అంబటి రాంబాబు నిరాహార దీక్ష విరమణ | YSRCP Leader Ambati Rambabu Ends Hunger Strike | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబు నిరాహార దీక్ష విరమణ

Apr 18 2026 6:19 PM | Updated on Apr 18 2026 7:31 PM

YSRCP Leader Ambati Rambabu Ends Hunger Strike

గుంటూరు:  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తన నిరాహార దీక్షను విరమించారు.  తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్‌ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు(శనివారం) తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్షకు దిగారు అంబటి రాంబాబు. ఆ నిరాహార దీక్షను సాయంత్రం వరకూ అంబటి కొనసాగించారు. మాజీ హోంమంత్రి సుచరిత.. అంబటి రాంబాబు దీక్షను విరమింపజేశారు. 

అంబటి దీక్షకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలివచ్చాయి. దీనిలో భాగంగా సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై దాడి హేయమని, 7 గంటల పాటు దాడులు జరిగినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. అంబటిని వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.  దాడి చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్‌ చేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement