వెనుదిరిగే ప్రసక్తేలేదు: అంబటి రాంబాబు | Ambati Rambabu on Police Actions | Sakshi
Sakshi News home page

వెనుదిరిగే ప్రసక్తేలేదు: అంబటి రాంబాబు

Apr 12 2026 2:50 PM | Updated on Apr 12 2026 3:40 PM

Ambati Rambabu on Police Actions

సాక్షి, పుత్తూరు: పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్‌​ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‍ప్రజాసమస్యలపై నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్‌ చేసి, మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులతో అణచివేయాలని చూస్తే వెనుదిరిగే ప్రసక్తేలేదని అన్నారు. బలిజలు, కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ స్పందించకుంటే కాపులను మోసం చేసినట్లేనని చెప్పారు.

కాగా, కొన్ని రోజుల క్రితం పోలీసులు తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.  రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి, చిత్రహింసలు పెట్టారు. కుటుంబ సభ్యులు తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 

తంబిరెడ్డి జాడకోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్‌గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.

మరోవైపు, బాపట్లలో ఆదివారం (ఏప్రిల్‌ 12) చెరుకుపల్లి ఎస్సై అనిల్‌కుమార్‌ ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డిని చితకబాదారు. వైఎస్సార్‌సీపీ నేతల పోస్టులను స్టేటస్‌ పెట్టుకున్నందుకు దాడి చేశారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement