మహిళలను రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు: అంబటి | Ambati Rambabu Slams Police Over Lathi Charge | Sakshi
Sakshi News home page

మహిళలను రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు: అంబటి

Apr 8 2026 12:30 PM | Updated on Apr 8 2026 12:57 PM

 Ambati Rambabu Slams Police Over Lathi Charge

గుంటూరు: ఏబీఎన్‌ ఆఫీసుల వద్ద నిరసనలు చేస్తే అడ‍్డుకుంటారా? అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ శాంతియుతంగా నిరసన తెలిపింది. అయితే, వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు మండిపడ్డారు.

‘నా ఇంటిని రౌడీ మూకలు ముట్టడిస్తే నో పోలీస్‌. మా ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేస్తే పోలీసులు ఆపలేదు. సందులో ఏబీఎన్‌ ఆఫీస్‌ వద్ద నిరసన తెలిపితే లాఠీఛార్జ్‌ చేస్తారా? మహిళలను ఏబీఎన్‌ రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’ అని అంబటి రాంబాబు అన్నారు.

కాగా, గుంటూరులో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. ఏబీఎన్‌ ఆఫీస్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతల నిరసన తెలిపారు. ఆ సమయంలో మాజీ మంత్రి అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏబీఎన్‌ ఆఫీస్‌ ఎదుట అంబటి రాంబాబు, పార్టీ నేతలు బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. పోలీసుల అరాచకంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement