బయట అంబటి వెంట మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు ఉన్నారు.అంబటి రాంబాబుకుబెయిల్ మంజూరు గుంటూరు లీగల్: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నం.8 /23 కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.కుముదిని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘‘రంగోలి లక్కీ డ్రా’ కార్యక్రమానికి సంబంధించి ఆరి్థక నేర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా అరెస్టు చేసి ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట రాంబాబు తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి బుధవారం కోర్టులో వాదనలు వినిపిస్తూ... ఆ కార్యక్రమం ప్రజా ఉత్సవాల్లో భాగమని, మోసం, బలవంతం లేదా ఆరి్థక దుర్వినియోగం జరగలేదని, కేసులో నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని, విచారణ పూర్తికాక ముందే అరెస్టు చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని వివరించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించిన అనంతరం, న్యాయమూర్తి రెండు పక్షాల వాదనలు పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. -
నా పెళ్ళాం.. బిడ్డలని తరిమేశారు.. జైలు నుంచి రాగానే అంబటి మాస్ వార్నింగ్..
-
ఒక్క రోజు కూడా జైల్లో ఉండాల్సిన కేసు కాదు.. అంబటి విడుదలపై అడ్వకేట్ షాకింగ్ నిజాలు
-
మళ్లీ చెప్తున్నా తగ్గేదేలే. అనితకు కౌంటర్ Ambati
-
పులిలా బయటకు వచ్చాడు.. విడుదలపై YSRCP నేతల రియాక్షన్
-
బాత్ రూమ్ లో జారి పడ్డ... జైల్లో పరిస్థితులపై అంబటి సెటైర్లు
-
జైలు నుండి అంబటి విడుదల పులిలా బయటకొచ్చిన కాపు టైగర్
-
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల
-
మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
సాక్షి,రాజమండ్రి: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. ఐ డోంట్ కేర్. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తప్పు చేయలేదు కాబట్టి అంబటి రాంబాబుకు ఆత్మవిశ్వాసం ఉంది. వైఎస్సార్సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్క చేయరు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటాం -జక్కంపూడి రాజాప్రశ్నించినందుకు అంబటి ఇంటిపై దాడి చేసి అయనను జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవటానికే తనకు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నా వైపు న్యాయం ఉంది వెనక్కి తగ్గేది లేదని అంబటి చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు -వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి.. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించే తప్ప ప్రజలకు ప్రభుత్వం మంచి చేయడం లేదు. అంబటి క్షమాపణ చెప్పినా ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు..అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ప్రజల్లో అంతా గమనిస్తున్నారుఅధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడింది. - తానేటి వనిత ,మాజీ హోంమంత్రి -
అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారాయణస్వామి, కుమార్తె కృపాలక్ష్మి
-
అంబటికి బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి ఉన్నారు.అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపింది. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు.ఈ కేసులో విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో పీటీ వారెంట్ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
జైల్లో అంబటి పరిస్థితి ఏలా ఉందంటే..
-
పులిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య పెట్టారు జాగ్రత్త
-
కోర్టు ఆర్డర్స్.. అంబటికి ప్రత్యేక సదుపాయాలు
-
కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది
-
గళ్ళ మాధవి, అనిత గుర్తుపెట్టుకోండి..!
-
మీ తల్లిని తిట్టినా సిగ్గులేకుండా.. నాగబాబుకు మాస్ కౌంటర్..
-
బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
-
అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్
-
పవన్‌పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. -
కాలమే సమాధానం చెప్తుంది.. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన బొత్స
-
జైల్లో అంబటి పరిస్థితి..! జడ శ్రవణ్ రియాక్షన్..
-
Israel : ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటమే శాంతి భద్రతలా..?
-
Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?
-
అంబటితో ములాఖత్..YSRCP నాయకులు సంచలన వ్యాఖ్యలు
-
కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్
-
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది.సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్‌ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు. నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.ఇలా వరుస కేసులతో బాబు సర్కార్.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. -
Chirla Jaggi: గుర్తుపెట్టుకోండి.. ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఉండవు..
-
జైల్లో పెట్టినా అదే ధైర్యం.. పోలీస్ జీపులోంచి తగ్గేదే లే..
-
అంబటిపై కుట్రల మీద కుట్రలు
-
2023లో కేసు.. ఇప్పుడు పీటీ వారెంట్
-
అంబటి కుటుంబానికి పెద్దిరెడ్డి పరామర్శ
-
సర్కార్ శాడిజం.. కాపు నేతపై కన్నింగ్ ప్లాన్
-
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా, గతేదాడి నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్సార్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్‌కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్‌పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్‌పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. -
సర్కారు శాడిజానికి 'పరాకాష్ట'
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు. ఒకే కేసులో ఇన్ని ఎఫ్‌ఐఆర్‌లా..హైకోర్టు విస్మయం.. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్‌మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్‌లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్‌లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మిమ్మల్ని పొలిమేరలు దాటే వరకు.. గల్లా మాధవి వంగలపూడి అనితకు జడ శ్రవణ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
విడుదల కాకుండా ... అంబటిపై మరో కేసులో ఇరికించాలని చూస్తోన్న పోలీసులు
-
అంబటికి బెయిల్... కూతురు మౌనిక ఫస్ట్ రియాక్షన్
-
మాజీ మంత్రి అంబటిపై ఆగని కూటమి కుట్రలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.గతేడాది నవంబర్‌లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో పెండింగ్‌లో ఉన్న పాత కేసును2023లో పెండింగ్‌లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. -
అంబటి రాంబాబు బెయిల్‌పై లాయర్లు రియాక్షన్
-
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఉషశ్రీ చరణ్
-
రాజమండ్రి జైల్ నుంచి రేపే అంబటి విడుదల
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. నవంబర్ 12న వైఎస్సార్సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు బెయిల్‌కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయల్దేరారు. -
అంబటి కుటుంబానికి విజయవాడ YSRCP నేతలు పరామర్శ
-
జైల్లో అంబటిని కలిసిన తరువాత ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
-
ఇటువంటివి నేనెప్పుడూ చూడలేదు... ఇది మీకు చాలా ప్రమాదం.. అరెస్ట్ పై ఉండవల్లి
-
కక్ష సాధింపే.. క్లియర్‌గా తెలిసిపోయింది: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మంగళవారం కలిశారు. రాజమండ్రి జైలులో అంబటితో ఉండవల్లి అరణ్‌కుమార్, మాజీ మంత్రి కన్నబాబు ములాఖత్ అయ్యారు.అనంతరం ఉండవల్లి.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త పద్దతి నడుస్తుందన్నారు. ‘‘ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్.. విమర్శించిన వారికి జైలు. పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన వారికి బెయిల్ దారుణం. జైల్లో వేయడం, 30 చోట్ల నుంచి కంప్లైట్ల పెట్టడం దారుణం. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కక్ష సాధింపు అనేది క్లియర్ గా తెలిసిపోయింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ రాగా, మరో కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబును పోలీసులు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరిచారు. ఒక కేసులో బెయిల్ లభించినా.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాత్రి 7.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.అంబటిపై ఆగని కుట్రలునల్లపాడు పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చిన స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌తోపాటు సౌకర్యాలు కోరుతూ రాంబాబు వేసిన ఎమినిటీస్ పిటిషన్లను తిరస్కరించారు. నల్లపాడు కేసులో బెయిల్ వస్తుందన్న ఉద్దేశంతో గతంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో పెట్టిన కేసులో పీటీ వారెంట్‌పై సోమవారం రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకువచ్చి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వక్కాల సూరిబాబు, మాజీ ఎంపీపీ మాతంగి శ్రీకాంత్, సహచర న్యాయవాదులు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.బెయిలబుల్ సెక్షన్లతో ఉన్న కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ బద్ధమైన హక్కు అని, అలాంటి సందర్భాల్లో అరెస్ట్, రిమాండ్ అవసరంపై కోర్టు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. అంబటికి ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ రాకుండా, పాత కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. -
KSR Show: రాజకీయ నిరసనలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలట..!
-
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్‌లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్ అంబటికి బెయిల్
-
పుల్ హ్యాపీ.. అంబటి బెయిల్ పై పొన్నవోలు రియాక్షన్
-
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట
-
అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
-
అంబటిపై నాగబాబు వ్యాఖ్యలు.. కొండా రాజీవ్ అదిరిపోయే కౌంటర్
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులుగతేడాది నవంబర్ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్‌లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. 44 కేసులు కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి.


