gutur district
-
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు...నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్‌పై చర్యలు లేవు...దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. -
Monkeypox: గుంటూరులో మంకీపాక్స్ కలకలం!
గుంటూరు: గుంటూరులో అనుమానిత మంకీపాక్స్ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్ వైద్యులు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఇదీ చదవండి: తల్లడిల్లిన మాతృ హృదయాలు -
గుంటూరు జిల్లా టీడీపీలో బయటపడ్డ విభేదాలు
-
గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సాగిందిలా..
-
నిడమానురు వద్ద రోడ్డు ప్రమాదం
-
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం
ఆరుగురు కూలీలను బలిగొన్న ట్రాలీ ఆటో గురజాల/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్)/కంభం (కనిగిరి): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురజాల మండలంలోని జంగమహే శ్వరపురంలో ట్రాలీ ఆటో టైరు పగలడంతో వాహనం అదుపు తప్పి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. బేడ బుడ్గజంగం కాల నీ కూలీలు బొల్లాపల్లి మండలం చక్రాయ పాలెం తండాలో మిరపకాయలు కోసేం దుకు వెళ్లారు. రోజూలాగే పనులు ముగించు కుని తిరుగు ప్రయాణమయ్యారు. 10 నిమి షాల్లో ఇంటికి చేరుకుంటారనగా టైర్ పగి లింది. దీంతో డ్రైవర్ వాహనం అదుపుకాక రోడ్డు పక్కనే కరెంట్ స్తంభానికి ఢీకొట్టాడు. స్తంభం ముక్కలుగా విరిగిపోగా పక్కనే చెరు వులోకి ఆటో బోల్తా కొట్టింది. ప్రమాదంలో పేర్ల మార్తమ్మ అలియాస్ ఇస్తారమ్మ (65), కడెం నర్సమ్మ(45), కడెం సమీక్ష (12), పస్తం కుమారి(14) అక్కడికక్కడే మృతి చెం దారు. గాయపడిన వారిని గుంటూరు తర లిస్తుండగా మార్గంమధ్యలో గంధం వెంక టమ్మ (45), కె.సమ్మక్క (16) మృతి చెందా రు. మరో 20 మందికి తీవ్ర గాయాల య్యా యి. మృతదేహాల్ని వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించి క్షతగాత్రుల్ని పరామర్శించారు. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమారం


