‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’ | YSRCP Leader Ambati Rambabu Criticizes Chandrababu Naidu Government For Inaction Over Two Years In Tadepalli | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’

May 9 2026 5:21 PM | Updated on May 9 2026 7:20 PM

YSRCP Leader Ambati Rambabu Takes On C handrababu

తాడేపల్లి :  ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి మాటలు చెబుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రజలకు చేసేంది మాత్రం ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. 

ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ఒక్కో కాన్ఫరెన్స్ లో ఒక్కో అంశంపై బడాయి మాటలు చెప్పారు. కానీ ఈ ఏడు సమావేశాల్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మోదీ కన్నా చంద్రబాబు పరిపాలనాదక్షుడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఇంకేం చేశారు?, ప్రపంచానికి పాఠాలు చెప్తాననే చంద్రబాబు మంత్రులు బృందాన్ని సింగపూర్ ఎందుకు పంపారు?, 

సింగపూర్‌లో స్టడీ చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారా?, ఇప్పుడు ఆ హామీలన్నీ ఎగ్గొట్టి సింగపూర్ లో ఏం చేశారు?, ఎన్నికలకు ముందు చూపించిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది?, ఈ రెండేళ్లలో ఒక్క పేదోడికీ గజం స్థలం కూడా ఇవ్వలేదు. వార్డు, గ్రామ సచివాలయాలను సర్వ నాశనం చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతున్నారు. 

ఆరోగ్యశ్రీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమయ్యాయి?, సింగపూర్ పర్యటన కేవలం షికారు కోసమే. ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ చేయలేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. జగన్ హయాంలో జరిగినంత వేగంగా పనులు జరగటం లేదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రమే ప్రశ్నించింది. 

రాయలసీమ లిఫ్టును రేవంత్‌రెడ్డికి గిఫ్టుగా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై మళ్ళీ అక్రమ కేసులు పెట్టటం దుష్ట సంప్రదాయం. ఎంతమందిని అరెస్టు చేసినా వెనక్కు తగ్గేదే లేదు. క్రిమినల్స్‌ని కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సోషల్ మీడియా వాళ్ల మీద ప్రయోగిస్తారా?, వెలిగొండలో మంత్రి రామానాయుడు చాలా డ్రామాలు చేస్తున్నారు. ఫోటోలకు స్టిల్ ఇవ్వటం తప్ప ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

జగన్ పథకాలు ఆపేశారు.. పనికొచ్చే పథకం ఒక్కటీ లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement