breaking news
YS Rajasekhara Reddy
-
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం పరంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్, పింఛన్ పెంపు వంటి పథకాలతో ప్రజల మనసుల్లో వైఎస్సార్ శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు. ‘రాహుల్ గాం«దీని దేశ ప్రధాని చేయాలని వైఎస్సార్ కలలు కన్నారు.ఆయన ఆశయ సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే, మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్, కోడలు వైఎస్ భారతీరెడ్డి, సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, సమీప బంధువులు మహానేత విగ్రహానికి పూల మాలలు వేసి స్మరించుకొని నివాళులు అర్పించారు. పులివెందుల నుంచి వారు రోడ్డు మార్గాన ఉదయం 7.45 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. పాస్టర్లు బెనహర్ నరేష్ , మృత్యుంజయ, రత్నకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.రెండు నిమిషాల పాటు మౌనం వహించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునా«థరెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధ, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్బాష, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, సమీప బంధువులు వైఎస్ యువరాజ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ సుగుణమ్మ, వైఎస్ ప్రమీలమ్మ, ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డితో పాటు అనంతపురం జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ కదిరి ఇన్చార్జ్ మక్బూల్‌బాషా తదితరులు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. ‘వైఎస్సార్ అమర్ రహే.. మరుపురాని నేత వైఎస్సార్..’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇడుపులపాయకు తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులను వైఎస్ జగన్ పేరుపేరునా పలకరించారు. అనంతరం వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. -
పరిపాలనాదక్షుడు మహానేత వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా భావించి పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని బుట్ట కన్వెన్షన్ సెంటర్లో ‘దైవమే మానవ రూపేణా’ పేరుతో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో పలువురు మాజీ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేనట్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు వైఎస్సార్ అని కీర్తించారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో రెండుసార్లు నిలబెట్టింది వైఎస్సార్ అని, ఆయన బతికుంటే ప్రధాని స్థాయికి ఎదిగేవారన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల ప్రాణాలు కాపాడేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిత్యం భారీగా నిధులు విడుదల చేసేవారన్నారు. వైఎస్సార్ లేకపోవడం తెలుగు ప్రజల దురదృష్టమన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూæ వైఎస్సార్ హయాంలోనే పులిచింతల పూర్తి చేశారని, పోలవరానికి నిధులు తీసుకొచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ ఘనతేనని కొనియాడారు. సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వైఎస్సార్ దగ్గర్నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక్కోటి ఉంటుందన్నారు. వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేసిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భాను, రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి, ఏసీబీ మాజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ రాఘవరెడ్డి, వైఎస్సార్ కుటుంబ స్నేహితుడు కొండా రాఘవరెడ్డి తదితరులు ప్రసంగించారు. సామాజిక న్యాయానికి పర్యాయ పదం బడుగు, బలహీన వర్గాల కోసం పరితపించి సుపరిపాలన అందించిన వైఎస్సార్‌ను ప్రజలు మరువలేరు. అట్టడుగు వర్గాలను అభివృద్ధి పరచాలన్న సంకల్పంతో పాలన సాగించారు. రాజ్యాంగానికి అనుగుణంగా అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నించారు. దివంగత వైఎస్సార్ పాలనలో అందిన విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సామాజిక న్యాయానికి పర్యాయ పదం వైఎస్సార్. – జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి వైఎస్సార్ మహనీయుడు మానవతా విలువలుగల మహనీయుడు వైఎస్సార్. సరికొత్త అలోచనలను ప్రోత్సహించే వైఎస్సార్ ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి సారించే వారు. పేదల అభ్యుదయం కోసం నిరంతరం ఆలోచించేవారు. – అజేయ కల్లం, మాజీ సీఎస్ హైదరాబాద్ తాగునీటి సమస్య తీర్చారు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య లేదంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవే. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి కృష్ణా, గోదావరి జలాలను తీసుకొచ్చారు. – కె.ఎస్.జవహర్‌రెడ్డి, మాజీ సీఎస్ సమస్యలకు పరిష్కారం ఆయన నైజం రైతులను ఆదుకోవడానికి వైఎస్సార్ సరికొత్తగా ఆలోచించేవారు. ప్రజా సమస్యలు వినడం, ఆ సమస్యలకు పరిష్కారం చూపడం ఆయన నైజం. అందువల్లే లక్షలాది మందికి ఆయన మేలు చేయగలిగారు. – కె.ఐ.వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ చైర్మన్ ఏపీ భవన్లో వైఎస్సార్ జయంతి వేడుకలు సాక్షి నెట్వర్క్/న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖరరెడ్డి నేటి తరానికి ఆదర్శనీయుడని అఖిల భారత రైతు సంఘాల అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి కొనియాడారు. అన్ని వర్గాల వారు ఆదరించే స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మదన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ అభిమానులు సదానంద రెడ్డి, వసంత, సంజయ్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా, చెన్నై ఐటీ వింగ్ ఆధ్వర్యంలో చెన్నైలోని ‘టెక్ టవర్’లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానేత చిత్రపటం వద్ద నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ చెన్నై ఐటీ వింగ్ సేవాదళ్ అధ్యక్షుడు హుస్సేన్, ఏపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు సునీల్, సేవాదళ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ సింగపూర్ విభాగం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటరెడ్డి పాలేనికి చెందిన సుబ్బారామమ్మ గుండె ఆపరేషన్ నిమిత్తం రూ.60 వేలు సాయం అందించింది. -
పేదల గుండెచప్పుడు డాక్టర్ వైఎస్సార్
సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు దేశంలోనే ట్రెండ్‌ను సెట్ చేశాయని, అందుకే ‘పేదల గుండెచప్పుడు వైఎస్సార్’ అని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నేతలు అంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హనుమంతరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి వారు భారీ కేకును కట్ చేశారు. తర్వాత పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ దూరమయ్యి 15 ఏళ్లు గడిచినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికీ ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి కార్యక్రమాల ద్వారా రైతులను రాజుగా నిలబెట్టారని చెప్పారు. పేదవాడికి ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయన్నారు. ప్రతి మనిషినీ సంతోషంగా నవ్వుతూ పలకరించడం వైఎస్సార్ నుంచే నేర్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడని, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన విజనరీ అని కొనియాడారు. మళ్లీ వైఎస్సార్ రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. జయంతినాడే వైఎస్సార్ విగ్రహం తొలగింపు అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ అధికారులు దారుణ ఘాతుకానికి తెగబడ్డారు. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. కూటమి నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్ జయంతి రోజునే ఉద్యోగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు మండిపడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే యథాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తదుపరి పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. -
వైఎస్సార్ పేరుతో అభ్యుదయ రైతులకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పేరుతో అభ్యుదయ రైతులు, వ్యవసాయ రంగానికి విశేష సేవలందించినవారికి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగా వైఎస్సార్ పేరిట ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్ చౌరస్తా, పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్ విగ్రహాలకు మంగళవారం భట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయాచోట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే వైఎస్సార్ వర్ధంతి నాటికి ఫౌండేషన్‌కు రూపకల్పన చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిన వారిని గుర్తించి వైఎస్సార్ పేరిట అవార్డులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌ను నిత్యం స్మరిస్తూ, వారి ఆలోచనను ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ అంటే మొదట గుర్తుకువచ్చేది వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులేనని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణించి 15 ఏళ్లు అవుతున్నా ఆయన గుర్తులు ప్రతి ఇంట్లో చిరస్మరణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేటితరం యువత, రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వైఎస్సార్ నుంచి ఎంతో నేర్చుకోవాలన్నారు. పంజగుట్ట కూడలిలో జరిగిన కార్యక్రమంలో భట్టితోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ టీపీసీసీ ఆధ్వర్యంలో ఘన నివాళులువైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గాం«దీ భవన్లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. అనంతరం పేదలకు వ్రస్తాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి, మహేశ్‌కుమార్‌గౌడ్, దానం, శ్రీగణేశ్, బల్మూరి, అద్దంకి దయాకర్, మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, కేవీపీ పాల్గొన్నారు. -
విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)
-
YSR Jayanthi: దైవం మానవ రూపేణ
హైదరాబాద్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. మంగళవారం సాయంత్రం బుట్ట కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, పలువురు న్యాయమూర్తులు, సీనియర్ జర్నలిస్టులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దైవమే మానవ రూపేణ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు వక్తలు.. వైఎస్సార్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో తమకు ఉన్న అనుభవాలను సభికులతో పంచుకున్నారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వై. ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి స్వాగతోపన్యాసం ఇచ్చారు. వేదికపైన ఉన్న పెద్దలకు, వైఎస్సార్ అభిమానులకు, వైఎస్సార్ ఆత్మీయులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైఎస్సార్ అభిమానుల్ని ఒక వేదికపైకి తీసుకురావడమే. ఆయనలో లక్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుని, ఆయన ఆశయాల్ని ప్రజలందరి దగ్గరకు తీసుకెళ్లి, ఆయన పేరు చిరస్థాయిలో ప్రజల గుండెల్లో ఉండేటట్లు చేయాలనే సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ ఇది..ఆయన చనిపోయి 16 ఏళ్లు అయినప్పటికీ, ఆయన్ని గుర్తుచేసుకుని ఇంత మంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే వైఎస్సార్ వ్యక్తిత్వమే కారణం. ఆయన మామూలు మనిషి కాదు.. దేవుని రూపంలో మనందరి ముందు తిరిగిన మహా మనిషి. ఎందుకు మహా మనిషంటే.. ఆయనతో దగ్గరగా పని చేసిన వాళ్లని కదిలిస్తే అది అర్థమవుతుంది. ఆయనతో నాకున్న ఒక అనుభవం పంచుకుంటాను.పేదలకు నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చిన మహానేత1989 నుంచి 2009 సెప్టెంబర్ వరకూ ఆయనతో అతి దగ్గరగా నడిచిన వ్యక్తిని నేను. రోజూ ఆయన్ను కలవడానికి వందలాది మంది వచ్చేవారు. అందులో సామాన్యులు, వీఐపీలు కూడా ఉండేవారు. వీఐపీలు రూమ్‌లో ఉంటే.. సామాన్యులు గ్యాలరీలో ఉండేవారు. కానీ ముందు ఆయన సామాన్యులను కలిసి వారి సమస్యలు వినేవారు. అలా ఎందుకు చేసేవారంటే.. సామాన్యులు ఇక్కడ వరకూ రావడమే కష్టం. మరి అటువంటుది వాళ్లను ముందుగా కలవకపోతే.. వారికి వసతి దగ్గర నుంచి టికెట్ల వరకూ అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యలతో వచ్చిన వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టకూడదనేవారు వైఎస్సార్. అలా సామాన్యుల సమస్యలు వినడమే కాదు.. అది తాను పడుకునే టైమ్‌కు ఎంతవరకూ వచ్చిందనేది రిపోర్ట్ ఇవ్వాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించేవారు వైఎస్సార్. అలా అందులోంచి పుట్టుకొచ్చినవే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, వృద్ధులకు పెన్షన్లు అనే పథకాలు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఏదో చేయాలనే తపన వైఎస్సార్‌లో ఎప్పుడూ ఉండేది. ఏ రైతూ ఆత్మహత్య చేసుకోకూడదు అనే భరోసా ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు.మాలాంటి వాళ్లను కూడా ఆయన అభిమానిగా మార్చుకున్నారుసీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వైఎస్సార్‌తో ఆరంభంలో పెద్దగా పరిచయం లేదు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అందుకు సపోర్ట్ చేసిన వాళ్లలో నేనూ ఒకడిని. ఇక్కడ విశేషమేటంటే మాలాంటి వాళ్లను కూడా వైఎస్సార్ ఆయనవైపుకు తిప్పుకునేలా చేశారు. ఒకానొక సందర్భంలో ఆయన క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత జర్నలిస్టులతో మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి చేస్తారా?, అని అడిగితే.. ‘ చేసి చూపిస్తాం’ అని ఒక ధృఢ సంకల్పంతో చెప్పిన మాట నన్ను ఆయనవైపుకు వెళ్లేలా చేసింది. ఆ రకంగానే పులిచెంతలను పూర్తి చేయడమే కాదు.. పోలవరానికి నిధులు తీసుకొచ్చి ఇంతవరకూ ఆ ప్రాజెక్టు రూపాంతరం చెందిందంటే అది వైఎస్సార్ ఘనతే’ అని కొనియాడారు.వైఎస్సార్‌పై ఒక్కొక్కరి అనుభవంతో ఒక్కొక్క గ్రంథం రాయొచ్చువైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరైన సభికులని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. సభలో ఉన్న ఒక్కొక్కరు వైఎస్సార్ గురించి చెబితే ఒక్కో గ్రంధం రాయొచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌తో ఉన్న తనకున్న అనుభవాన్ని దేవులపల్లి అమర్ పంచుకున్నారు. ‘నేను ఈ వృత్తిలోకి వచ్చి 50 ఏళ్లు అయ్యింది. 1976లో ఈ వృత్తిలో అడుగుపెట్టా. 1978లో వైఎస్సార్ శాసనసభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. అప్పట్లో బాగా దగ్గరగా లేకపోయినా, 1999లో ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినదగ్గర్నుంచి నాకు అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. వైఎస్సార్ దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక్కటి ఉంది. అది ‘హ్యూమన్ ఫేస్’. మానవత్వం అనేది ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం. ఈరోజుల్లో రాజకీయ నాయకుల్లో బాగా లుప్తమైపోయినది కూడా అదే. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఉండాల్సిన మానవత్వం అనేది వైఎస్సార్ నుంచి రోజూ చూసేవాళ్లం. ఆయనకు మానవ్వతం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఒక అనుభవం చెబుతాను. ఒక కార్మికుడ్ని, ప్రింటింగ్ పేపర్లో వేస్ట్(రద్దు)ను వేరుకునే ఒక కార్మికుడ్ని ఒక సందర్భంలో వైఎస్సార్‌కు దగ్గరకు తీసుకుపోయా. ఆ కార్మికుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఆ కార్మికుడి రిపోర్ట్లు చూసి వైఎస్సార్ రూ. 2 లక్షల మంజూరు చేశారు. రూ. 30 వేలు అడిగిన సందర్భంలో అది ఎక్కడ సరిపోద్ది అని రెండు లక్షలు మంజూరు చేశారు. దాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. అయితే ఆ మరుసటి రోజు కిరణ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో డబ్బులు విషయంలో జాప్యం జరిగింది. అయితే ఆ కార్మికుడు ఆపై రెండు రోజులకు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్.. ఆ కుటుంబం ఊహించనంత పరిహారం ఇచ్చారు. ఆ కార్మికుడు ఎవరో వైఎస్సార్‌కు తెలీదు. అయినా మానవత్వంతో ఉదారత చాటుకున్నారు’ అని వైఎస్సార్‌తో తనకున్న ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఇలా అక్కడకు విచ్చేసిన పలువురు.. వైఎస్సార్‌తో ఉన్న ఆనాటి మరుపురాని అనుభవాలను పంచుకున్నారు. అవి ఈ వీడియోలో చూసేయండి. -
విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్/తిరుపతి గాంధీ రోడ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌లో సోమవారం వైఎస్సార్ అభిమానులు మహ్మద్ జిలానీ బాషా, అక్రమ్ బాషా, కోటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి యాత్ర–2 చిత్ర నిర్మాత శివ మేక ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని నిర్వహించేందుకు తన స్థలాన్ని కేటాయించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని మసూద్ అహ్మద్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రసన్న సోమిరెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, షేక్ అబ్దుల్లా, ఫహీమ్, ఖాజా ముతాలిబ్, చక్రి, కర్ణ, పవన్ కుమార్, హనుమంత్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్, రమణా రెడ్డి, షోయబ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో..సౌదీ అరేబియాలోని జుబైల్ ప్రాంతంలో వైఎస్సార్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అకియాకునో కంపెనీ క్యాంపులో కడపకు చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కంపెనీలో పని చేసే సుమారు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సింగపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి..వైఎస్సార్ జయంతిని సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కేక్‌ను కట్ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఎ. సాంబశివారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి, కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి, కో కన్వీనర్స్ – ప్రకాష్ , సంతోష్ తో పాటు పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొరబాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్సార్ ఆప్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సౌత్ ఆఫ్రికాలో ఘనంగా వైఎస్సార్ జయంతివైఎస్సార్సీపీ ఎన్నారై సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో జోహన్స్‌బర్గ్‌లోని మిడ్ రాండ్లోలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డామన్నారు. అనంతరంచిల్డ్రన్స్ హోమ్‌లో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు నరసింహారెడ్డి కళ్ల, సూర్యరామిరెడ్డి, శివ రాజవరపు, విక్రం రెడ్డి పెట్లూరు, కృష్ణారెడ్డి, అంజలి రెడ్డి, మనోజ రాజవరపు, సూర్య రామిరెడ్డి, శ్రావణి రెడ్డి పెట్లూరు, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు -
వైఎస్సార్ విజనరీ లీడర్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకుని ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్సార్‌పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ‘ వైఎస్సార్ విజనరీ లీడర్. ఏపీ ప్రజల సంక్షేమ కోసం తన జీవితాన్ని అంకింతం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు’ అని కొనియాడారు. Humble tributes to former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.A visionary leader who devoted his life to the welfare of the people of Andhra Pradesh and made countless contributions to their upliftment.He will always be… pic.twitter.com/D3BO9MZsCM— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2025 వైఎస్సార్ కృషి మరువలేనిది..రైతులు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ చేసిన కృషి మరువలేనదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. ఏపీ రాష్ట్ర ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మానవతా వాది వైఎస్సార్ అని కొనియాడారు. On his birth anniversary, we pay homage to Y. S. Rajasekhara Reddy, the Former Chief Minister of Andhra Pradesh.A truly compassionate leader, he devoted his entire life to the progress and well-being of the state. His remarkable contributions to public service, especially… pic.twitter.com/JYQOdeEthS— Mallikarjun Kharge (@kharge) July 8, 2025 -
పేదలకు దేవుడు వైఎస్సార్.. ఆయనొక బ్రాండ్..
-
YSR: రైతుల గుండెలలో చిరంజీవి
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో విధాలుగా రైతులను ఆదుకున్నారు. 2004 మే నెల రెండవ వారంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేసే నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి దారుణంగా ఉంది. దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాద న్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో జీఓ నంబర్ 421 విడుదల చేసి, 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.రైతులు అప్పులు కట్టలేక సహకార సంఘాలు దివాళా తీసే పరిస్థితిలో వైద్య నాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ. 1,800 కోట్లు ప్రభుత్వం నుండి సహకార సంఘాలకు సహాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘాల్లో కలిపి రైతుల కోసం సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు.ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగు నీటి వనరులు ఉన్న భూమి సుమారుగా 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్ల రూపాయలతో కోటి ఎకరాలకు సాగునీరందిస్తానని ‘జల యజ్ఞం’ మొదలు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు ‘పోలవరం సాధనా సమితి’ పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రాజెక్టు అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి రాష్ట్రానికే వరమైన పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టడమే కాదు, జలయజ్ఞంలో చేపట్టిన అన్ని పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పూర్తి చేశారు.వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ప్రభుత్వానికి రైతు ఆదాయం కల్పిస్తున్నాడనీ, వ్యవ సాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనీ ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. కానీ దాన్ని అమలు చేసి దేశానికే మార్గదర్శకులు అయ్యారు. అనేక వ్యవసాయ పరిశోధనల సమన్వయానికి ‘అగ్రి కల్చర్ టెక్నాలజీ మిషన్’ ఏర్పాటు చేశారు. 2006 జనవరి 10వ తారీఖున దాన్ని ప్రారంభిస్తూ... ‘రెండవ హరిత విప్లవం కేవలం నీటిపారుదల, గిట్టుబాటు వ్యవసాయ మూలంగానే సాధ్యమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా లక్ష్యం’ అని ప్రకటించారు.రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే వరి ధాన్యానికి పెరిగిన మద్దతు ధర కేవలం రూ. 60 మాత్రమే (రూ. 490 నుండి రూ. 550). అదే 2004 నుండి 2009 వరకు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగిన మద్దతు ధర రూ. 450 (రూ. 550 నుండి రూ. 1000). అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ఇలానే పెరిగినాయి. ఆ మద్దతు ధరల కంటే ఎక్కువకు రైతులు తమ ఉత్పత్తులు అమ్ము కున్నారు. ఈ సమయంలోనే వైఎస్ ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలోనికి నెట్టివేయబడటానికి మరికొన్ని కారణాలు.. పిల్లల విద్య, కుటుంబంలోని వ్యక్తుల వైద్యం ఖర్చులు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సంక్షోభం ఎక్కువగా ఉందని గ్రహించి గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 పథకాలు తెచ్చారు.చదవండి: జలయజ్ఞమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరంఅభివృద్ధి – సంక్షేమం తన రెండు కళ్ళుగా పాలన గావించి, రైతుల గుండెలలో చిరంజీవిగా మిగిలిన ఆ మహానాయకుని స్మరించుకోవడం ఆయన జయంతి సందర్భంగా మనం ఇచ్చే గౌరవం.- ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం (ఏపీ) అధ్యక్షుడు -
వియత్నాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వియత్నాం రాజధాని హనోయి నగరంలో మంగళవారం ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గత వారం రోజులుగా వియత్నాంలో పర్యటిస్తున్న కరుణాకర రెడ్డి.. దివంగత రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఏ ప్రాంతంలో ఉన్నా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులున్నారని సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా వైఎస్ నిలిచి పోవడం జరిగిందని, అనేక రాష్ట్రాలలో ప్రస్తుత ముఖ్యమంతులు వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి, చరణ్ రెడ్డి, జివి లక్ష్మీ, వాణి రెడ్డి, నీహారిక, డేనియల్, ప్రశాంత్, పీటర్సన్, డాంగ్ జాన్, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
జలయజ్ఞమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరం
వైఎస్సార్ రూపొందించిన విధానాలు, అమలు చేసిన పథకాలు ఆయన్ని జనం గుండెల్లో చిరంజీవిని చేశాయి. ఒక నాయ కుడి దూరదృష్టి, ఆయన దార్శనికత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది. ప్రభుత్వాలు మారినా ఆయన పథకాల పేర్లు మారాయేమో కానీ వాటి కొనసాగింపు మాత్రం ఆగలేదు. అదే వైఎస్ ఘనత. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి ఆయన రూపొందించిన ‘జలయజ్ఞం’ కొనసాగింపే అంతిమ పరిష్కారం.వైఎస్సార్ జలయజ్ఞం ఉభయ తెలుగు రాష్ట్రాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. కారణాలేవైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి జలాలపై ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలకులకు దూరదృష్టి లేని కారణంగా... వెనుకబడిన ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ, రాయ లసీమ, ప్రకాశం, పల్నాడు తీవ్రంగా నష్టపోయాయి. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల విభజనకు ఇలాంటి అంశాలు ప్రధాన కారణ మయ్యాయి. వైఎస్సార్ తన రాజకీయ ప్రస్థానంలో వెనుకబడిన రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక ప్రాంతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుడి ఆలోచనలు సహజంగా సంకుచితంగా ఉంటాయి. కానీ రాయల సీమ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు భిన్నంగా విశాల దృక్పథంతో వ్యవహరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. రాయలసీమకు సాగు, తాగు నీటి కోసం ఉద్యమించినప్పటికీ, అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణ, ప్రకాశం, పల్నాడుతో పాటు... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నిప్రాంతాలకు జల న్యాయం చేయడం కోసం రూపొందించిందే జల యజ్ఞం. అది పోలవరమైనా, పులిచింతలైనా, పాలమూరు–రంగారెడ్డి అయినా, పోతిరెడ్డిపాడు వెడల్పైనా, వెలుగొండ, దుమ్మగూడెం టెయిల్ పాండ్ అయినా... వైఎస్సార్ విశాల దృక్పథానికి నిదర్శనం.జల సమస్యకు శాశ్వత పరిష్కారంప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా బనకచర్లకు తరలించాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.గోదావరి నుంచి బనకచర్లకు నీటిని తరలించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాయలసీమలో నీళ్లు లేవనే కారణంతో. పుష్క లంగా నీళ్లున్న గోదావరి నుంచి అత్యంత వ్యయప్రయాసలతో నీళ్లను రాయలసీమకు తరలించాలనే ఉద్దేశ్యంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. పరిమిత ఖర్చుతో వైఎస్సార్ దుమ్మగూడెం టెయిల్‌పాండ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు కుడి కాలువ ద్వారా నీటిని తరలించవచ్చు. అదే విధంగా దుమ్ము గూడెం టెయిల్‌పాండ్ పథకాన్ని అమలు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని తరలించడం ద్వారా... తెలంగాణ అవసరాలు తీర్చొచ్చు. అప్పుడు రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండదు.వైఎస్సార్ జలయజ్ఞాన్ని యథాతథంగా అమలు చేస్తే, గోదావరి నీళ్లు బనకచర్లకు భారీ ఖర్చుతో ఎత్తిపోయాల్సిన అవసరం ఉత్పన్నం కాదు. అదే సమయంలో గోదావరి నీటితో తెలంగాణ, కృష్ణా డెల్టా అవసరాలు తీరిపోతాయి. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ పథకం అమలు అయితేనే ఇవన్నీ నెరవేరుతాయి. ఖర్చు కూడా పోలవరం, బనకచర్లతో పోల్చుకుంటే చాలా తక్కువ. శాశ్వత పరిష్కారంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆస్కారం ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఈ పథకం... విడిపోయిన తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించగలిగిన సామర్థ్యం కలిగి ఉంది.రాయలసీమ ఎత్తిపోతలకు స్ఫూర్తిరాయలసీమ జల సమస్య పరిష్కారానికి ప్రధాన ఆటంకం... ఈ ప్రాంతానికి ఉపయోగపడే నీటి ప్రాజెక్టులు లేకపోవడం. ఇప్పటికే ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కేవలం బ్యాక్ వాటర్ వాడుకునే దుఃస్థితి నెలకొని ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ద్వారా తెలంగాణ, కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలి. మరో వైపు శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డి పాడుకు నీరు అంది గాలేరు–నగరి, ఎస్ఆర్బీసీ, చెన్నైలకు 15 టీఎంసీల నీరు విడుదలకు అవకాశం ఉంటుంది. హంద్రీ నీవాకు మాల్యాల ద్వారా నీరు విడు దల చేయాలంటే, శ్రీశైలంలో 840 అడుగుల నీరు ఉండాలి. ప్రకృతిలో ఏర్పడిన అసమతుల్య పరిస్థితుల వల్ల కృష్ణా, తుంగభద్రలలో నీటి ప్రవాహం పుష్కలంగా ఉన్నా, ప్రవహించే రోజులు గణనీయంగా పడిపోతున్నాయి. శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ మాత్రమే తీసుకునే పరిస్థితుల్లో వరద ప్రవాహం తక్కువ రోజులు ఉండటం, శ్రీశైలం నుంచి అనివార్యంగా నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయాల్సి రావడం వల్ల శ్రీశైలంలో రాయలసీమ ప్రాజెక్టులు నీరు అందుకునే కనీస నీటి మట్టం నిర్వహణ కష్టతరంగా మారింది. మరోవైపు అధికారిక నీటి కేటాయింపుల సాంకేతిక సమస్య వల్ల వరద, మిగులు జలాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి రోజుల్లో పోతిరెడ్డిపాడు, మాల్యాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు లేవు.చదవండి: వైతాళికుని జననంఈ సమస్యకు పరిష్కారంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ నీవాకు నీళ్లు తరలించే ఆలోచన వైఎస్సార్ చేస్తే, ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన జగన్ పరిమిత మైన రోజుల్లో శ్రీశైలం ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు, బనకచర్ల మధ్య లోకి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. దురదృష్టవశాత్తు సాంకేతిక అనుమ తుల సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయి. దీని ఖర్చు దాదాపు రూ. 7 వేల కోట్లు మాత్రమే. ప్రభుత్వం చొరవ చూపితే స్వల్ప కాలంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయవచ్చు. దాదాపు రూ. 10 వేల కోట్లతో 100 టీఎంసీల నీరు తరలించవచ్చు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే అనేక రెట్లు తక్కువ శ్రమ ఖర్చుతో అదే ప్రయోజనాలు పొందవచ్చు.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డిరాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
YSR Ghat: మహానేతకు నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
-
Jupudi Prabhakar: YSR గారు నన్ను ఇంటికి పిలిచి ఉద్యోగానికి రాజీనామా చేయమన్నారు
-
మహానేత వైఎస్సార్ జయంతి.. తెలంగాణ నేతల నివాళులు
సాక్షి, హైదరాబాద్: నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్‌కు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు నేతలు ఘన నివాళి అర్పిస్తున్నారు. ప్రజలకు వైఎస్సార్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ..‘జనహృదయ నేతకు నివాళి. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళి. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో ప్రజాపాలన సాగిస్తున్నాం’ అని అన్నారు.తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ..‘అవిశ్రాంత ప్రజా సేవకులు. వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం. మహానేత, అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు’ అర్పించారు.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ..‘జన హృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళి. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని.. ప్రజాసంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, చిర స్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైఎస్సార్’ అని అన్నారు. -
LIVE: జన హృదయ నేతకు YS జగన్ నివాళి
-
మహానేత YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి
-
జన్మ సార్థకత వైఎస్‌కే చెల్లింది!
‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్‌గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్‌సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్‌ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్‌కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్‌ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్‌ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్.. అరుదైన చిత్రమాలిక
-
నేడు వైఎస్సార్ జయంతి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నివాళులర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న వైఎస్సార్ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.కార్యక్రమంలో పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారని టీపీసీసీ తెలిపింది. కాగా, వైఎస్సార్ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలలు కన్న సమాజాన్ని సాధించుకుందామని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
తెలుగు నేలంతా నీ అడుగు జాడలే..
కడలిపాలవుతున్న నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, ఎల్లంపల్లితో పాటు 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టిన భగీరథుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా.. పేదింటి పిల్లలు ఉన్నత విద్య చదివేలా ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యానికి భరోసా కల్పించే ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో పాలకులకు టార్చ్‌బేరర్‌గా నిలిచిన పాలనాదక్షుడు..పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు ప్రవహించేలా చేసి.. ఉపాధి అవకాశాలను సమృద్ధిగా కల్పించి.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు ఉమ్మడి ఏపీని గమ్యస్థానంగా మార్చి, ఆర్థిక మాంద్యం ముప్పును అధిగమించడమెలాగో చాటిచెప్పిన ఆర్థికవేత్త..సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత...పాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన సంస్కరణశీలి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి..! ఆ మహా నేత 76వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి : మనసు ఉండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్సార్). ఉమ్మడి ఏపీకి ఆయన సీఎంగా పనిచేసినది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మైలురాళ్లలాంటి సంక్షేమ పథకాలను, చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యకమ్రాలను చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైఎస్ పథకాలను కొనసాగించక తప్పని పరిస్థితి. వాటి పేర్లు మార్చి వైఎస్ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జనం కోసం ఎందాకైనా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. 1978లో రాజకీయ అరంగేట్రం నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం వరకు తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అటు కేంద్రంలో... ఇటు ఉమ్మడి రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారిన దశలో పాదయాత్ర చేశారు వైఎస్సార్. మండుటెండలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి 1,475 కిలోమీటర్లు నడిచి జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. కాంగ్రెస్‌ను 2004లో ఉమ్మడి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్సార్ పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాటి టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒకే ఒక్క సంతకంతో ఎత్తివేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004–09 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే దీనికి సాక్ష్యం. ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా రూ.168.52 కోట్లు..: 2004 మే 14–2007 జూన్ 26 మధ్య సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైఎస్సార్ విడుదల చేసిన మొత్తం. ఆ సమయంలో జబ్బునపడ్డ పేదల వేదన గమనించారు. ఆపత్కాలంలో సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించేలా 108 అంబులెన్స్ సర్వీసును తీసుకొచ్చారు వైఎస్సార్. గ్రామాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికంతో ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూపకల్పన చేశారు. దీంతో లక్షలాది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న అగ్రవర్ణ విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం... తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీ, తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్ సమీపంలో ఏర్పాటయ్యేలా చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ట్రిపుల్ ఐటీలను స్థాపించి లక్షలమందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు. తెలుగునేల సుభిక్షం కోసం భగీరథ యత్నం ‘1978లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాక.. కోస్తా జిల్లాల పర్యటనకు వెళ్లాను. అక్కడి కాలువలను చూశాను. కరువు ప్రాంతాల్లో కూడా ఇలా నీళ్లు పారించాలని నాలో సంకల్పం ఏర్పడింది. నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని అడిగితే దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. దీంతో నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్ గుర్తు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతో సహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేసి దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. పొదుపు వ్యవస్థలో విప్లవం ‘పావలా వడ్డీ’ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి అతి భారీ వడ్డీలు వసూలు చేస్తున్న సమయంలో... మహా నేత ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న పావలా వడ్డీ పథకం చలనం సృష్టించింది. దేశమంతా డ్వాక్రా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చింది. రాష్ట్రంలో నేడు గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల వరకు పొదుపు సంఘాలున్నాయి. వీటిలో 2,90,928 సంఘాలు వైఎస్సార్ సీఎంగా ఉన్న 2004–08 మధ్య ఏర్పడినవే. దీనికి పావలా వడ్డీ అమలే ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పావలా వడ్డీ పథకం ప్రభావంతో నేడు పొదుపు సంఘాలకు రూ.3 లక్షల్లోపు రుణాలను బ్యాంకులు 7% వడ్డీకే ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అజేయుడువైఎస్సార్ 1978ఎన్నికల్లో పులివెందుల నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983, 1985 లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1989, 1991, 1996, 1998లో కడప ఎంపీగా గెలుపొందారు. 1999 నాటికి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాదితో పాటు, 2004, 2009 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. 31 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓటమి లేకుండా.. ఆరుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.నేడు వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం హాజరు కానున్న మాజీ ఎంపీలు, హైకోర్టు మాజీ జడ్జీలుసాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా హైటెక్ సిటీ బుట్టా కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ న్యాయమూర్తులు పి.లక్ష్మణ రెడ్డి, నాగార్జున రెడ్డి, బి.శేషశయన రెడ్డి, జి.కృష్ణ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు అజేయ కల్లం, కేఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీలు వి.దినేష్ రెడ్డి, సీఎన్ గోపీనాథ్ రెడ్డిలతో పాటు వైఎస్సార్‌తో కలిసి పనిచేసిన అధికారులు పాల్గొంటారని ఈశ్వర ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.ఆయన పథకాలు.. దేశానికే మార్గదర్శకాలువ్యవసాయాన్ని పండుగ చేసే ఉచిత విద్యుత్, బంజరు నేలను సస్యశ్యామలం చేసే జలయజ్ఞం.. పేదలను విద్యావంతులను చేసే ఫీజు రీయింబర్స్మెంట్, పేదల వైద్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ,.. ఆపత్కాలంలో ఆదుకునే 108.. ఇతరరాష్ట్రాలూ చేపట్టాయి. ఆరోగ్య శ్రీ స్ఫూర్తితో మోదీ సర్కారు ఆయుష్మాన్ భారత్‌ను చేపట్టడం విశేషం. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాల్సిందేనని అప్పట్లో ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించారంటేనే వైఎస్ గొప్పదనం ఏమిటో తెలుస్తోంది. -
వైతాళికుని జననం
మహాత్ముల జననం కూడా మామూలుగానే ఉంటుంది. కానీ వారి జీవన ప్రయాణంలో వారు ఎదుగుతూ మానవాళిని తమ వెంట తీసుకువెళతారు. తెలుగు రాష్ట్రాలు మరువ లేని, మరచిపోని మహానాయకులలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అతి ముఖ్యులు.గంభీరమైన రూపం, ఆయన మనసులా తెల్లని దుస్తులు, ముఖం మీద చెరగని చిరు నవ్వు, ఆప్యాయమైన పలకరింపు, అందరితో కలసిపోయే తత్త్వం, మృదుభాషణం, నిగర్వం, సహనం, సమయ స్ఫూర్తి ఇలా అన్నీ కలిపితే ఆయనే పులివెందుల డాక్టరు, రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని సంస్కరించిన సామాజిక వైద్యుడు, ప్రజల రాజన్న, రైతుల హృదయ మెరిగిన రైతన్న.1949 జూలై 8న వై.ఎస్. జన్మించాడు. చారిత్రక మలుపునకు ఆరంభం ఆ రోజు. ఆ బాలుడు అజేయుడు, అనితర సాధ్యుడు అవు తాడనీ, ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ఎదుగుతాడనీ, రాష్ట్రాన్ని, ప్రజల మనసులను ఏలుతాడనీ ఎవరు ఊహించారో గానీ రాజులలో శేఖరుడు కావాలని ‘రాజశేఖరు’డని నామకరణం చేశారు. సాధనతో సార్థకనామధేయుడే అయ్యాడు.రూపాయి డాక్టర్కర్ణాటకలోని గుల్బర్గాలో వైద్య విద్యను పూర్తి చేసుకుని, 1972లో తిరుపతి రుయా ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా చేరారు. అప్పట్లో ‘రుయా‘ కన్నా పెద్ద ఆసుపత్రి రాయలసీమలో లేదు. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే సీమవాసులందరినీ చూసే అవ కాశం ఆయనకు లభించింది. ఆయన నిత్య విద్యార్థి. ఆ గుణం వల్ల ప్రజల సమస్యలు, పేదరికం మరింతగా అర్థమయ్యాయి.పులివెందులలో ఆసుపత్రి ప్రారంభించాడు. ఉన్న ఊరు, కన్న తల్లి రుణం తీర్చుకోలేమని కేవలం ఒక్క రూపాయికి వైద్యం చేసే వాడు. రూపాయి డాక్టరుగా ఆయన పేరు మారు మోగిపోయింది.వైద్యుడిగా రాత్రింబవళ్లు సేవ చేస్తున్నా ఆయనలో ఏదో అసంతృప్తి. సమాజానికి వైద్యం చేయాలి, తన పరిధి మరింత పెంచు కోవాలి, అపుడే అందరికీ అన్ని సౌకర్యాలు అందించగలం అని భావించిన రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. రాజకీయాలు ఈనాడే కాదు, ఆనాడు కూడా అంత స్వచ్ఛంగా ఏమీ లేవు. అవినీతి, బంధు ప్రీతి, అహంకారం, స్వార్థం– ఇవే రాజ్య మేలుతున్నాయి. కానీ నిజాయితీ గెలుస్తుందనీ, ప్రజల ప్రేమ గెలిపిస్తుందనీ భావించాడు.రాజీలేని పోరాటం చేయడం, విమర్శలను నవ్వుతూ ఎదుర్కొ నడం, అందర్నీ కలుపుకొనిపోవడం, స్థిరంగా నిలబడటం ఆయన నైజం. అందుకే ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా శాసనసభలోనూ, పార్లమెంటులోనూ తన గళం వినిపించారు.క్షమించడం నేర్చుకున్నాడు!ముక్కుసూటితనం ఆయన తత్త్వం. బెదరడం, పదవి కోసం తలదించుకుని ఒదిగి ఒదిగి వుండటం ఆయనకు రాదు. అందుకే సొంత పార్టీలో కూడా ఆయనను కొందరు కంటకులు ఇబ్బందులకు గురి చేశారు. వారిపై తిరగబడ్డాడు, వారే తోక ముడిచేలా చేశాడు. అయితే ఆయన శత్రువులను క్షమించడం నేర్చుకున్నాడు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన తండ్రి వై.ఎస్. రాజారెడ్డిని చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకోలేదు. హత్యానంతరం వారికి ఆశ్రయం కల్పించింది చంద్రబాబు అని ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాంటిది 2003 అలిపిరి వద్ద చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగితే వెంటనే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చిచంద్రబాబును పరామర్శించాడు. అంతేకాదు, తిరుపతి గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై కూర్చుని నిరసన తెలియచేశాడు.సహృదయత, సచ్ఛీలత, సంస్కారం, క్షమాగుణం, కార్యదక్షత, పట్టుదల ఇవన్నీ ఆయనలోని అంతర్లీన గుణాలు. విమానం ఎక్క గలడు, అవసరమైతే రిక్షాలోనూ కూర్చోగలడు. అధికార దండాన్నే కాదు, కార్యకర్త చేతిజెండాను కూడా మోయగలడు. అందుకే 33 ఏళ్ల చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉప నాయకుడుగా ఉన్నాడు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును ఓ సందర్భంలో సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ ధైర్యం, ఆ తెగువ చూసి దేశమే ఆశ్చర్యపోయింది. చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు గుత్తేదారుడనీ, జన క్షేమంకన్నా తన వారి క్షేమం గురించి ఆలోచిస్తాడనీ ఆనాడే గ్రహించాడు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 9 మంది శాసన సభ్యులతో 9 రోజులు నిరాహార దీక్ష చేయించాడు.రాయలసీమ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందాలనీ, కరువునేల సస్యశ్యామలం కావాలనీ ఎంతో తపించాడు. రాయల సీమకు ప్రధానంగా నీరు అందించేది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్. అప్పట్లో దాని సామర్థ్యం 1,105 క్యూసెక్కులు మాత్రమే. దాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలని పోరాటం చేసిన ముఖ్యుడు రాజశేఖర రెడ్డి. 1986లో లేపాక్షి నుండి 22 రోజులు పాదయాత్ర చేశాడు. ఈ పోతిరెడ్డిపాడు కోసం ఎం.వి. రమణా రెడ్డి, మైసూరా రెడ్డి, భూమన్, శ్రీధర్ ఇంకా అనేకమంది ఇతర నాయకులు ఆయనను అనుసరించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరు వాతనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 43 వేల క్యూసెక్కులకుపెంచాడు. నేడు రాయలసీమ మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నచంద్రబాబు ఆనాడు ఈ పెంచడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. అందరివాడునిస్సత్తువతో కుళ్లి కునారిల్లిన కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక్కడే భుజం మీదికి ఎత్తుకున్నాడు. తన పోరాట పటిమతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశాడు. తాను నాయకుడిననీ, అధికారంలో ఉన్నాననీ ఏనాడూ భావించలేదు. కడప జిల్లాలోని ఓ మారుమూల పంచా యితీ ఎన్నికలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న తన అనుచరునికి ఇబ్బంది కలిగింది. రిగ్గింగ్ ద్వారా అతడిని ఓడించాలని ప్రత్యర్థులు ప్రయత్నించారు. అది తెలిసిన రాజశేఖర రెడ్డి స్వయంగా వెళ్ళి ఎన్నికల బూత్‌లో ఏజెంటుగా కూర్చున్నాడు. సింహం ఎదురుగాఉంటే చిట్టెలుకల సమూహాలు ఏం చేస్తాయి! తన వారిని కాపాడు కోవటానికి ఆయన ‘సిరికిం జెప్పడు, శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప’ అన్నట్లు దిగివస్తాడు.తానే ఎదగాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. తన వారి చేయిని ఎన్నడూ వదలలేదు. తనను నమ్మినవారిని, వెంట ఉన్న వారిని అందరినీ భుజాలమీద ఎత్తుకుని ఉన్నత స్థానాల్లో కూర్చో బెట్టాడు. నాతోపాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, బొత్స సత్యనారా యణ, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, అంబటి రాంబాబు, జక్కంపూడి రామ్మోహనరావు, కోమటిరెడ్డివెంకటరెడ్డి, దానం నాగేందర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మా రెడ్డి, ఉదయభాను, వట్టి వసంతకుమార్, రఘువీరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి – ఇలా ఇంకాఎందరినో ఎదిగేలా చేశాడు. ఎదుగుతూ వుంటే మురిసిపోయాడు.తనకు అపకారం చేసిన వారిని, తాను ఓడిపోవాలి అని కోరు కున్న వారికి కూడా సహాయం చేశాడు. రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలనుకున్నాడు తప్ప, వారి నాశనం కోరుకోలేదు. ‘పగవారు శరణు జొచ్చిన – మగ తనములు నెరుప, తగునె మగవారలకున్’ అని మహాకవి పోతన అన్నట్లు పగవాడిని కూడా ప్రేమించిన మగవాడు వైఎస్. అలాంటి నాయకుడు ‘న భూతో న భవిష్యతి’.2003 – రాష్ట్ర రాజకీయాలలో పెద్ద మలుపు, చరిత్రలో ఓ కుదుపు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవాలని, కష్టసుఖాలుతెలుసుకోవాలని పాదయాత్రకు నడుము కట్టాడు. నిలువునా కాల్చే స్తున్న 50 డిగ్రీల ఎండ, వేడిగాలులు, ఏమాత్రం సహకరించని వాతా వరణం. అయినా సరే కదిలాడు, పేదల కన్నీళ్లను చదవటానికి. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 67 రోజులు 1,673 కిలోమీటర్లు అవిశ్రాంతంగా, మధ్యలో ఆరోగ్యం క్షీణించినా పట్టుదలతో నడిచాడు. ఎన్నో అనుభవాలు, ఎన్నో వినతులు, ఎన్నో వేదనలు విన్నాడు. నీళ్లు, కన్నీళ్లు ఎండిన ప్రాంతాలు చూశాడు.నడిచే చరిత్ర!2004లో అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించుకున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు రహస్యం అందరికీ తెలుసు, జనం గెలిపించింది రాజన్నను అని. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణం చేసిన క్షణం నేను ఆయన పక్కనే ఉన్నాను. ఆయనలో ఏదో మార్పు గమ నించాను. అధికారంలోకి వస్తే అహంకారం తలకెక్కుతుంది చాలా మందికి. కానీ వైఎస్ ముఖంలో అది లేదు. దైవదర్శనం లభించిన మహర్షి ముఖంలోని ప్రశాంతత, పరిపక్వత కనిపించాయి.ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచన, నమ్మిన ప్రజలకు అన్నీ తాను కావాలన్న అభిలాష. ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ లాంటి పథకా లను రూపకల్పన చేశాడు, జలయజ్ఞం చేశాడు. పేరుకే ప్రారంభమై ఆగిపోయిన ఎన్నో ప్రాజెక్టులను పరుగెత్తించాడు. ఆయన అందలం ఎక్కినందువల్లనేమో వరుణ దేవుడు ఆనందపడి కావాల్సినన్ని వర్షాలు కురిపించాడు. రైతుల్లో ఆనందం, రాష్ట్రంలో ఆనందం.ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి పని ఓ చరిత్ర. ఎన్నోసంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్య నక్సలిజం. ఎప్పుడూ ఎక్కడో ఒకచోట కాల్పులు, మరణాలు. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, పౌర హక్కుల నేతలు చేసిన విజ్ఞప్తిని ఆయన విన్నారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటైన సంఘంలో ఇతర పెద్దలతో పాటు నేనూ ఒక సభ్యుడిని. అధికారంతో కాల్చి చంపడం కాదు, అనురాగంతో నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువద్దాం అని ఆయన కోరుకున్నాడు.2009 ఎన్నికలలో అధిష్టానం భయపడింది ఏమవుతుందోనని. వారికి భరోసా ఇచ్చి ఒంటి చేత్తో తిరిగి అధికారంలోకి వచ్చాడు. ప్రజల పట్ల ఆయన నమ్మకం అది. ప్రజలకు ఆయన చేసిన మేలు పట్ల ఉన్న విశ్వాసం అది. అంత గొప్పవ్యక్తి సాహచర్య, స్నేహం, ఆత్మీయత, అభిమానం నాకు లభించాయి అంటే అది నా అదృష్టం. ఆయన చిరునవ్వు నా ఆస్తి. నా భుజం మీద ఆయన చేయి వేసి ‘కర్ణా’ అని పిలవడమే నా ధైర్యం. ఆయన గురించి ఎంత చెప్పినా నాకుఇంకా ఏదో మిగిలే ఉంటుంది. మంచితనం కలకాలం నిలిచిఉంటుంది అన్న అక్షరాలకు ఆయన మూలధనం. మానవుల కన్నీరు మాన్పగా కదిలిన ఆ మహా మనిషికి నేడు జన్మదినం.-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్-భూమన కరుణాకర రెడ్డి -
న్యూజిలాండ్‌లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్‌రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో లండన్లోనిని ఈస్టమ్లో దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.యూకే నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ లో పాల్గొని వేడుకల్లో భాగస్వాములైన వారిని అభినందించారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖరరెడ్డి జీవి తాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకో వడం సంతోషంగా ఉందన్నారు. మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నార న్నారు. నేతలందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ యూకే కో-కన్వీనర్ మలిరెడ్డి కిశోర్‌రెడ్డి, కీలక కమిటీ సభ్యులు శ్రీనివాస్ దొంతిబోయిన, ఎస్ఆర్ నందివెలుగు, సురేందర్ రెడ్డి అలవల, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైఎస్సార్సీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్‌ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, అరే శ్యామల, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు. -
వైఎస్సార్ పేరుతో న్యూజిలాండ్‌లో రక్తదానం
సాక్షి,అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆక్లాండ్‌లో వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ బృందం శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆనంద్ ఎద్దుల మాట్లాడుతూ జూలై 8న డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ రక్తదానంలో ఆనంద్ ఎద్దుల, బుజ్జి బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, రమేశ్ పనాటి, విజయ్ అల్ల, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సిడ్నీలో ఘనంగా జయంతి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని సిడ్నీలో శుక్రవారం ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పాలనను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న ప్రేమను గుర్తుచేసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణం, ఐటీ రంగ అభివృద్ధి, 108 అంబులెన్స్‌లు, నీటి ప్రాజెక్టులు వంటి ఎన్నో పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడ్నీ కన్వీనర్ అమర్నాథ్ రెడ్డితో పాటు ఎన్ఆర్ఐలు రామనాథ్ రెడ్డి, రాజశేఖర్ లంకెల, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ బెతంశెట్టి, విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ జవాజి, మను రెడ్డి, తిమ్మా రెడ్డి, రాజ్ బద్దం, చంద్ర మౌళి, పెద్దిరెడ్డి, ఉమేష్ కుర్బా, శ్రీనివాస్ గాయం, సురేశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాన్నా.. నా ప్రతి అడుగులోనూ మీరే స్ఫూర్తి.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్ మోడల్, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.Happy Father’s Day! Remembering the closing Day of your historic Padayatra! pic.twitter.com/Xn8qqadyKm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2025 -
నడచిన హిమాలయం... ఎగసిన ప్రజాకెరటం!
కళ్లు ఆకారాన్ని చూస్తాయి. మనస్సు ఆంతర్యాన్ని చూస్తుంది. దాని పరిధి చాలా విశాలం. మనసుతో మను షుల్ని, సమాజాన్ని చూడగలిగినవాడు, చదవగలిగినవాడు మహానాయకుడు. ఆ మహానాయకుడే మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాకు అత్యంత సన్నిహితుడు, హితుడు, గురువు, మార్గదర్శి. అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, మనిషి పట్ల మమ కారం, పేదరికాన్ని పారద్రోలాలన్న పట్టుదల, అణగారిన జనానికి అన్నీ సమకూర్చాలన్న కోరిక, సమసమాజ స్థాపన ఆయన లక్షణాలు, లక్ష్యాలు. శత్రువును కూడా క్షమించగలిగే సంస్కారం, పగవాడికైనా మేలు చేసే గుణం ఆయన సొంతం. హిమాలయ సమున్నతుడు కాబట్టే ప్రజలు ప్రేమగా ఆయ నను ‘రాజన్న’ అని పిలుచుకున్నారు. పాదయాత్ర:2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన 1,648 కిలోమీటర్ల పాదయాత్ర ఓ చరిత్ర. ఆయన వెంట నేను ఉండటం నా అదృష్టం. ఎంత జీవితాన్ని చూశానో, ఎన్ని నేర్చు కున్నానో అన్నిటికీ ‘సాక్షి’ ఆ పాదయాత్ర. 2003 ఏప్రిల్ 9న చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది మహాయాత్ర. ఆ సభా వేదికకు పైన నీడగా షామియానా వేశారు. విపరీతంగా వచ్చిన జనం అందరూ ఎండలోనే ఉన్నారు. అది గమనించిన వైఎస్ ‘జనం ఎండలో ఉంటే నేను నీడలోఉండాలా’ అంటూ షామియానా తీయించారు. మండుటెండలోనే సాగింది ఆయన ప్రసంగం. అనంతరం తొలి అడుగు వేశారు ప్రజా ప్రస్థానానికి! కీపాస్ కట్టిన పంచ, తలపాగాలతో రైతులా కదిలారు. ఆయనను దగ్గరగా చూడా లని, కరచాలనం చేయాలని, కష్టాలు చెప్పుకోవాలని, గ్రామాలకు గ్రామాలు కదలి వచ్చాయి. చేవెళ్ల దాటి కౌకుంట్ల, మన్నెగూడ, శివారెడ్డిపేట... ఇలా అనేక గ్రామాల గుండా సాగుతోంది పాదయాత్ర. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చలించిపోతున్నారు. రాత్రి బస చేస్తున్న గ్రామాలలో కొందరు పెద్దలు ఆయన వద్దకు వచ్చి అక్కడ ఏసీ సౌకర్యం ఉన్న ఇల్లు ఉందని ఆహ్వానించినా, సున్నితంగా కాదని జనం మధ్య పడుకునేవారు వైఎస్. సదాశివ పేటకు చేరింది యాత్ర. అక్కడ ఎందరో కుండలు చేస్తున్నారు. వారిని చూపించాను ఆయనకు. ‘కరుణా! చూడాల్సింది వారు చేస్తున్న కుండల్ని కాదు, వారిగుండెల్ని’ అంటూ వారి దగ్గరికి వెళ్లారు. అంత దగ్గరగా ఆయనను చూసి చెమ్మగిల్లిన కళ్లతో వారు వారి బాధల్ని చెప్పుకున్నారు. ‘మంచిరోజులు వస్తున్నాయి’ అంటూ వారిని ఓదార్చారు. ప్రజలలో కనిపిస్తున్న పేదరికం, అనారోగ్యం, కరవు చూసి చలించిపోయిన ఆయనలో అప్పుడే ఉచితకరెంటు, ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఎనిమిదవ రోజు సుల్తానాపూర్‌లో యాత్ర సాగుతోంది.ఆ గ్రామంలో నర్సారెడ్డి అనే రైతు కుటుంబాన్ని అప్పు తీర్చ మని బ్యాంకు వారు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అప్పటికే నర్సారెడ్డి ఆత్మహత్య చేసు కున్నాడు. అయినా ఆ కుటుంబాన్ని బ్యాంకువాళ్లు వేధిస్తు న్నారు. అది విన్న వైఎస్ ముఖంలో బాధ, కోపం! వెంటనే బ్యాంకు వారిని పిలిపించి నిలదీశారు, హెచ్చరించారు.బ్యాంకువారు భయపడి వెనక్కి తగ్గారు, ఆ కుటుంబం రక్షింప బడింది.పొతంశెట్టి పల్లెలో యాత్ర సాగుతోంది. ఓ యువ జంట వైఎస్ ఎదురుగా వచ్చి కాళ్ళమీద పడింది. తాము ప్రేమి కులమని, కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని, చాలా దూరం నుంచి మిమ్మల్ని నమ్మి వచ్చామని వారు చెప్పుకొన్నారు. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆయన అక్కడే అప్పుడే ఆ జంటకు వివాహం చేశారు, అక్షింతలు వేశారు. మరో నాయకుడైతే వారిని అక్కడే వదిలేసేవారు. కానీ వైఎస్ ముందుచూపుతో హైదరాబాదులోని ఓ పోలీసు ఉన్నతాధి కారికి ఫోన్ చేసి ఆ జంటకు రక్షణ కల్పించమని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సాగే దారిలో నేను, మరికొందరు మిత్రులం వైఎస్ కన్నా కాస్త ముందుగా ఆ దారిలో వెళ్లేవాళ్ళం. వైఎస్ రాక గురించీ, పాదయాత్ర గురించీ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు మా ప్రయత్నం. బురుగిద్ద గ్రామం దాటి, గాంధీనగర్ చేరుకున్నాం. అప్పటికి రాత్రి ఏడు గంటలు అయి ఉంటుంది. హఠాత్తుగా వడగళ్ళ వాన, విపరీతమైన చలి! వర్షంలో తడుస్తామని ప్రక్కనే వున్న జీపు ఎక్కి కూర్చున్నా. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. మా వెనుక దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న వైఎస్ ఆ చలిలో, వర్షంలో అలాగే తడుస్తూ వచ్చారు. అందుకే ధీరుడు, నాయకుడు అయ్యారాయన. నాయకపురం దాటి, లక్ష్మీపురం గ్రామంలో ప్రవేశించాం. అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకే పార్టీ, ఇద్దరు నాయకులు! ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేస్తున్నారు. అది గమనించిన వైఎస్సార్ ఇద్దర్నీ పిలిచి అక్కడే రాజీ చేశారు. పాదయాత్ర గోదావరి జిల్లాలలోకి ప్రవేశించింది. అక్కడ కూడా రైతు బతుకు దీనంగా ఉండటం, గ్రాసం లేక పశువు లను రైతులు సగం ధరకు అమ్ముకోవడం చూసి వైఎస్ చలించి పోయారు. సీతంపేట గ్రామంలో నాగపద్మిని అనే మహిళ వైఎస్ దగ్గరికి వచ్చింది. కుటుంబ నియంత్రణకు ఆపరేషన్ చేయించున్నాననీ, అధికారులు ఆ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారనీ చెప్పింది. వెంటనే అధికారులను పిలిపించి అక్కడే సర్టిఫికెట్ ఇప్పించారు. ఆమె చేతిలో పదిహేను రోజుల పసికందు ఉంది. ఆ బిడ్డకు ‘రాజశేఖర్’ అని పేరు పెడతానంటే, ఆయన కాదని ‘రాజీవ్‘ అని నామకరణం చేశారు. రాజ మండ్రి సమీపం కోవూరుకు చేరుకున్నాం. జన ప్రవాహం మరింత ఎక్కువయింది. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు జనం చప్పట్లు ఆగలేదు. ఆ క్షణమే అర్థమ య్యింది రాష్ట్రానికి కాబోయే అధినాయకుడు ఎవరో!2003 మే 18:తెల్లారింది. కానీ నిప్పుల కొలిమిలో నిద్ర లేచినట్లు ఉంది. వైఎస్ నీరసంగా కనిపించారు. అయినా నడక సాగింది. కానీ నీరసం తెలుస్తోంది. ఓ చెట్టు క్రింద మంచం వేసి కాసేపు కూర్చోబెట్టాం. తరువాత మెల్లగా మధురపూడి గ్రామం చేరుకున్నాం. ఆయన పూర్తిగా నీరసించి పోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. ఆరు రోజుల విరామం తరువాత మే 24న తిరిగి నడక ప్రారంభించారు వైఎస్. యాత్ర పత్తిపాడు గ్రామం దగ్గర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.జనప్రవాహం చెక్కు చెదరడం లేదు. జూన్ 11న జర్జంగి గ్రామం చేరుకున్నాం. అక్కడ రాళ్ళ క్వారీలలో వందలాది మంది వడ్డెరలు పని చేస్తున్నారు. వారంతా ఆయణ్ణి చూడటానికి వచ్చారు. తమ తలపాగాలను తీసి రోడ్డుమీద పరిచారు. దానిపై ఆయన్ని నడవమన్నారు. చూస్తున్న అందరి కళ్ళూ చెమరించాయి. శరీరాలు పులకరించాయి. అది కదా అభిమానం, అది కదా గౌరవం... అది కదా నిజమైన సన్మానం! జూన్ 15న ఇచ్ఛాపురం చేరుకున్నాం. ఆ సాయంత్రం బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. పార్టీలోని అతిరథ మహారథులందరూ వేదికపైకి వచ్చారు. లక్షలాది మందిజనం. చప్పట్లకు దిక్కులు దద్దరిల్లాయి. ఆ మహా ప్రజా ప్రస్థానానికి చిహ్నంగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మహా పాదయాత్ర పూర్తి అయింది. ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు! చాలు జీవితానికి ఈ అనుభూతి. గుర్తు చేసుకుంటే శరీరం పులకరిస్తోంది. ఆయన జ్ఞాపకంతో కళ్లు చెమరిస్తు న్నాయి. రైతు బాంధవుడైన ఆ మహానేత అడుగులో అడుగు వేసి నడచిన నా జన్మ ధన్యం. చరిత్ర ఏనాడూ మరచిపోలేని సత్యం ఈ మహాయాత్ర!-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్-భూమనకరుణాకర రెడ్డి -
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్‌గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్‌లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.శంషాబాద్‌లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. -
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్.. ఓ ఎమోషన్ -
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు. -
నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్‌కు తెరతీశారు. నందిగామ గాంధీ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్లో నిర్ణయించారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల తీరుపై వైఎస్సార్సీపీ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మొండితోక జగన్మోహన్ రావు మీడియాత మాట్లాడుతూ.. గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ట్రాఫిక్ సమస్య సాకుగా చూపి విగ్రహాన్ని తొలగించేందుకు దురుద్ధేశంతో కౌన్సిల్లో తీర్మానం చేశారు. గాంధీసెంటర్‌లో అస్తవ్యస్తంగా ఉన్న విగ్రహాలను వైఎస్సార్సీపీ హయాంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశాం. విగ్రహాలను మార్చే సమయంలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే మార్పు చేశాం’’ అని ఆయన వివరించారు.విగ్రహాలను మారుస్తున్న సమయంలో అప్పటి టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ విగ్రహం తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినా అక్రమంగా తీర్మానం చేసి విగ్రహాన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారు వైఎస్ జగన్ పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల కాలంలోనే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనించాలి. ఈ క్షణం ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం’’ అని మొండితోక జగన్మోహన్రావు చెప్పారు. -
వైఎస్‌ను దోషిగా నిలబెట్టాలని చూశారు: సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఓబుళాపురం మైనింగ్ అంశంలో ఎలాంటి తప్పు చేయకపోయినా పన్నెండున్నర సంవత్సరాలపాటు అవమానాలు భరించా. మానసిక వేదన అనుభవించా. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఇన్నాళ్లూ పోరాడా. అంతిమంగా న్యాయం గెలిచింది. వాస్తవాలను పరిశీలించిన సీబీఐ కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం ఆనందంగా ఉంది’అని మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసు నమోదు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. ‘నన్ను ముందు పెట్టి అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. మేము ఈ మైనింగ్ లీజు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా, న్యాయపరంగానే అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కేబినెట్ ఆమోదంతోపాటు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సైతం ఉన్నాయి. విధానపరమైన నిర్ణయంలో ఎక్కడా మేము తప్పు చేయలేదు. మాపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయారు. కాబట్టే న్యాయస్థానం నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అంతా చట్టబద్ధమే..: కృపానందం ‘ఓబుళాపురం మైనింగ్ లీజు విషయంలో చట్ట నియమ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. ఎక్కడా పొరపాటు చేయలేదు. న్యాయపరంగా కూడా ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే న్యాయస్థానం ఈ కేసు నుంచి నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన బి. కృపానందం అనందం వ్యక్తం చేశారు. గనుల లీజు అంశం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనేది కాదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే మంజూరు అవుతాయని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొదటి రెండు చార్జిషీట్లలో తమ పేర్లు లేకపోయినా మూడో చార్జిషీట్లో సీబీఐ తన పేరు ఎందుకు చేర్చిందో ఆ సంస్థకే తెలియాలన్నారు. గనులను లీజుకిచ్చే విధానపరమైన నిర్ణయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మినందునే నిర్దోషిగా తనను, ప్రజాప్రతినిధిని ప్రకటించిందని ఆయన చెప్పారు. జైలుకు పోతానని ప్రత్యర్థులు హేళన చేసినా..‘కన్నీళ్లతో తొలిసారి ఇదే సీబీఐ కోర్టు మెట్లెక్కా. నేను అవినీతికి పాల్పడ్డానని.. జైలుకు పోతానని నా ప్రత్యర్థులు హేళన చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి చేశానని.. దోపిడీకి పాల్పడ్డానని ఎన్నో నిందలు, ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని, నన్ను దోషులుగా నిలిపేందుకు ప్రయత్నించారు. మా నైతికతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు, నిందలు మోపినా నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకొని నా వెంట నిలిచారు. నేను బాధపడ్డప్పుడు ఇంట్లోని వారంతా నాకు ఎంతో ఆప్యాయతతో సహకారం అందించారు. కోర్టుకు వెళ్లినప్పుడు నా ప్రజలు వెంట వస్తే లాఠీచార్జి చేసిన పరిస్థితులు ఉండేవి. మేము ఎలాంటి తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా. నా నమ్మకం గెలిపించింది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న బాధ నుంచి బయటపడ్డా. ఇక మరింత ఉత్సాహంతో ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తా’అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. -
YSR మావోయిస్టుల చర్చల సారాంశాన్ని కుల్లంకుల్లా దేశం ముందు ఉంచాడు
-
జోహార్ వైఎస్సార్
-
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైన కంచ గచ్చిబౌలి భూములను నాటి చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందని.. వారి కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెర విడిపించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో బిల్లీరావు కు కట్టబెట్టిన భూముల కేటాయింపులను రద్దు చేసి, దానిపై న్యాయపోరాటం చేసినది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ భూములను స్వాదీనం చేసుకోవడం ద్వారా అద్భుత ముగింపు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడి ప్రజలకు కానుకగా ఇచ్చామని, అవే భూముల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణానికి ఎలాంటి ఇక్కట్లు కలగకుండానే అభివృద్ధి ఉంటుందని హామీ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం రగులుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివాద అంశాలపై స్పష్టత ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు హయాంలో ధారాదత్తం.. ‘‘యూనివర్సిటీ భూములను చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు 9న బిల్లీరావు అనే వ్యక్తికి చెందిన ఐఎంజీ భారత్‌కు అప్పనంగా ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2004 ఫిబ్రవరి 10న సేల్‌డీడ్ ద్వారా 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు ఇచ్చారు. దీనికి బదులుగా యూనివర్సిటీకి గోపన్‌పల్లిలో 397 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్సిటీకి, బిల్లీరావుకు లబ్ధి జరిగితే నష్టపోయినది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలే. వైఎస్ పోరాడితే.. మేం ముగింపునిచ్చాం.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బిల్లీరావుకు కట్టబెట్టిన భూములను రద్దు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2006 అక్టోబర్ 21న సేల్‌డీడ్‌ను రద్దు చేస్తూ.. భూములను తిరిగి స్వా«దీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బిల్లీరావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. వైఎస్సార్ బలంగా న్యాయపోరాటం చేశారు. క్రమేణా రాష్ట్ర విభజన అనంతరం ఈ భూముల అంశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కోర్టులో న్యాయపోరాటం మొదలుపెట్టింది. 2024 మార్చిలో హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇస్తే.. బిల్లీరావు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సైతం బలమైన వాదనలు వినిపించింది. దీనితో అదే ఏడాది మే 3న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వైఎస్సార్ చేసిన పోరాటానికి ప్రభుత్వం అలా ముగింపునిచ్చింది. దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్న భూమిని స్వా«దీనం చేసుకుంది. రాష్ట్ర ఆస్తి రాష్ట్ర ప్రజలకే దక్కాలన్నది ప్రభుత్వ భావన. ఇది ప్రజల విజయం. కుట్రదారులే అశాంతి రేపుతున్నారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లీరావుకే భూములు చెందాలన్న లక్ష్యంతో మౌనంగా ఉంది. పంచుకుని తిందామని చూసింది. అప్పుడు కోర్టులో కొట్లాడకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ దానికి వంత పాడుతోంది. యువతలో అశాంతిని నెలకొల్పి ప్రభుత్వంపై ఉసిగొల్పాలన్నదే వారి లక్ష్యం. ఈ కుట్రలపై యువత అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలకు పోవద్దు. పోలీసులు సైతం సంయమనంతో వ్యవహరించాలి..’’అని భట్టి పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు లక్ష్యంగా అభివృద్ధి.. యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువత ఆశయాల కోసం కట్టుబడలేదు. అటు ప్రభుత్వ రంగంలో, ఇటు ప్రైవేటు రంగంలో ఉపాధి ఊసే లేదు. ప్రస్తుత ప్రభుత్వం యువత కోసం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ భూముల్లో ఐటీ హబ్, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హైటెక్ సిటీ ఫేజ్–1, 2 ఏర్పాటు చేస్తాం. దీనిద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్‌కు ఇప్పటికే ఉన్న గ్లోబల్ సిటీ పేరును మరింత విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప.. ఎవరి సొంత ప్రయోజనాలు లేవు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిరక్షిస్తూనే అభివృద్ధి చేపడతాం. -
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్ఆర్ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి. ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్ రాక్ పైథాన్, బోయాస్ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.ఆదాయం కోసం ఆరాటమే తప్ప..‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. పక్కనే కాంక్రీట్ జంగిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్ చేసింది. ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి. నాడు వైఎస్సార్ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్ భూములే. నాడు పిల్ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.గూగుల్ ఫొటోలే ఆధారామా?‘గూగుల్ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి. దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని సర్కార్ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. -
వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి ఎమ్మెల్యే అయ్యా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి రికార్డు సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎప్పుడు చూసినా పంచెకట్టులోనే కనిపిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దేశ విదేశాలు ఎక్కడికి వెళ్లినా పంచెకట్టులోనే వెళ్తారు. ఆయన ఆహార్యం అందరినీ ఆకట్టుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఆయన పంచెకట్టులోనే తిరగడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంచెకట్టుతో ఉంటున్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా పంచెకట్టు మూలంగా సులువుగా గుర్తు పట్టేస్తుంటారు. ఈసందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ అభిమానిగా ఆయన పంచెకట్టు నన్నెంతో ఆకట్టుకునేది. ఆయన అడుగుజాడల్లో నడిచిన నేను కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయ్యాను. అప్పుడే కేసీఆర్ పోటీ చేస్తున్నాడని తెలియడంతో నా ఆహార్యంలో మార్పు ఉండాలనుకున్నాను. దీంతో వైఎస్సార్‌లా పంచె కట్టాలని నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా పంచెకట్టులోనే వెళతాను’ అని అన్నారు. విదేశాలకు వెళ్లినపుడు కూడా చాలా మంది దగ్గరకు వచ్చి కలిశారని, ఆంధ్ర ప్రాంతానికి వెళ్లినపుడు తనను గుర్తుపట్టి, పలకరించి సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారన్నారు. -
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్‌చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్‌లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్‌గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్‌లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నా..ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్–ఈ కేడర్‌లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్‌ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్ఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా -
విశాఖ స్టేడియంకు వైఎస్సార్ పేరును కొనసాగించాలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రచేసి స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్ ఆర్చ్పై, స్టేడియానికి చెందిన ఫసాట్లలో వైఎస్సార్ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీమంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలతో ఆభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తొలగించిన వైఎస్సార్ పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు హౌస్ అరెస్ట్..మరోవైపు.. ఈనెల 19న విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన చేపడుతుందని పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లుచేసి బెదిరించారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్టుచేస్తామని హెచ్చరించారు. విశాఖ నార్త్ నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్సార్సీపీ ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు.ఐపీఎల్ మ్యాచ్లవల్లే శాంతియుత నిరసనమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ఈనెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న ఉద్దేశంతో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేశామని మాజీమంత్రి, విశాఖజిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఆర్చ్పై వైఎస్సార్ పేరు తొలగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ మార్క్, ఆయన బ్రాండ్ కనబడకూడదనే వైఎస్సార్ పేరును తొలగించేందుకు కుట్ర చేశారని అమర్నాథ్ మండిపడ్డారు. గతంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీతకొండ వ్యూ పాయింట్‌కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని ఆక్షేపించారు.అలాగే, విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్‌కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవేకాక.. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేకచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా..? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా..? 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
‘వైఎస్సార్’ను జనం గుండెల్లో నుంచి తొలగించలేరు
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే , పార్టీ అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు. స్వయంగా చంద్రబాబు కుమారుడే లోకేష్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుమట్లు.. కోడుమూరులో నిన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, నాగార్జున యూనివర్శిటీ సహా అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. చివరికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. జనం రావటంతో ఆ ముష్కరులు పారిపోయారన్నారు.‘రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కారులు వైఎస్ఆర్ విగ్రహాలపై పడ్డారు. విగ్రహాలను తొలగించ గలరేమోగానీ జనం గుండెల్లో నుండి వైఎస్సార్ ని తొలగించలేరు. తన తెచ్చిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్ దేవుడయ్యాడు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు అన్నీ తెలుసు. రాయలసీమకు వైఎస్సార్ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారు. వైఎస్ జగన్ నేరుగా ఎన్టీఆర్ పేరుతో జిల్లానే ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం వైఎస్సార్ పేరును తొలగిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే 4 లక్షల మంది పెన్షన్‌దారులకు పెన్షన్ కట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. కూటమి నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదువిశాఖపట్నంలో స్టేడియం పేరు తొలగించటం దారుణం. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? , కూటమి నేతలు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లుంచుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
వైఎస్సార్ పేరు అంటే చంద్రబాబుకు వణుకు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్సార్ పేరును గోడల మీద, స్టేడియం మీద నుంచి చెరిస్తారేమో కానీ.. ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అన్నారు. వైఎస్సార్ పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతోందన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వైఎస్సార్సీపీ లేకుండా చేయాలని చూస్తున్నారు. వైఎస్సార్ పేరు, బ్రాండ్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరు తొలగించారు. సీతకొండ వ్యూ పాయింట్‌కి వైఎస్ పేరు చేరిపివేశారు. వైఎస్సార్ పేరు గోడల మీద, స్టేడియం మీద నుంచి చెరిస్తారేమో కానీ.. ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు.రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేపడతాం. వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తుగా క్రికెట్ స్టేడియానికి పేరు పెట్టారు. వైఎస్సార్ పేరు వింటేనే కూటమి నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్లో లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగించారు. అలాగే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు. ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరును కూడా చంద్రబాబు పెట్టలేకపోయారు. కానీ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన నాయకుడు వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
జన హితం.. వైఎస్సార్సీపీ లక్ష్యం
సాక్షి, అమరావతి : సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఒక్కడితో మొదలైన వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. రాజకీయంగా వైరి పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై.. చంద్రబాబు, సోనియా గాంధీ కుట్ర చేసి అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలు అక్రమంగా జైల్లో నిర్బంధించినా వైఎస్ జగన్మోహన్రెడ్డి లెక్క చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా.. విలువలు, విశ్వసనీయతతో ప్రజలకు పార్టీని చేరువ చేశారు. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 14 నెలలపాటు 3,648 కి.మీల దూరం యాత్ర సాగింది. ఫలితంగా టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ.. 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50 శాతానికిపైగా ఓట్లు, 151 శాసన సభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు జమ చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కట్టడం.. సూపర్ సిక్స్‌తోపాటు 143 హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. అయినా పది నెలలుగా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్సీపీ విధానం ప్రజా పక్షమని చాటి చెబుతున్నారు. నేడు పార్టీ జెండాను ఆవిష్కరించనున్న వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లే మార్గాలను పార్టీ రంగులతో తోరణాలుగా తీర్చిదిద్దారు. బుధవారం ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా ఎగర వేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు పిలుపునిచి్చంది. -
పులివెందులలో వైఎస్ జగన్ చేతుల మీదుగా రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
పులివెందుల పర్యటన: రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం.. ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ఆస్పత్రిని అధునీకరించడం విశేషం. రాజారెడ్డి ఐ సెంటర్‌గా ఇవాళ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. -
నాడు వైఎస్సార్, జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు
సాక్షి, నాగర్ కర్నూల్ / నారాయణపేట: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ సీఎంరేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన కుమారుడు జగన్సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజమెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. -
అందరికీ అమ్మ.. వైఎస్ జయమ్మ
పులివెందుల రూరల్ : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. కానీ ఏమీ అడగకుండానే పేదలకు సాయం అందించిన అమ్మ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్.జయమ్మ. వైఎస్.జయమ్మ జీవించి ఉన్నంతకాలం పులివెందులకు సంబంధించిన ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ అను నిత్యం దాన,ధర్మాలలో మునిగిపోయేది. మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరిన తర్వాత 2006 జనవరి, 25న జయమ్మ తుదిశ్వాస వదిలారు. అంతకుమునుపు 2003లో వైఎస్సార్ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొనేందుకు పాదయాత్ర చేసిన సందర్భంలో తల్లిగా వైఎస్.జయమ్మ కుమిలిపోతూనే.. ఇంట్లో పాదయాత్ర చేస్తూ బిడ్డకు మంచి జరగాలని రోజూ ప్రారి్థంచేది. అంతేకాదు 1999లో విపరీతమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు పది మందికి పట్టెడన్నం పెట్టాలని భావించిన మాతృమూర్తి వైఎస్.జయమ్మ. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఐదారు వందల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించి ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా 1995 నుంచి 2000 వరకు పులివెందుల సర్పంచ్‌గా పనిచేసిన వైఎస్.జయమ్మ అప్పటి ప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచ్ అవార్డుతోపాటు పంచాయతీని ఆదర్శంగా నిలిపి ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే వైఎస్.జయమ్మ జీవించినంత కాలం ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ పులివెందుల అమ్మగా గుర్తింపు పొందారు. ఆమె మరణించి నేటికి సరిగ్గా 18ఏళ్లు అవుతోంది. నేడు వైఎస్ జయమ్మ వర్ధంతి వేడుకలు దివంగత వైఎస్.రాజారెడ్డి సతీమణి వైఎస్.జయమ్మ 19వ వర్ధంతి వేడుకను శనివారం పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారు. వైఎస్.జయమ్మ సమాధి వద్ద ప్రార్థనలతోపాటు.. స్థానిక పార్క్ వద్ద ఉన్న జయమ్మ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, దివంగత వైఎస్.జార్జిరెడ్డి సతీమణి వైఎస్. భారతమ్మలతోపాటు వైఎస్సార్ సోదరుడు వైఎస్.సు«దీకర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులరి్పంచనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. -
బాబుకది షరా మామూలే!
బాబుకది షరా మామూలే! ‘‘చంద్రబాబూ..కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో నీకు నీవే సాటి’’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్య ఇది. 1999-2004 మధ్యకాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా బాబు ఉన్నారు. ఈ సమయంలో ఆయా సందర్భాలలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను వేలెత్తి చూపుతూండేవారు. ‘‘అబద్దాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలవుతుంది అని శాపం ఉంది’’ అని కూడా వైఎస్సార్ ఎద్దేవ చేసేవారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసత్యమైనా తన అవసరానికి తగ్గట్టు మాట్లాడేవారని చెప్పాలి.ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సఫలమయ్యారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తరువాత ఇంకో మాట మాట్లాడటం విషయంలో ముప్పై ఏళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడూ బాబు ఉన్నారు. అబద్దాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట! చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితోపాటు మేనిఫెస్టోలో మరో 175 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తామని, సంపద సృష్టించడం తనకు తెలుసు అంటూ నమ్మబలికారు. లోకేష్, పవన్కళ్యాణలు కూడా బాబు వాగ్ధానాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు అవుతాయా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు... ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ అని ప్రకటించేశారు. అరె... తమకు తెలియకుండా అన్ని హామీలెప్పుడు అమలు చేశారబ్బా అని ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతైంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి ఉత్తుతివే అని అందరూ అనుకుంటున్నప్పుడు ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు. అందుకే హామీలన్నీ అమలు చేసేశామన్న భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారని అనుకోవాలి. అయితే వృద్ధుల ఫించన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం మినహా మరే ఇతర హామీ అమలు కాలేదన్నది వాస్తవం. పైగా... లక్షల మంది ఫించన్లకు కోత పెట్టిన తరువాత కానీ మొత్తం పెంపు జరగలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. ఎంతమందికి నిజంగా అందిందన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా, మరో నాలుగు నెలల వరకు ఆ ఊసే ఎత్తడానికి వీలు లేదు. అంటే నెలకు రూ. 200ల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని అడిగితే సమాధానం మాత్రం బాబూ అండ్ కో నుంచి ఉండదు. ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు కేసులు బనాయించేస్తారు. కేసులు వస్తాయి. జైలుపాలు కావాల్సి ఉంటుంది. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.1500 చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారమైతే చేశారు కానీ.. ఇచ్చింది సున్నా! తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని.. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తే తాము ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని ఊదరగొట్టారు. ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు వస్తాయని, ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని కూడా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చిన విషయం ఎవరూ మరచిపోలేదు కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్ధికి ఈ పథకం అంది ఉంటే ఒట్టు! రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన రూ.13500 కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ గురించి అసలు మాట్లాడటమే లేదిప్పుడు. అయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తరపోవడం తప్ప చేసేది ఏముంటుంది. ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి.ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని, అంతవరకు నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామన్న భృతి కూడా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇవి కాకుండా మానిఫెస్టోలో వలంటీర్ల కొనసాగింపు, వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం, బీసీ, ఎస్సీఎస్టీ వర్గాల వారికి యాభై ఏళ్లకే రూ.4 వేల చొప్పున ఫించన్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న హామీ కూడా అమలు కాకపోగా.. అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు పోగా.. ప్రజలపై రూ.15 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. బహుశా చంద్రబాబు సృష్టిస్తానన్న సంపద ఇలా జనాలపై బాదడం ద్వారానే అనుకోవడం ప్రజల వంతైంది. ఒకపక్క ప్రజలకు పైసా విదల్చని ప్రభుత్వం ఇంకోపక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు తెచ్చుకుంటున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయల అప్పులు తేవడం ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే అలివికానీ హామీలు బోలెడన్ని చేసి ఎన్నికల తరువాత అన్నీ తూచ్ అనేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో హామీ ఇచ్చిన బాబు తరువాత ఎన్ని పిల్లిమొగ్గలు వేసింది ఇటీవలి అనుభవమే. ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్నా, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీలతో జత కట్టే అంశంలో గమనించినా, ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, అన్ని అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
ఇడుపులపాయ : వైఎస్ఆర్కు నివాళులర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ నేతలపై అనుమానం
-
ఐక్యంగా పోరాడండి: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘వైఎస్సార్సీపీ నాయకులు ఐక్యంగా పోరాటం చేయాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి...’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్న ఆయన నేరుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సు«దీర్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ భరోసా కలి్పంచాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆదేశించారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బీ అంజాద్‌బాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులతో సమావేశమై పలు విషయాలు చర్చించారు. అనంతరం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు.బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆయా ప్రాంతాల నాయకులతోను వివిధ అంశాలపై చర్చించారు. కాగా, పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ... ఆగి పలకరిస్తూ... వారి వినతులు స్వీకరిస్తూ... వైఎస్ జగన్ భాకరాపురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద సెల్ఫీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల రూ.530 కోట్లతో నిరి్మంచారు. 605 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తిచేశారు. ఎన్ఎంసీ తనిఖీల అనంతరం 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే కూటమి ప్రభుత్వం మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లు తిరస్కరిస్తూ లేఖ రాసింది. దీంతో ఈ ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వేంపల్లె నుంచి పులివెందులకు వెళుతూ మార్గమధ్యంలోని మెడికల్ కళాశాల వద్ద ఆగి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులు, కొంతమంది ఉద్యోగులు మెడికల్ సీట్లు భర్తీ చేసి వైద్య కళాశాలను నిర్వహించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం తిరస్కరించిందని వైఎస్ జగన్‌కు వివరించారు. ఇక్కడ నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
YS Jagan: వైఎస్సార్‌కు ఘన నివాళులు
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
ధర్మ ద్రోహం బాబుదే
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: విదేశీ దండయాత్రికులను మించి ఆలయాలను నేలమట్టం చేసిన చరిత్ర సీఎం చంద్రబాబు సొంతం! తిరుమల వేయి కాళ్ల మండపం నుంచి విజయవాడలోని పురాతన ఆలయాల దాకా ఆయన తీరు ఇదే! వదాన్యుల ఔదార్యంతో భక్తులు, బాటసారుల కోసం ఏర్పాటైన సత్రాలను సైతం విక్రయించి సొమ్ము చేసుకునేందుకు వెనుకాడ లేదు. బెజవాడ అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజల కలకలం బాబు నిర్వాకమే కదా! ఇక చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటతో డజన్ల సంఖ్యలో భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! దేవాలయాలను కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన చరిత్ర చంద్రబాబుదైతే వేల ఆలయాలను నిర్మించడంతోపాటు జీర్ణోద్ధారణ పనులు సైతం చేపట్టి హైందవ ధర్మాన్ని గౌరవించిన మనసున్న పాలకుడు వైఎస్ జగన్. ఆలయ నిర్మాణం, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనే. ఏడుకొండల వైభవాన్ని చాటి చెబుతూ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైంది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. మతాలకు అతీతంగా మానవత్వానికి పెద్దపీట వేసిన పాలకులు వైఎస్సార్, వైఎస్ జగన్. మూడేళ్లకు ఒకసారి ధార్మిక పరిషత్తు కమిటీలను నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో మాత్రమే ఏర్పాటయ్యాయి. నిత్య పూజలకు నోచుకోని వేలాది దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం ద్వారా దీపాలు వెలిగించిన వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు బరి తెగించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. పద్నాలుగేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గుర్తుండిపోయే కార్యక్రమాలు ఒక్కటైనా చేపట్టని సీఎం చంద్రబాబు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిందలు వేయటంపై భక్తకోటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఆయన నిర్వాకాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. శ్రీరాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని చెబుతారు... మరి ధర్మ ద్రోహం చేసింది ఎవరు? విశాఖలో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన శ్రీవారి ఆలయం శరణం అయ్యప్పా..!!భక్తులు అయ్యప్ప మాల ధరించడం కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎగతాళిగా మాట్లాడారు. మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్రం ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని నాడు దారుణంగా వ్యాఖ్యానించారు.బాబు పాలనలో కూల్చివేతలు.. విక్రయాలు.. క్షుద్రపూజలు!⇒ తిరుమలలో 1472 సంవత్సరంలో నిర్మించిన పురాతనమైన వెయ్యి కాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వమే. ⇒ గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ⇒ బెంజి సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను చంద్రబాబు తన సన్నిహితుడి విద్యా సంస్థకు కారుచౌకగా కట్టబెట్టారు. ⇒ 2014– 19 మధ్య సింహాచలం ఆలయ భూముల రికార్డుల నుంచి వందల ఎకరాల భూమి మాయమైనట్లు దేవదాయ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ⇒ విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో మాన్సాస్ ట్రస్టుకు విశాఖ చుట్టు పక్కల ఉన్న విలువైన భూములను 2014లో చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. ⇒ అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూములను టీడీపీ నాయకులకు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టేందుకు చేసిన యత్నాలపై వైఎస్సార్ సీపీ న్యాయ పోరాటం చేసింది. ⇒ చంద్రబాబు హయాంలో ఆలయాల పాలక మండళ్ల సభ్యులుగా నియమించిన టీడీపీ నేతల ఆగడాలతో వివిధ సందర్భాల్లో ఐదుగురు అర్చకులు మృతి చెందినట్లు అర్చక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ హయాంలో కీలక నిర్ణయాలు⇒ రాజకీయ నేతల జోక్యానికి తావు లేకుండా దేవదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్ట సవరణలు చేసింది. ⇒ దేవదాయ శాఖ పరిధిలో కనీస వార్షికాదాయం లేని వేలాది ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా దివంగత వైఎస్సార్ తెచ్చారు. తొలి విడతగా 3,500 ఆలయాల్లో అమలు చేశారు. ⇒ వైఎస్సార్ హయాంలో భక్తులకు స్వామి వారి అన్న ప్రసాదాలు ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు, అన్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది కూడా వైఎస్ పాలనలోనే. తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాల ద్వారా భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారు. దివ్య దర్శనం టోకెన్లు, చంటి పిల్లలకు దైవ దర్శనం, తిరుమలకు వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరూ తిరునామం తిలక ధారణ చేయాలనే నిబంధన తెచ్చారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరుగాడకుండా పవిత్రతను పరిరక్షించారు. స్వామి వారి వైభవం చాటేందుకు భక్తి చైతన్య రథాలు తెచ్చారు. ⇒ వేద విద్య, విజ్ఞానం, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో టీటీడీ 2006లో వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలో ఆధ్యాత్మీక విద్య అందించే ఏకైక యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని విభాగాలను విస్తరించే దిశగా అడుగులు వేశారు. ⇒ ఏడుకొండల వైభవాన్ని దశదిశలా చాటేందుకు నాటి సీఎం వైఎస్సార్ సూచనలతో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి 2008 జూన్‌లో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించారు. భక్తులను ఆధ్యాత్మీక సాగరంలో ఓలలాడించే కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అశేష భక్త కోటి ఎస్వీబీసీ చానల్ ద్వారా వీక్షిస్తోంది. ⇒ శ్రీనివాసుడి వైభవాన్ని చాటిన వాగ్గేయ కారుడు అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే. 75 మంది వేద పండితులతో విద్వత్తు సదస్సులు కూడా నిర్వహించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహం పేరుతో నిత్యం హోమం నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా వైఎస్సార్ పాలనలోనే. ⇒ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళసూత్రాలు, వెండి మెట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. మంగళసూత్రాలు, మెట్టెలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 36 వేల నూతన జంటలకు పంపిణీ చేసి శ్రీవారి కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా వేడుకగా వివాహం జరిపించారు. ⇒ దళిత, గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ పాలనలోనే. స్వామి వారినే దళిత, గిరిజన వాడలకు తీసుకెళ్లి శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే కార్యక్రమం చేపట్టారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చి సమానత్వాన్ని చాటారు.జగన్ పాలనలో ధర్మ సంరక్షణ ఇలా..⇒ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో టీటీడీ చైర్మన్ నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశీ ఆవు పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను విస్తరించారు. సుమారు 150 పాలిచ్చే ఆవులను సంరక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గో మహా సమ్మేళనం నిర్వహించారు. ⇒ చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గోవింద కోటి, రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద, రామకోటి రాసిన పిల్లలకు వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పించింది. గోవింద నామ కోటి పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందించింది. ⇒ టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాలు పెంచారు. కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపారు. ⇒ వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారికి ఓపిక ఉన్నంత కాలం పని చేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ⇒ తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ ⇒ తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా నివసించే ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ⇒ వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సుమారు రూ.350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,635 నూతన ఆలయాలను నిర్మించారు. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీరో్ణద్ధారణ చేశారు. ⇒ అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్ము కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. ⇒ వైఎస్సార్ తరహాలో వేద విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ⇒ గత ప్రభుత్వం తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు, వేద విద్వాంసులు, పీఠాధిపతుల సలహాలతో పునరుద్ధరించారు. ⇒ మఠాధిపతులు, ఆగమ పండితులతో 2022 ఆగస్టులో రెండో విడత ధార్మిక పరిషత్‌ను నియమించి నిర్ణయాధికారాలు కల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. ⇒ దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపనకు తావు లేకుండా కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం రోజుల తర్వాత భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖకు ఆర్డినెన్స్ ద్వారా కట్టబెట్టారు. ⇒ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ వంశపారంపర్య ధర్మకర్తలు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. ⇒ 2014– 19 మధ్య విజయవాడలో కృష్ణా నది ఒడ్డున 30కిపైగా పవిత్ర దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చి వేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని పునఃనిర్మించింది. ⇒ 2021 మే 14న జీవో నెంబరు 52 జారీ చేయడం ద్వారా గతంలో రూ.5,000 వేతనాలు పొందే వారికి రూ.పది వేల చొప్పున, రూ.పది వేల వేతనం పొందేవారికి రూ. 15,625 చొప్పున వేతనాలను పెంచుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ⇒ వంశపారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నది గత ప్రభుత్వమే. ⇒ ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు గత ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేసింది. ⇒ అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి రూ.48.33 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ⇒ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అర్చక సమాఖ్య నాయకులకు స్థానం కల్పించింది. ⇒ పాలక మండలి సభ్యులెవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించేలా చట్ట సవరణ తెచ్చింది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు స్టైఫండ్ రూ.3.06 కోట్లు అందజేసింది. ⇒ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ⇒ మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి నిర్ణయాధికారాలు కల్పించిన వైఎస్ జగన్⇒ 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ధూప దీప నైవేద్య పథకాన్ని 1,600 ఆలయాలకు పరిమితం చేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం 5,338 ఆలయాలలో అమలయ్యేలా చర్యలు తీసుకుంది.⇒ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడసేవకు భక్తులు అందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడసేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి నెలా పున్నమి గరుడసేవ ద్వారా ఎంతో మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించింది.⇒ ఆలయ నిర్మాణం, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనే. గతంలో ఇతర ఆలయాల నుంచి సమకూరిన కామన్ గుడ్ ఫండ్ నిధుల నుంచే ఈ కార్యక్రమాలు చేపట్టగా వైఎస్ జగన్ ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ దుర్గ గుడి ఆలయ అభివృద్ధికి ఖజానా నుంచి రూ.70 కోట్లు మంజూరు చేసింది. -
వైఎస్ఆర్ అంటేనే ఒక చరిత్ర..
-
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
AP: వైఎస్ఆర్కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు
సాక్షి,విశాఖపట్నం: దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం(సెప్టెంబర్2) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్‌రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎంకు లేదు: బొత్సవైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి.ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగింది.పార్టీలకతీతంగా వైఎస్‌ను ప్రజలు ఆరాధిస్తారు.వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్జగన్ పయనిస్తున్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారు.వైఎస్ ఆశయాలను మేమంతా కలిసి ముందుకు తీసుకువెళ్తామని ప్రమాణం చేస్తున్నాంప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.వైఎస్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు.మళ్లీ వైఎస్ జగన్ ను మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలివైఎస్ఆర్ జిల్లాలో.. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీదేవి, మాజీ ఆప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ,కౌన్సిలర్లు, నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన -
మరపురాని మహానేత.. ఇడుపులపాయంలో నివాళులర్పించిన జననేత (ఫొటోలు)
-
నాన్నకు కన్నీటి నివాళి
-
వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని.. జగన్ భావోద్వేగం
వైఎస్సార్, సాక్షి: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిన.. వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్.. మిస్ యూ’ అనే ఓ సందేశం ఉంచారు. We miss you, Dad pic.twitter.com/lzNm7wSHJn— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2024 -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత
సాక్షి, అమరావతి: వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే! కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు. భౌతికంగా దూరమైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సోమవారం వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ జీవచ్ఛవంలా మారిన తరుణంలో వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండలో 1,475 కి.మీ. నడిచారు. పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. ఆరోగ్యశ్రీ... ఫీజులు 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.168.52 కోట్లను వైఎస్సార్ విడుదల చేశారు. అనంతరం ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 108, 104 స రీ్వసులను ప్రారంభించారు. ఆయన తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లక్షలాది పేద విద్యార్థులకు మేలు జరిగింది. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్సిటీ.. తిరుపతిలో పశువైద్య కళాశాల, హైదరాబాద్‌లో ఐఐటీని ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. జలయజ్ఞం ద్వారా ఒకేసారి 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేశారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిరి్మంచారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. -
ప్రజల బాగు కోరిన పాలకుడు
ముఖ్యమంత్రి పదవిని లక్కీ లాటరీలా పొందినవారు కొందరు, పైరవీలతో చేజిక్కించుకున్నవారు కొందరు, తెలివిగా పావులు కదిపి సాధించినవారు కొందరు... ఈ కేటగిరీల్లో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఎందరినో చూశాం. పూర్తి ప్రజాదరణతో ఒకే ఒక్కడై నిలిచి, గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి... కాదు శక్తి... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే! జమ్మలమడుగులో పుట్టి, స్వగ్రామం పులివెందులలో, బళ్లారిలో చదివి, గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టరుగా పులివెందులలో రూపాయి డాక్టరుగా ఊరి జనానికి చేరువయ్యారు. చిన్ననాటి నుండీ గాంధీ, నెహ్రూలపై పెరుగుతూ వస్తున్న అభిమానం ఆయనను కాంగ్రెస్‌కు చేరువ చేసింది. పులివెందుల డిగ్రీ కాలేజీ స్థాపించి విద్యాభివృద్ధికీ, 20 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరి చుట్టుపక్కల ప్రజలకూ దగ్గరయ్యారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడై 1978లో కాంగ్రెస్ చీలిక రాగా ‘రెడ్డి కాంగ్రెస్’ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రతిసారీ గెలుస్తూ వచ్చారు. యువజన సర్వీసులు, ఎక్సైజ్, విద్యా శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా, గ్రామ గ్రామాన ప్రజల కష్టనష్టాలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. భగ్గున మండుతున్న ఎండల్లో కాలినడకలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో గమనించారు.ఓ పక్క కరువు, మరోవంక గంజినీళ్లకు కూడా నోచుకోని అభాగ్యులు, విద్యుత్ కొరత వల్ల బోర్లు పనిచేయక అచేతనులైన రైతన్నల దౌర్భాగ్య స్థితి, నిరుద్యోగుల నిస్తేజం... ఇవన్నీ ఆయనను కొత్త మనిషిగా తీర్చిదిద్దాయి. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తాననీ, అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననీ ప్రజలకు మాటిచ్చారు. నమ్మకం కలిగించారు. వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రజలకు విద్యుత్ చార్జీలు భారం కావడం, ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని కరెంటు సరఫరా ప్రాథమిక అవరోధంగా గుర్తించి ‘ఉచిత విద్యుత్’ హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానన్నారు. సరిగా పండక, అరకొర దిగుబడి తెగనమ్మితే పెట్టుబడి ధర కూడా రాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు విని, చదివి ఆయన చలించి పోయారు. వివిధ వర్గాల ప్రజల జీవన్మరణ సమస్యలను ఎలాగైనా సరే పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. పాదయాత్ర క్రమంలో రాజమండ్రి నగరం వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్ళీ నిర్విరామంగా ఇచ్ఛాపురం వరకూ నడక సాగించి, 64 రోజుల పాదయాత్ర (3 రోజుల విరామంతో కలిపి 67 రోజులు) లక్ష్యం పూర్తి చేశారు.అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. వైఎస్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అంతకు పదేళ్ళ ముందు 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దికాలానికే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు బీజేపీ ఆసరా తోడై, 1999లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. ప్రజలంటే గొఱె<లనీ, ఎన్నికలంటే కాస్త పేరున్న పార్టీతో జతకట్టి సునాయాసంగా గెలవచ్చనీ పాత అనుభవ పాఠాల ద్వారా నమ్మి, ఈసారి 2004 ఎన్నికల బరిలోనూ దూకారు. అలిపిరి మందుపాతర పేలుడులో త్రుటిలో బతికి బయటపడిన ఘటన సానుభూతి తెచ్చి గెలిపిస్తుందని నమ్మారు. సానుభూతి చల్లారకుండా ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు దిగారు. ప్రచార పర్వంలో ఎక్కడా సానుభూతి జాడలేదు సరికదా ప్రజాగ్రహం ఎదురైంది. కాంగ్రెస్ అఖండ విజయం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2004 మే 14న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు. రైతులకు సహకార రుణమాఫీ కోసం కేంద్రాన్ని ఒప్పించారు. పీకల లోతు అప్పుల్లో మునిగి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించారు. ‘ఆరోగ్యశ్రీ’తో అత్యంత ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపంతో గుండెజబ్బుల బారిన పడిన పసిపిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు.‘108 వాహనం’ ద్వారా అత్యవసర అంబులెన్సు వాహనాలను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య కోసం ‘ఫీజు రీ–ఇంబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్లతో ఇంజనీరింగ్ విద్యను అందించారు. ‘జలయజ్ఞం’తో భారీ, మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రం నలుమూలలా విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాల సాగుభూమితో రాష్ట్రం అన్నపూర్ణగా విరాజిల్లాలని పట్టుదలతో కృషి చేసారు. అంతకు ముందు నామమాత్రంగా ఉండే వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ పథకాల రుణమాఫీతో ఊరట కలిగించారు.‘ఇందిరమ్మ ఇళ్ల’ను ‘ఇందిరమ్మ ఊళ్ళు’ అనేలా గణనీయంగా నిర్మించారు. ప్రకృతి కూడా పరవశించిందేమో... హర్షాతిరేకంతో వర్షాలను చాలినంతగా రాష్ట్రమంతటా కురిపించింది. గ్రామదేవతల, దేవాలయ ఉత్సవాలు ఊరూరా పునః ప్రారంభమయ్యాయి. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూడసాగింది. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు సైతం ‘ఆరోగ్యశ్రీ’తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేశారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి, మరింత జాగరూకతతో సాగుతూ, పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో ‘రచ్చబండ’ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవడానికి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూముతో సంబంధాలు తెగిపోయాయి. మరునాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. ‘నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇకలేరు’! ఈ వార్తను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. ఇంతగా ప్రేమను పొందిన నాయకుడు చరిత్రలో మరొకరు లేరు. 2009 సెప్టెంబరు 3వ తేదీ జన హృదయ విజేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని లోకానికి తెలిసిన రోజు. అదే రోజు గణేశ నిమజ్జనం. ‘గణేశ్ మహరాజ్‌కీ జై’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో, పిల్లలు, పెద్దలు సహా అశేష జనసందోహంతో, నృత్యాలు, ఆటపాటలు, టపాసుల, డప్పులు, ఆర్కెస్ట్రాల కోలాహలంతో 24 గంటలపాటు నిర్విరామంగా సాగాల్సిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంతే జనంతో నిర్వికారంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక మహా మౌనప్రదర్శన అన్నట్టుగా సాగిపోయింది. లెక్కకు మిక్కిలిగా పూనుకున్నా జరగదనిపించే ఆ సంఘటన ఆ జననేత పట్ల గొప్ప గౌరవానికి తార్కాణం. ‘పథకాలంటే ఇవీ, పరిపాలన అంటే ఇదీ, పాలకుడంటే ఇలా...’ అని మామూలు వ్యక్తుల నుండి మేధావుల దాకా అనుకునేలా సాగిన ఆయన రాష్ట్ర నాయకత్వ హయాం ‘న భూతో న భవిష్యతి!’తిరుమలగిరి సురేందర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
జనం గుండెల్లో నిండిన దేవుడు
ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడాయన. పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయన. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడాయన. సర్కారీ పాలనలోనే కాదు... స్నేహంలోనూ, సాయంలోనూ వై.ఎస్. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం. జనహృదయ విజేత వైఎస్ 2009లో అకాల మరణం చెందినప్పుడు ఆయన ఆప్తుడు, నాటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ తన గుండె లోతుల్లో నుంచి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాల మాలిక ఈ వ్యాసం. నేడు వైఎస్ 15వ వర్ధంతి సందర్భంగా నాటి కథనాన్ని నవతరం పాఠకుల కోసం మరోసారి అందిస్తున్నాం.గాంధీభవన్‌లో మీటింగ్... పీసీసీ అధ్యక్షులు ఎం. సత్యనారాయణరావు గారు, సీఎల్పీ లీడర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు కూర్చున్నారు. ఏదో అర్జంట్ మీటింగ్! అందుబాటులో ఉన్న నాయకులందరినీ పిలిచారు. ప్రెసిడెంట్ గారి రూంలోనే మీటింగ్. ముప్పై కుర్చీల దాకా వేశారు. నేను బాగా చివరి వరుసలో మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ‘అరుణ్! ముందుకు రావయ్యా... ఇక్కడ ఖాళీగా ఉంది గదా!’ అంటూ ముందు వరుసలో కూర్చోమని ఆహ్వానించారు సత్యనారాయణ గారు. ‘ఎందుకు సార్... మళ్లీ ఎవరైనా పెద్ద లీడరొస్తే లేచి వెనక్కి రావాలి. ఇక్కడ కూర్చుంటే ఎవ్వరొచ్చినా లేవక్కర్లేదు’ అన్నాను నవ్వుతూ. అన్ని సీట్లూ నిండిపోయాయి. మీటింగ్ ప్రారంభమైంది. ఏదో నోట్ చేయాల్సిన అవసరమొచ్చింది. ‘అరుణ్! ముందుకు రావయ్యా!’ అంటూ వైఎస్ గారి పక్కనే కుర్చీ వేయించి నన్ను కూర్చోపెట్టారు. నేను, వైఎస్ గారితో అన్నాను... ‘చూశారా సార్! టైం వచ్చినప్పుడు చివరాఖర్న కూర్చున్నా తీసుకొచ్చి ముందు కూర్చోపెడ్తారు.’ ‘అవును అరుణ్! ఇది బైబిల్లో ఉంది... తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును’. నా జీవితంలో మర్చిపోలేని సందేశమిది. అప్పట్నుంచి నేనేనాడూ నా గురించి నేను గొప్పగా ఊహించుకోలేదు. ఎవరైనా పొగుడుతుంటే వైఎస్ గారి వాక్యమే గుర్తుతెచ్చుకుంటూ ఉండేవాడిని. 2009 ఎన్నికల ఫలితాలపై వైఎస్ మాట్లాడుతూ, ‘ప్రజలు మాకు పాస్ మార్కులే వేశారు. ఇది ఘన విజయంగా నేను భావించడం లేదు. గర్వం వీడి అణకువతో ప్రజలకు దగ్గరకండి’ అంటూ తనను తాను తగ్గించుకుంటున్నప్పుడు ఆయన మరింత హెచ్చించబడతాడనే అనుకున్నాను గానీ ఆ హెచ్చు మరీ ఇంత ఎక్కువగా ఉంటుందనీ... ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లిపోతారనీ కలలోనైనా ఊహించుకోలేదు. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి నాయకులొస్తే వారి ఉపన్యాసాలను నేను అనువదించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకెవర్నీ ఒప్పుకునేవారు కాదు వైఎస్ గారు! చాలాసార్లు కొందరు నాయకులు లోపల్లోపల గొణుక్కుంటూ ఉండేవారు ‘వీడే చెయ్యాలా ట్రాన్స్లేషన్... ఆ మాత్రం అనువాదకులు మనూళ్లో లేరా...’ అని!! కొన్నిసార్లు బాహాటంగా పత్రికల్లోనే విమర్శించారు. రాజీవ్‌గాంధీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ – ఎవరొచ్చినా వారితోపాటు వేదిక మీద నాకూ కుర్చీ వేసేవారు! నాకన్నా సీనియర్లు, మంత్రులు, పెద్ద నాయకులు ఎంతోమంది కింద కూర్చోవటం, కేవలం అనువాదకుడినైన కారణంగా నేను వేదిక మీద కూర్చోవటం కొంతమందికి మింగుడుపడేది కాదు. కానీ ట్రాన్స్లేషన్ విషయంలో మాత్రం వైఎస్ కాంప్రమైజ్ అయ్యేవారు కారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అనంతపూర్‌లో ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్సింగ్, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రçఘువంశప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రసంగించారు. నన్ను సోనియాగాంధీ గారికి కేటాయించి, మిగతా ముగ్గురికీ ఇంకో ముగ్గురు నాయకులను ట్రాన్స్లేషన్కి ఏర్పాటు చేశారు. సరిగ్గా అందరూ స్టేజీ మీద కూర్చున్నాక వైఎస్ గారికి ఈ ఏర్పాటు సంగతి తెలిసింది. ఆయన ససేమిరా అంగీకరించలేదు. మొత్తం నలుగురికీ నేనే అనువాదం చెయ్యాలన్నారు. ‘సుమారు నలుగురు మాట్లాడేదీ ఒకటే ఉంటుంది. మళీ మళ్లీ అదే నేనొక్కడినే రిపీట్ చేస్తే జనానికి బోర్ కొడ్తుందేమో సార్’ అన్నాను. ‘చెప్పినట్టు చెయ్! నో మోర్ ఆర్గ్యుమెంట్!’ అన్నారు. నలుగురి స్పీచ్‌లూ నేనే అనువదించాను. ‘ఇంటర్ ప్రెటేషన్ కావాలి, ట్రాన్స్లేషన్ కాదు. లక్షల మంది పాల్గొన్న సభ, ఎక్స్పెరిమెంట్లు చేయటం పద్ధతి కాదు’ అన్నారాయన. నాకు అప్పుడు పదేళ్ల క్రితం జరిగిన ఒక అనువాద సంఘటన గుర్తుకొచ్చింది. విశాఖలో గాజువాక దగ్గర రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ. రాజేష్ పైలట్, అహ్లూవాలియా, వైఎస్, ద్రోణంరాజులతో కలిసి కార్లలో గాజువాక వెళ్తున్నాం. రాజీవ్‌గాంధీ చిరునవ్వు ముఖంలో మృత్యుకళ ప్రవేశపెట్టడం ఆ దేవుడి వల్ల కాలేదనీ... అందుకే అందమైన ఆ ముఖం నిర్జీవమైనప్పుడు ఎలాగుంటుందో చూపించలేని ఆ దేవుడు, అసలు ఆ ముఖమే లేకుండా చేసేశాడని వైఎస్ గారితో చెప్పాను. ఆ రోజుల్లో వైఎస్‌తో ఉండవల్లి ఈ మాటలు రాజశేఖరరెడ్డి గారి స్పీచ్‌లో చెప్పమన్నాను. ఆయన వద్దన్నారు. ‘ఇంత వివరంగా నువ్వే చెప్పగలవు. నువ్వే చెప్పు’ అన్నారు. ‘సార్! నేను అనువాదకుణ్ణేగానీ వక్తను గాను. రాజేష్ పైలట్, లేదా అహ్లూవాలియానో ఈ మాటలంటే నేను అనువదించగలను గానీ వాళ్లనకుండా నేనెలా చెప్తాను’ అన్నాను. ‘అక్కడికేదో వాళ్లు చెప్పింది మాత్రమే నువ్వు చెబుతున్నట్టు పోజు పెట్టకోయ్... అయినా నువ్వు చేసేది భావానువాదం, భాషానువాదం కాదు! భావం మారకుండా ఈ పదాలు జొప్పించు’ అన్నారు వైఎస్. అహ్లూవాలియా మాట్లాడుతూ రాజీవ్ మరణాన్ని విశ్లేషిస్తుండగా... నేను అనువాదం చేస్తూ, పైన చెప్పిన నాలుగు మాటలూ కలిపేశాను. సభలో ఊహించని రెస్పాన్స్. వైఎస్ గారు మీటింగ్ అయిపోయాక నా భుజం తట్టారు. ఇప్పుడనిపిస్తోంది... ఎప్పుడూ నవ్వుతూ ఉండే వైఎస్ ముఖంలో సైతం మృత్యువును ప్రవేశపెట్టడం ఆ భగవంతుని వల్ల కాలేదనీ, అందుకే హెలికాప్టర్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన ఆ శరీరం కోట్లాదిమంది అభిమానుల ఆఖరి చూపులకు కూడా నోచుకోలేదని!ఇద్దరు మనుష్యుల మధ్య సంబంధాలు... ఇచ్చిపుచ్చుకోవటాలతో బలపడుతుంటాయి. ఒకరికొకరు సహాయపడుతూ ఆప్తులవుతారు. వైఎస్ గారితో నా సంబంధం తల్చుకుంటే... నాకు ఆశ్చర్యమేస్తుంది! ఎప్పుడూ ఆయన వల్ల నాకు జరిగిన ఉపకారాలే తప్ప... నా నుంచి ఆయన కోసం వీసమెత్తు కంట్రిబ్యూషన్ కూడా లేదు. కనీసం వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి కూడా... కావల్సిన కులబలం, ధనబలం లేని నన్ను రెండుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్కీ పోటీ చేయించారు. ఎక్కడో లక్షలాదిమంది మధ్య నుంచొని రాజీవ్‌గాంధీ ఉపన్యాసానికి చప్పట్లుకొట్టే స్థాయి కాంగ్రెస్ కార్యకర్తనైన నన్ను సాక్షాత్తూ ఆ రాజీవ్‌గాంధీ పక్కనే నిలబెట్టారు. అగ్రనాయకులందరూ అడ్డుపడ్డా... నేనే బాగా అనువదిస్తానని, వారితో వాదించి – వారిని వారించి నాకు ఢిల్లీ స్థాయి నాయకులందరి పక్కనా ఉండే స్థాయి కల్పించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ స్థాయి నాయకులు నన్ను పేరెట్టి పిలిచే స్థానంలోకి పంపించారు. నేనేనాడూ ఆయన్ని ‘నాకిది కావాల’ని అడగలేదు. మొన్నటి (2009) ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం ధైర్యం చేసి ఒక్క రిక్వెస్ట్ చేశాను... ‘ఈసారి ఎన్నికల్లో నన్ను పోటీ చేయించవద్ద’ని! అప్పటికే రామచంద్రరావు గారి దగ్గర ఈ ప్రతిపాదన చేసి చాలా తిట్టించుకున్నాను. అందుకే వైఎస్ గారితో నెమ్మదిగా ఈ విషయం చెప్పాను. హైదరాబాద్ శివార్లలో ఒక సభకు హాజరవ్వటానికి బయలుదేరుతున్న వైఎస్, తనతో పాటు కారెక్కమన్నారు. సుమారు ఇరవై నిమిషాల ప్రయాణం. దారిలో ఆయనకి ఎక్స్ప్లైన్ చేశాను. ఈసారి నాకెంత ప్రతికూల పరిస్థితులున్నాయో... నేను నెగ్గటం ఎంత అసాధ్యమో వివరించాను. ‘ఇప్పుడు నువ్వు పోటీ చేయకపోవడం కరెక్ట్ డెసిషన్ కాదు. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా నువ్వే గెలుస్తావు... డోంట్ వర్రీ గాడ్ ఈజ్ దేర్’ అన్నారు వైఎస్. అది 2009 సెప్టెంబర్ 3. ఆ రోజు వినాయక నిమజ్జనం. హైదరాబాద్ నగరమంతా అల్లకల్లోల సునామీ సముద్రంలా ఉండేరోజు. వైఎస్ మరణవార్త నెమ్మది నెమ్మదిగా జనానికి చేరుతోంది. నిశ్శబ్దంగా నిమజ్జనం ప్రారంభమయ్యింది. ప్రతి ముఖంలో దుఃఖం, ఎంతోమంది మహానాయకుల మరణవార్తల్ని విన్నాం, కళ్లారా చూశాం. ‘ఆ వార్త వినగానే గుండె పగిలింది’ అంటూ చాలాసార్లు అంటుంటాం. ఇంతకాలం ఇదొక పద ప్రయోగమే... మహా అయితే పదాలంకారమో అనుకున్నాగానీ... నిజంగా గుండె పగిలి చచ్చిపోయేంత దుఃఖం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంట్లో అందొచ్చిన కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తున్న వృద్ధులు... ‘రేపు నా బిడ్డల పరిస్థితేమి’టంటూ పిల్లల తల్లులు... ఫ్రీగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులు... రాష్ట్రమంతా వెక్కివెక్కి ఏడ్చింది. కొన్ని వందల గుండెలు నిజంగానే పగిలిపోయాయి. యాక్సిడెంట్ కన్ఫర్మ్ అయి వైఎస్ మృతదేహాన్ని గుర్తించారని తెలిసిపోయాక, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి ఫ్లోర్‌లోకి వెళ్లాను. ఆయనతో నాకున్న సంబంధం, ఆయన నాపై చూపిన ప్రేమాభిమానాలూ మనసులో రీళ్లు తిరగసాగాయి. ఒక మాట దగ్గర రీల్ ఆగిపోయింది. ‘డోంట్ వర్రీ,,, గాడ్ ఈజ్ దేర్.’ నేను తప్పుగా విన్నాను ఆయనన్న మాట... ‘డోంట్ వర్రీ గాడ్ ఈజ్ హియర్!’ అని అయి ఉంటుంది. నేనుండగా నీకెందుకు వర్రీ!! నా సంకల్పమే నీకు దైవం. నా బలమే నీకు దైవబలం. ఇంకా తెలియలేదా అరుణ్... నేనెవరినో!!వైఎస్ గారితో నేను మాట్లాడిన మాటలు, వెటకారాలు, వేళాకోళాలు, జోకులూ అన్నీ గుర్తుకొచ్చి నెమ్మదిగా వెన్నులో వణుకు పుట్టింది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమి అనాలనిపిస్తే అది అనేసేవాడిని. ఎవరేమనుకుంటారో, అనొచ్చో–లేదో... అని ఏనాడూ సంకోచించలేదు. ఎన్నిసార్లు నా మాటలు ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చో... ఎన్నిసార్లు ఆయనకు నా మాటల వల్ల బాధ కలిగిందో... హఠాత్తుగా నాకు ‘భగవద్గీత’లోని ఒక శ్లోకం (11: 42) గుర్తుకొచ్చింది. అర్జున ఉవాచ :‘‘యచ్చావహా సార్థ మసత్కృతోసివిహార శయ్యాసన భోజనేషుఏకోథ వాప్యచ్యుత తత్సమక్షంతత్ క్షామయే త్వామహ మప్రమేయమ్’’ (విశ్వరూప సందర్శన యోగం)‘‘కృష్ణా! నాశరహితా! నీ ఈ మహిమ తెలియక పొరపాటున గానీ, చనువు వల్ల గానీ ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా అని అలక్ష్యముగా నేనేమి అన్నానో... విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చుండునప్పుడు గానీ, భుజించినప్పుడు గానీ, ఒక్కడవుగా ఉన్నప్పుడుగానీ, ఇతరుల యెదుట పరిహాసముగా గానీ ఏ విధంగా ప్రవర్తించితినో నా అపరాధములన్నీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకొనుచున్నాను.’’తండ్రీ! ఓ రాజశేఖరరెడ్డీ! నన్ను క్షమించు... అనుగ్రహించు!!ఉండవల్లి అరుణ్‌కుమార్ – వ్యాసకర్త ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు -
వైద్య కళాశాలలపై చంద్రబాబు శాడిజం..
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలకు వైఎస్సార్ పేరును తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 8500 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు,రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలను ఆయన ప్రారంభించారు. కొత్త మెడికల్ కళాశాలలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. దశాబ్దాలగా ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యకి వైఎస్ జగన్ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభించింది.రూ. 750 కోట్లతో ఉద్దానం వాసులకి శాశ్వత మంచినీటి పథకంతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా వైఎస్ జగన్ సర్కార్ నిర్మించింది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కళాశాలలకు చంద్రబాబు సర్కార్ అనుమతి సాధించలేకపోయింది. కానీ కొత్త మెడికల్ కళాశాలకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జారీ చేసింది.2023-24లో ప్రారంభమైన ఐదు, 2024-25 లో ప్రారంభం కావాల్సిన మరో ఐదు వైద్య కళాశాలలు పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కడపలోని క్యాన్సర్ ఆసుపత్రికీ వైఎస్సార్ పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. -
‘చంద్రబాబూ.. పేర్లు మార్చడం తప్ప ఏం చేశావ్?’
నెల్లూరు, సాక్షి : సోమశిల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకూ అయన ముఖ్యమంత్రిగా ఉన్నారు..ఏనాడైనా సమగ్ర సోమశిల గురించి ఆలోచించారా..? అని ప్రశ్నించారు.‘‘అప్పట్లో 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా 40 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు దీనిని వ్యతిరేకించినా.. రాజశేఖర్ రెడ్డి ఖాతర చేయలేదు. 14 ఏళ్లల్లో ఎప్పుడూ పెన్నార్ డెల్టా అధునికీకరణ గురించి పట్టించు కోలేదు. సంగం...నెల్లూరు బ్యారేజ్‌ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు.. మేమే పూర్తి చేశాం అని అన్నారాయన... సంగం బ్యారేజ్‌కు మంత్రిగా ఉంటూ మరణించిన గౌతమ్ రెడ్డి పేరు పెడితే దానిని చంద్రబాబు తొలగించారు. నెల్లూరు బ్యారేజ్‌కు మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప ఏం అభివృద్ది చేశారో చెప్పాలి చంద్రబాబు అని డిమాండ్ చేశారు. సోమశిల మరమ్మతులకు వైఎస్సార్సీపీ హయాంలోనే పునాది పడింది. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు అన్నారు.1995లో ఆయన ట్రాక్ రికార్డ్ బాగా లేదు..అందుకే ఆందోళన కలుగుతోంది. సోమశిల జలాశయం పనులు నాణ్యతతో చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. -
మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం
సాక్షి, అమరావతి: “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక..! అన్నది తమ నినాదమని ఈనాడు పత్రిక నీతులు వల్లిస్తూ ఉంటుంది. నిజానికి రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా ‘ఈనాడు’ ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది!! మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది. అందుకే 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రి నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక అంతగా దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరితెగించి విష ప్రచారం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షరసత్యం. రామోజీరావు ముమ్మాటికీ ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమరి్పంచిన నివేదిక లోగుట్టును విప్పింది.ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే నాడు వైఎస్సార్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతో 2006లో వైఎస్సార్ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించ లేదు. ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు ఏ రాజగురువూ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్ వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దు్రష్పచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్ మెయిల్ పాత్రికేయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు. తలొగ్గిన తరువాత ప్రభుత్వాలు ఆ అక్రమాలకు అండగా చంద్రబాబువైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీహుజూర్ అన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా ఆలకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రామోజీరావు అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును క్లోజ్ చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది.అక్రమాల పుట్ట మార్గదర్శి చిట్‌ఫండ్స్.. నిగ్గు తేల్చినందుకే జగన్‌పై దుష్ప్రచారంరామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లలో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించారు. చందాదారులకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. బ్రాంచి కార్యాలయాల్లోని నగదు నిల్వలలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్‌లను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి విచారించారు. తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని, తమకు శిక్ష పడటం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురదజల్లారు. సత్యం నినదించడం కాదు... దోపిడీ వర్ధిల్లాలి అదే ఈనాడు నినాదం.. విధానం రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా ... ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినటానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజూ నిగ్గుతేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ అయితే.. ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సీఐడీ దర్యాప్తులు, ఆర్బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడలు పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు జాతీయ రహదారులు, నగరాల్లోని రహదారులను కబ్జా చేసినా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం...అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేద ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీ. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిల్మ్ సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫిల్మ్ సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇక ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ ఈనాడు పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.ఇకనైనాప్రభుత్వాలు స్పందిస్తాయా? మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాయా? లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంత పాడి మౌనంగా ఉండిపోతాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మునుముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.18 ఏళ్లు నెట్టుకొచ్చారు6.11.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులపై చర్యలు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవల్లి ఫిర్యాదు.13.11.2006: ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. ఆర్బీఐ మార్గదర్శి వివరణ కోరింది. 30.11.2006: తాము సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రామన్న మార్గదర్శి. ఇకపై డిపాజిట్లు వసూలు చేయవద్దని మార్గదర్శికి ఆర్బీఐ ఆదేశం.19.12.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ.19.12.2006: వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నంబర్ 801 జారీ. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అదీకృత అధికారిగా టి.కృష్ణరాజు నియామకం జీవో 800 జారీ. 27.12.2006: రంగాచారి, కృష్ణరాజుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మార్గదర్శి, రామోజీరావు పిటిషన్.29.12.2006: మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ ఆర్బీఐ లేఖ. 29.12.2006: ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీ హైకోర్టులో పిటిషన్.19.2.2007: ఎన్.రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. 19.2.2007: రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.23.2.2007: రంగాచారి నియామకం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మార్గదర్శి, రామోజీ రావు.23.1.2008: మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అదీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు. 13.7.2009: అదీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరుకు నాంపల్లి కోర్టు ఆదేశం 20.7.2009: నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రామోజీ. 3.8.2009: రామోజీ పిటిషన్‌ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు.7.9.2009: అదీకృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి, రామోజీ పిటిషన్. 27.11.2009: వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి, రామోజీ 17.10.2010: ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్ మూసివేత 1.7.2011: మార్గదర్శి అక్రమాల కేసులో విచారణను కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన నాంపల్లి 18.7.2011: నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ హైకోర్టులో పిటిషన్ 26.07.2011: మార్గదర్శి అక్రమాలపై దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలంటూ హైకోర్టులో రామోజీ, మార్గదర్శి పిటిషన్ 2011: రామోజీ, మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 2014: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 18.9.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ మార్గదర్శి, రామోజీ అనుబంధ పిటిషన్ 12.10.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ 31.12.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శి, రామోజీరావుపై అ«దీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసిన హైకోర్టు 16.12.2019: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ 17.10.2022: డిపాజిటర్ల పరిరక్షణ చట్టంపై మార్గదర్శి, రామోజీరావు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను మూసేసిన హైకోర్టు 9.4.2024: మార్గదర్శిపై అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన దర్మాసనం. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు లేకున్నా సరే మార్గదర్శి ఎండీగా ఉన్న ఆయన కోడలు శైలజ కిరణ్, భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబ సభ్యులను చట్టపరంగా శిక్షించాలి. అంతేకాదు మార్గదర్శి మొత్తం అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – వొగ్గు గవాస్కర్, న్యాయవాదిరామోజీ కుటుంబం బాధ్యత వహించాల్సిందే మార్గదర్శి అక్రమాలు నిరూపితమయ్యాయి. హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు ప్రస్తుతం లేకున్నా సరే ఆ హెచ్యూఎఫ్లోని ఇతర సభ్యులు బాధ్యత వహించాల్సిందే. వసూలు చేసిన డిపాజిట్లకు కనీసం పదిరెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా శిక్షలకు రామోజీ కుటుంబ సభ్యులు అర్హులు. కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది, విజయవాడ సొంత ఆడిట్ కుదరదు∙ నిజాలు నిగ్గు తేలాల్సిందే ∙ మార్గదర్శికి స్పష్టంచేసిన సుప్రీం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పట్లో చెరుకూరి రామోజీరావు చేయని కుతంత్రం లేదు... ఎంతగా అంటే ‘అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్మును డిపాజిట్‌దారులకు చెల్లించేశాం... ఆ విషయాన్ని మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’అంటూ కనికట్టు చేసేందుకు యతి్నంచారు. కానీ, ఆ కుతంత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తిప్పికొట్టింది. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదు అని తేల్చిచెప్పింది. డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో... లేదో... నిర్దారించాల్సిందిగా మార్గదర్శి ఆడిటర్లు కాదు... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని విస్పష్టంగా ప్రకటించింది. డిపాజిట్లు చెల్లించేశాం...మా ఆడిటర్లులెక్క తేల్చేశారు.. సుప్రీంకోర్టులో రామోజీ వితండవాదం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,610.38కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు సుప్రీంకోర్టులో అడ్డగోలు వాదనలతో కనికట్టు చేయాలని యతి్నంచారు. తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని సంబంధిత డిపాజిట్‌దారులకు చెల్లించేశామని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మొత్తం రూ.2,610.38 కోట్ల అక్రమ డిపాజిట్లలో 2023, జూన్ 30నాటికి 1,247మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని చెప్పారు. కేవలం రూ.5.31కోట్లు మాత్రమే క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు పూర్తిగా ఆడిట్ చేసి నివేదిక సమరి్పంచారని... అన్ని లెక్కలు సరిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులు, వారికి చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.అదేం కుదరదు.. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే – స్పష్టంచేసిన సుప్రీంకోర్టు రామోజీరావు తరఫు న్యాయవాదుల వాదనలను ఏప్రిల్‌లోనే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే... మీ దగ్గర పని చేసే ఆడిటర్లు నివేదిక ఇస్తే సరిపోదు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకోము’ అని స్పష్టం చేసింది. ఎందుకంటే రూ.5వేలు డిపాజిట్‌చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కూడా పారీ్టగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ న్యాయస్థానం విచారించాలని తీర్పునిచి్చంది. డిపాజిట్లు తిరిగి చెల్లించినది.. లేనిది పరిశీలించేందుకు ఓ జ్యుడిíÙయల్ అధికారిని నియమించాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
శ్రీరాంపురంలో దివంగత నేత YSR విగ్రహం ధ్వంసం
-
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్‌లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
TG: అసెంబ్లీలో వైఎస్ఆర్ను పొగిడిన అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పొగిడారు. బడ్జెట్లో సోమవారం(జులై 29) బడ్జెట్‌పై మాట్లాడిన సందర్భంగా ఒవైసీ వైఎస్ఆర్ను గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ఆర్ న్యాయం చేశారని కొనియాడారు.ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీల మదిలో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్ఆర్ లేకపోతే రిజర్వేషన్ల అంశంలో తమకు అన్యాయం జరిగేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెప్తానన్నారు. -
YSRపై ప్రశంసలు
-
న్యూజెర్సీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
నాన్ననంటే నొప్పి లేదు.. బాబు కోసం బయలుదేరావా తల్లీ..!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏమైంది?ఆమె పూర్తిగా బాలెన్స్ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఆమె టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా మద్దతు ఇస్తున్న తీరు రాజకీయంగా దివాళాకోరుతనాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబును పొగిడితే పొగుడుకోవచ్చు. కాని తన అన్న ,మాజీ ముఖ్యమంత్రిని, వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్దతిగా లేదు. తాను తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ బయల్దేరి ,చివరికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన వైనం సిగ్గుచేటైన విషయంగా ఆమె భావిస్తున్నట్లు లేదు.తెలంగాణ రాజకీయాలలో ఉండడానికి వీలు లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరిమేసిన మాట నిజమా?కాదా?ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మట్టి చేబూని ప్రమాణం చేసి ,ఈ గడ్డపైనే రాజకీయం చేస్తానని చెప్పారా? లేదా? కాని ఆ తర్వాత నాలుక మడతేసి అక్కడ నుంచి ఎందుకు వచ్చారో ప్రజలకు తెలియదా? ఆమె ఆత్మకు తెలియదా? దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ప్రత్యర్దులతో చేతులు కలిపి ఆమె ఆంధ్ర రాజకీయాలలోకి ఎంటర్ అయిన విషయం అబద్దమా?ఆమెకు టీడీపీ మీడియా ప్రముఖుడు సలహాలు ఇచ్చే మాట నిజం కాదా? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో చంద్రబాబు నాయుడు జరిపిన మంతనాలు దేనికోసమో తెలియదా? తన అన్నపై పెట్టిన అక్రమ కేసులలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కూడా చేర్చడం ద్వారా కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరిస్తే, తగుదునమ్మా ..అంటూ అదే పార్టీలో చేరి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేసిన చరిత్రను షర్మిల సొంతం చేసుకున్నట్లు అనిపిస్తుంది. కేసులు పెట్టడం, ఆ చార్జీషీట్లలో రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించడం తప్పు అని కాంగ్రెస్ అధిష్టానం చెబితే,అప్పుడు ఆమె ఆ పార్టీలో చేరితే ఫర్వాలేదు. కాని వైఎస్సార్‌కు ప్రజలలో ఉన్న అభిమానంలో వాటాను పొందే దురుద్దేశంతో షర్మిలను కేవలం ఒక పావుగానే కాంగ్రెస్ వాడుకుంటున్న విషయం తెలియనిదా?ఇదే కాంగ్రెస్ ను ఆమె ఎంత తీవ్రంగా గతంలో విమర్శించారో గుర్తు లేదా? పైగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ అనేవారని, అందుకే కాంగ్రెస్ లో చేరారని ఆమె బొంకినంత మాత్రాన జనం నమ్ముతారా? కడప జిల్లాలో ఓటమి ఎరుగని వైఎస్ ఆర్ కుటుంబం నుంచి పోటీచేసి షర్మిల ఓటమిపాలై అపకీర్తి పొందారా?లేదా? రాజకీయాల కన్నా ఇంటిలో ఉన్న తగాదాలను రోడ్డుమీదకు తెచ్చి అందరి పరువు తీయడానికి వెనుకాడని షర్మిల మనస్తత్వం అర్ధం అవుతూనే ఉంది. టీడీపీతో కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ ఉందో ,లేదో కాంగ్రెస్ నేతలు ఎవరిని అడిగినా తెలుస్తుంది.ఒకప్పుడు వైఎస్సార్ మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకువెళ్లి సభ పెడితే వైఎస్సార్ కు నివాళి అర్పించినట్లే అవుతుందా?ఇదే రేవంత్ రెడ్డిని గతంలో షర్మిల ఏమని నిందించారో గుర్తు లేదా?కడప ఉప ఎన్నిక జరిగితే ఆయన వచ్చి గల్లి,గల్లీ తిరుగుతానని అంటే ప్రజలు పిచ్చివాళ్లా? షర్మిల సీఎం అవుతారని రేవంత్ ప్రకటిస్తే నిజమేనని పొంగిపోతే అంతకన్నా తెలివితక్కువతనం ఉంటుందా? షర్మిల కాంగ్రెస్ సీఎం. అవుతారని రేవంత్ అనడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు కాని, ఆయన కేవలం టీడీపీకి ఉపయోగపడడానికే అలా అంటున్నారని ఆమెకు అర్ధం కాకపోవచ్చు. ఆంధ్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మృత పార్టీగానే ఉందని చెప్పక తప్పదు. అది కోలుకుంటుందా?అన్నది తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ కాంగ్రెస్ కు షర్మిల నాయకత్వం వహించినందున వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారు కొందరైనా వస్తారన్న ఆశ ఉండవచ్చు.గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో టిక్కెట్ రాని కొంతమంది కాంగ్రెస్ లో చేరినా వారికి ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికి తెలుసు. షర్మిల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారంలో ఉన్న చంద్రబాబుపై కన్నా విపక్షంలో ఉన్న జగన్ పైనే ఎక్కువ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.దానిని బట్టే ఆమె లక్ష్యం తెలిసిపోతుంది. ఏపీలో ఒకవైపు బీజేపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకుని, మరో వైపు కాంగ్రెస్ తో పరోక్ష పొత్తును పెట్టుకుని చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయం చేశారా?లేదా? వైఎస్సార్సీపీ ఓట్లు ఒకటి,రెండు శాతం చీలినా తనకు రాజకీయంగా ఉపయోగమని చంద్రబాబు పన్నిన వ్యూహంలో షర్మిల కూడా ఒక పావు మాత్రమేనని రాజకీయవర్గాలలో బహిరంగ రహస్యమే.అదే ధోరణి ఇప్పటికీ షర్మిల కొనసాగిస్తున్నారు. బీజేపీకి వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తున్నదంటూ చేసిన వ్యాఖ్య అర్ధరహితం. వైఎస్సార్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. కాని అంశాలవారీగా సపోర్టు చేసే విషయాన్ని రహస్యంగా చేయడం లేదు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ చెప్పిన కొన్ని అసత్యాలు చూడండి. ఆమె సాక్షిని నడుపుతున్న జగన్ ను ప్రశ్నిస్తున్నారట. ఇందులోనే ఆమె ఎంత ద్వేషం వెళ్లగక్కుతోంది కనబడుతూనే ఉంది. ఆయన నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్సార్సీపీ అధినేత. ఐదేళ్లపాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనను ఉద్దేశించిన తీరు కచ్చితంగా ఆమెలో అక్కసు తెలియచేస్తుంది. ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి అమ్మ ఒడి పధకం అమలు చేస్తామని జగన్ 2019లో హామీ ఇచ్చారని ఆమె చెబుతున్నారు. అది పచ్చి అబద్దం . వైఎస్సార్సీపీ అమ్మ ఒడి స్కీమ్ కింద పిల్లల చదువుల నిమిత్తం తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఆ మేరకు అమలు చేసింది. తెలుగుదేశం పార్టీ ,జనసేన పార్టీ కలిసి మానిఫెస్టో విడుదల చేసి ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్ధికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందచేస్తామని ప్రకటించాయి. కాని ఇప్పుడు అలా చేయకుండా మడమ తిప్పుతున్నారు.అలా మోసం చేస్తున్నదన్న విమర్శను ప్రజలు టీడీపీపై చేస్తుంటే షర్మిల ఆ పార్టీని, చంద్రబాబును కాపాడడానికి జగన్ పై అబద్దపు ఆరోపణలతో రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. తల్లికి వందనం స్కీము పై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని అన్నారు తప్ప, ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతగా షర్మిల చెప్పలేకపోవడంలోని ఆంతర్యం ప్రజలు అర్దం చేసుకోలేరా?మొక్కుబడిగా బస్ లలో మహిళల ఉచిత ప్రయాణం గురించి టీడీపీని ప్రశ్నించారు . ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్న స్కీమ్ గురించికాని, మూడు గ్యాస్ బండల పంపిణీ .నిరుద్యోగ భృతి, వలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం, రైతు భరోసా ఇరవై వేల రూపాయలు వంటి హామీల గురించి చంద్రబాబును నిలదీయవలసి కాంగ్రెస్ అద్యక్షురాలు , ఆ పని చేయకుండా విపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీని ప్రశ్నించడం విడ్డూరంగానే కనిపిస్తుంది. వైఎస్సార్ విగ్రహాల ద్వంసంపై ఇన్నాళ్లకు కొద్దిగా స్పందిస్తూ, ఇంకోసారి విగ్రహాలను పగలకొడితే ఊరుకోం అని ఆమె అన్నారు. అంటే ఇన్నాళ్లూ చేసిన విద్వంసాన్ని ఆమె తప్పు పట్టడం లేదనుకోవాలి. కనీసం అలా విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై కేసులు పెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేయడం లేదు.అది తండ్రిపై ఆమెకు ఉన్న ప్రేమ. టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ కాదని ఆమె అంటున్నారు.మంచిదే. ఆ విషయాన్ని ఆచరణలో చూపించాలి కదా? టీడీపీవారి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తే ఎవరైనా ఏమంటారు?తమలపాకుతో టీడీపీని, తలుపుచెక్కతో వైఎస్సార్సీపీని కొట్టినట్లుగా విమర్శలు చేయడం ద్వారానే షర్మిల తన మనోగతాన్ని తెలియచేస్తున్నట్లు కనిపిస్తుంది. మరో కొత్త ప్రచారాన్ని ఆమె తెరపైకి తీసుకురావడం ద్వారా తాను చంద్రబాబు మద్దతుదారునని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికలు చంద్రబాబు సీఎం.కావాలా? వద్దా?అన్న కోణంలో జరిగాయట.చంద్రబాబుకు అనుభవం ఉందట. సమర్దుడు అని ప్రజలు అవకాశం ఇచ్చారని ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు.ఒకనెల రోజుల క్రితం ఈమెనే ఈ ఎన్నికలు జగన్ పై జరిగినవని అన్న సంగతి మర్చిపోయి ఉంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఆమె పరోక్ష మద్దతు ఇస్తున్నారు.అదే టైమ్ లో టీడీపీ, జనసేన,బీజేపీ కూటమితో పోరాడిన వైఎస్సార్సీపీ ని బీజేపీ తోకపార్టీ అని షర్మిల అనడం చిత్రంగానే ఉంది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధం లేదట. ఇక్కడ సంబంధం గురించిన ప్రశ్న కాదు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రజలలో ఆయన స్మృతిని నిలబెట్టింది..ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆదరణను బహిర్గతం చేసింది జగన్ అన్న ది ఆమెకు తెలియదా?ఏ తండ్రికి ఏ కొడుకు ఇవ్వలేనంతగా గొప్ప నివాళి అర్పించిన ఘనత జగన్ ది కాదా! జగన్ తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములకు వైఎస్ ఆర్ పేరు పెట్టింది షర్మిలకు తెలియదా? హెల్త్ యూనివర్శిటీకి సైతం వైఎస్ ఆర్ పేరు పెట్టారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ గోడకు ఉన్న వైఎస్ ఆర్ పేరును అవమానకరంగా తొలగిస్తే కనీసం ఖండించని షర్మిల ఆయనకు వారసురాలు అవుతుందట. వైఎస్సార్ పేరుతో ఉన్నదాదాపు అన్నిటిని మార్చేసిన టీడీపీని ఒక్క మాట అనకపోవడం ఆమె విజ్ఞత. వైఎస్సార్ మరణం తర్వాత ఆయనను అవమానించిన కాంగ్రెస్ లో చేరిన షర్మిల టీడీపీకి సేవ చేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ఏది ఏమైనా షర్మిల తన తండ్రి మాదిరి ఫెయిర్ రాజకీయం చేసి పేరు తెచ్చుకుంటారా?లేక కుట్ర రాజకీయంలో భాగం అయి తన అన్నపై అక్కసు తీర్చుకుంటారా?అన్నది ఆమె తేల్చుకోవాలి! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
డల్లాస్‌లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డల్లాస్ లోని బసేరా ఇండియన్ క్యూసిన్లో జరిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆంద్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగంలాంటిదని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. -
వైఎస్ఆర్ పాదాల చెంతకు సోనియా, రాహుల్ గాంధీ?
-
ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రను మనం ప్రత్యక్షంగా చూశామని, ఆ సంక్షోభం, ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడిగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాల మధ్యనే ఈ పార్టీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ రోజు నుంచి కోట్ల మందికి జగన్ ఆశాదీపం అయ్యారన్నారు. వైఎస్సార్‌కి మించి అడుగులు ముందుకు వేసే బిడ్డగా జగన్ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని తన ఐదేళ్ల పాలనా కాలంలో అందరూ గర్వపడేలా చేసి చూపించారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలిచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పనిలేకుండా ఆయన పాలించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే ఆయన పరిపాలన అందించారు. ప్రజల్లో మమేకమైన పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నా లోతుకుపోవటం సరైంది కాదు. మరోసారి మోసానికి బాబు శ్రీకారం..ఇక అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన అలవిగాని హామీలిచ్చారు. ఆసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు ఆదే రీతిలో మరోసారి మోసానికి బాబు శ్రీకారం చుట్టారు. ఖజానా ఇంత ఖాళీ అయి ఉంటుంది అనుకోలేదని అప్పుడే చంద్రబాబు అంటున్నారు. ఖజానా బాగాలేదు కాబట్టి హామీలు నెరవేర్చటం కష్టమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది అత్యంత మోసం, దగా.రాష్ట్రం రావణకాష్టం..అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టం చేస్తున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యులు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు గండికొట్టడం ప్రారంభమైంది. వైద్యంలో స్పెషలిస్టు సేవలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు చేస్తున్నారు. మన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకెళ్దాం. మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం. బాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌పైన, వైఎస్సార్సీపీపైన కూటమి నేతలు దాడిచేస్తున్నారు.తాను అమలుచేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారు. అది జరగకుండా.. మనం ఎక్కడా డీలాపడకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలి. ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మనమంతా పునరంకితం అవుదామని శపథం చేద్దాం. ఇందుకు ఇంతకంటే మంచి రోజు, వైఎస్సార్ జయంతిని మించిన రోజులేదు. అనంతరం.. మాజీమంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో.. మాజీమంత్రి జోగి రమేష్, నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అంబటి మురళీ, మలసాని మనోహర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చల్లా మధు, కొమ్మూరి కనకారావు, ఎ.నారాయణమూర్తి, బందెల కిరణ్‌రాజ్, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాస్‌రెడ్డి, మహిళా నేతలు నారమల్లి పద్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపర భగీరథుడు వైఎస్సార్’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు..ఇదిలా ఉంటే.. వైఎస్ జయంతి సందర్భంగా పుత్తా ప్రతాప్‌రెడ్డి ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తొలుత.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్‌లు కట్‌చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు కేక్ కట్‌చేసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఇడుపులపాయలో..ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.విదేశాల్లోనూ ఘనంగా..వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్: డాక్టర్ ప్రదీప్ చింతా తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్ అని, మనసున్న మారాజు వైఎస్సార్‌కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్ లైఫ్ సెంటర్లోనూ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కేక్ కట్‌చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
సాక్షి, హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ల ఉత్తర్వులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి కానుకగా 34 మంది కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా అధికారికంగా నియమించారు. మరొకరిని వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట మార్చి 15వ తేదీతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా చైర్మన్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు మొత్తం 37 మంది కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవులు లభించాయి. వీరిలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వరరావు తనకు నామినేటెడ్ పదవి వద్దనడంతో ఆయన పేరు అధికారిక జాబితాలో లేదని తెలుస్తోంది.ఆయన్ను ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించగా, తాజా జాబితాలో ఆ పోస్టును ఖమ్మం జిల్లాకు చెందిన మువ్వా విజయ్‌బాబుకు కేటాయించారు. ఆయనకు గతంలో కేటాయించిన విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరు కూడా అధికార జాబితాలో లేదు. ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ల నియామకానికి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని, అందుకే ఆమె పేరు పెండింగ్‌లో పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రకటించిన జాబితాలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కార్పొరేషన్‌ను మార్చారు. ఆయనకు గతంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించినా. ఆ పదవిని యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు కట్టబెట్టాలన్న ఆలోచనతో జ్ఞానేశ్వర్‌ను ముదిరాజ్ కార్పొరేషన్‌కు మార్చారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా గతంలో కోటా్నక్ నాగును నియమించగా, ఆయన స్థానంలో కోటా్నక్ తిరుపతిని ప్రకటించారు. ఇక, సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు 12, కమ్మలకు 3, వెలమలకు 1, ముస్లింలకు మూడు, ఆర్యవైశ్య, బ్రాహ్మణులకు ఒక్కోటి చొప్పున పదవులు లభించాయి.బీసీల్లో గౌడ్లకు 4, ముదిరాజ్‌లకు 2, మున్నూరుకాపులకు రెండు, వడ్డెర, పద్మశాలి, లింగాయత్‌లకు ఒక్కో పదవి లభించింది. ఎస్సీలకు 1, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ప్రకటించారు. కాగా, కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వచి్చన రోజే పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే చాలా కాలం వేచి ఉన్నామని, ఇక ఉత్తర్వులు వచి్చన తర్వాత ఇంకా వేచి ఉండడం ఎందుకంటూ హడావుడిగా వెళ్లి తమ తమ కార్యాలయాల్లోని సీట్లలో ఆసీనులు కావడం గమనార్హం. -
సంక్షేమానికి మారుపేరు వైఎస్
సాక్షి,హైదరాబాద్: దేశంలో సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే పేరు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వై.ఎస్. చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమంపై వై.ఎస్. చెరగని ముద్ర వేశారన్నారు.ఆయన హయాంలో జరిగిన అభివద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపయోగపడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల హామీలకు స్ఫూర్తి రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి, కష్ణా జలాల వినియోగం, హైదరాబాద్‌లో పెట్టుబడులకు కూడా ఆయనే స్ఫూర్తి అని రేవంత్ కొనియాడారు. వై.ఎస్. స్ఫూర్తి ని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు. ఆయన చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తినిచి్చందన్నారు. 2009లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలని వై.ఎస్. చెప్పారని.. కానీ రాహుల్ ప్రధాని కాకుండానే ఆయన దూరమయ్యారని విచారం వ్యక్తం చేశారు. వై.ఎస్. స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్‌ను ప్రధాని చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఆయన అభిమానులంతా కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు.వైఎస్ స్థానం సుస్థిరం: డిప్యూటీ సీఎం భట్టిఅభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హదయాల్లో వై.ఎస్. స్థానం సుస్థిరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే నేడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజానీకానికి మేలు జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలను వై.ఎస్. ఆదుకున్నారని చెప్పారు. తెలంగాణ వడివడిగా అభివద్ధివైపు అడుగులు వేయడానికి వై.ఎస్. వేసిన పునాదులే కారణమన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నేడుహైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. గాం«దీభవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ప్రజాభవన్‌లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం లక్డీకాపూల్/పంజగుట్ట/బంజారాహిల్స్: మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వై.ఎస్. భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వై.ఎస్. 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ సోమవారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రేవంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వై.ఎస్. ఫొటోలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం పంజగుట్ట కూడలిలోని వై.ఎస్. విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులరి్పంచారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/10లోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వై.ఎస్. విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, వై.ఎస్. ఆప్తమిత్రుడు కేవీపీ, మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన నివాళులు అర్పించారు. -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ, సాక్షి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. వైయస్సార్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించాలి. ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదే నిజమైన నివాళి. పేద ప్రజల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సాధికారత కోసం వైఎస్ఆర్ తన జీవితాంతం పనిచేశారు అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. -
నిను మరువం రాజన్నా.. ఏపీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫొటోలు)
-
సిడ్నీలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొనియాడారు. వైఎస్ఆర్ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్‌గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024 -
వైఎస్ఆర్ పై అంతులేని అభిమానం
-
నాన్నా.. మీ 75వ పుట్టిన రోజు మా అందరికీ పండుగ రోజు
-
సాక్షి ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
"వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రం మరోలా ఉండేది"
-
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన గురుమూర్తి
-
ప్రజాభవన్ లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్
-
"అపర భగీరథుడు వై.యస్.ఆర్" పుస్తకావిష్కరణ
-
TG: వైఎస్సార్ జయంతి కానుక.. కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ పదవులు
సాక్షి,హైదరాబాద్: మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కానుక అందించారు. తెలంగాణలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ పదవుల పంపిణీ చేపట్టారు. చురుగ్గా పనిచేసిన మొత్తం 35 మంది నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులను కట్టబెట్టారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం(జులై 8) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా జంగారాఘవరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలజగ్గారెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా అలేఖ్యపూజారి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అవినాష్‌రెడ్డి అగ్రి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కాసుల బాలరాజు, స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్‌కు మనాల మోహన్ రెడ్డి, వేర్‌హౌజ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఫిషరీస్ కోపరేటివ్ కార్పొరేషన్‌కు మెట్టు సాయికుమార్ తదితరులను చైర్పర్సన్లుగా నియమించారు.ఏ పదవి ఎవరికి.. ఇక్కడ క్లిక్ చేయండి.. -
వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
-
ఇప్పటికీ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్
-
గిరిజనుల కులదైవం ఫోటోతో పాటు వైఎస్ఆర్ గారి ఫోటో..
-
తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నేత వైఎస్సార్: భూమన
-
తుల గుండెల్లో రైతు బిడ్డగా YSR..
-
వ్యవసాయమంటే ప్రత్యేకమైన ప్రేమను చూపిన వైఎస్సార్
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
KSR Live Show: YSR సంక్షేమ ముద్ర.. రాజ ముద్ర..
-
వైఎస్సార్ జయంతి: జనహృదయ నేతకు వైఎస్ జగన్ నివాళి (ఫోటోలు)
-
ఆ జ్ఞాపకం.. నా జీవితంలో మర్చిపోలేను..
-
ప్రజా సంక్షేమానికి డైరెక్షన్ వైఎస్ఆర్..
-
రాజన్నా.. ఈ నేల నిను మరవదన్నా.. వైఎస్సార్ పాదయాత్ర ఫోటోలు
-
శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్
-
చెప్పింది చేసిన అరుదైన నేత
వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్సార్‌ది మొదటి స్థానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగువారి సంప్రదాయ పంచెకట్టులోనే కనిపించేవారు. వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. ఆయన మాటలూ, చేతల్లో హుందాతనం తొణికిసలాడేది. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రజా నాయకుడాయన.రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి అంతిమ ఘడియల వరకూ ఓటమి ఎరుగని నేత. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌గా చిరస్థాయిగా నిలిచిన ఆయన పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. నేటి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949 జూలై 8న జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యాభ్యాసం, తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులై, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారు.తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. తరువాత జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేసి, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు వైద్య సేవలు అందించి, రెండు రూపాయల డాక్టర్‌గా గుర్తింపు పొందారు.తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20 వేల 496 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసన సభలో కాలు పెట్టినప్పటినుంచీ 2009 వరకు ఆయన పోటీ చేసిన అన్ని సార్లూ విజయం సాధించారు. 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారు.పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్ 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిల రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు జరిపారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటివి ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి.నిర్లక్ష్యం నీడలో ఉన్న కడప జిల్లాను 2004–09 కాలంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారు. కడప మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్ ఐటీ నెలకొల్పారు. అనేక పరిశ్రమలు స్థాపింపజేశారు.ఆయన హయాంలో జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ. 12 వేల కోట్లతో కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. ఇంతలో 2009 సెప్టెంబర్ 2న సంభవించిన ఆయన అకాల మరణం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద కుదుపయ్యింది. – నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, 98481 28215 (నేడు వైఎస్సార్ 75వ జయంతి) -
వైఎస్సార్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
జనహృదయ విజేత
సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పేద ప్రజల్లో దైవంలా కొలువై నిలిచారు. అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... వైఎస్సార్ పేద ప్రజల బాగుకోసం దాన్ని ఉపయోగించారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు.ఆ విధంగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు దగ్గర చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘జలయజ్ఞం’ ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. ఆయన కాలంలోనే ఎన్నో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు.దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్, వైద్య విద్యలను అందించి అనేక మందిని ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దారు. ప్రతి నిరుపేదకూ ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి పేదవారి సొంతింటి కలను నిజం చేశారు. నిరుపేద ముస్లిం యువతకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకుల వంటి వృద్ధులకు పింఛన్‌ను క్రమం తప్పకుండా ఇచ్చి వారి ఆకలి తీర్చారు.ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త విని ఎందరో అభిమానుల గుండెలూ ఆగిపోయాయి. ఆయన భౌతికంగా లేకపోయినా సకల జనుల హృదయాల్లో ‘రాజన్న’గా ఆయన నిలిచే ఉన్నారు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
ఇడుపులపాయకు భారీగా తరలివచ్చిన YSR అభిమానులు
-
Watch Live: జన నేతకు వైఎస్ జగన్ నివాళి
-
వైఎస్ఆర్ రాజముద్ర
-
YSR Jayanthi: ఇడుపులపాయకు వైఎస్ జగన్
-
మహానేత వైఎస్సార్ 75వ జయంతి
-
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఓటమి ఎరుగని ధీరుడు..
-
మహోన్నత నాయకత్వం
విలక్షణ నాయకుడు వై.ఎస్.ఆర్. విపక్షాలు సైతం కొనియాyì న వ్యక్తిత్వం ఆయనది! ఇచ్చిన మాట తప్పని నైజం. ‘పేదల కోసమే పాలన’ అన్నది ఆయన సిద్ధాంతం. అన్నదాతకు ఆపద్బాంధవుడు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ అందుబాటులోకి తెచ్చి, అసమానతలను రూపుమాపిన క్రాంతదర్శి. జన జీవితంతో ఆయన మమేకం అయ్యారు. జయాపజయాలకు అతీతంగా పాలన సాగించారు. ఏం చేసినా అది ప్రజల కోసమే! ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అది ప్రజా సంక్షేమం కోసమే! తెలుగు నేలను సస్యశ్యామలం చేయటానికి జలయజ్ఞం తలపెట్టారు. విశ్వసనీయతే తన సైన్యంగా విమర్శలను తిప్పికొట్టారు. తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఆదర్శప్రాయుడైన ప్రజా నాయకుడిగా నిలబడ్డారు. నేడు ఆయన జయంతి.అధికారం కోసం వెన్నుపోటుకైనా వెనుకాడని నేతలుండొచ్చు. పదవి కోసం ఎలాంటి వంచనకైనా నిస్సిగ్గుగా సిద్ధపడే పార్టీలుండొచ్చు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా, జన జీవితంతోనే పెనవేసుకున్న నాయకత్వాన్ని వైఎస్ రక్తంలోనే చూస్తాం. అందుకే వైఎస్ఆర్ అనే మూడక్షరాలు తెలుగువాడి గుండె గొంతుకయ్యాయి. దశాబ్దకాలం దాటినా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోని పున్నమి వెలుగులే పేదవాడి చిరునవ్వుగా మారాయి. ఎంత పెద్ద ఆపదొచ్చినా పెద్దాయన ఉన్నాడనేది వైఎస్ పాలనలో ప్రజలకు ఉన్న నమ్మకం. మాటిస్తే మడమ తిప్పడనేది వైఎస్‌పై జనానికి ఉన్న విశ్వాసం. మేలు చేసేటప్పుడు వైఎస్ రాజకీయాలు చేయడనేది విపక్షాలే ఒప్పుకున్న నిజం. ఓ బ్యూరోక్రాట్‌గా నేను ఆయన్ని దగ్గర్నుంచీ చూశాను. ప్రజల కోసమే బతికిన విలక్షణ నాయకుడే వైఎస్ఆర్లో నాకు కన్పించాడు. కార్యకర్తలే కుటుంబం అనుకున్న గొప్ప వ్యక్తిత్వం వైఎస్‌లోనే చూశాను. దశాబ్దాల రాజకీయ అనుభవం కావచ్చేమో... ప్రజలకు ఏం కావాలో నిక్కచ్చిగా నిర్ణయించే సామర్థ్యం వైఎస్‌కే సొంతం. ఆయన పాలనలో ఎన్నో ఘటనలు... ఇంకెన్నో జ్ఞాపకాలు... మరెన్నో మరపురాని ఘట్టాలు..!విన్నాడు... ఉన్నానని ధైర్యమిచ్చాడు!పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా ప్రజల పక్షానికి చేర్చింది. ఊరూవాడా జనం గుండె చప్పుళ్ళు విన్నాడు. అప్పుడే ‘నేనున్నా’ననే భరోసా ఇచ్చాడు. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనే పట్టుదల ఆయనలో బహుశా అప్పుడే మొదలైందేమో! పాలనలో అది స్పష్టంగా కన్పించింది. పేదవాడికి పెద్ద జబ్బొస్తే ఊపిరి పోవడమే వైఎస్ వచ్చే నాటికి ఉన్న పరిస్థితి. ముద్ద పెట్టే పొలం, తలదాచుకునే ఇల్లు అమ్మేసి వైద్యం చేయించుకునే దయనీయ పరిస్థితి అది. ఇది వైఎస్ మనసును చలించేలా చేసింది. సీఎంగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితే ఉండకూడదని ఆశించారు. చిన్న అర్జీ తీసుకొస్తే చాలు ఎన్ని లక్షలైనా వైద్యం కోసం ఇవ్వాలని ఆదేశించారు. ఇలా రోజుకు రూ. 1.20 కోట్లు ఖర్చయ్యేది. ఇదంతా ఖజానాకు భారం అని బ్యూరోక్రాట్స్ చెప్పబోతే వారించారాయన. ‘పేదవాడి ఆపద తీర్చలేకపోతే ఎందుకయ్యా? బేవరేజ్ మీద సెస్ 1 నుంచి 2 శాతానికి పెంచితే సరిపోదా?’ అంటూ తేలికగా చెప్పేవారు. పనుల్లో బిజీగా ఉండి, రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చినా.. ‘సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యాయా?’ అని అడిగేవారు. పేదవాడిపై ఇంత ప్రేమ ఎంతమందికి ఉంటుంది? గ్రేట్ అన్పించేది. ఇలా ఎంతకాలం సీఎం ఆఫీసుకు పేదవాళ్ళు అర్జీలు పట్టుకుని రావాలి? శాశ్వత పరిష్కారం లేదా? వైఎస్ వేసిన ఈ ప్రశ్నల్లోంచే ‘ఆరోగ్య శ్రీ’ పథకం ఆవిర్భవించింది. దీనిపైనా విపక్షాలు విమర్శలు చేశాయి. విషయం ఏమిటంటే విమర్శించిన విపక్ష నేతలే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం! వాళ్ళే వైఎస్ తమకు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పటం!తప్పు చేయను... ఏం చేసినా మీ కోసమే!ఇది వైఎస్ గట్టిగా నమ్మిన సిద్ధాంతం. జలయజ్ఞం పేరుతో భారీగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతీ ప్రాజెక్టుపైనా విపక్షాలు రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుసరించిన విధానం విపక్షాల నోటికి తాళం వేసింది. ప్రతీ ప్రాజెక్టు దగ్గరకు విపక్ష నేతలను పిలిపించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పే ఏర్పాటు చేయడం వైఎస్ విజ్ఞతకు నిలువుటద్దం. ‘‘నేను తప్పు చేయనయ్యా... ఏం చేసినా ప్రజలకోసమేనయ్యా...’’ అని వైఎస్ చెప్పిన ఈ మాటలను ప్రజలు విశ్వసించారు. కాలగర్భంలో కలిసిన పోలవరం ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినా... పోతిరెడ్డిపాడుతో వరద జలాలు వాడుకునే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజాభిష్టమే లభించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ‘ఇక మిమ్మల్ని విమర్శించలేను’ అంటూ జి. వెంకటస్వామి కృతజ్ఞతా పూర్వకంగా అనడం ఇప్పటికీ చాలామంది గుర్తు చేస్తారు. ఒక ప్రాంతం కాదు... ఒక పార్టీ కాదు... ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసి తీరాల్సిందే అనేది వైఎస్ సిద్ధాంతం. అద్భుతమైన తెలివితేటలుండీ ఆర్థిక ఇబ్బందులతో చదవలేని పేదలకు ఫీజు రీ–ఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వైఎస్ వల్ల... డాక్టర్లు, ఇంజనీర్లు అయిన పేదవాళ్ళున్నారు. అలా కొత్త వెలుగులు విరజిమ్ముతున్న జీవితాలు ఎన్నో! పేదవాడి నోటికాడికి ముద్ద చేర్చాలన్న లక్ష్యంతో రూ. 5.30 కిలో బియ్యం ధరను రూ. 2కు తగ్గించాలని భావించారు. దీన్ని బ్యూరోక్రాట్స్ వ్యతిరేకించారు. ‘‘మీ అభ్యంతరాలు మీరు చెప్పండి... కానీ ఇది అమలు చేయడం నా బాధ్యత’’ అంటూ... నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ గొప్ప వ్యక్తి వైఎస్ అనడం అతిశయోక్తేమీ కాదు.తిరుగులేని నిర్ణయాలువైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో మిర్చి రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. జిల్లాల నుంచి అందిన ఈ సమాచారంతో వైఎస్ అప్పటికప్పుడే అధికారులను సమావేశపర్చారు. మార్కెట్లో రూ. 800 క్వింటాలున్న మిర్చిని, రూ.1500కు కొనాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో కొన్ని వేల మంది మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూశాం. ఇలాంటిదే మరో ఘటన. నిజామాబాద్‌లో రైతులు పండించే ఎర్ర జొన్నలు పంజాబ్, హర్యానాలకు సరఫరా అవుతాయి. వీటిని సేకరించే దళారులకు కేజీకి రూ. 12 వస్తే, రైతుకు వచ్చేది రూ. 4. రైతులకు ఎక్కువ ధర చెల్లించే ఓ దళారికి అవసరమైన బ్యాంకు లోన్ ఇప్పించడంలో అధికారులు కాదన్నా, వైఎస్ఆర్ నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేయడాన్ని ఇప్పటికీ అక్కడి రైతులు మరిచిపోరు. మరొక సందర్భం – వైఎస్ఆర్ హయాంలో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రతీ సిలిండర్‌కు రూ. 50 సబ్సిడీ ప్రకటించారు. రూ. 50 సబ్సిడీ ఇవ్వడం మామూలు విషయమేమీ కాదు. ఆర్థిక భారం పడుతుందని అధికారులు, ఆర్థిక మంత్రి చెప్పినా ‘ప్రతీ ఇంట్లో మేలు జరుగుతుంది కదా’ అని తన నిర్ణయంతో ముందుకు వెళ్లారు వైఎస్ఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వేసేప్పుడు స్వపక్షం నుంచే అనేక రకాల ఒత్తిడి వచ్చింది. ఇవేవీ లెక్క చేయలేదు. 150 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును అంత ధైర్యంగా చేపట్టడం వల్ల రాజధాని రూపురేఖలే మారాయి. హైదరాబాద్ విమానాశ్రయం పరిశీలనకు వెళ్ళినప్పుడు ఓ ముఖ్య విషయం ఆయన దృష్టికి వచ్చింది. విమానాల హబ్ ఏర్పాటు వల్ల అనేక రకాల అభివృద్ధి ఉంటుంది, దీనికి టాక్స్‌ను 14 నుంచి ఒక్క శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తి అది. అప్పటికప్పుడే ఆయన దానిపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విమానాశ్రయం ఆర్థిక పురోగతే మారింది.విశ్వసనీయతే ఆయన సైన్యంఇంటిలిజెన్స్ కన్నా ముందే వైఎస్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసేది. ఒకసారి గుంటూరు దగ్గర రైలు ప్రమాదం జరిగితే అధికారుల కన్నా ముందే ఆయన అప్రమత్తమయ్యారు. ఆయనే అందరికీ ఫోన్లు చేసి బాధితులకు అండగా ఉండమని చెప్పారు. ప్రతీ ఊళ్ళో ఆయనకు నెట్వర్క్ ఉండేది. ఏ జిల్లాకు వెళ్ళినా కనీసం 40 మంది కార్యకర్తలతో ఆయన విడిగా మాట్లాడేవారు. ఏ అర్ధరాత్రయినా ఆయనకు వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. విషయం చెప్పేవాళ్లు. ఆయన కూడా వినేవాడు. దీంతో కచ్చితమైన సమాచారం వచ్చేది. చుట్టూ ఉన్న కోటరీపై ఆయన ఎప్పుడూ ఆధారపడేవాడే కాదు. ఎంత పెద్ద ఆందోళన జరిగినా రైతులు, ప్రజలపై తుపాకులు ఎక్కు పెట్టొద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేవాడు. నిజామాబాద్‌లో ఎర్రజొన్నల వివాదం సందర్భంగా, ముదిగొండలో కాల్పుల సందర్భంగా... ‘రైతులకు ఏమైనా జరిగిందా?’ అంటూ ఆయన పడ్డ కంగారు మాటల్లో చెప్పలేనిది. విపక్ష నేతలను అసెంబ్లీలోనూ పేర్లు పెట్టి పిలిచే స్వతంత్రం... చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా– మళ్ళీ సెక్యులర్ మాటలు చెప్పినా తేలికగా కొట్టిపారేసే ధైర్యం... ఓడిపోయినా ప్రతీ క్షణం ప్రజా క్షేత్రంలోనే ఉండే గొప్ప నైజం... వైఎస్ ఉన్నతిని పెంచాయి. ఈనాటికీ ఏ నేతకూ లేని ప్రజాదరణను తెచ్చి పెట్టింది. వైఎస్ మన మధ్య లేకపోవచ్చు. సడలని విశ్వాసం... చెదిరిపోని ప్రజల కలల స్వప్నంలో పథకాల రూపంలో ఎప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి(వై.ఎస్.ఆర్. సీఎంగా ఉన్నప్పుడు సీఎంవో కార్యదర్శి) -
వైఎస్సార్.. తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
ఆ పేరే ఒక స్ఫూర్తి వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. రూ.లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. ఐదేళ్లలోలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి.. 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత.. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు వైఎస్సార్సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలు.. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. మహానేత మరణించి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయుడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు జీవం అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచి్చన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట⇒ 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను విడుదల చేశారు. ఆ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బునపడ్డ పేద కుటుంబాలు ఆ ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచి్చంది. 108, 104 అంబులెన్స్ సరీ్వసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్‌ను చేపట్టింది. ⇒ కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతోసహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. ⇒ కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థలో విప్లవం తీసుకొచి్చంది. ⇒ 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ⇒ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదువులు దక్కేలా చేశారు⇒ పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీసిటీ సెజ్తోసహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. -
వారానికో జిల్లాకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇకపై ప్రతి వారం ఒక జిల్లాకు వెళ్లాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించడంతో పాటు ఆయా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన సొంత జిల్లా పాలమూరు నుంచి ఆయన పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలును సీఎం సమీక్షిస్తారని, ఈ మేరకు అన్ని వివరాలతో సమావేశానికి రావాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. కీలక రంగాలపై ఫోకస్ జిల్లాల పర్యటనలో భాగంగా కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడం, వర్షాకాలం నేపథ్యంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష జరుపుతారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన సీఎం.. ఆ దిశలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా ఐటీఐల అప్‌గ్రెడేషన్ తదితర అంశాలపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, వైద్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యరంగ బలోపేతం తదితర అంశాలపై కూడా సూచనలు చేయనున్నారు. ఇక ప్రతి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి స్థానిక అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడతారని, త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడం ద్వారా వీలైనంత వేగంగా వాటిని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించేలా అధికారులకు మార్గదర్శనం చేస్తారని సమాచారం. వీటితో పాటు వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ, ఎరువుల లభ్యత, ఉపాధి హామీ పనులను సమీక్షించనున్న సీఎం.. రైతుభరోసా అమలు విధివిధానాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్న ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో అమలు కావాల్సిన అన్ని కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో జిల్లాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని కూడా సీఎం సమీక్షించనున్నారు. ఏడు నెలల పాలనపై ఏమంటారు? గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలనా పరంగా సాధారణ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, సీఎం ఎక్కువగా రాజకీయ అంశాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, కేబినెట్ విస్తరణ లాంటి అనివార్య రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పార్టీలో చేరికలపై కూడా దృష్టి పెట్టారు. ఇక వీలున్నంత మేరకు ప్రభుత్వ పాలనపై కూడా సమీక్షలు నిర్వహించారు. ఇటీవలే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం ప్రజలతో మమేకం కావాలని వారికి సూచించారు. ఆఫీసుల్లో కూర్చుని పనిచేయడం కన్నా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటివి తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి పాలన వ్యవహారాలపై రేవంత్ దృష్టి సారించారు. తాను సైతం క్షేత్రస్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. తొలుత గత ఏడు నెలల పాలనపై అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల మనోగతం ఎలా ఉందన్న దానిపై కూడా జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ ఎలా ఉందన్న దానిపై కూడా ఆయన ఫోకస్ పెట్టారని, అందులో భాగంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. నేడు మంగళగిరికి రేవంత్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు గాను ముఖ్యమంత్రి సోమవారం ఏపీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి వెళ్లి సీకే కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, కార్యక్రమం ముగిసిన తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 7:45 నిమిషాలకు హైదరాబాద్ వస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. -
రైతన్నల గుండెల్లో రాజముద్ర
ప్రకృతి కన్నెర్ర చేసింది. పాలకుల కరుణ కరువైంది. వరుణుడు పత్తా లేకుండా పోయాడు.వర్షాలు లేక, పంటలు పండక 1993 నుంచి 2004 మధ్య కాలంలో కరువు రక్కసి కబంధ హస్తాల్లో ‘అనంత’ రైతన్న చిక్కుకున్నారు. అలాంటి తరుణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశాకిరణంగా కనిపించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి అన్నదాత దిక్కులు చూస్తున్న సమయంలో అపర భగీరథుడిగా నిలిచారు. చేతిలో చిల్లిగవ్వ లేక పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలు, పేదల ఇంటికి పెద్ద కొడుకయ్యారు. పుట్టెడు అప్పులతో పిల్లల్ని చదివించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధంతరంగా అసువులు బాసిన రైతుల కుటుంబాలతో పాటు, పేదలకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకూ అందరి బంధువయ్యారు. అందుకే ఆయన తనువు చాలించి 15 యేళ్లు కావస్తున్నా నేటికీ అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.అనంతపురం అగ్రికల్చర్: 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై ఉచిత కరెంటు, విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తూ తొలి సంతకంతోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఆ ఒక్క సంతకంతో ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్ల విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. ఖరీఫ్‌లో పంట రుణాల పంపిణీ రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు.పంటల బీమాతో ధీమా..అప్పట్లో చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకాన్ని మార్పు చేసి రైతులకు ఎనలేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం దక్కింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు అందింది.ఒకే విడతగా రుణమాఫీ..2008లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్సార్ 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు.రాయితీతో విత్తనాలు..ఖరీఫ్, రబీలో రైతులకు లక్షల క్వింటాళ్ల వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ అందజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు.అనుబంధ రంగాలకూ ప్రాధాన్యత..వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూత అందించారు. రూ.25 కోట్ల రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీర విప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్ల సబ్సిడీ అందజేశారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో అందజేశారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్ల రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇలా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.అంతకు మించి..తండ్రి వైఎస్సార్‌కు తగ్గ తనయుడిగా గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. కరోనా కాలంలో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రోత్సాహం లాంటివే కాకుండా కేవలం రైతు సంక్షేమానికి ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించారు. దేశంలో తొలిసారిగా ఊరూరా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థతో వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ కోసం గ్రామం దాటి వెళ్లకుండా 867 ఆర్బీకేలను నిర్మించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్‌లతో పాటు పశుసంపద, జీవాల రక్షణకు వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 108 మాదిరిగా 1962 కింద మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు తెచ్చారు. రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలో రూ.15 లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) కింద ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర పరికరాలు అందించారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఏటా మూడు విడతల్లో రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.13,500 పెట్టుబడి సాయం ఇచ్చారు. ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా ‘ఈ–క్రాప్’, ఈ–కేవైసీ పారదర్శకంగా చేపట్టారు. రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందించారు. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివృద్ధికి అడుగడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందజేశారు. -
రాజువయ్యా.. మహరాజువయ్యా..
ప్రతి అడుగులో ఆలోచన..ముఖంలో చిరు మందహాసంతో కూడిన దర్పం..ఆహార్యంలో రాజసం..నమ్మిన ప్రజలకు దిక్సూచి.. అభాగ్యులకు ఆపన్నహస్తం..అన్నార్తులకు భరోసా..అభివృద్ధికి చిరునామా..అనారోగ్య బాధితులకు ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు జలయజ్ఞం, పేదవాడికి గూడు ఈ మాటలన్నీ ఎవరి నోట వినిపించినా ఠక్కున గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన పరిపాలన కాలంలో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన నాటికీ..నేటికీ ప్రజల గుండెల్లో మహారాజులా కొలువై ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన పాలన కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు అందించిన సేవలు ఒకసారి మననం చేసుకుంటే..సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరువు, పేదరికం, కటిక సమస్యలు తాళలేక పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వలసపోయే జనం..ఇదీ సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖచిత్రం! అలాంటి నేపథ్యంలో 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కీలక మలుపు. ఇక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. 2004 మే నెలలో తాను అధికారం చేపట్టింది మొదలు 2009 సెప్టెంబరులో అకాల మరణం వరకూ ముఖ్యమంత్రిగా ప్రతి పథకంలోనూ, అభివృద్ధి పనుల్లోనూ ఈ ప్రాంతానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. నాటి ఆయన కృషి తాలూకా ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి. తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అదే పంథాను కొనసాగించారు. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసరికి సాగునీరు అందుతోంది. ప్రగతిపథం వైపు ఉమ్మడి విజయనగరం జిల్లా వడివడిగా అడుగులు వేస్తోంది. వలసలు దాదాపుగా తగ్గిపోయాయి. బయటి ప్రాంతాలవారే ఇక్కడికొచ్చి స్థిరపడేలా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కలను సాకారం చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఆ మహామనిషి జయంతి నేడు (సోమవారం, జూలై 8). ఆయనను స్మరించుకోవడానికి ఊరూవాడా ప్రజలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ క్యాడర్‌ను కోరారు.జేఎన్టీయూ వైఎస్సార్ పుణ్యమే...ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు సాంకేతిక విద్యకు దిక్సూచిగా ఉన్న జేఎన్టీయూ–జీవీ విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2007లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. దీన్ని ఎప్పటికై నా యూనివర్సిటీని చేయాలనే ముందుచూపుతోనే 80 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది.మాతాశిశుసంరక్షణకు ప్రాధాన్యం..డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బొబ్బిలి సీహెచ్‌సీలో రూ.44.30 లక్షలతో సీమాంక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ప్రారంభించిన భవనంలోనే నాటి నుంచి గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు అందుతున్నాయి.ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది....విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు లైనింగ్ పనులు, పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు, నాగావళి ఉపనది జంఝావతి నుంచి రాష్ట్రానికి వచ్చే 4 టీఎంసీల వాటా నీరు వినియోగించుకునేందుకు వీలుగా 1976వ సంవత్సరంలో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో పనులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాలోపూర్తయినవే.వైఎస్సార్‌కు స్మృతివనం..పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక దైవంలా ఆరాధిస్తున్నారు. 2006లో ముఖ్యమంత్రి హాదాలో ఇక్కడ ప్రజాపఽథం కార్యక్రమానికి వైఎస్సార్ వచ్చారు. ఆయన మరణానంతరం ఇక్కడ వైఎస్సార్ స్మృతివనాన్ని గ్రామస్తులు నిర్మించారు.చీపురుపల్లి అభివృద్ధికి ఆద్యుడుచీపురుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాంది పలికారు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చొరవతో రూ.83 కోట్లతో ఇందిరమ్మ సుజలధార పథకం చేపట్టడం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగించారు. చీపురుపల్లికి ఆ మహానేత వైఎస్సార్ హయాంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేడు ఆదర్శ డిగ్రీ కళాశాలగా కొనసాగుతోంది.‘గిరి’జన గ్రామాల్లో వెలుగువేపాడ మండలం కరకవలస పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన మారిక గ్రామానికి తొలిసారిగా 2006లో విద్యుత్ సదుపాయం కల్పించిందీ నాటి రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆ గ్రామానికి బీటీ రోడ్డుకు నిధులు కేటాయించిందీ ఆయనే. జామి మండలంలో మూతపడి ఉన్న భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరుకు రైతుల జీవితాల్లో తీపి నింపారు. రాజన్న మరణానంతరం మళ్లీ ఆ ఫ్యాక్టరీ మూతపడింది.తోటపల్లితో మూడు జిల్లాల్లో ప్రగతి...విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రగతికి మూలకారకంగా తోటపల్లి ప్రాజెక్టు ఉంది. వాస్తవానికి ఇప్పుడు ప్రాజెక్టు ఉన్న తోటపల్లి ప్రాంతానికి దిగువన నాగావళి నదిపై బ్యారేజీ ఉండేది. 64 వేల ఎకరాలకు సాగునీరు అందించే దీన్ని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టును నిర్మిస్తానంటూ 2003 సంవత్సరంలో చంద్రబాబు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. తర్వాత దాని ఊసే తేలేదు. 2004వ సంవత్సరంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించే ఈప్రాజెక్టు నిర్మాణానికి రూ.450.23 కోట్లు నిధులు మంజూరు చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2004 అక్టోబరు 17వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయన హయాంలోనే భూసేకరణ, పునరావాసం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు కూడా 81 శాతం అయిపోయాయి. ఆయన అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులైన వారెవ్వరూ పెండింగ్ పనులపై దృష్టిపెట్టలేదు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. ఆధునికీకరణకు, హెడ్ వర్క్‌లను పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు. -
వైద్యరంగంలో రాజముద్ర
-
నేనున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తకు జగన్ పరామర్శ
వైఎస్సార్, సాక్షి: టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శనివారం జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. కడప రిమ్స్‌కు వెళ్లి బాధితుడు అజయ్‌ను కలిసి నేనున్నాను అని ధైర్యం చెప్పారు. వేంపల్లెలో శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్యకర్త దాడి గురించి తెలుసుకున్న జగన్.. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్‌కు వెళ్లారు. దాడి జరిగిన విధానం గురించి తెలుసుకున్న ఆయన.. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్‌పోర్టు వద్ద కోలాహలంఅంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ రాకతో ఎయిర్పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి, అర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు. ఇక.. తన పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో ఉండనున్న జగన్.. పలువురు కార్యకర్తలు, నేతల్ని కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే వేడుక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. -
‘వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం’
తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నాం, రక్తదానం, పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కి పిలుపునిస్తున్నాం.పార్టీ క్యాడర్ అంతా జులై 8న వీటిని నిర్వహించాలని కోరుతున్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మహనీయుడిని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఆ మేరకు క్యాడర్ అంతా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. వైఎస్సార్ ఆశయాలు, విధానాలతోనే వైఎస్సార్సీపీ ఏర్పడింది. వైఎస్ఆర్ ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతున్నాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
తస్సాదియ్యా... మన రోశయ్య!
విషయ పరిజ్ఞానం, లెక్కలు, తేదీలు, చమత్కారం, సమయ స్ఫూర్తి, ముక్కుసూటిగా ప్రవాహ వేగంతో మాట్లాడే లక్షణం, స్పష్టమైన ఉచ్చా రణ, గంభీరమైన కంఠస్వరం వంటి లక్షణాలు మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఓ ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. శాసన సభలోనూ, బయటా ఆయన మాట్లాడిన ప్రతిమాటా ఒక చెణుకే.ఓసారి రోశయ్య అల్లుడు ఒక విందులో తన మిత్రులతో ఎంజాయ్ చేస్తూ టీవీ ఛానెళ్లకు చిక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో టీడీపీ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మూకుమ్మడిగా ఉత్సాహంతో రెచ్చిపోయారు. చివరగా రోశయ్య తాపీగా నిలబడ్డారు. ‘అధ్యక్షా... ఎన్టీ రామారావు గారికీ, నాకూ దేవుడు మంచి అల్లుళ్ళనివ్వలేదు. ఏంచేస్తాం అధ్యక్షా’ అనేసి ఠక్కున కూర్చున్నారు. పాపం... తెలుగు తమ్ముళ్లు నవ్వలేరు, నవ్వకుండా ఉండలేరు. ఇక చంద్రబాబు పరిస్థితి సరే సరి! మిగతా సభ్యుల నవ్వులతో ఆనాటి సభ వెల్లివిరిసింది.మరోసారి సభలో చంద్రబాబు ఆరోపణలపై ప్రతిస్పందిస్తూ ... ‘అధ్యక్షా... స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని నేను డ్రామా కంపెనీవాడు అనలేదు. ముందు ఆయన డ్రామాలు వేశాడు. తరవాత సినిమాల్లోకి వెళ్లి ప్రముఖ నటుడయ్యాడు అన్నానంతే. మీరు (చంద్రబాబును ఉద్దేశించి) ఒకప్పుడు ఆయన్ను గౌరవించారు. మధ్యలో పోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది... సరే, నన్ను తెలివితేటలు గలవాణ్ణని అన్నారు. నేను తెలివితేటలు గలవాణ్ణయితే ఇలా ఉంటానా? ఒంటరిగా ఉన్నప్పుడెప్పుడో అదనుచూసి రాజశేఖర రెడ్డిని ఒక్కపోటు పొడిచి ఆ సీట్లో కూర్చునేవాడిని...’ అన్నారు. అంతే... చంద్రబాబు, ఆ పార్టీ సభ్యులు కిక్కురుమంటే ఒట్టు.వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన ఓ చెణుకు గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా చెప్పారు: ‘‘రోశయ్య ఓసారి రాజమండ్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లడంపై మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి మంచిది కాదు–అప్పుల ఊబిలోకి పోతాం అన్నారు... సరే విలేకర్లు తర్వాత ఆయన మాటల్ని మరో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫైనాన్స్ మినిస్టర్ (యనమల రామృష్ణుడు)తో అని, దీనికేమంటారు? అని అడిగారు. అందుకాయన మేమేమైనా తప్పు చేస్తున్నామా, ఫెసిలిటీ ఉంది, వాడుకుంటున్నాం. దాని కెందుకింత గొడవ? అన్నారు. ఈ సంగతి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సులో రోశయ్యతో చెప్పి, దీనిపై మీరేమంటారు? అని అడిగారు. దీనికి రోశయ్య ‘చూడు నాయనా... ప్రతి ఊరికీ శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది. ఉంది కదాని వాడుకోం కదా, జీవుడు పోయిన తర్వాతే అక్కడికి పట్టుకెళ్ళేది’ అని జవాబిచ్చారు.చెణుకులు విసరడమే కాదు అణకువలోనూ, అందరితో కలివిడిగా ఉండడంలోనూ ఆయన పెట్టింది పేరు. ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగుతూ తన పేషీలో సెక్రెటరీ, పీ.ఏ, ఇతర ఉద్యోగులందరి సీట్ల దగ్గరకూ వెళ్లి ‘నా టెర్మ్ అయిపోయింది. కృతజ్ఞతలు. నా వల్ల ఏమైనా ఇబ్బందిపడి ఉంటే ఏమీ అనుకోకండి’ అని వినమ్రంగా చెప్పారు రోశయ్య.శాసన మండలి సభ్యునిగా ఎన్టీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి, మండలి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకునేలా చేశాడని నాటి విశ్లేషకులు అంటుంటారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా ఉద్యోగంలా భావించారు. అసంతృప్తిగా పని చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అవినీతి మచ్చలేని నిలువెత్తు నిజాయితీ ఆయన. ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే సత్యమిది. రాజకీయాల్లో ఆయన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది.– తిరుమలగిరి సురేందర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
ఆగని టీడీపీ శ్రేణుల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల విధ్వంసకర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం పలు గ్రామాల్లో ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయ భవనంపై టీడీపీ, జనసేన జెండాలు ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ⇒ కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలోని ప్రధాన సెంటరు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో మండలంలోని గొల్లగూడెం పంచాయతీపై యువగళం జెండా ఎగురవేశారు. ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఉప్పలూరులో సచివాలయ భవనంపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన బోర్డును పగులగొట్టారు. ⇒ నెల్లూరు జిల్లా జలదంకి మండలం కేశవరంలో నిర్మాణంలోని ప్రభుత్వ భవనాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాలను పగులగొట్టారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రాల్లో గోడలపై ఉన్న నవరత్నాల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్‌క్లినిక్ భవనం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక పంచాయతీ కార్యాలయంపైన ఉన్న సచివాలయం గోడకు అమర్చిన నవరత్నాల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన వివరాలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతోసహా ఈ శిలాఫలకంపై ఉన్నాయి. గ్రామ శివారున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఫొటోతో ఉన్న స్వాగత బోర్డులను ఊడబెరికారు.ఈ ఘటనల్ని సర్పంచ్ వీధి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మద్దింశెట్టి దొరబాబు, నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలాన్ని మండపేట రూరల్ సీఐ శ్రీధర్, అంగర ఎస్ఐ అందే పరదేశి పరిశీలించి వివరాలు సేకరించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సచివాలయం ప్రభుత్వ ఆస్తి అని, దీన్ని ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడినవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ⇒ అనకాపల్లి జిల్లా మాడుగుల రూరల్ మండలంలో గిరిజన పంచాయతీ అయిన లోవపోన్నవోలు గ్రామ సచివాలయం భవనం మీద కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన జెండాలు ఎగురవేశారు. ఈ విషయమై ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావును అడగగా.. ప్రభుత్వ కార్యాలయాల మీద జాతీయజెండా మినహా పార్టీ జెండాలు పెట్టకూడదని చెప్పారు. వీటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ప్రదేశాన్ని సోమవారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామిదాసు మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా గ్రామాల్లో నెలకొలి్పన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం అరాచక చర్య అని చెప్పారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలకు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారని, అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లా కరుణాకరరావు, కావూరి వినయ్‌కుమార్, కలకొండ రవికుమార్, ఎంపీటీసీ సభ్యురాలు కటుకూరి రాధమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణారావు, నంబూరి కృష్ణారావు, నాయకులు వెంకటరెడ్డి, బాబూరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పేదల ఇంటి నిర్మాణాలు ధ్వంసంచాట్రాయి మండలం పోలవరంలో పేట్రేగిన టీడీపీ నేతలుచాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో టీడీపీ నాయకులు పేట్రేగిపోయారు. గత ప్రభుత్వం పేదలకు ఇచి్చన స్థలాల్లో లబ్ధిదారులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి జేసీబీతో రెండు ఇళ్ల పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకిలించివేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలవరం గ్రామంలోని మంకొల్లు రోడ్డులో నాలుగో లే అవుట్లో 28 మంది పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటిస్థలాలు మంజూరు చేసింది.వాటికి రిజి్రస్టేషన్ చేయించి పట్టాలు ఇచ్చింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు దానం బాబూరావు, కొంగర దేవదత్తం తమకు ఇచ్చిన స్థలాల్లో రూ.2 లక్షల వంతున వెచ్చించి ఇంటి నిర్మాణాల కోసం పునాదులు నిర్మించి, పిల్లర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామంలో జగనన్న లే అవుట్లో వేల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ధ్వంసం చేశారు.రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గంలో ఇలాంటి విధ్వంసాలు చేపట్టడం దారుణమని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకలించి వేయడంపై బాధితులు ఫిర్యాదు చేశారని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ మహ్మద్ మసూద్ అలీ తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినట్టు లబ్ధిదారులు చెప్పారు. -
అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్‌బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేశారు. -
కొనసాగుతున్న విధ్వంసకాండ
కృష్ణగిరి/నాగలాపురం/నల్లజర్ల/జలదంకి: టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ విగ్రహాలను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరిలోని బస్టాండ్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు.ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరుకలచెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమకతాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామిరెడ్డి, హుసేన్‌సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వీటి ప్రారంభోత్సవ సమయంలో ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ధ్వజమెత్తారు. దీనిపై గోవర్థనగిరి వైఎస్సార్సీపీ సచివాలయ కన్వీనర్ మునిశేఖర్ పిచ్చాటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల సచివాలయం–1 పరిధిలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నవరత్న పథకాలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 26 రోజులుగా సాగుతున్న దాడులు, దాష్టీకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని గ్రామ సర్పంచ్ బండి చిట్టి, ఉప సర్పంచ్ నక్కా పండు ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిలాఫలకంపై పేర్లు తొలగింపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్ తదితర పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్‌తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మెలకు కూడా పచ్చ పెయింటింగ్ వేశారు. పంచాయతీ భవనం గోడపై సీబీఎన్ అని రాశారు. గతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
రెడుబుక్ ఉన్మాదమిది
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా గ్రామాల్లో, ఎస్సీ, ఎస్టీ వాడల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలదోస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా చితకబాదుతుండటం ఊరూరా కనిపిస్తోంది. శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలను తొలగిస్తున్నారు.. పగలగొడుతున్నారు.బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదేం కక్ష సాధింపు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎవరైనా ఇలా చేశారా? అధికారం చేజిక్కించుకుంటే ఇలా దాడులు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి లైసెన్స్ వచ్చినట్లా? లేక అధికారంతోపాటు హిస్టీరియా ఏమైనా వచ్చిందా? రెడ్ బుక్.. రెడ్ బుక్.. అంటూ లోకేశ్‌కు వచి్చన పూనకం తాలూకు ఉన్మాదమే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకూ నరనరాన ఎక్కినట్లుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడమే మీ ఉన్మాద లక్ష్యం అయితే.. ప్రజాగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసి పడటం ఖాయం. ఆ సెగలో మాడి మసి అవుతారో.. లేక పద్ధతి మార్చుకుని బుద్ధిగా పాలన సాగిస్తారో చూడాలి.అద్దేపల్లి (భట్టిప్రోలు)/సాక్షి ప్రతినిధి బాపట్ల: టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. భట్టిప్రోలు పంచాయతీ పరిధి అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం ముప్పావు భాగానికి పైగా దగ్ధమైంది. దీంతో దళితవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే, వైఎస్సార్ విగ్రహానికి సమీపంలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైఎస్సార్సీపీ వారు పగులగొట్టారని, అందుకు ప్రతీకారంగా వైఎస్ విగ్రహాన్ని తగులబెట్టినట్లు టీడీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు జెండా దిమ్మెను కొద్దిగా పగులగొట్టుకుని ఆ సాకుతో వైఎస్ విగ్రహాన్ని కాల్చివేశారని వైఎస్సార్సీపీ నేతలు వాదిస్తున్నారు. ఇరువర్గాలూ పరస్పర ఫిర్యాదులుబాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు అనంతరం టీడీపీ అరాచకపర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో చాలామంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదలి వెళ్లిపోయారు.ఈ పరిస్థితిలో టీడీపీ జెండా దిమ్మెలను పగులగొట్టే పరిస్థితి వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నది టీడీపీ నేతలకూ తెలుసు. కాకపోతే ఏదో ఒక సాకుచూపి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఏడు మందిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ప్రతిగా 14 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు : ఎస్‌ఐఈ ఘటన గురించి తెలుసుకున్న వేమూరు సీఐ పి.రామకృష్ణ, ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు, సిబ్బందితో çఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వైఎస్సార్ విగ్రహం దగ్ధం చేసిన ఏడుగురిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై 435, 427, 507 ఆర్/34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. దళితవాడలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. విగ్రహాలు ధ్వంసం హేయం : మేరుగుస్ఫూర్తిని నింపిన మహనీయుల విగ్రహాల ధ్వంసం, దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీమంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విగ్రహం దహనం విషయం తెలుసుకున్న ఆయన అద్దేపల్లిని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. టీడీపీ దురాగతాన్ని ఖండించారు.హుటాహుటిన మరొక విగ్రహం ఏర్పాటుకు యత్నంవైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు. దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా పోలీసులు నిర్ధాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారు. విగ్రహాన్ని దగ్ధం చేయడం గ్రామ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని.. చంద్రబాబు రాక్షస పాలనకు ఇది పరాకాష్టని అశోక్‌బాబు మండిపడ్డారు. -
వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్ విగ్రహానికి..
సాక్షి, బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
శిలాఫలకాల ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం రాత్రి, సోమవారం ధ్వంసం చేశారు. వాహనాల దహనం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో రూ.27 లక్షలతో నిరి్మంచిన పీఏసీఎస్ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. త్రిసభ్య కమిటీ పేరుపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా చైర్మన్‌గా వ్యవహరించిన గంధం వెంకటరత్నం (షావుకారు) పేరు సైతం తొలగించారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఎంఈవో సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు గంటా రజనీప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మండపేట–ద్వారపూడి రహదారి పనులకు సంబంధించి స్థానిక తాపేశ్వరం రోడ్డులోని లాకులకు వెళ్లే దారిలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోను పూర్తిగా తొలగించారు. ఘటనాస్థలాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పరిశీలించారు. శిలాఫలకాల ధ్వంసం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వెంటనే స్పందించి, ఇటువంటి ఘటనలను నిలువరించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ⇒ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లేదారిలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు తెలిపే శిలాఫలకాన్ని తొలగించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ⇒ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం గ్రామంలో బత్తుల రాంబాబు ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రాంబాబు ద్విచక్రవాహనాన్ని ఇంటి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి దాటాక మంటలు రావటాన్ని గమనించిన స్థానికులు మంటల్ని ఆరి్పవేశారు. అప్పటికే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. రాంబాబు భార్య స్వాతి గ్రామంలో వలంటీరుగా పనిచేసింది. టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ద్విచక్రవాహనం దహనమైంది. ఘటనాస్థలాన్ని ఎస్.ఐ. పి.హజరత్తయ్య పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ⇒ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కండువా వేశారు. టీడీపీ నాయకుల ఆగడాలు తారస్థాయికి చేరాయని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి అవమానించారని వైఎస్సార్సీపీ మర్లపాడు గ్రామ అధ్యక్షుడు సింగమనేని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఆగని టీడీపీ అరాచకం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడమేగాక ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శివాపురంతండాలో ఆదివారం రాత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన విగ్రహాన్ని మాయం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారి ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు నకరికల్లు ఎస్ఐ కె.నాగేందర్రావు చెప్పారు.గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో వడ్డెరపాలెం వెళ్లే మెయిన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం ధ్వంసం చేశారు. ఇది గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాడు–నేడు కింద గత ప్రభుత్వంలో నిర్మించిన పాఠశాల ప్రహరీలను ఆదివారం టీడీపీ నాయకులు జేసీబీ యంత్రాలతో కూల్చేశారు. నాడు–నేడు కింద కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గత ప్రభుత్వం తీర్చిదిద్దింది.గ్రామ నడిబొడ్డున ఉన్న పాఠశాలకు ప్రత్యేకంగా రూ.20 లక్షలతో ప్రహారీ నిర్మించింది. ఈ గోడను కొందరు టీడీపీ నాయకులు ఇళ్లకు అడ్డంగా నిర్మించారని ఇప్పుడు కూల్చేశారు. టీడీపీ నాయకుల ఇళ్ల ముందు విశాలంగా స్థలం కావాలని రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మండలంలోని మల్లానూరు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గుత్తార్లపల్లి వద్ద నిర్మించిన వన్నెకుల క్షత్రియ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సైతం కూల్చేశారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ జంగాలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త పచ్చికాల శీనయ్య రేకుల షెడ్‌ను, ప్రహరీని స్థానిక టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. శీనయ్య రూ.5 లక్షలతో తన స్థలంలో షెడ్ వేసుకుని చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ప్రహరీని, షెడ్‌ను ధ్వంసం చేస్తామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తుండటంతో శీనయ్య రెండురోజుల కిందట వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున జేసీబీతో ప్రహరీని, రేకుల షెడ్‌ను ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంకమరావు తెలిపారు.తూర్పు గోదావరి జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురం నుంచి దొండపూడి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి మాజీ హోం మంత్రి తానేటి వనిత ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై సోమవారం ఉదయం ఆ శిలాఫలకం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ ఆర్మీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం నాలుగురోడ్ల కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.తాము గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇటువంటి దాడులు, శిలాఫలకాల ధ్వంసాలు చేయలేదని వారు చెప్పారు. టీడీపీ, జనసేన నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు.అంగన్వాడీ స్థలం కబ్జాపెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించిన ఘటన పెద్దపంజాణి మండలంలోని బెరబల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పెద్దపంజాణి పంచాయతీ బెరబల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్న సుమారు 10 సెంట్ల ప్రభుత్వ భూమిని దాదాపు రెండేళ్ల క్రితం గ్రామస్తుల వినతి మేరకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి కేటాయిస్తూ ఆక్రమణలకు గురికాకుండా ప్రహరీ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భూమిని తిరిగి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. జేసీబీతో ప్రహరీని తొలగించారు. -
సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలికి సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా గెలిచిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ చైతన్యానికి నిలయమైన తెనాలి నుంచి ఎందరో రాజకీయ ఉద్దంఢులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా సమర్థత నిరూపించుకున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి మంత్రి పదవులను చేపట్టినవారు కొందరే. నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కేవలం నలుగురు మాత్రమే మంత్రి పదవులను చేపట్టారు. అందులో ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించగా, మరొకరు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో అప్పటి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. 2004, 2009 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాదెండ్ల మనోహర్ ఆ రెండు ఎన్నికల్లోనూ తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాదెండ్ల మనోహర్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లైబ్రరీ కమిటీ చైర్మన్ పదవి వరించింది. తర్వాత క్యాబినెట్ హోదాతో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిని నిర్వర్తించారు. అనంతర రాజకీయ పరిణామాలతో వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో జనసేన అభ్యరి్ధగా తెనాలి నుంచి పోటీచేసిన నాదెండ్ల మనోహర్, ఆ రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 వచ్చేసరికి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. జనసేన పీఏసీ చైర్మన్‌గా జనసేన, టీడీపీల మధ్య పొత్తులో మనోహర్ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. బీజేపీతో కూడా పొత్తు కుదరటంతో జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేసి, అధికారాన్ని చేపట్టాయి. జనసేనలో నెంబర్ టూ అయిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌కు సహజంగానే మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. ఆ ప్రకారంగానే గన్నవరం ఐటీ పార్కులో బుధవారం అట్టహాసంగా జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మనోహర్‌కు కీలక మంత్రిత్వ శాఖ లభిస్తుందనేది కూడా వాస్తవమే. 2009–14 మధ్య అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత విభజిత ఆంధ్రపదేశ్‌కు తెనాలి నుంచి తొలిగా మంత్రి పదవిని చేపట్టిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కావటం మరో విశేషం! 1952 ఎన్నికల్నుంచి తెనాలిలో మూడుసార్లు పోటీచేసి గెలిచిన ఆలపాటి వెంకట్రామయ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా మూడు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 1989లో తెనాలి నుంచి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి విజయం సాధించినా, డాక్టర్ చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. 2009లోనూ మళ్లీ విజయాన్ని నమోదు చేసింది. ఆ రెండుసార్లు తెనాలి నుంచి కాంగ్రెస్ తరçపున ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా నియమితులయ్యారు. -
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల అరాచకాలపై సర్వత్రా ఖండనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఈర్ష్య, అసూయలతో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాల్లేవీ ఉండకూదని పచ్చ మూకలు దాడులకు తెగపడుతోంది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ సందేశం ఉంచారు. ‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం.రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…— YS Sharmila (@realyssharmila) June 9, 2024.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె. మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన. -
AP: వైఎస్సార్ విగ్రహాల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు. విగ్రహం ముందు వైపు ట్రాక్టర్ స్లిప్ అయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనంతరం మడ్డి ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చి విగ్రహం మీద పోసి నిప్పు పెట్టారు. ఆ మేరకు విగ్రహం పక్కనే మడ్డి ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం పెదగోగులపల్లెలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఉన్న బోర్డును నేలమట్టం చేశారు. సమీపంలోని ఆర్వో ప్లాంటులోకి చొరబడి పైపులను విరిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డులో కూడా ఇదే రీతిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ⇒ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారిలోని దీపిక కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల్లో ఈ వాహనాన్ని ఉపయోగించారు. పోలింగ్ అనంతరం ఆ వాహనాన్ని దీపిక కల్యాణ మండపం వద్ద పార్కింగ్ చేశారు. దుండగులు వాహనానికి నిప్పంటించిన తర్వాత కల్యాణ మండపంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీవీ.పురం, కొత్తపల్లి మహభారతం, వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసి శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మండలాధ్యక్షడు మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ⇒ కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్సార్ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు పొక్లెయిన్‌పైకి ఎక్కి మహానేత వైఎస్సార్ విగ్రహం మెడలో పచ్చ కండువా వేశాడు. చేతిలో టీడీపీ జెండా పెట్టాడు. భవానీపురం పోలీసులు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ర్యాలీ ముందుకు కదిలిన తర్వాత పోలీసులు టీడీపీ కండువా, జెండాను తొలగించారు.⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన రహదారి సమీపంలో ఎన్నో ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు విగ్రహం అక్కడే ఉందని, ఉదయం లేచి చూసేసరికి విగ్రహం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.⇒ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో హల్ చల్ చేశారు. పట్టణంలోని పలుచోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, మొండితోక అరుణ్ కుమార్ల బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
అమాత్య పదవిపై ఆశలు!
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడే అమాత్య పదవిపై ఆశలు మొదలయ్యాయి. ఫలితాలు వచ్చి 24 గంటలైనా గడవక ముందే ఎవరికి వారు తమకే మంత్రి పదవి దక్కుతుందంటూ అంచనాలేసుకుంటున్నారు. వారితో పాటు వారి ప్రధాన అనుచరులు కూడా ఊహల పల్లకీలో విహరిస్తున్నారు. సీనియారిటీ, సామాజిక సమీకరణలు, కూటమి పెద్దలతో ఉన్న పరపతి, పరిచయాలు, అనుబంధాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. ఎవరికి అనుకూలంగా వారు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 13 మంది ఎమ్మెల్యేలు కూటమి తరఫున ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు జనసేన, ఒకరు బీజేపీ నుంచి, మిగిలిన ఎనిమిది మంది టీడీపీ నుంచి గెలుపొందారు.👉 విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి నాలుగోసారి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు ఈ దఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు, విశాఖ ఎంపీగా ఎన్నికై న శ్రీభరత్‌తో సత్సంబంధాలున్నాయి. ఇవన్నీ తమ నాయకుడు వెలగపూడికి మంత్రి పదవి దక్కేందుకు కలిసొచ్చే అంశాలని ఆయన అనుచరులు చెబుతున్నారు.👉 నాలుగోసారి గెలిచిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవిపై నమ్మకంతో ఉన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మంత్రిగా పనిచేశారు. తన సామాజికవర్గం కోటా కలిసొస్తుందని ఆయన ఆశతో ఉన్నారు.👉 పెందుర్తి నుంచి జనసేన తరఫున ఎన్నికై న పంచకర్ల రమేష్‌బాబుకి ఇది మూడోసారి గెలుపు. దీంతో తన సీనియారిటీ, జనసేన కోటా, సామాజికవర్గం కలిసొచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. అయితే గంటా, పంచకర్లది ఒకే సామాజికవర్గం కావడంతో ఈయనకు మంత్రి పదవి ప్రతిబంధకంగా మారుతుందని అంటున్నారు.👉 నర్సీపట్నం నుంచి ఏడోసారి గెలుపొందిన అయ్యన్న తనకు మంత్రి పదవి ఖాయమన్న భావనలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కేబినెట్లో స్థానం దక్కడంతో ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.👉 గాజువాక నుంచి టీడీపీ తరఫున రెండోసారి గెలిచిన పల్లా శ్రీనివాసరావు తన సామాజికవర్గ కోటాలో మంత్రివర్గంలో స్థానం ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఆయన అనుచరులు ఇప్పటికే ఈ ప్రచారం మొదలు పెట్టారు.👉 విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికై న విష్ణుకుమార్‌రాజు తనకు కూటమి బీజేపీ కోటాలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశతో ఉన్నారు. అయితే బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఆయనకు పోటీగా ఉన్నారు.👉 పాయకరావుపేట నుంచి రెండో దఫా ఎన్నికై న వంగలపూడి అనిత కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎస్సీ సామాజికవర్గం, మహిళా కోటా తనకు కలిసొస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.👉 జనసేన తరఫున అనకాపల్లి నుంచి గెలిచిన కొణతాల రామకృష్ణ 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. జనసేనలో సీనియర్ అయిన కొణతాల తనకు కేబినెట్లో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు.👉 ఆఖరి నిమిషంలో మాడుగుల సీటు దక్కించుకుని పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అయ్యన్నది, ఈయనది ఒకే సామాజికవర్గం కావడం అడ్డంకిగా మారుతుందని చెబుతున్నారు. ఇలా ఫలితాలు వెలువడ్డాయో లేదో అలా మంత్రి పదవులపై ఎవరికి వారే అంచనాల్లో మునిగి తేలుతున్నారు. వారి అనుచరులు సైతం బాహాటంగానే చెప్పుకుంటున్నారు. -
ఆరోగ్యశ్రీని మళ్లీ YSR తరహాలో అమలు చేస్తాం: రేవంత్
-
ప్రాంతీయ, రాజకీయ స్వభావాలు ఒకటి కాదు!
పులివెందుల ప్రజల గురించీ, ఇక్కడి సంస్కృతి గురించీ అభ్యంతరకరంగా మాట్లాడ్డం ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ప్రాంత ప్రజల పట్ల విషం కక్కడం పెరిగిపోయింది. ఇక్కడ జరిగే రాజకీయ సంఘటనలన్నింటికీ మొత్తం పులివెందుల ప్రజలనూ, ఆ ప్రాంతాన్నీ, సంస్కృతినీ తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే పులివెందుల ప్రజల పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించడంలో మీడియా, సినిమా వాళ్లూ, రాజకీయనాయకులూ సఫలీకృతమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా తోడవడంతో చివరికి ఈ ధోరణి ఎక్కడికెళ్లి ఆగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ముద్ర మొత్తం రాయలసీమకు ఉంది. ఇక్కడ లేని జీవితాన్ని ఇక్కడిదిగా చూపించి డబ్బు చేసుకోవడంలో సినిమా వాళ్లు ముందున్నారు. ఇవ్వాళ ఏ సినిమా రంగమైతే రాయలసీమనూ... అందులోనూ పులివెందుల వంటి ప్రాంతాలనూ నేరపూరితంగా చూపిస్తూ ఉందో, ఆ రంగానికి ఇక్కడి ప్రజలు చేసిన సేవ అంతా ఇంతా కాదు. సినిమారంగంలో మొత్తం దక్షిణ భారతదేశంలోనే తొలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన బీఎన్ రెడ్డి పులివెందుల ప్రాంతం వాడే. ఈయన తీసిన ‘స్వర్గ సీమ’, ‘బంగారు పాప’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు కళాఖండాలు. ‘వాహిని’ సంస్థను స్థాపించి ఈయన సృష్టించిన చిత్రరాజాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే వచ్చిన బి. నాగిరెడ్డి కూడా సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. విజయా సంస్థను ప్రారంభించి ఈయన నిర్మించిన ‘పాతాళ భైరవి’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘షావుకారు’ వంటి సినిమాలు అజరామరమైనవి. పత్రికా రంగంలోనూ బి. నాగిరెడ్డి అపార కృషి చేశారు. చక్రపాణితో కలసి ‘చందమామ’ పత్రికను ప్రారంభించారు. అప్పటి తరం పిల్లలు చందమామ చదవకుండా పెరగలేదంటే అతిశయోక్తి కాదు. మోరార్జీ దేశాయ్ వంటి మాజీ ప్రధాని కూడా బి. నాగిరెడ్డిని చందమామతోనే గుర్తు పెట్టుకుని ‘చందమామ రెడ్డిగారు’ అని పిలిచేవారట. తర్వాత ఆయన మహిళల కోసం ‘వనిత’, సినిమా పాఠకుల కోసం ‘విజయ చిత్ర’ వంటి పత్రికలను నడిపారు. అలనాటి హాస్య నటుడు పద్మనాభం, ‘షో’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు పొందిన నీలకంఠ వంటి వారు కూడా ఈ ప్రాంతం వారే. ఇక్కడ పుట్టిన రచయితలు మొదటి నుంచి అభ్యుదయ వాదులు. తమ రచనల్లో మానవత్వం, స్త్రీ హక్కులు, రైతు జీవితం, సామరస్య భావాల గురించి రాశారు. ‘తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది – డ్రైనేజి స్కీము లేక... డేంజరుగా మారుతోంది’ అన్న ప్రముఖ హేతువాద జర్నలిస్టు గజ్జల మల్లారెడ్డి ఇక్కడి వాడే. తెలుగు సాహిత్య విమర్శ దిగ్గజం రాచమల్లు రామచంద్రారెడ్డి, కథకులు వైసీవీ రెడ్డి, నాద మునిరాజు, అరవేటి శ్రీనివాసులు, కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన వేంపల్లె షరీఫ్ వంటి వాళ్లు ఇక్కడివాళ్లే. ఎక్కువమంది వ్యవసాయం చేసి బతుకుతారు. ఒకప్పుడు చిరుధాన్యాలతోపాటు వేరుశనగ విపరీతంగా పండేది. ఇప్పుడు రైతులు చీని, నిమ్మ తోటలను పెంచుతున్నారు. వందల అడుగుల లోతులో బోర్లు వేస్తే కానీ నీళ్లు పడని స్థితి. తమతోపాటు పొలాల్లో పనిచేసి తమకింత తిండి పెట్టే మూగజీవాలను ఇక్కడివాళ్లు ఇంటి మనుషుల కిందే చూసుకుంటారు. అవి చనిపోతే మనుషులతో సమానంగా అంత్యక్రియలు చేస్తారు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపరు. ఆడపిల్లలందరినీ వాళ్ల వయసుతో నిమిత్తం లేకుండా గౌరవంగా ‘అమ్మా’ అని పిలుస్తారు. అత్యంత గౌరవ మర్యాదలకూ, సున్నితత్వానికీ, సహ జీవన సంస్కృతికీ నెలవు ఇక్కడి నేల. అందుకే ఇక్కడి నుంచి అంతమంది కళాకారులు రాగలిగారు. పెద్దన లాంటి వాళ్లు ‘ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మయినా చేవే’ అన్నారంటే ఇదే కారణం. అదంతా వదిలేసి కేవలం కళ్లముందు జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇక్కడి వాళ్లంతా దుర్మార్గులు అన్నట్టు, ఇక్కడి సంస్కృతి అంతా ఆటవిక సంస్కృతి అన్నట్టు రాజకీయనాయకులు మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి రాజకీయ స్వభావమూ, ప్రాంతీయ స్వభావమూ ఒకటి కాదు. ఏ ప్రాంతంలో అయినా రాజకీయం అన్నింటికీ అతీతమైంది. దానికి ఎల్లలు లేవు. అది పెట్టుబడి దారులతో కలసి దేశవ్యాప్తంగానే అన్ని రకాల వ్యవస్థలనూ, మానవీయ విలువలనూ ధ్వంసం చేస్తోంది. ఒక దశలో ప్రజాస్వామ్యానికి మూల సూత్రమైన ప్రజలను సైతం నిర్లక్ష్యం చేసి కేవలం డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులతో అధికారం చేపట్టే దశకు వచ్చింది. ఇలాంటి రాజకీయాల్లో ఎవరూ ప్రశ్నలు, విమర్శలకు అతీతులు కాదు. అయితే ఆ ముసుగులో తమకు గిట్టని లేదా ఓటేయని ప్రాంతాలను ఆ యా స్థానిక రాజకీయ నాయకుల చర్యలతో కలిపి నిందించడం కరెక్టు కాదు. ముఖ్యంగా పులివెందుల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు కడప ఎంపీగా, రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, తరువాత వచ్చిన ఆయన తనయడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.జగన్‌పై రాజకీయ విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా ఒక వర్గం మీడియా, నేతలు మొత్తం పులివెందుల ప్రాంతాన్నీ, అక్కడి ప్రజలనూ నిందిస్తూ మాట్లాడుతున్నారు. విచక్షణతో రాజకీయ విమర్శలను రాజకీయాలకు లేదా రాజకీయ వ్యక్తుల వరకే పరిమితం చేస్తే బావుంటుంది. అలా కాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే పులివెందుల ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు తగిన కార్యాచరణతో సదరు మీడియా, రాజకీయ నేతల ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుంది. – డా‘‘ వేంపల్లె షరీఫ్జర్నలిస్టు, రచయిత ‘ 96034 29366 -
YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేదలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచే వారు. కరవు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు వైఎస్.రాజారెడ్డి జన్మించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నత స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర ఎనలేనిది.పులివెందుల గ్రామ సర్పంచ్గారాజకీయాల్లోకి రాక మునుపు నుంచి పులివెందులలో వైఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్యనైనా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల సర్పంచుగా తన ప్రజాప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు ఆయన పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పులివెందులలో వీధి దీపాలు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు. అప్పట్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సమస్య పరిష్కరించారు. గ్రామ సమస్యలపై పోరాడుతూనే మరో వైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రజలకు నేడు జనరంజక పాలన అందడానికి, పేదల పట్టెడు అన్నం, గూడు, బట్టలు కట్టడమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న పెద్దాయన కుమారుడు దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కృషి ఉంది. నేటికీ అక్కడక్కడా పెద్దాయన పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానంపులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో వైఎస్.రాజారెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన బ్రతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన పెద్దాయన. ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలవబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. అంతేగాక ఆయన తనయుడు దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. పెద్దాయన పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలు, రాజకీయాలను అన్నీ తానై చూసుకొనేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.విద్యా ప్రదాతగాదివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్‌లు చూపిన బాటలోనే వైఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికీ పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబసభ్యులునేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా గురువారం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి పార్కులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం జీసెస్ చారిటీస్‌లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మేము కొనసాగించిన YSR గారి ఆదర్శవంతమైన పథకాలు..!
-
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
-
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్‌ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్‌పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్‌ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్‌కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్‌ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్‌ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా
తనకు ఎదురేలేదని విర్రవీగిన ఆయనకు పెద్దాయన గట్టిదెబ్బే కొట్టారు. దారుణ ఓటమి రుచిచూపించారు. అయితే, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో మళ్లీ తెరమీదికి వచ్చిన ఆయన.. ప్రజలను బురిడీ కొట్టించి మళ్లీ గద్దెనెక్కారు. నమ్మి ఓట్లేసిన పాపానికి నరకం చూపించారు. ఆయన చేతిలో దారుణంగా మోసపోయిన జనం.. తమను అక్కున చేర్చుకున్న పెద్దాయన కుమారుడికి పట్టం కట్టారు. ఆ పెద్దాయన, ఆయన కుమారుడు మరెవరో కాదు దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో 2004,2009లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబును.. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మట్టి కరిపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాబుకు చుక్కలు చూపించారు. గతంలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ కుటుంబ విశ్వసనీయతకే జనం పట్టం కట్టినట్లు తెలిసిపోతుంది. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వరకూ వెనకడుగు వేయని తత్వం, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతోనే ఇది సాధ్యమైంది. తమకు జిల్లా కంచుకోట అని బాకాలు ఊదే టీడీపీ నాయకుల మాటలను జనం నమ్మడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర తనదనీ, మూడు దఫాలు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునే చంద్రబాబు.. తండ్రీతనయుల చేతిలో దారుణంగా ఓడిపోవడం చరిత్రలో ఒక విచిత్రం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం సాధించారు. టీడీపీని పరాభవం బాట పట్టించారు. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టడం, తన హయాంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయడంతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 2019లో సునామీ సృష్టించిన జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2019లో రాజకీయ పెను తుఫాను సంభవించిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాను ధాటికి సైకిల్ గల్లంతైంది. జనహితమే లక్ష్యంగా బరిలోకి దిగిన జగన్ సైన్యం టీడీపీ అభ్యర్థులను మట్టి కరిపించింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు దఫాలు బాబును కోలుకోలేని దెబ్బతీయగా.. 2019లో జగన్ ఏకంగా చంద్రబాబును రాజకీయంగా వెంటిలేటర్‌పై పడుకోబెట్టినంత పనిచేశారు. ఇక అప్పట్లో గెలిచిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కూడా అత్తెసరు మెజారీ్టతో గట్టెక్కడం గమనార్హం. పాతకథ పునరావృతమే..! 2019 ఫలితాలు ఈ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పారీ్టకి పనిచేసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడంతో టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ కేడర్ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. అభ్యర్థుల ఎంపిక తమ పారీ్టకి గుదిబండలా తయారైందని నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా తీవ్రంగా విమర్శించిన గుమ్మనూరు జయరామ్‌కు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో కేవలం డబ్బు కోసమే సీటు కేటాయించారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లోనూ డబ్బున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీకి భంగపాటు తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నాన్నకు ప్రేమతో..!