దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | YS Jagan expressed condolences on the demise of Asha Bhosle | Sakshi
Sakshi News home page

దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Apr 12 2026 3:01 PM | Updated on Apr 12 2026 4:06 PM

YS Jagan expressed condolences on the demise of Asha Bhosle

సాక్షి,తాడేపల్లి: దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన  ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ  ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు.
  
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement