జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు | YSRCP Ambati Rambabu Sensational Comments On Sai Krishna Custodial Death Case In Guntur, Demands CBI Probe | Sakshi
Sakshi News home page

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

Jun 23 2026 10:32 AM | Updated on Jun 23 2026 5:16 PM

YSRCP Ambati Rambabu Sensational Comments On Sai krishna Case

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు ఉలిక్కిపాటు ఎందుకని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు ఇండియాలోనే అరుదైన కేసుగా అభివర్ణిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మంగళవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ..   

‘‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. సాయికృష్ణను చంపేశారు. ఎవరో పెద్ద నేరస్థుడిని రక్షించేందుకు అతన్ని బలి చేశారు. సీబీఐ దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి అని అంబటి వ్యాఖ్యానించారు.  

ఇది దేశంలోనే అరుదైన కేసు. బుర్రలేని జనసేనవాళ్లు సాయికృష్ణను చంపడం కరెక్టేనని మాట్లాడుతున్నారు  సాయికృష్ణ మీద 2 కేసులే ఉన్నాయి. కానీ, పవన్‌ కల్యాణ్‌ 22 కేసులు ఉన్నాయని అంటున్నారు.  శిక్షించడానికి పోలీసులు ఎవరు? శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి. నేను సాయికృష్ణను కొట్టారని ఫొటోలు ఇచ్చాను. ఒకవేళ అతను బతికి ఉంటే చెప్పండి..

.. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసును మేకప్‌ చేసే కార్యక్రమంలో ఉన్నారు. చట్ట ప్రకారం.. 18 నెలలపాటు సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచాలి. కానీ, కృష్ణలంక పీఎస్‌లో సీసీ ఫుటేజీ మాయం కావడం ఆందోళనకరమైన విషయం. ఈ విషయాన్ని ఎల్లో మీడియా సైతం ప్రచురించింది. నిందిత పోలీసులను కాపాడటానికే సీసీటీవీ ఫుటేజీలు మాయం చేశారు. 

.. జనసేన నేతలు కల్లు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారు.  బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఈ హత్యాకాండకు, సీఐ నాగరాజుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీలోని కాపు నేతలే ఎందుకు మాట్లాడుతున్నారు?. మిగతా కులాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అని అంబటి ప్రశ్నించారు.

బాగుందయ్యా చంద్రబాబు.. సాక్ష్యాలు మాయం చేసి అరెస్ట్ చేశావ్...

.. చంపడం, బూడిద చేయడం.. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం.. ఇదేంటి?. ఎవరో  పెద్ద నేరస్థుడిని కాపాడడానికే సాయికృష్ణను బలిచేశారు.  చంద్రబాబు వేసిన సిట్‌తో ఏం ఒరగదు.  సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని అంబటి తేల్చి చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement