చంద్రబాబుకు వైఎస్‌ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు | Coalition government will throw mud at YSRCP Ambati rambabu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వైఎస్‌ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు

May 24 2026 6:10 PM | Updated on May 24 2026 6:16 PM

Coalition government will throw mud at YSRCP Ambati rambabu

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్‌ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ‍ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.

కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్‌పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా  చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని  మాజీ మంత్రి మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement