వేల కి.మీ దూరం నుంచి‌ క్షిపణులను గుర్తించగలిగే.. | Warship At Visakhapatnam Beach | Sakshi
Sakshi News home page

వేల కి.మీ దూరం నుంచి‌ క్షిపణులను గుర్తించగలిగే..

Apr 12 2026 11:20 AM | Updated on Apr 12 2026 11:33 AM

Warship At Visakhapatnam Beach

సాక్షి, విశాఖపట్నం: వేల కిలోమీటర్ల దూరం నుంచి బాలిస్టిక్‌ క్షిపణులను గుర్తించగలిగే ఓ యుద్ధ నౌక శనివారం విశాఖ తీరంలో కనువిందు చేసింది. రక్షణ శాఖకు చెందిన ఈ నౌకను నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది నిర్వహిస్తారు. అణు క్షిపణితో పాటు ఉపగ్రహాలను సైతం ట్రాకింగ్‌ చేసే సామర్థ్యం దీని సొంతం.

హార్మూజ్‌ను దాటిన జగ్‌ విక్రమ్‌
భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌ హార్మూజ్‌ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్‌ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్‌ ఇది. శనివారం మధ్యాహా్ననికి గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ను దాటి భారత్‌ దిశగా సాగుతోంది. ముంబైలోని గ్రేట్‌ ఈస్టర్న్‌ షిప్పింగ్‌ కంపెనీకి చెందిన జగ్‌ విక్రమ్‌ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది.

కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్‌ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్‌ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్‌ ట్రాఫిక్‌ డేటా చెబుతోంది.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement