ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి | Ex Minister Ambati Rambabu Meets Mudragada Padmanabham | Sakshi
Sakshi News home page

ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి

Mar 26 2026 12:52 PM | Updated on Mar 26 2026 3:17 PM

Ex Minister Ambati Rambabu Meets Mudragada Padmanabham

సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్‌కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు.

ముద్రగడను కలిసిన అంబటి.. నా బలం జగన్.. నా ధైర్యం నా పార్టీ

Advertisement
 
Advertisement
Advertisement