ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఈరోజు(సోమవారం, మే 18వ తేదీ) ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత ఆందోళనకు విశేష స్పందన లభించింది. పెట్రో బాదుడును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు.. అన్ని జిల్లాల కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందించారు.


