ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు | Ambati Rambabu Fires On Chandrababu, Lokesh, Pemmasani | Sakshi
Sakshi News home page

ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు

Apr 18 2026 7:33 AM | Updated on Apr 18 2026 8:50 AM

Ambati Rambabu Fires On Chandrababu, Lokesh, Pemmasani

సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్‌ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ..  తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్‌లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలన్నారు.

‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్‌, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్‌ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్‌, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

..నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్‌పై చర్యలు లేవు.

..దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్‌ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement